సిరియా
» సిరియా ఒక పశ్చిమాసియా దేశము. క్రీ.పూ. 2500 సంవత్సరాల నుండి ఇక్కడ ప్రజల నివసిస్తున్నట్లు దాఖలాలు ఉన్నాయి. రాజధాని డమాస్కస్ నగరంలో ఆనాటి ఆనవాళ్ళు ఇప్పటికీ కనబడుతున్నాయి. |
» క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు ఫోనీషియన్లు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ప్రజలు ఎక్కువగా రాజధాని డమాస్కస్ ప్రాంతంలో నివసిస్తుంటారు. ఒకప్పుడు సిరియా దేశం వివిధ దేశాల రాజులకు యుద్ధభూమిగా ఉండేది. |
» దేశాన్ని ఫోనేషియన్ల తర్వాత గ్రీకులు, రోమన్లు, బైజాంటైన్ రాజుల పరిపాలించారు. క్రీస్తుశకం 632లో ముస్లిం మత నమ్మకం కలిగిన ప్రాఫెట్ మహమ్మద్, ఇతర అరబ్బీ సైనికులు ఆ దేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ విధంగా సిరియాదేశం ముస్లిం మత దేశంగా మారిపోయింది. |
» కొన్ని వందల సంవత్సరాలపాటు కలీఫాలు పరిపాలించారు. క్రీ.శ. 1095లో యూరోపు నుండి క్రైస్తవులు క్రమంగా వచ్చి ఈ దేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. క్రీ.శ. 1114లో సుల్తాన్ నూరుద్ధీన్ అనే రాజు క్రమంగా సిరియాదేశాన్ని ఆక్రమించి క్రిస్టియన్లను తరిమివేశాడు. 15వ శతాబ్దంలో ఒట్టోమాన్ రాజులు ఈ దేశాన్ని ఆక్రమించారు. 1944తో సిరియా దేశం స్వాతంత్య్రం పొందింది. |
» సిరియా దేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 14 భాగాలుగా విభజించారు. ఒక్కొక్క భాగాన్ని గవర్నోరేట్ అని అంటారు. ఇవి తిరిగి 61 జిల్లాలుగా విభజింపబడి ఉన్నాయి |
» దేశంలోని పది పెద్ద నగరాలు ఉన్నాయి అవి . |
డమాస్కస్ ,అలెప్పొ ,హోమ్స్ లటా కియా ,హమా, అల్ రక్కఫ్, డీర్ ఎజ్జోర్ ,అల్‌హసకా ,క్వామిష్లీ ,సయ్యిదా జన్సబ్ |
» దేశంలో 74 శాతం మంది ప్రజలు ముస్లిములు. వీరు చాలా స్నేహ పూర్వకంగా ఉంటారు. లెవన్‌టైన్, ఖుర్దు, టుర్కుమెన్, సిర్కాసియన్, గ్రీకులు, జ్యూలు, ఆర్మేనియన్‌లు... ఇలా ఎన్నో తెగల వాళ్ళు ఉన్నారు. అరబ్బీ, కుర్దెష్ భాషలు మాట్లాడుతారు. |
» మాంసం, రొట్టెలు వీరి ప్రధాన ఆహారం. గోధుమ, మైదా పిండితో బన్, రొట్టె, బ్రెడ్డు లాంటి పదార్థాలు తయారుచేస్తారు. వీటితో పాటు సూప్‌లు, కూరలు ఉంటాయి. |
» దేశ రాజధాని డమాస్కస్ నగరం కిక్కిరిసిన జనాభాతో నిండిన నగరం. నగరం నలుదిశలా ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. బైజాంటైన్ ఆర్కేడ్ అనేది జూపిటర్ దేవుని ఆలయం. దీనిని రోమన్ పరిపాలకులు నిర్మించారు. ఈ ఆర్కేడ్ సమీపంలోనే ఉమ్మాయ్యద్ మసీదు ఉంది. దీనినే గ్రాండ్ మాస్క్ అంటారు. దీనిని పూర్వం ఒకటవ కాన్‌స్టాంట్‌నోపుల్ అనే రోమన్ చక్రవర్తి నిర్మించాడు. ఈ మసీదుకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. మసీదు లోపలి భాగంలో శిఖరం లోపలి భాగంలో ఇప్పటికీ సెయింట్ జాన్ తల భాగం నిలిచి ఉంది. మరో విశేషం 2001లో పోప్ జాన్ పాల్-2 ఈ మసీదును సందర్శించాడు. |
» 2013 లో జరిగిన రసాయన దాడిలో ఈ దేశం ఒక్కసారిగా వార్తలలోకి వచ్చింది. అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో 2013 ఆగస్ట్ 21, బుధవారం చరిత్ర ఎరుగని దారుణ మారణహోమం జరిగింది. ప్రభుత్వ బలగాలు జరిపిన రసాయన ఆయుధ దాడిలో 1,300 మందికి పైగా బలయ్యారు. |
» దేశ రాజధాని డమాస్కస్‌కు దగ్గర్లోని తూర్పు గౌటాలో తిరుగుబాటుదారుల
స్థావరాలపై ప్రభుత్వ బలగాలు ఉదయం రసాయనిక ఆయుధాలతో కూడిన రాకెట్లతో దాడి చేశాయని
విపక్ష కూటమి తెలిపింది. విష వాయువులు పీల్చి వందలాది మంది చనిపోయారని, ఊచకోతలో
కుటుంబాలకు కుటుంబాలు అసువులు బాశాయని ‘లోకల్ కోఆర్డినేషన్ కమిటీస్’ పేర్కొంది.
రసాయనిక దాడి తర్వాత, యుద్ధవిమానాల నుంచి బాంబుల వర్షం కురిపించారని తెలిపింది. |
సిరియా పూర్తి పేరు : సిరియన్ అరబ్ రిపబ్లిక్ |
సిరియా జాతీయగీతం: Homat el Diyar (Guardians of the Land) |
సిరియా రాజధాని : డమాస్కస్ |
సిరియా అధికార భాషలు : అరబిక్ |
సిరియా ప్రభుత్వం: ఫ్రెసిదెన్తిఅల్ రిపబ్లిక్ |
సిరియా ప్రెసిడెంట్ : Bashar al-Assad |
సిరియా ప్రైమ్ మినిస్టర్ : Muhammad Naji Etri |
సిరియా ఇండిపెండెన్స్
France : - First declaration : September 19361 - Second declaration : January 1 1944 - Recognized : April 17 1946 |
సిరియా విస్తీర్ణం : మొత్తం 185,180 కి.మీ² |
సిరియా జనాభా : జూలై 2007 అంచనా 20,314,747 |
సిరియా జీడీపీ (PPP) 2005 అంచనా : మొత్తం $71.74 బిలియన్ |
సిరియా కరెన్సీ :
సిరియన్ పౌండ్ (SYP) |
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment