భూకంపం ఎందుకు వస్తుంది ? మీకు తెలుసా?





ప్రకృతి కన్ను తెరిస్తే క్షణంలో ప్రపంచమంతా శూన్యం. ఇటీవల మహారాష్ట్రలో సంభవించిన భూకంపం వల్ల ముప్పై వేలకు పైగా మరణించారు. భూకంపం పైన సరైన అవగాహన ఎంతో అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూకంపాల మీద కూడా అమాయకపు ప్రజల్లో రకరకాల కట్టుకథలున్నాయి. 

భూకంపం కోసం చిత్ర ఫలితం

అవన్నీ కథలుగానే వున్నాయి.భూకంపాలు రావటానికి శాస్త్రపరమైన కారణాలే గాక పర్యావరణానికి జరుగుతున్న అపార నష్టాలు కూడా కారణమవుతున్నాయి. పెద్ద రిజర్వాయర్లలో నిల్వ వుంచిన నీటివల్ల, అపారమైన భూగర్భ జలాన్ని ఎక్కువగా దుర్వినియోగం చేయడం ద్వారా, చెట్లను నరకడం వంటి చర్యలతో భూకంపాలు వచ్చే అవకాశముందని చెబుతున్నారు. 

భూకంపం కోసం చిత్ర ఫలితం

రిజర్వాయర్లలో వున్న వందలాది ఘనపు మైళ్ళ నీటి వత్తిడి భూమిపై కలగటం వల్ల భూగర్భంలో మార్పులు జరిగి భూమి కంపిస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ, ప్రదక్షిణం చేస్తూ, దానిలోపల సర్దుబాటు చేసుకోవడం వల్ల భూమి లోపల పొరలు కంపిస్తాయి. వాటి కంపనాల తీవ్రతను బట్టి నష్టం వాటిల్లుతుంటుంది.

భూకంపం కోసం చిత్ర ఫలితం

భూమి లోపల అనేక పొరలుంటాయి. ఒకపొర మందం సుమారు 50 కిలోమీటర్లు వుండినట్లయితే, ఆ పొరను క్రెస్ట్‌ లేదా లిథోస్పియర్‌ అంటారు. దాని క్రింద పొరను మాంటక్‌ అని పిలుస్తారు. దాని మందం మూడువేల కిలో మీటర్లు వుంటుంది. ఈ పొరతో పోలిస్తే హిమాలయాలు ఎంతో చిన్నవి. భూమిలోని కేంద్ర ప్రాంతంలో ఉష్ణోగ్రత 8000 డిగ్రీల సెల్సియస్‌. ఆ ప్రాంతంలో మరిగిన లావా మాంటిక్‌, క్రెస్ట్‌లను ఛేదించుకొని బయటకు రావటం కొన్ని చోట్ల జరుగుతూ వుంటుంది. 



దీన్నే అగ్నిపర్వతం బ్రద్ధలయింది అంటూ వుంటారు. భూమిలోపల 12 కఠిన పొరలతో పాటు చిన్న పొరలు కూడా వుంటాయి. ఇవి నిరంతరం ఒక దాని నొకటి తగులుతూ కదులుతూంటాయి. ఈ కదలిక ఫలితమే ఒక్కోసారి అపార నష్టాన్ని కలిగిస్తుంది. 


ఎక్కువ వత్తిడిలో బయటకు వచ్చిన లావా ప్రభావంతో భూమి పైపొరైన క్రెస్ట్‌ పదినుండి పన్నెండు చలించే శిలాఫలకాలుగా ఏర్పడుతుంది. లావా ఒత్తిడి, ఉష్ణోగ్రతలకు ఈ శిలాఫలకాలలోని కొన్ని భాగాలలో లోపాలు ఏర్పడతాయి. శిలాఫలకాలు చలిస్తే ఒకదాని నొకటి నెట్టుకుంటాయి. 


దానివల్ల ఆ శిలాఫలకాలలో పగుళ్ళు ఏర్పడుతాయి. ఈ పగుళ్ళ స్థాయిని బట్టి భూకంప స్థాయిని బట్టి భూకంప స్థాయి ఉంటుంది. 1906లో శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో సంభవించిన భూకంపంలో రోడ్లు, ప్రహరీలు ఇరవై అడుగులు పక్కకు కదిలాయి. భారీ ఆనకట్టల వల్ల, అణు ప్రయోగాల వల్ల కూడా భూకంపాలు ఏర్పడతాయి. భూకంప సమయంలో ధ్వని తప్పనిసరిగా వస్తుంది. సముద్రాలలో కూడా భూకంపాలు సంభవిస్తూ వుంటాయి.


భూమిలో కలిగే ప్రకంపనాలు నమోదుచేసే సాధనాన్ని సిస్నోగ్రాఫ్‌ అంటారు. రెండవ శతాబ్దంలో చైనాలో మొట్ట మొదట సిస్మోగ్రాఫ్‌ను తయారు చేశారు. ఈ సాధనంలో స్రింగ్‌ల నుండి స్థిరంగా వ్రేలాడే బరువు వుంటుంది. దీనికి నాలుగు దిశల చలనాలను నమోదు చేయగల సాధనాలు జత చేయబడి వుంటాయి. 


ఈ సిస్మో గ్రాఫ్‌ వెనకాల అద్దముంటుంది. ఏ కారణంగా నైనా భూమి కంపిస్తే, దాని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ తరంగాలు వెనకనున్న అద్దాన్ని కదిలిస్తాయి. ఆ అద్దంనుండి ప్రతిబింబించే కాంతి కిరణాలు నిత్యం తిరుగాడే గుండ్రటి డ్రమ్‌ మీదికి ఫోకస్‌ చేయబడి వుంటాయి. అవి ఫోటో గ్రాఫిక్‌ ప్లేటు మీద పడుతూ వుంటాయి. భూకంపనాలు వచ్చినపుడు కాంతి కిరణాలు పైకి కిందికి పడుతూ వుంటాయి.


దీని వల్ల డ్రమ్‌మీద వుండే ఫోటో గ్రాఫిక్‌ ప్లేటు మీద చలించిన గీతలు ఏర్పడతాయి. ఈ విధంగా భూకంపనాలను గర్తించగలం.భూకంప తీవ్రతను కొలిచే సాధనాన్ని అమెరికాకు చెందిన ఛార్లెస్‌ రిక్టర్‌ 1935లో కనుగొన్నాడు. మూడువేల ఎనిమిది వందల లీటర్ల పెట్రోలు ఇచ్చే శక్తికి సమానమైన శక్తి భూకంపం సందర్భంగా విడుదలయితే అది రిక్టర్‌ స్కేలుమీద 2.5కు సమానం. 


అది ఆరుకు దాటితే భూకంప ప్రభావం ఎక్కువగా వుంటుంది. శాస్త్ర పరిజ్ఞానంతో భూకంపమెప్పుడు వస్తుందో ముందుగా తెలుసుకొనే పద్ధతి ఇంకా తెలియలేదు. 

సూచన :  భూకంప మొస్తున్నప్పుడు ఇంటినుండి వెలుపలికి వచ్చేయాలి. 

ఆంధ్రప్రదేశ్‌ని భూ ప్రకంపనలు వణికిస్తున్నాయి. 

గత కొద్ది కాలంగా పది రోజులకో నెల రోజులకో ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడో 
ఓ చోట భూ ప్రకంపనలు అయితే నమోదవుతున్నాయి. 

భూమి అంతరర్గత పొరల్లో సర్దుబాట్ల ఫలితమే ఈ ప్రకంపనలు 


0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment