General Knowledge (నదులు-భూములు-అడవులు)



1. నైరుతి రుతుపవనాల కాలం ? 
- జూన్‌ మధ్య నుంచి సెప్టెంబర్‌ మధ్య వరకూ

2. నెలసరి ఉష్ణోగ్రత, వర్షపాత విలువల ఆధారంగా శీతోష్ణస్థితులను వర్గీకరించినవారు? 
-కొప్పెన్‌

3. అటవీ భూమి అధికంగా ఉన్న రాష్ట్రం ? 
- మధ్యప్రదేశ్‌

4. రాష్ట్రాల వైశాల్యాలతో పోల్చినప్పుడు అత్యల్పంగా అడవులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ? 
- హర్యానా

5. మడ అడవులకు మరో పేరు ?
- సుందర వనాలు

6. ఏ వృక్షాల వల్ల సుందరవనాలు అనే పేరొచ్చింది ? 
- సుందరి వృక్షాలు

7. ఏ అడవుల్లో టేకు వృక్షాలు సమృద్ధిగా పెరుగుతాయి? 
- ఉష్ణమండల తేమతో కూడిన సతత హరితారణ్యాలు

8.ఆల్ఫైన్‌ ఉద్బిజ్జాలు ఎక్కడ ఉన్నాయి ? 
- హిమాలయాల్లోని 3500 మీటర్ల ఎత్తు మించిన ప్రాంతంలో

9. జాతీయ అటవీ విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు ? 
- 1952లో

10. రాష్ట్ర వైశాల్యంలో అత్యధిక భూభాగంలో అడవులు ఉన్న రాష్ట్రం ?
- అరుణాచల్‌ ప్రదేశ్‌ (62.1శాతం)

11.దక్కన్‌ పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా ఏ పర్వత శ్రేణి ఉంది ?
- సాత్పుర

12. ఏయే నదులు కలిసి గంగానది ఏర్పడింది ? 
- అలకనంద, భాగీరథి

13. గంగా నదిని బంగ్లాదేశ్‌లో ఏమంటారు ? 
- పద్మానది

14.పీర్‌పంజల్‌ శ్రేణి ఎక్కడుంది ? 
- హిమాచల్‌ ప్రదేశ్‌

15. ఒకప్పుడు హిమాలయాలు, గంగా-సింధు మైదానం ఉన్న ప్రాంతం ?
- టెథిస్‌ సముద్రం

16.టెథిస్‌కు ఉత్తరంగా ఉన్న భూభాగం ? 
- అంగారా భూమి

17. టెథిస్‌ సముద్రానికి దక్షిణంగా ఉన్న భూభాగం ? 
- గోండ్వానా భూమి

18. హిమాలయాల వైశాల్యం ? 
- 5లక్షల చ.కి.మీ

19. హిమాలయాల్లో సమాంతర శ్రేణులు ? 
- 3 (హిమాద్రి-అత్యున్నత హిమాలయాలు, హిమాచల్‌-నిమ్న హిమాలయాలు, శివాలిక్‌ శ్రేణి-బాహ్య హిమాలయాలు)

20. పండ్ల వ్యవసాయానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు ? 
- కులు, కాంగ్రా లోయలు (హిమాచల్‌ ప్రదేశ్‌)

21.సహ్యాద్రి అంటే ?
- పశ్చిమ కనుమలు

22.ఆరావళి ప్రత్యేకత ? 
- ప్రపంచంలో అతి పురాతన ముడుత పర్వతాలు

23. గురుశిఖర్‌ శిఖరం ప్రత్యేకత? 
- ఆరావళి పర్వతాల్లో ఎత్తైంది

24. భారత దేశంలో గొప్ప ఎడారి ? 
- థార్‌ ఎడారి (2లక్షల చ.కి.మీ)

25. సింథు నది జన్మస్థలం ? 
- మానస సరోవరం (టిబెట్‌) 2880 కి.మీ

26. గంగా నది జన్మస్థానం ? 
- గంగోత్రి (2525 కిలోమీటర్లు)

27. గోదావరి జన్మస్థానం? 
- నాసికాత్రయంబకం (1465 కిలోమీటర్లు)

28. కృష్ణా నది జన్మస్థలం ? 
- మహాబలేశ్వర్‌ (1400 కిలోమీటర్లు)

29. కావేరి నది జన్మస్థలం ? 
- కర్ణాటకలోని కూర్గ్‌ జిల్లాలోని బ్రహ్మగిరి కొండలు

30. ద్వీపకల్పంలో పెద్ద నది ? - గోదావరి

31. హిమాచల్‌ ప్రదేశ్‌ పర్వత శ్రేణుల్లో వేసవి విడుదులు?
- సిమ్లా, ముస్సారి, నైనిటాల్‌, చక్రాటా, రాణిఖేట్‌

32.జమ్మూ ప్రాంతం ఎక్కడ ఉంది ? 
- జమ్మూ కొండలు (శివాలిక్‌ శ్రేణి)

33. అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎక్కడ ఉంది ? 
- మిష్మి కొండలు (శివాలిక్‌ శ్రేణి)

34. ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరం ? 
- ఎవరెస్టు (8848మీటర్లు- నేపాల్)

35. ప్రపంచంలో రెండో ఎత్తైన శిఖరం ?
- కె2 (8611 మీటరుల - కారంకోరం శ్రేణి)

36. ప్రపంచంలో అతి ఎత్తైన పీఠభూమి ? 
- పామీర్‌ పీఠభూమి (ట్రాన్స్‌ హిమాలయాలు)

37. భాబర్‌ అంటే ? 
-శివాలిక్‌ కొండల పాదాల వెంట విసనకర్ర ఆకారంలో గులకరాళ్లతో కూడిన నచ్ఛిద్ర మండలం

38.టెరాయి అంటే ? 
- భాబర్‌ మండలం కింద గల చిత్తడి మైదానం

39. భంగర్‌ అంటే ? 
- ఒండలి నిక్షేపాలతో ఏర్పడ్డ ప్రాచీన మైదానం

40. ఖాదర్‌ అంటే ? 
- ఇటీవల కాలంలో ఏర్పడ్డ ఒండలి మైదానం

41.ఆవరణ సమతుల్యాన్ని కాపాడటానికి ఎంత శాతం విస్తీర్ణంలో అడవులు ఉండాలి ? 
- మైదానాల్లో 20శాతం, కొండ ప్రాంతాల్లో 60శాతం, మొత్తం భూభాగంలో 33శాతం అడువులు ఉండాలి.

42. అటవీ ఆధారిత పరిశ్రమలు ఏవి ? 
- కాగితం, అగ్గిపెట్టెలు, పొరచెక్కలు, రంగుల పరిశ్రమలు

43.ఎన్‌ఆర్‌ఎస్‌ఏ విస్తీర్ణ రూపం ? 
- నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ

44. ఒండ్రు మృత్తికలో ఏవి సమృద్ధిగా ఉంటాయి ?. 
- సున్నపురాయి, పొటాష్‌

45. ఏ మృత్తికలో బంకమన్ను ఎక్కువగా ఉండి తేమను నిల్వ ఉంచే వక్తి ఉంటుంది ?
- నల్లరేగడి

46. ఏ పదార్థ నిక్షాళనం వల్ల భూమి లాటరైట్‌ మృత్తికల లక్షణం పొందుతుంది ?
- సిలికా

47. ఏ శిలలు శిథిలం చెంది ఎర్రమృత్తికలు ఏర్పడతాయి ? 
- స్పటికాకార రూపాంతర శిలలు

48. మెత్తని రేణువుల అవక్షేపాలు నిక్షేపించడం వల్ల ఏ మృత్తికలు ఏర్పడతాయి ? 
- ఒండ్రు

49. భారత్‌లో క్రమక్షయం ద్వారా ఏటా సగటున ప్రతి హెక్టార్‌కి కొట్టుకుపోయే మృత్తికల పొరలు ? 
- 16.4 టన్నులు

50. చంబల్‌ నదీ ప్రాంతంలో ఏ రకపు మృత్తికా క్రమక్షయం ఎక్కువగా జరుగుతుంది ? 
- అవనాళిక

51. గొప్ప నాగరికతలకు పుట్టినిల్లు ? 
- ఒండ్రు మృత్తికలు

52. నల్లరేగడి మృత్తికలు ఎక్కడ ఏర్పడతాయి ? 
- దక్కన్‌ పీఠభూమిలో లావా, నీస్‌, గ్రానైట్‌ శిలలపై

53. ఉష్ణమండల చెర్నోజెమ్‌లు దేనిలో ఉంటాయి ? 
- నల్లరేగడి మృత్తికలు

54.తేమను నిల్వ చేసుకునే మృత్తికలు ఏవి ?
- నల్లరేగడి

55. గిరిజన వ్యవసాయం ఏ రకానికి చెందినది ? 
- పోడు వ్యవసాయం / విస్తాపన వ్యవసాయం

56. పరిణతి పొందిన మృత్తికలు ఎక్కువగా ఉండే ప్రాంతం ?
- పర్వత ప్రాంతం

57.పత్తి పంటకు అనుకూలమైన మృత్తికలు ? 
- నల్లరేగడి

58.తేయాకు, కాఫీ, రబ్బర్‌ పంటలకు అనుకూలమైన మృత్తికలు ?
- లాటరైట్‌ మృత్తికలు

59. భారతదేశంలో ఎక్కువ శాతం ఆక్రమించిన మృత్తికలు ? 
- ఒండ్రు మృత్తికలు (23.40శాతం), నల్లరేగడి (24.12శాతం), ఎర్రమృత్తికలు(29.08శాతం), లాటరైట్‌ (4.30శాతం), పర్వత మృత్తికలు (10.64శాతం), ఎడారి ఇసుక (8.46శాతం)

60. అల్యూమినియం తయారీలో వాడే ముడి ఖనిజం ? 
- బాక్సైట్‌

61. జిప్సం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం ? 
- రాజస్థాన్‌

62.ఆంధ్రప్రదేశ్‌లో ఇనుప ధాతు నిక్షేపాలు ఉన్న జిల్లా ? 
- ఖమ్మం

63.భారతదేశంలో అత్యధిక శక్తిదాయక వనరుగా ఉపయోగపడుతున్న ఖనిజం ? 
- బొగ్గు

64.మాంగనీసు ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్‌ స్థానం ? 
- తృతీయ

65. మధ్యప్రదేశ్‌ఏ ఖనిజం ఉత్పత్తిలో అగ్రగామి?
- వజ్రాలు

66. కోరాల్‌ ఏ ఖనిజంతో సంబంధం కలిగి ఉంది ? 
- బంగారం

67. సున్నపురాయి ఏ పరిశ్రమకు ముఖ్య ముడి పదార్థం ?
- సిమెంట్‌

68.మన దేశంలో దొరికే ఇనుప ధాతువును ఎక్కువగా కొనుగోలు చేస్తున్న దేశం ?
- జపాన్‌

69. తమిళనాడులోని నైవేలి దేనికి ప్రసిద్ధి చెందినది ? 
- లిగ్నైట్‌

70. ఏ శిలల్లో ఎక్కువగా ఇనుప ధాతు నిక్షేపాలున్నాయి ? 
- ఆర్కెయిన్‌

71. ఏ పరిశ్రమకు అబ్రకం తప్పనిసరిగా కావాలి ? 
- విద్యుత్‌

72. భారతదేశంలో ఎక్కువగా ఇంధన శక్తిని ఉత్పత్తి చేస్తున్న ఖనిజం ? 
- నేల బొగ్గు

73.దేశంలోని ముఖ్య ఇనుప ధాతువులు ? 
- హెమటైట్‌, మాగటైట్‌

74. జిస్పంను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ? 
- రాజస్థాన్‌

75.భారతదేశంలో రాగి ఉత్పత్తి ఏ రాష్ట్రంలో ఎక్కువ ? 
- బీహార్‌

76. ముఖ్యమైన లిగ్నైట్‌ రకపు బొగ్గు క్షేత్రం ? 
- తమిళనాడులోని నైవేలి

77. ఏ రాష్ట్రంలోని ఇసుక నిక్షేపాల్లో థోరియం, యురేనియం ఎక్కువగా ఉన్నాయి ?
- రాజస్థాన్‌

78. సీసం, జింకు నిక్షేపాలు దేనితో కలగలిసి ఉంటాయి? 
- స్ఫటికాకృతి షిస్ట్స్‌

79.ఝరియాలో దొరికే ఖనిజం ?
- బొగ్గు

80. మయూర్‌ భంజ్‌లో దొరికేది ?
- ఇనుము

81. నెల్లూరులో దొరికే ఖనిజం ?
- అబ్రకం

82. బాంబే హైలో దొరికేది ?
- పెట్రోలియం

83. కోలార్‌లో దొరికే ఖనిజం ?
- బంగారం

84. ఐఆర్‌ఇడిఎ అంటే ? 
- ఇండియన్‌ రినవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ లిమిటెడ్‌

85. ద్వీకల్ప పీఠభూమిలోని రెండో అతిపెద్ద నది ? 
- కృష్ణానది

86. భారత ప్రతిస్థాపక యోగ్యశక్తి అభివృద్ధి సంస్థ స్థాపన ? 
- 1987

87. అవక్షేప శిలల్లో దొరికేది ?
- పెట్రోలియం

88. ప్రపంచం మొత్తం ఇనుము నిల్వల్లో భారత్‌లో ఎంత శాతం ఉన్నాయి ? 
- 25 శాతం (ఇనుము జపాన్‌కు ఎగుమతి చేస్తున్నాం)

89. దేని ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది ?
- అబ్రకం

90. దేని ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది ?
- మాంగనీసు