ఐవరీ కోస్ట్
»దక్షిణ ఆఫ్రిక ఖండంలో ఉండే ఒక దేశం ఐవరీ కోస్ట్ . కొందరు యూరోపియన్లు ఆక్రమించుకొని ఏనుగు కొమ్ములను, బానిసలను కొని ఇతర దేశాలకు ఎగుమతి చేసేవారు. అలా ఏనుగు కొమ్ముల వల్ల ఈ ప్రాంతాన్ని ఐవరీకోస్ట్ అన్నారు. |
»8వ శతాబ్దంలో ఫ్రెంచి వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకొని, 1960 వరకు తమ ఆధిపత్యం ఉంచుకున్నారు. ఏ పాలకులు ఈ ప్రాంతాన్ని పాలించినా బాగా అభివృద్ధి చేయడం వల్ల ఈ రోజు ఈ దేశం ఎంతో ఐశ్వర్యంగా, ఎంతో అధునాతనంగా కనిపిస్తుంది. ఇప్పటికీ ఫ్రెంచి వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. |
»దేశంలో ప్రజల ముఖ్య ఆహారం మొక్కజొన్న పిండితో చేసిన పేస్టు. దీనినే అయిటూ అంటారు. అరటి, కసావాలు ఆహారంలో ముఖ్యమైన భాగం. వీరు పామ్ ఆయిల్ ఎక్కువగా ఉపయోగిస్తారు. అలూకో అనే ఆహారం, చేపలతో చేసిన కూరలు, మాంసం, వీరి ఆహారంలో ఒక భాగం. స్థానికంగా బంగూయి అనే పేరుతో పిలిచే సారాయి స్థానికంగా బాగా ప్రాచుర్యంలో ఉంది. |
»ఈ దేశం లో అబిద్‌జాన్ నగరం మొత్తం పశ్చిమ ఆఫ్రికా ఖండంలోనే ఒక అందమైన నగరం. దేశంలో నాలుగో పెద్దనగరం. ఈ నగరం ఒకప్పుడు రాజధానిగా ఉండేది. దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ నగరం గుండెకాయ లాంటిది. |
»ఐవరీ కోస్ట్ దేశానికి యాముస్సోక్రో రాజధాని. అయితే ఇది పేరుకే రాజధాని నగరం. ప్రభుత్వ కార్యకలాపాలన్నీ అబిద్‌జాన్ నగరం నుండే జరుగుతాయి.నగరంలో లేడీ ఆఫ్ పీస్ బాసిలికా ప్రముఖంగా చూడదగిన కట్టడం. పోప్‌జాన్ పాల్-2 దీనిని ఒక పవిత్ర ప్రదేశంగా ప్రకటించాడు. దీనిలోపల 18 వేల మంది, బయట 3 లక్షలకు పైగా జనం ఒకేసారి కూర్చోగలుగుతారు. |
»బోకే నగరం ఐవరీ కోస్ట్ దేశం లో రెండో అతి పెద్ద నగరం. ఇది వల్లీడు బందామా రీజియన్‌లో ఉంది. ఈ నగరం చుట్టుపక్కల పత్తిపంటలు, పత్తి జిన్నింగ్ మిల్లులు అధికంగా ఉన్నాయి. ఈ నగరం పరిసరాలలో బంగారు, పాదరసం, మాంగనీసు గనులు ఉన్నాయి. ఒకప్పుడు ఈ నగరం బానిసలను కొనడం, అమ్మడంలో పేరు గాంచిన నగరం. |
»దేశంలో దాదాపు 65 తెగల ప్రజలు ఉండడం వల్ల ప్రతి తెగవారు కూడా తమతమ స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూ ఉన్నారు. దేశం మొత్తంలో ముస్లిములు రంజాన్ నెలను పాటిస్తారు. ‘మాన్’ పేరుతో పిలిచే మాస్కుల పండుగ దేశమంతా జరుపుకుంటారు. మార్చి నెలలో బొకే అనే పండుగను జరుపుతారు. ఇది వారంరోజుల పాటు జరిగే కార్నివాల్. |
»దేశంలో పరిపాలన కోసం రీజియన్లు, జిల్లాలుగా విభజింపబడి ఉంది. |
»దేశంలో మొత్తం 21 రీజియన్‌లు, 4 జిల్లాలు ఉన్నాయి. దేశానికి రాజధాని, యాముస్సోక్రో అయినా, పరిపాలన అంతా అబిద్‌జాన్ నగరం నుండే నడుస్తూ ఉంటుంది. అన్ని దేశాల కార్యాలయాలు అబిద్‌జాన్ నగరంలోనే ఉన్నాయి.దేశంలో ఫ్రెంచ్ భాష అధికార భాష అయినా, దాదాపు 65 స్థానిక భాషలు మాట్లాడే తెగలవారు ఉన్నారు. |
|
కొస మెరుపు : దక్షిణ
ఆఫ్రిక ఖండంలో ఉండే ఐవరీ కోస్ట్ దేశం కరెన్సీ నాణేం పై వినాయకుడి బొమ్మ
ముద్రించి "వినాయకచవితి" రోజు విడుదల చేయబోతుంది. నాణేలపై
"వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు
సర్వదా" అనే శ్లోకాన్ని కూడా ముద్రించారు. ఐవరీ కోస్ట్ దేశంలో అధిక శాతం
ముస్లింలు, క్రైస్తవులు ఉన్నారు. అయినా ఆ దేశం నాణేం పై వినాయకుడి బొమ్మ
ముద్రించడం విశేషం ! |
వైశాల్యం: 3,22,463 చదరపు కిలోమీటర్లు |
జనాభా: 2,39,19,000 (తాజా అంచనాల ప్రకారం) |
రాజధాని: యామూస్సోక్రో |
ప్రభుత్వం: ఏకపార్టీ పాలన |
భాషలు: ఫ్రెంచి, ఆటవిక తెగల భాషలు |
మతం: (సున్నీ) ముస్లింలు 39 శాతం, క్రైస్తవులు 32శాతం, అనిమిజం అనే సంప్రదాయిక ఆఫ్రికన్ మతం 12 శాతం, ఇతరులు 17 శాతం |
వాతావరణం: సంవత్సరమంతా దాదాపు 22 నుండి 32 డిగ్రీల సెల్సియస్ |
స్వాతంత్య్ర దినోత్సవం: 1960, ఆగస్టు 7 |
సరిహద్దులు: మాలి, బుర్కినా, ఘనా, గినీ, నైబీరియా, అట్లాంటిక్ మహాసముద్రం |
పంటలు: కోకో, కాఫీ, పత్తి, అరటి, పైనాపిల్, రబ్బరు, చక్కెర, వరి, కస్సావా, యామ్ |
పరిశ్రమలు: వ్యవసాయాధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, దుస్తులు,
తోలు వస్తువులు, అటవీ ఉత్పత్తులు, గనులు, పెట్రోలు శుద్ధి. కరెన్సీ: సిఎఫ్‌ఎ ఫ్రాంక్ |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment