1. యూరో పే మాస్టర్ కార్డ్, వీసా చిప్‌తో కూడిన రూపే డెబిట్ కార్డులను ప్రారంభించిన బ్యాంకు ?
- భారతీయ మహిళా బ్యాంకు (ఆగస్టు 6న)
2. ప్రపంచ అత్యుత్తమ విద్యా సంస్థల జాబితాలో తొలి 500 విద్యాసంస్థల్లో నిలిచిన సంస్థ ?
- బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్
3. జీవశాస్త్ర విద్యార్థులకు శిక్షణ నిమిత్తం జంతువులపై కోత ప్రక్రియను చేపట్టవద్దని నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ?
- పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్
4. ఆగస్టు 29 ఎవరి పుట్టిన రోజు జాతీయ క్రీడాదినంగా పరిగణిస్తారు ?
- హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్
5. ధ్యాన్ చంద్ ఏ ఏ సంవత్సరాల్లో ఒలింపిక్స్‌లో బంగారు పతకాలు సాధించాడు ?
- 1928, 1932, 1936
6. ఏ రోజును మనం క్విట్ ఇండియా దినంగా జరపుకుంటాం ?
- ఆగస్టు 9
7. జాతీయ సద్భావనా దినాన్ని ఏ రోజున జరుపుకుంటాం?
- రాజీవ్ గాంధీ జయంతి (ఆగస్టు 20)
8. నాగసాకి, క్విట్ ఇండియా దినోత్సవాన్ని నిర్వహించే రోజు ఏది ?
- ఆగస్టు 9
9. ప్రపంచ ఫొటో గ్రాఫీ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహించుకుంటాం ?
- ఆగస్టు 19
10. ప్రపంచ స్నేహ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ?
- ఆగస్టు మొదటి ఆదివారం
11. యూరో పే మాస్టర్ కార్డ్, వీసా చిప్‌తో కూడిన రూపే డెబిట్ కార్డులను ప్రారంభించిన బ్యాంకు ?
- భారతీయ మహిళా బ్యాంకు (ఆగస్టు 6న)
12. గ్రాంథాలయ వారోత్సవాలు, అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించే రోజు ?
- ఆగస్టు 12
13. ఆగస్టు 9ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించిన ప్రాంతం ?
- విశాఖపట్నం
14. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరుమీద బిజెపి ఎంపి. పాత్రికేయుడు తరుణ్ విజరు రచించిన పుస్తకం పేరు ?
- మోడీ -ఇన్‌క్రెడిబుల్ ఎమర్జెన్స్ ఆఫ్ ఎ స్టార
15. మోడీ-ఇన్‌క్రెడిబుల్ ఎమర్జెన్స్ ఆఫ్ ఎ స్టార్ట్ పుస్తకం ఏ భాషలో ప్రచురితమైంది ?
- చైనీస్ భాషలో
16. బ్రెయిలీ లిపిలో రచించిన సర్దార్ వల్లభారు పటేల్ జీవిత చరిత్రను ఎవరు రచించారు ?
- సాయిబాబా గౌడ్
17. రాష్ట్రపతి అదనపు కార్యదర్శి థామస్ మాథ్సై రచించిన ఏ పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు?
- ది వింగ్ వండర్స్ ఆఫ్ రాష్ట్రపతి భవన్
18. జ్ఞానపీఠ్ అవార్డుగ్రహీత సి.నారాయణరెడ్డి రచించిన ఏ పుస్తకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆవిష్కరించారు ?
- నింగికెగిరిన చెట్టు
19. జపాన్ పరిశోధకులు రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కెమెరా సెకన్‌కు ఎన్ని ఫ్రేములను చిత్రిస్తుంది ?
- 44,000కోట్ల ఫ్రేములను చిత్రిస్తుంది
20. తోక చుక్కను చేరి అరుదైన ఘనతను సాధించిన తొలి అంతరిక్ష నౌక ?
- యూరోపియన్ స్పేస్ ఎజెన్సీకి చెందిన రోసెట్టా
21. ఏ పేరుగల తోకచుక్కను యూరోపియన్ స్పేస్ ఎజెన్సీకి చెందిన రోసెట్టా చేరుకుంది ?
- 67పి / చర్యుమోవ్-జిరాసి మెంకో
22. వాతావరణ మార్పులపై ఏర్పడిన బేసిక్ దేశాల పేర్లు?
- బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికా, భారత్, చైనా
23. వాతావరణ మార్పులపై ఏ రోజున బేసిక్ దేశాలు సమావేశమయ్యాయి ?
