వ్రేలాడే తోటలు(బాబిలోనియా) ప్రాచీన ప్రపంచంలో గల ఏడు వింతలలో ఒకటిగా ఉండేది.అవి ఇప్పుడు ఇరాక్ దేశంలో బాబిల్ అనే ప్రాంతంలో కలవు.
నాలుగువేల సంవత్సరాలకు పూర్వం ప్రపంచంలోని ప్రధాన ముఖ్య పట్టణాలలో బాబిలోనియా ఒకటి. ప్రపంచంలోని ప్రప్రథమంగా ఏర్పడి ఉన్న మహా సామ్రాజ్యాల్లో ప్రసిద్ధి చెందినది బాబిలోనియా. ఈ మహనగరం 10 వేల హెక్టార్ల ల వైశాల్యంతో ప్రపంచంలోనే పెద్ద నగరంగా ప్రఖ్యాతి గాంచింది.
క్రీ.పూ 626 లో "ఛాల్‌డియాన్" వంశానికి చెందిన మహారాజు "నబో పొలొన్సర్" బాబిలోనియాకు అధిపతిగా ఉండేవాడు. బాబిలోనియా నగరం చుట్టూ చాల ఎత్తైన గోడలను నిర్మించాడారాజు. ఈ గోడలను "ది వాల్స్ ఆఫ్ బాబిలోనియా" అని పిలిచేవారు. గోడ ఎత్తు 335 అడుగులు. ఈ గోడలను ప్రపంచంలోని అద్భుతాలలో రెండోవదిగా పేర్కొనేవారు.
అయితే పురాణ చరిత్ర ఆధారంగా "నెబూహాడ్ నెజ్జర్" చక్రవర్తి తన చుట్టు పట్ల రాజ్యాలకు చెందిన పలువురు రాజ కుమార్తెలను వివాహమాడారు. అతని భార్యలలో మెడిస్ రాకుమారి సెమిరామిస్, ఒకరు మెడియస్ సైన్యం అస్సీరియన్స్ ను జయించడంలో నెబుచాన్డ్ నెజర్ కు సహాయపడ్డాయి.
నెబుకద్‌జరు మరణానంతరం 22 సంవత్సరాలకు బాబిలోనియా సామ్రాజ్యాన్ని పర్షియా చక్రవర్తి స్వాధీనం చేసుకున్నాడు. ఆయన్ను "సైప్రటిస్ ది గ్రేట్" అంటారు. ఈనాడు పర్షియన్లకు దక్కిందేమంటే అద్భుతమైన గోడల శిధిలాలు, ఒకటి లేక రెండు ఆర్చీలు.
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment