రాజ్యాంగం - ప్రధానమంత్రి - భాద్యతలు

పాలిటి ప్రాక్టిస్  బిట్స్  18-09-2014


1. భారత రాజ్యాంగాన్ని అనుసరించి సంఘాలు ఏర్పరచుకొనే స్వేచ్ఛను ఏ విషయంలో నియంత్రించవచ్చు?
    ఎ) ప్రజా భద్రత      బి) విదేశాల్లో స్నేహ సంబంధాల నిర్వహణ     
 సి) రాష్ట్ర విధానానికి సంబంధించిన ఆదేశిక సూత్రాలు    డి) కేంద్ర జాబితా

2. ఆర్థిక  ప్రజాస్వామ్యాన్ని దేనితో సాధించవచ్చు?
    ఎ) ప్రాథమిక హక్కులు       బి) ప్రియాంబుల్‌    
  సి) రాష్ట్రవిధానానికి సంబంధించిన ఆదేశిక సూత్రాలు  డి) కేంద్ర జాబితా

3. ‘మొదట్లో, ప్రధానమంత్రి సమానుల్లో ప్రధముడైతే ప్రస్తుతం మాత్రం చుక్కల్లో చంద్రుడు’ 
అని వ్యాఖ్యానించింది ఎవరు?
    ఎ) హెర్బట్‌ మారిసన్‌      బి) రామ్‌సేమ్యూర్‌      సి) హెచ్‌.జె.లాస్కి      డి) అంబేద్కర్‌

4. ‘ప్రధానమంత్రి సూర్యుడైతే, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలే మంత్రులు’ అని వ్యాఖ్యానించింది ఎవరు?
    ఎ) హెచ్‌.జె.లాస్కి      బి) ఐవర్‌ జన్నింగ్స్‌      సి) మన్రో          డి) అంబేద్కర్‌

5. భారత ప్రధానమంత్రిని, అమెరికా అధ్యక్షునితో పోలిస్తే ప్రధానమంత్రే సరైన పోలిక అవుతుంది 
తప్ప రాష్ట్రపతి కాదు అని వ్యాఖ్యానించింది ఎవరు?
    ఎ) అంబేద్కర్‌      బి) హెచ్‌.జె. లాస్కి      సి) మన్రో      డి) ఐవర్‌ జన్నింగ్స్‌

6. బిల్లు చట్టంగా మారడానికి కావాల్సిన రాష్ట్రపతి ఆమోదముద్రకు సంబంధించిన విషయాన్ని
 తెలిపే ఆర్టికల్‌ ఏది?
    ఎ) 121  బి) 122  సి) 111  డి) 112

7. రాజ్యాంగంలోని 52 నుంచి 62 వరకుగల నిబంధనలు దేనికి సంబంధించినవి?
    ఎ) రాష్ట్రపతి          బి) ఉపరాష్ట్రపతి      సి) ప్రధానమంత్రి          డి) లోక్‌సభ స్పీకర్‌

8. ఏ నిబంధనను అనుసరించి రాష్ట్ర శాసనసభలు ఆమోదం పొందిన బిల్లులను గవర్నర్‌ రాష్ట్రపతికి 
పంపుతారు?
    ఎ) 100  బి) 200  సి) 300  డి) 400

9. భారతదేశంలో అంతర్గత కారణాలవల్ల మొదటగా అత్యవసర పరిస్థితిని ఎప్పుడు ప్రకటించారు?
    ఎ) 1975-77      బి) 1977-79      సి) 1979-81      డి) ఏదీకాదు

10. భారత్‌-పాక్‌ యుద్ధ సమయంలో(1965)       భారత ప్రధాని ఎవరు?
    ఎ) నెహ్రూ      బి) లాల్‌బహదూర్‌ శాస్త్రి    సి) ఇందిరాగాంధీ      డి) ఎవరూకాదు

11. 1975నాటి అత్యవసర పరిస్థితి ప్రకటనపై సంతకం చేసిన రాష్ట్రపతి ఎవరు?
    ఎ) నీలం సంజీవరెడ్డి  బి) ఫకృద్దీన్‌ అలీ అహ్మద్‌  సి) వివి.గిరి            డి) జిడి. జెట్టి

12. అత్యవసర పరిస్థితి కాలంలో సైతం రద్దుకాని నిబంధనలు ఏవి?
    ఎ) 23, 24      బి) 25, 26       సి) 27, 28      డి) 20, 21

13. ఇందిరాగాంధీ ఇరవై సూత్రాల ఆర్ధిక పథకాన్ని ఎప్పుడు ప్రకటించారు?
    ఎ) 1970      బి) 1972      సి) 1975      డి) 1980
14. బికారీ హటావో నినాదాన్ని ఇచ్చింది ఎవరు?
    ఎ) నెహ్రూ      బి) ఇందిరాగాంధీ      సి) రాజీవ్‌గాంధీ      డి) ఎవరూకాదు

15. మొరార్జీ దేశాయ్‌ని(1977) ప్రధానమంత్రి పదవికి ఆహ్వానించిన రాష్ట్రపతి ఎవరు?
    ఎ) వివి.గిరి          బి) బి.డి.జెట్టి      సి) ఫకృద్దీన్‌ అలీ అహ్మద్‌       డి) ఎవరూకాదు

16. ఇందిరాగాంధీ ప్రధాని పదవి చేపట్టే నాటికి (1966) ఏ సభలో సభ్యురాలు?
    ఎ) లోక్‌సభకు నామినేట్‌ అయిన సభ్యురాలు      బి) రాజ్యసభకు నామినేట్‌ అయిన సభ్యురాలు    
  సి) రాజ్యసభకు ఎన్నికైన సభ్యురాలు  డి) ఏదీకాదు

17. మాజీ కేంద్ర మంత్రులను గవర్నర్‌గా నియమించరాదని సూచించిన కమిటీ ఏది?
    ఎ) సర్కారియా సంఘం  బి) రాజమన్నార్‌ సంఘం      సి) పాలన సంస్కరణల సంఘం 
 డి) ఏదీకాదు

18. ఏ ఆర్టికల్‌ ప్రకారం రాష్ట్రపతికి విధుల నిర్వహణలో సహాయ సలహాను అందించడానికి 
ప్రధాని అధ్యక్షతన మంత్రిమండలి ఉంటుంది?
    ఎ)74      బి) 74(1)    సి) 75    డి) 75(1)

19. మంత్రిమండలి, రాష్ట్రపతికి ఇచ్చిన సలహాని ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించరాదని చెప్పే ఆర్టికల్‌ ఏది?
    ఎ) 74    బి) 74(1)   సి) 74(2)   డి) 75

20. రాష్ట్రపతి, మంత్రిమండలి సలహా మేరకే విధులు నిర్వర్తించాలని పేర్కొన్న రాజ్యాంగ సవరణ ఏది?
    ఎ) 32     బి) 42    సి) 62    డి) 82

21. రాజ్యాంగం ప్రకారం మంత్రుల సంఖ్య ఎంత ఉండాలి?
    ఎ) లోక్‌సభ సభ్యుల్లో 15 శాతం      బి) రాజ్యసభ సభ్యుల్లో 15 శాతం   
 సి) పార్లమెంటు సభ్యుల్లో 15 శాతం డి) ఏదీకాదు

22. ఏ కమిటీ సిఫారసుల మేరకు మంత్రులను మూడు రకాలుగా వర్గీకరిస్తారు?
    ఎ) అనంతశయనం అయ్యంగార్‌ కమిటి      బి) కృష్ణస్వామి అయ్యర్‌ కమిటి     
 సి) గోపాలస్వామి అయ్యంగార్‌      డి) ఏదీకాదు

23. ఏ సవరణ ద్వారా క్యాబినెట్‌ అనే పదాన్ని 352వ ప్రకరణలో చేర్చారు?
    ఎ) 1978-44వ సవరణ  బి) 1976-42వ సవరణ  సి) 1971- 24వ సవరణ      డి) ఏదీకాదు

24. క్యాబినెట్‌ ఎన్ని రోజులకు ఒకసారి సమావేశం కావాల్సి ఉంటుంది?
    ఎ) 7     బి) 14     సి) 15     డి) 30

25. "All are accountable to one; one is accountable to all, they have to sink 
together or they have to sail together"  ఈ వ్యాఖ్య దేని గురించి తెలియజేస్తుంది?
    ఎ) మంత్రిమండలి సమష్టి బాధ్యత      బి) మంత్రిమండలి వ్యక్తిగత బాధ్యత 
     సి) పార్లమెంటు బాధ్యత        డి) ఏదీకాదు

26. ఏ కమిటి సూపర్‌ క్యాబినెట్‌గా వ్యవహరిస్తుంది?
    ఎ) రాజకీయ వ్యవహార కమిటి      బి) ఆర్థిక వ్యవహారాల కమిటి    
  సి) నియామకాల కమిటి      డి) పార్లమెంటరీ వ్యవహారాల కమిటి

27. ‘క్యాబినెట్‌ ఈజ్‌ ఎ డిక్టేటర్‌’ అని వ్యాఖ్యానించింది ఎవరు?
    ఎ) రామ్‌సేమ్యూర్‌      బి) ఐవర్‌ జన్నింగ్స్‌      సి) అంబేద్కర్‌          డి) ఎవరూకాదు

28. జతపరచండి
    ఉపప్రధానులు        ప్రధానమంత్రులు
    1. వల్లభభాయ్‌ పటేల్‌    ఎ. నెహ్రూ
    2. మొరార్జీ దేశాయ్‌        బి. ఇందిరాగాంధీ
    3. వై.వి.చవాన్‌        సి. చరణ్‌సింగ్‌
    4. ఎల్‌.కె. అద్వానీ        డి. వాజపేయి
    ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి  బి) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి 
 సి) 1-సి, 2-డి, 3-సి, 4-బి  డి) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి

29. తాష్కెంట్‌లో మరణించిన ప్రధానమంత్రి ఎవరు?
    ఎ) నెహ్రూ           బి) లాల్‌బహదూర్‌ శాసి్త్ర      సి) మొరార్జీదేశాయ్‌      డి) చరణ్‌ సింగ్‌

30. రెండుసార్లు తాత్కాలిక ప్రధానమంత్రిగా పని      చేసింది ఎవరు?
    ఎ) గుల్జారీలాల్‌ నందా      బి) హిదయ్‌తుల్లా      సి) పై ఇద్దరూ          డి) ఎవరూకాదు

31. విశ్వాస తీర్మానంతో అధికారాన్ని కోల్పోయిన ఏకైక ప్రధానమంత్రి ఎవరు?
    ఎ) పి.వి. నరసింహారావు      బి) రాజీవ్‌గాంధీ      సి) దేవెగౌడ         డి) వాజపేయి

32. మంత్రిమండలి, సంయుక్త బాధ్యతను నెరవేర్చే విధంగా చూడాల్సిన బాధ్యత ఎవరిది?
    ఎ) ప్రధానమంత్రి         బి) రాష్ట్రపతి      సి) లోక్‌సభ స్పీకర్‌     డి) పార్లమెంటు అధ్యక్షుడు

33. కేంద్ర క్యాబినెట్‌ సమావేశాలకు సంబంధించి సరైనది ఏది?
    ఎ) క్యాబినెట్‌ వారానికి ఒకసారి సమావేశం కావాలి  
బి) ప్రధానమంత్రి హాజరుకాని పక్షంలో డిప్యూటీ ప్రధానమంత్రి లేదా ప్రధాని 
సూచించిన క్యాబినెట్‌ మంత్రి అధ్యక్షత వహిస్తారు  
    సి) ఆహ్వానం మేరకు కేంద్ర సహాయ మంత్రులు కూడా సమావేశాలకు హాజరు కావచ్చు    
  డి) పైవన్నీ

34. క్యాబినెట్‌ ప్రాముఖ్యానికి కారణం ఏమిటి?
    ఎ) పార్టీ క్రియాశీలత, అగ్రనాయకత్వం      బి) మంత్రుల సమ్మోహన శక్తి    
  సి) కఠినమైన పార్టీ క్రమశిక్షణ      డి) పైవన్నీ

35. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి మధ్య ఉండే సంబంధం ఎటువంటిది?
    ఎ) రాజ్యాంగ పరమైనది      బి) చట్టపరమైనది      సి) న్యాయపరమైనది      డి) ఏదీకాదు

36. ప్రధానమంత్రి మరణించినపుడు మంత్రిమండలి---
    ఎ) రద్దవుతుంది          బి) రద్దు కాదు      సి) పునర్వ్యవస్థీకరిస్తారు      డి) ఏదీకాదు    

37. రాజ్యాంగ పరంగా మంత్రులు---
    ఎ) మూడు రకాలు      బి) అందరికీ సమాన ప్రతిపత్తి ఉంటుంది   
   సి)  క్యాబినెట్‌ మంత్రులకు ఎక్కువ అధికారాలు ఉంటాయి       డి) పైవన్నీ

38. ఏ సందర్భాల్లో రాష్ట్రపతి, మంత్రిమండలి సలహా తీసుకోడు?
    ఎ) కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ను తొలగించే విషయంలో   
 బి) చైర్మన్‌, సభ్యులను తొలగించే విషయంలో      సి) పై రెండూ      డి) పైవేవీకావు

39. కిందివానిలో ఏ రిట్‌/ అధిలేఖనం ‘మేము ఆదేశిస్తున్నాం’ అనే అర్థాన్ని ఇస్తుంది?
    ఎ) హెబియస్‌ కార్పస్‌      బి) మాండమస్‌      సి) కోవారెంటో          డి) సెర్షియరరీ

40. భారతదేశంలో జాతీయ మానవహక్కుల సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
    ఎ) 1990  బి) 1991  సి) 1992  డి) 1993

41. ప్రాథమిక హక్కులపై నిర్భంధాన్ని విధించే అధికారం ఎవరిది?
    ఎ) పార్లమెంటు          బి) ప్రధానమంత్రి      సి) రాష్ట్రపతి          డి) ఎవరూకాదు

42. రాజ్యాంగంలోని ఏ అధికరణం వార్తా ప్రచురణ హక్కును కల్పిస్తుంది?
    ఎ) 14  బి) 21  సి) 32  డి) 19

43. ఏ రాజ్యాంగం నుంచి చట్టాల సమాన రక్షణను గ్రహించారు?
    ఎ) బ్రిటన్‌  బి) యుఎస్‌ఎ సి) ఐర్లాండ్‌  డి) ఆసే్ట్రలియా

44. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ న్యాయసమీక్ష గురించి తెలియజేస్తుంది?
    ఎ) 12వ ఆర్టికల్‌          బి) 13వ ఆర్టికల్‌      సి) 14వ ఆర్టికల్‌          డి) 15 వ ఆర్టికల్‌

45. కింది కేసుల్లో సమానత్వపు హక్కుకు సంబంధించిన వాజ్యం ఏది?
    ఎ) కేశవానంద కేసు      బి) మినర్వామిల్స్‌ కేసు      సి) గోలక్‌నాథ్‌ కేసు    
డి) చంకం దొరైరాజన్‌ కేసు

46. ప్రస్తుతం ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి?
    ఎ) 8      బి) 9      సి) 10     డి) 11

47. ఏ కమిటీ సూచనల మేరకు ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు?
    ఎ) రాజమన్నార్‌         బి) సర్కారియా      సి) స్వరణ్‌సింగ్‌ కమిటి   డి) బల్వంతరాయ్‌ కమిటి

48. ప్రాధమిక విధులను---
    ఎ) ప్రాధమిక హక్కులతోబాటే ప్రవేశపెట్టారు    బి) ఆదేశిక సూత్రాల స్థానంలో ప్రవేశ పెట్టారు 
   సి) వీటిని ప్రత్యేకంగా ప్రవేశ పెట్టారు    డి) పై రెండింటితో కలిపి ప్రవేశ పెట్టారు.


సమాధానాలు....

1) డి  2) సి  3) ఎ  4) బి  5)ఎ  6) సి  7) ఎ  8)బి  9) ఎ  10) బి  11) బి  12) డి  13) సి  14)సి  15) బి 

 16) బి  17) ఎ  18) బి  19) సి  20) బి  21) ఎ  22) సి  23) ఎ  24) ఎ  25) ఎ  26) ఎ  27) ఎ  28) ఎ  

29) బి  30) ఎ  31) డి  32) ఎ  33) డి  34) డి  35) ఎ  36) ఎ  37) బి  38) సి  39) బి  40) డి  41) సి 

 42) డి  43) ఎ  44) బి  45) డి  46) డి  47) సి  48) సి