- న్యూఢిల్లీలో ఆగస్టు 2014 7,8 తేదీల్లో
24. యూరో పే మాస్టర్ కార్డ్, వీసా చిప్‌తో కూడిన రూపే డెబిట్ కార్డులను ప్రారంభించిన బ్యాంకు ?
- భారతీయ మహిళా బ్యాంకు (ఆగస్టు 6న)
25. ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రదేశంలో ఉన్న ప్రయోగశాల విస్తరణ పనులను చైనా ఎప్పుడు ప్రారంభించింది ?
- ఆగస్టు 8న (సుమారు 2,400మీటర్ల దిగువన)
26. అత్యంత ధనవంతులున్న దేశాల్లో ప్రపంచంలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ?
- ఎనిమిదో స్థానంలో
- ముజఫర్ అలీకి రాజీవ్‌గాంధీ సద్భావన అవార్డు :
ఉమ్రన్ జాన్ లాంటి ప్రముఖ హిందీ చిత్రాలు నిర్మించిన బాలీవుడ్ దర్శకుడు ముజఫర్ అలీ.. రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డుకు ఎంపికయ్యారు. శాంతి, మత సామరస్యాలను ప్రోత్సహించేందుకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఇవ్వనున్నారు. పురస్కారం కింద ఓ జ్ఞాపిక, రూ.50లక్షల నగదు అందించారు.
- చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్‌గా అరూప్ రాహా :
ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్‌గా భారత వాయుసేన అధిపతి అరూప్ రాహా 2014 జులై 30న బాధ్యతలు చేపట్టారు. జనరల్ బిక్రమ్‌సింగ్ స్థానంలో బాధ్యతులు చేపట్టిన రాహా 29 నెలలపాటు ఈ హోదాలో ఉంటారు. త్రివిధ దళాల అవసరాలను సమన్వయం చేసేవీ ఈ కమిటీ సైనిక కార్యకలాపాలు, ఆయుధ పరికరాలు సమకూర్చుకోవడం వంటి బాధ్యతులు నిర్వర్తిస్తుంది.
- ఇక్రిశాట్ డైరెక్టర్‌గా తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ :
అంతర్జాతీయ మెట్టపంటల పరిశోధనా కేంద్రం (ఇక్రిశాట్) డైరెక్టరుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా రాజీవ్‌శర్మను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇది వరకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇక్రిశాట్ డైరెక్టర్‌గా వ్యవహరించేవారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇక్రిశాట్ తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వచ్చినందున.. రాష్ట్రం నుంచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డైరెక్టర్‌గా వ్యవహించేస్తారని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. ఇక్రిశాట్‌లో భారతదేశం నుంచి ముగ్గురు డైరెక్టర్లు ఉంటే. అందులో తెలంగాణ సీఎస్ ఒకరు.
- సుప్రీంకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు :
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా 2014, ఆగస్టు 13 కొత్తగా నలుగురు జడ్జిలు బాధ్యతలు స్వీకరించారు. వీరి చేరికతో ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా సహా మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. ప్రపుల్లచంద్రపంత్ (62), అభరు మనోహర్ సుప్రే (59), ఆర్ భానుమతి (58), ఉదరు ఉమేశ్‌లలిత్ (58)లు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు. వీరిలో పంత్, సప్రే, భానుమతులు మేఘాలయ, గౌహతి, జార్ఖండ్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేస్తూ పదోన్నతిపై సుప్రీంకు వచ్చారు.
- అత్యంత విలువైన భారత బ్రాండ్ టాటా :
దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్ నిలిచింది. రూ.1,26,000కోట్లతో టాప్ 100 భారత బ్రాండ్లలో అగ్రస్థానం సొంతం చేసుకుంది. రెండు, మూడు స్థానాల్లో ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ నిలిచాయి. ఈ వివరాలను కన్సల్టింగ్ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా తన వార్షిక సర్వేలో వెల్లడించింది. వంద కంపెనీల మొత్తం బ్రాండ్ విలువ 92.6 బిలియన్ డాలర్లు కాగా అందులో అయిదో వంతు టాటా గ్రూపుదే కావడం విశేషం.
- దేశంలో తొలి ఐదుగురు కుబేరులు :
రిలయన్స్ ఇండిస్టీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ సహా అయుదుగురు భారత బిలియనీర్ల వద్దే దేశంలో మొత్తం కుబేరుల సంపదలో సంగం పోగుపడిందని ఓ సర్వే తెలిపింది. ఈ అయిదుగురు వద్ద మొత్తం 85.5 బిలియన్ డాలర్లు (రూ.5,23,897కోట్లు) ఉన్నట్లు లెక్కతేలింది. యథావిధిగా ముఖేష్ అంబానీ 24.4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,49,474కోట్లుత) దేశంలోనే అత్యంత ధనవంతుడిగా అగ్రస్థానంలో నిలిచారని వెల్త్-ఎక్స్ సంస్థ వెల్లడించింది.
ముఖేష్ అంబానీ, ఉక్కు దిగ్గజం లక్ష్మిమిట్టల్, సన్ ఫార్మాకు చెందిన దిలీప్ సింఘ్వీ, విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, టాటా సన్స్ వాటాదారు పల్లోంజీ ఫాపూర్జీ మిస్త్రీలు.. దేశంలో తొలి ఐదుగురు కుబేరులు. వీరి సంపద మొత్తం భారత బిలియనీర్ల సంపదలో 47.5 శాతానికి సమానం.
- 12వేల కిలోమీటర్లు ప్రయాణించే చైనా క్షిపణి :
కొత్త తరం ఖండాంతర క్షిపణి (ఐసీబీఎం)ని చైనా రూపొందించింది. ఇది 12వేల కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను చేధించగలదు. డాండ్ ఫెంగ్-41 (డీఎఫ్-41) అనే ఈ క్షిపణి ఉనికి ప్రభుత్వ పర్యావరణ దస్త్రంలో వెల్లడైంది. దీంతో ఈ అస్త్రం ఉనికిని పరోక్షంగా దృవీకరించినట్లయింది.
- తూర్పు ఆసియా విదేశాంగ మంత్రుల సదస్సు :
కొత్త తూర్పు ఆసియా విదేశాంగ మంత్రుల నాలుగో సదస్సు మయన్మార్‌లోని నేపిడాలో ఆగస్టు 10న జరిగింది. సదస్సులో పాల్గొన్న భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ దక్షిణ చైనా సముద్రంలో చైనా బలప్రయోగాన్ని వ్యతిరేకించింది. ఈ విషయంలో బ్రూనై, మలేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, తైవాన్‌లతో చైనా పోరాడుతోంది. దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం నుంచి అనుమతి పొంది భారత్ జరుపుతున్న చమురు తవ్వకాలపై కూడా చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది.
- సూయజ్ కాలువ జలమార్గ నిర్మాణ పనులు ప్రారంభం:
145 ఏళ్ల చరిత్రగల సూయజ్ కాలువ జలమార్గాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఈజిప్ట్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన నిర్మాణ పనులను ఆ దేశాధ్యక్షుడు అబ్దుల్ ఫత అల్-సిసి ఆగస్టు 6న ప్రారంభించారు. దీంతో ఐరోపా, ఆసియా ఖండాల మధ్య వర్తకం మరింత విస్తరించనుంది. సుయజ్ కాలువను తొలిసారిగా 1869లో ప్రారంభించారు. ఇది ఈజిప్టులోని మెడిటేరియన్ , ఎర్ర సముద్రాలను కలిపే కృత్రిమ జలమార్గం. దీని వల్ల వర్తకుల నౌకలు, ఓడలు ఆఫ్రికా ఖండాన్ని చుట్టి రాకుండా నేరుగా ఐరోపాను చేరుకోవచ్చు.
- సిబిడీటీ ఛైర్మన్‌గా కేపీ చౌదరి బాధ్యతలు :
పన్నుల కేంద్ర బోర్డ్ (సిబీడీటీ) కొత్త ఛైర్మన్‌గా కేవీ చౌదరి 2014, ఆగస్టు 1న బాధ్యతలు స్వీకరించారు. అర్‌కే తివారీ పదవీ విరమణ నేపథ్యంలో చౌదరి నియామకం జరిగింది. మూడు నెలలపాటు ఆయన ఈ బాధ్యల్లో కొనసాగుతారు. 1978 బ్యాచ్, సీనియర్ ఐఆర్‌ఎస్ అధికారి అయిన కేవీ చౌదరి ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. పన్నుల రంగంలోని పలు విభాగాల్లో ఆయనకు అపార అనుభవం ఉంది. ప్రత్యక్ష పన్నుల విభాగంలోని రెవెన్యూ వసూళ్ల బోర్డ్ (ఇన్వెస్ట్‌గేషన్)లో సభ్యునిగా ఇప్పటివరకూ ఆయన కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, హెచ్‌ఎస్‌బీసీ జెనీవా టాక్స్‌పేయర్స్ జాబితా సహా నల్లధనం, పన్ను ఎగవేతలు వంటి పలు కీలక కేసుల్లో దర్యాప్తు జరిపిన బృందాల్లో సభ్యునిగా చౌదరి పనిచేశారు.