» జార్జెస్ క్యూవియర్ 1769 సంవత్సరంలో ఆగస్టు 23వ తేదీన
జన్మించాడు. బాల్యంలోనే జీవశాస్త్రమన్నా, దాని అధ్యయనమన్నా ఆయన ఎంతో ఆసక్తిని
కనపరచేవాడు. »1795లో చదువు పూర్తయ్యాక, మరో గొప్ప శాస్త్ర వ్తేత్త, జెఫరీ హివేర్ ఆహ్వానంపై పారిస్ వెళ్ళాడు. అక్కడ ఆయనకు అసిస్టెంటుగా ఉండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. శరీర శాస్త్రమంటే ఇష్టం ఉండడం వలన ఆ శాస్త్రంలో క్యూవియర్ చాలా కృషి చేశాడు. »ఆయన జంతు శరీర శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్‌గానూ పని చేశాడు. నెపోలియన్ చక్రవర్తి నుండి ప్రశంసలు అందుకున్న క్యూవియర్ అనేక ఉద్యోగాలు చేశాడు. |
»ఒక
జంతువులో అవయవాలు అన్నీ వేర్వేరుగా ఉన్నా, అన్నింటికీ ఏదో ఒకరకమైన సంబంధం ఉందని
క్యూవియర్ అభిప్రాయం. తన శాస్త్రీయ పరిజ్ఞానంతో క్యూవియర్ జంతుజాలాన్ని
వర్గీకరించారు కూడా. »శిలాజ శాస్త్రంలో క్యూవియర్ ఎనలేని ప్రతిభ చూపించారు. ఎంతో శ్రమపడి, కేవలం శిలాజాల సాయంతోనే ఆఫ్రికా, భారత దేశాల్లో కనిపించే ఏనుగులు వేర్వేరు జాతులకు చెందినవని నిరూపించాడు క్యూవియర్. |
»ప్రకృతిలో
అప్పుడప్పుడు వైపరీత్యాలు సంభవించి చాలా జీవులు మరణించి, అంతరించిపోతాయని
సూత్రికరించారు. అలాంటి వైపరీత్యాల తర్వాత మళ్ళీ కొత్త జీవులు పుడతాయని ఆయన
వాదించేవాడు. పరిణామ శాస్త్రంలో క్యూవియర్ సూత్రం కూడా ముఖ్య స్థానాన్ని
పొందింది. |
»క్యూవియర్‌కి
అపూర్వ జ్ఞాపకశక్తి ఉండేది. తన గ్రంథౄలయంలోని 1900 పుస్తకాలు ఆయనకు కంఠంతా
వచ్చని అనేవారు. ఈ పూర్వ జీవ, శిలాజ శాస్త్రవేత్త 1832లో మరణించాడు. |
జార్జెస్ క్యూవియర్(Georges Cuvier) - మహా మహులు
Share this
Related Articles :
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment