రాజ్యాంగం - సవరణలు - పంచాయితీరాజ్‌ వ్యవస్థ




పాలిటి ప్రాక్టిస్ బిట్స్ (05/09/2014)



                        
1.  పంచాయతీరాజ్‌ సంస్థల వ్యవహారాలను పర్యవేక్షించే  అత్యున్నత వ్యవస్థ ఏది?
    1) గ్రామీణాభివృద్ధి శాఖ   2) ఆర్థిక శాఖ       3) పట్టణాభివృద్ధి శాఖ    4) ప్రణాళికా మండలి

2.  నేషనల్‌ ఎక్స్‌టెన్షన్‌ సర్వీస్‌ పథకాన్ని ఎపుడు ప్రారంభించారు?
    1) 1952   2) 1953  3) 1954   4) 1951

3.  సమాఖ్య విధానం ప్రకారం స్థానిక ప్రభుత్వం ఏ జాబితాలోకి వస్తుంది?
    1) ఉమ్మడి జాబితా    2) కేంద్ర జాబితా    3) రాష్ట్ర జాబితా        4) ఏదీకాదు

4. కింది వానిలో సరైన జత ఏది?
    1) 1960 - వర్కింగ్‌ గ్రూప్‌ ఆన్‌ పంచాయత్స్‌ అండ్‌ కో-ఆపరేటివ్స్‌  
  2) 1961 - కమిటీ ఆన్‌ రేషనలైజేషన్‌ ఆఫ్‌ పంచాయత్‌ స్టాటిస్టిక్స్‌
    3) 1962 - స్టడీ టీమ్‌ ఆన్‌ పంచాయతీరాజ్‌ ఫైనాన్స్‌     
4) 1965 - కమిటీ ఆన్‌ పంచాయతీరాజ్‌ ఎలక్షన్స్‌

5.  భారతదేశంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థని మొదటగా ప్రారంభించిన రాష్ట్రం ఏది?
    1) కర్ణాటక     2) ఆంధ్రప్రదేశ్‌    3) మహారాష్ట్ర     4) రాజస్థాన్‌

6. జనత ప్రభుత్వం, అశోక్‌మెహతా కమిటీని ఎపుడు ఏర్పాటు చేసింది?
    1) 1978   2) 1979   3) 1977   4) 1980

7. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎపుడు పంచాయతీరాజ్‌ విధానాన్ని ప్రారంభించింది?
    1) 1959   2) 1956   3) 1955   4) 1957

8. జీవీకే రావు కమిటీని ఎపుడు నియమించారు?
      1) 1984   2) 1985   3) 1987   4) 1983

9. రాజీవ్‌గాంధీ ప్రభుత్వం(1986), పంచాయతీరాజ్‌ సంస్థలపై నియమించిన కమిటీ ఏది?
    1) సంతానం కమిటీ     2) జీవీకే రావు కమిటీ    3) ఎల్‌. ఎమ్‌. సింఘ్వీ కమిటీ    
4) హనుమంతరావు కమిటీ

10. 73వ రాజ్యంగ సవరణ చట్టాన్ని భారత రాజ్యాంగంలోని ఏ విభాగానికి చేర్చారు?
    1) పార్ట్‌- 9  2) పార్ట్‌- 10 3) పార్ట్‌- 11 4) పార్ట్‌- 12

11. ప్రభుత్వమే గ్రామ పంచాయతీలను నిర్వహించాలని భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన నిర్దేశిస్తుంది?
    1) నిబంధన 24     2) నిబంధన 22    3) నిబంధన 19     4) నిబంధన 40

12. 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని(1992) ఏ ప్రధానమంత్రి కాలంలో చేశారు?
    1) రాజీవ్‌గాంధీ         2) వీపీసింగ్‌    3) పీవీ నరసింహారావ్‌     4) చంద్రశేఖర్‌

13. 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రాజ్యాగంలోని ఏ షెడ్యూల్‌లో  చేర్చారు?
    1) 7వ షెడ్యూల్‌         2) 9వ షెడ్యూల్‌    3) 6వ షెడ్యూల్‌         4) 11వ షెడ్యూల్‌

14. భారతదేశంలో మొదటి మున్సిపల్‌ కార్పొరేషన్‌ను ఎక్కడ స్థాపించారు?
    1) బొంబాయి 2) ఢిల్లీ 3) బెంగళూరు 4) మద్రాసు

15. స్థానిక ప్రభుత్వ సంస్థల మొదటి తీర్మానంగా దేనిని అభివర్ణిస్తారు?
    1) మేయో తీర్మానం 2) రిప్పన్‌ తీర్మానం   3) రాణి తీర్మానం   4) వికేంద్రీకరణ కమిషన్‌ తీర్మానం

16. కింది వాటిలో సరైన జత ఏది?
    1) 73వ రాజ్యాంగ సవరణ చట్టం -1991    2) 74వ రాజ్యాంగ సవరణ చట్టం -1992
    3) నగరాభివృద్ధి మంత్రిత్వ శాఖ -1984    4) మేయో తీర్మానం - 1726

17. భారతదేశంలో కంటోన్మెంట్‌ చట్టాన్ని ఎప్పుడు చేశారు?
1) 1923  2) 1924  3) 1916  4) 1921

18. ఏ చట్టం ప్రకారం భారతదేశంలో తొలిసారిగా స్థానిక స్వపరిపాలనను 
ఒక ప్రొవిన్షియల్‌ సబ్జెక్టుగా ప్రకటించారు?
    1) మేయో తీర్మానం  2) భారత ప్రభుత్వ చట్టం, 1919    3) భారత ప్రభుత్వ చట్టం, 1935    
 4) భారత స్వాతంత్య్ర చట్టం, 1947

19. భారతదేశం(1907)లో వికేంద్రీకరణపై వేసిన రాయల్‌ కమిషన్‌కు ఎవరు అధ్యక్షత వహించారు?
     1) మేయో 2) రిప్పన్‌  3) ఉడ్‌రఫ్‌  4) హాబ్‌ హౌస్‌

20. బొంబాయి, కలకత్తా నగరాల్లో మున్సిపల్‌ కార్పొరేషన్‌ను ఎపుడు ఏర్పాటు చేశారు?
    1) 1726    2) 1687    3) 1870   4) 1787

21. స్థానిక స్వపరిపాలన గురించి ఏ జాతీయ నాయకుడికి ఎక్కువ గౌరవం, విశ్వాసం ఉండేవి?
    1) జవహర్‌లాల్‌ నెహ్రూ      2) గాంధీజీ    3) సుభాష్‌ చంద్రబోస్‌    4) లాల్‌బహదూర్‌ శాసి్త్ర

22. లోకల్‌ ఫైనాన్స్‌ ఎంక్వైరీ కమిటీ (1949-51) అధ్యక్షుడు ఎవరు?
    1) జాన్‌ ముత్తయ్య     2) పీకే వట్టాల్‌    3) లక్ష్మీ మిట్టల్‌          4) సంతానం

23. 74వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని(1992) భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్‌లో చేర్చారు?
    1) షెడ్యూల్‌- 9      2) షెడ్యూల్‌- 12    3) షెడ్యూల్‌- 11     4) షెడ్యూల్‌- 10

24. నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఆర్గనైజేషన్‌ (సి. ఎం. కరియా)ను ఎపుడు నియమించారు?
     1) 1985-86 2) 1984-85 3) 1986-87 4) 1983-84

25. జిల్లా ప్రణాళికా మండలి గురించి రాజ్యాంగంలోని ఏ అధికరణ వివరిస్తుంది?
    1) 243 జెడ్‌ఈ 2) 243 జెడ్‌డీ 3) 243 జెడ్‌బీ 4) 243 జెడ్‌సీ

26. మెట్రోపాలిటన్‌ ప్రణాళికా మండలి గురించి వివరించే అధికరణ ఏది?
    1) 243 జెడ్‌ఈ 2) 243 జెడ్‌బీ 3) 243 జెడ్‌డీ 4) 243 జెడ్‌సీ

27. పంచాయతీరాజ్‌కు సంబంధించి అశోక్‌మెహతా కమిటీ సిఫార్సు కానిది ఏది?
    1) పంచాయతీరాజ్‌లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పాల్గొనడం
 2) రెండంచెల పంచాయతీరాజ్‌ ఉంటే మంచిది 3) రాజ్యాంగ పరమైన రక్షణ  
  4) జిల్లా పరిషత్‌కు పరిమిత అభివృద్ధి కార్యక్రమ విధులు

28. కంటోన్మెంట్‌ బోర్డు ఎవరి ప్రత్యక్ష నియంత్రణలో ఉంటుంది?
    1) రాష్ట్ర ప్రభుత్వం       2) కేంద్ర పోలీస్‌ శాఖ    3) రక్షణ మంత్రిత్వశాఖ   4) హోం మంత్రిత్వ శాఖ

29. 74వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పంచాయితీ ఎన్నికల నిర్వహణ బాధ్యత ఎవరిది?
    1) రాష్ట్ర ఎన్నికల సంఘం  2) కేంద్ర ఎన్నికల సంఘం  3) పంచాయితీ సంస్థల ఎన్నికల సంఘం   
   4) ప్రత్యేక ఎన్నికల సంఘం

30. మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా ఎవరు పనిచేస్తారు?
    1) రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ    2) డివిజనల్‌ కమిషనర్‌    3) ఐఏఎస్‌ అధికారి  

  4) రాష్ట్ర గ్రూప్‌-1 అధికారి

31. భారతదేశంలో ఎన్నిరకాల కంటోన్మెంట్‌ బోర్డు లు ఉన్నాయి?
    1) 1   2) 2   3) 3   4) 4

32. క్లాస్‌-1 కంటోన్మెంట్‌ బోర్డును ఎంత జనాభా ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు?
    1) సివిల్‌ జనాభా పదివేల కంటే ఎక్కువ ఉండే ప్రాంతాల్లో  
2) సివిల్‌ జనాభా 2500 నుంచి 10000 వరకు ఉండే ప్రాంతాల్లో 
 3) సివిల్‌ జనాభా 2500 కంటే తక్కువ ఉండే ప్రాంతాల్లో  
4) కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాంతంలో ఏర్పాటు చేయాలని భావిస్తే

33. కంటోన్మెంట్‌ చట్టాన్ని(1924) ఎవరు చేశారు?
    1) కేంద్ర శాసనవ్యవస్థ 2) రాష్ట్ర శాసనవ్యవస్థ    3) రెండూ         4) ఏదీకాదు

34. మున్సిపాలిటీ సిబ్బందికి సంబంధించి సమీకృత విధానాన్ని ఏయే రాషా్ట్రలు పాటిస్తున్నాయి?
    ఎ) ఒరిస్సా    బి) బీహార్‌     సి) కర్ణాటక    డి) రాజస్థాన్‌   ఇ) పంజాబ్‌   ఎఫ్‌) హర్యానా
    1) ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్‌     2) ఎ, బి, సి, ఇ, ఎఫ్‌
    3) బి, సి, డి, ఇ, ఎఫ్‌        4) ఎ, సి, డి, ఇ, ఎఫ్‌

35. కంటోన్మెంట్‌ బోర్డు ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ను ఎవరు నియమిస్తారు?
    1) రాష్ట్రపతి       2) ప్రధానమంత్రి    3) ఆర్మీ జనరల్‌       4) ఎన్నికద్వారా

36. పోర్ట్‌ట్రస్ట్‌ను ఎలా ఏర్పాటు చేస్తారు?
    1) పార్లమెంట్‌ చట్టం ద్వారా  2) కార్యనిర్వాహకవర్గ ఉత్తర్వు ద్వారా
 3) రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా    4) రాజ్యసభలో తీర్మానం ద్వారా

37. క్లాస్‌-1 కంటోన్మెంట్‌ బోర్డులో ఎంతమంది సివిల్‌ ప్రతినిధులు ఉంటారు?
    1) 5    2) 9    3) 7    4) 6

38. సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ లోకల్‌ గవర్నమెంట్‌ను ఎపుడు స్థాపించారు?
    1) 1953  2) 1954  3) 1955  4) 1957

39. సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ లోకల్‌ గవర్నమెంటుకు ఎవరు అధ్యక్షుడిగా పని చేస్తారు?
    1) కేంద్రమంత్రి           2) ఒక ప్రత్యేక అధికారి    3) కేంద్ర సహాయమంత్రి    4) క్యాబినెట్‌ సెక్రటరీ

40. ‘ప్రాంత’ ప్రాతిపదికతో భారతదేశంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఏజెన్సీలు ఏవి?
    1) టౌన్‌షిప్‌             2) కంటోన్మెంట్‌ బోర్డు    3) మల్టీపర్పస్‌ ఏజెన్సీలు     4) అన్నీ

41. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ ఎఫైర్స్‌ను ఎప్పుడు స్థాపించారు?
    1) 1973    2) 1975    3) 1978    4) 1976

42. హ్యూమన్‌ సెటిల్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్‌ను ఎప్పుడు స్థాపించారు?
    1) 1983 2) 1984 3) 1985 4) 1981

43. ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లోకల్‌సెల్ఫ్‌ గవర్నమెంట్‌ ఎక్కడ ఉంది?
    1) ముంబై   2) న్యూఢిల్లీ   3) చెన్నై 4) కోల్‌కతా

44. సెంటర్‌ ఫర్‌ అర్బన్‌ ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ను ఎక్కడ,ఎప్పుడు స్థాపించారు?
    1) న్యూఢిల్లీ- 1967         2) కోల్‌కత్తా- 1963    3) న్యూఢిల్లీ- 1963    
     4) ముంబై- 1963

45. సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ లోకల్‌ గవర్నమెంట్‌ను రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ఏర్పాటు చేశారు?
    1) నిబంధన 261         2) నిబంధన 263    3) నిబంధన 265         4) నిబంధన 264

46. మున్సిపల్‌ కార్పొరేషన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ను ఎవరు నియమిస్తారు?
    1) మున్సిపల్‌ కార్పొరేషన్‌ 2) అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ    3) రాష్ట్ర ప్రభుత్వం         
  4) కేంద్ర ప్రభుత్వం

47. ఏ నగర పాలక సంస్థను ప్రభుత్వం గెజిట్‌లో ప్రకటించి ఏర్పాటు చేస్తుంది?
    1) టౌన్‌ ఏరియా కమిటీ  2) నోటిఫైడ్‌ ఏరియా కమిటీ    3) స్పెషల్‌ పర్పస్‌ ఏజెన్సీ     
4) టౌన్‌షిప్‌

48. మెట్రోపాలిటన్‌ ప్రణాళికా మండలిని ఎంత జనాభా ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు?
    1) పది లక్షల జనాభా దాటిన మెట్రోపాలిటన్‌ ఏరియా
    2) పది లక్షల జనాభాకు తక్కువ ఉన్న మెట్రోపాలిటన్‌ ఏరియా 3) ఐదు లక్షల జానాభాకు తక్కువ
 ఉన్న మెట్రోపాలిటన్‌ ఏరియా 4) ఐదు లక్షల జనాభాకు ఎక్కువ ఉన్న మెట్రోపాలిటన్‌ ఏరియా

49. 74వ రాజ్యాగ సవరణ చట్టంలో ఏ మున్సిపాలిటీల గురించి వివరించారు?
    ఎ) నగర పంచాయతీ      బి) మున్సిపల్‌ కౌన్సిల్‌    సి) మున్సిపల్‌ కార్పొరేషన్‌   డి) నగర కౌన్సిల్‌
    1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి  3) బి, సి, డి  4) ఎ, సి, డి

50. 73వ రాజ్యాంగసవరణ చట్టం ఏ రాషా్ట్రలకు వర్తించదు?
    1) జమ్మూకాశ్మీర్‌         2) నాగాలాండ్‌    3) మేఘాలయ, మిజోరాం     4) పై అన్నింటికి


సమాధానాలు...

1) 1  2) 2  3) 3  4) 4  5) 4  6) 3  7) 1  8) 2  9) 3  10) 1  11) 4  12) 3  13) 4  14) 4  15) 1 

 16) 2  17) 2  18) 3  19) 4  20) 1  21) 2  22)3  23) 2  24) 1  25) 2  26) 1  27) 4  28) 3 

29) 1  30) 3  31) 3  32) 1  33) 1  34) 2  35) 1  36) 1  37) 3  38) 2  39) 1  40) 4  41) 4  

42) 3  43) 2  44) 1  45) 2  46) 3  47) 2  48) 1  49) 2  50) 4