>> అమెరికా, కెనడా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో కరెన్సీని డాలర్స్‌లో ముద్దుగా పిలుచుకుంటుంటారు. అసలు ఈ డాలర్ అనే పదం ఎలా పుట్టింది? అనేది తెలుసుకుందాం.
>>పదిహేనవ శతాబ్ధంలో జర్మనీలో పెద్ద సైజు వెండి నాణేలను ముద్రించేవారట. ఆ వెండి 'ధల్' అనే లోయనుంచి తీయబడింది. కాలక్రమేనా ధల్‌ని ధోల్‌గా పలికారు. ఆ నాణేలని ధోలర్ (లోయనించి) అని పిలుచుకునేవారట.
>>ఆ కాలంలో ధోలర్స్ యూరప్‌లోని అన్నిదేశాల్లో చలామణి అయ్యేవి. ప్రతి దేశం కూడా ధోలర్‌ని తమ భాషలో, తమ లిపిలో రాసుకునేవారట.
>>యూరోపియన్ దేశాల్లో ఒకటైన నెదర్లాండ్స్ భాష (డచ్)లో వీటిని డేలర్స్‌గా పలికేవారట. కాలక్రమంలో ఈ డేలర్స్ కాస్త డాలర్‌గా మారింది. అమెరికాలో స్పానిష్ కాలనీల్లో ఈ డేలర్స్ చెల్లుబాటు అయ్యేవి.
>>ఆ తర్వాతి రోజుల్లో అమెరికన్ మింట్ కూడా తమ వెండి నాణేలను ధోలర్స్ నాణేలతో సమానమైన బరువుతో ముద్రించింది. ఈ నాణేలకు అధికారకంగా డాలర్ అనే పేరుని అమెరికా ప్రభుత్వం పెట్టడంతో డాలర్స్ అయ్యాయి. తర్వాతి రోజుల్లో కాగితం నోట్లను ముద్రించినా వాటిపై కూడా డాలర్ పేరునే ముద్రించాయి.
>>ఈ విధంగా అమెరికాలో కరెన్సీకి డాలర్ అనే పేరు పుట్టింది. అమెరికాతో పాటు సింగపూర్, ఆస్టేలియా, కెనడా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లోని కరెన్సీ పేరు కూడా డాలరే కావడం విశేషం.
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment