మరికొన్ని Nouns కు Singular, Plural ఒకే రూపంలో ఉంటాయి. అంటే ఒకే మాటను Singular లోనూ,
Plural లోనూ వాడతాం. అవి :
1. Aircraft = విమానం (Singular)/ విమానాలు (Plural) a) An aircraft (ఒక విమానం - Singular) is launching here tomorrow(ఒక విమానం రేపు ఇక్కడ దిగుతోంది). b) These aircraft(విమానాలు - Plural) aremade in India. (ఈ విమానాలు భారత్‌లో తయారయ్యాయి).
|  |
2. Deer = జింక (Singular)/ జింకలు (Plural) a) A deer (ఒక జింక - Singular)
is under the tree. (చెట్టు కింద ఉంది).
b) Some deer (కొన్ని జింకలు - Plural) are by the lake. (ఆ సరస్సు దగ్గర
ఉన్నాయి). 3) Fish = చేప ((Singular)/ చేపలు (Plural) a) A fish (ఒక చేప - Singular)
is caught in the net. (వలలో చిక్కింది). b) Some fish (కొన్ని చేపలు - Plural) are very tasty. (చాలా రుచిగా ఉంటాయి). గమనిక: Science లో రకరకాల చేపలు అనే అర్థంలో 'Fishes' Plural గా వాడతారు. 4) Means = మార్గం (పద్ధతి, సాధనం) (Singular)/ మార్గాలు (పద్ధతులు, సాధనాలు)
(Plural) a) The means he followed (అతడు అవలంబించిన పద్ధతి/ మార్గం - Singular) is bad (చెడ్డది). b) There are many means (చాలా మార్గాలున్నాయి - Plural) of earning
money. (డబ్బు సంపాదించడానికి). 5) Offspring = సంతతి (ఒకరు - Singular), సంతతికి చెందినవి/ చెందినవారు -
(Plural). a) The human (మనిషి - Singular) is the offspring of the monkey.
(వానర
సంతతికి చెందిన ప్రాణి). b) The Kowravas (కౌరవులు - Plural) are the offspring of Dhrutarashtra. (ధృతరాష్ట్రుడి సంతతివారు - Plural).6) Species = జంతు, వృక్షజాతి
(Singular)/ జంతు, వృక్షజాతులు (Plural) a) This species of fish (ఈ జాతి (Singular) చేపలు) is rare (అరుదు). b) Many species of fish (Plural) are found in the sea. (చాలా జాతుల చేపలు
సముద్రంలో దొరుకుతాయి). 7) Series = వరుసక్రమం (Singular)/ వరుసక్రమాలు (Plural) a) This attack
(ఈ దాడి) is the first of a series (ఒక వరస - Singular) of attacks on
Indians. b) He has played four or five test series (నాలుగైదు test
matches series - Plural) for India.8) Sheep = గొర్రె (Singular) / గొర్రెలు (Plural)
a) A sheep (ఒక గొర్రె - Singular) follows its herd (తన మందను అనుసరించి వెళ్తుంది). b) Sheep (గొర్రెలు - Plural) are reared (పెంచుతారు) both for their
meat and wool. (వాటి మాంసం, ఉన్ని కోసం). 9) Swine - అసలు అర్థం - పంది (Singular)/ పందులు (Plural) - అయితే దీన్నిఎప్పుడూ తిట్టేందుకు/ science పరిభాషలో (ఉదాహరణకు - swineflue)
వాడతారు. a) He is behaving like a swine = అతడు ఓ పందిలా (Singular)
ప్రవర్తిస్తున్నాడు. b) These swine need to be sent out = ఈ పందులను (మనుషులను తిడుతూ)
బయటికి పంపాలి. Sailaja: Where is the book I gave you yesterday? (నేను నిన్న నీకిచ్చిన పుస్తకం ఏది?) Sashi: You mean that new edition of the Bhagavadgita? (నువ్వనేది భగవద్గీత కొత్త
సంకలనం
గురించా?) Sailaja: Exactly (సరిగ్గా అదే). Sashi: Oh, it is on the table there. I like its cover
very much, especially the back cover. It shows a beautiful picture of the
Himalayas, and the Ganga. (అది ఆ table
మీద ఉంది. దాని అట్ట బాగా నచ్చింది నాకు, ముఖ్యంగా వెనక అట్ట -
అది హిమాలయాలను, గంగను చూపిస్తోంది).
Sailaja: It is my brother's. He bought it in the US. (అది మా అన్నయ్య America లో కొన్నాడు). Sashi: When did he go there? Wasn't he in the Netherlands (Holland) for some time? (ఆయన అక్కడికెప్పుడు వెళ్లాడు. నెదర్లాండ్స్‌లో ఉండేవారు కదా?) Sashi: What do you think? I feel that of the two, The US is the better country to live in. The longer you live in India, the sadder you are because of the corruption here. (నీవేమనుకుంటున్నావు? రెండింటిలో అమెరికా మెరుగని నేననుకుంటున్నా. భారత్‌లో ఎంత ఎక్కువ ఉంటే అంత నిరాశగా ఉంటుంది, ఇక్కడి అవినీతి వల్ల). Sailaja: Perhaps you are right. Even Mr. Singh, PM of India doesn't seem to be much worried about the corruption his government. (నువ్వనేది సరైందేనేమో. ప్రధాని సింగ్ కూడా తన ప్రభుత్వం అవినీతి గురించి అంతగా ఆదుర్దా పడుతున్నట్లు అనిపించడంలేదు). Sashi: Perhaps the average Indian has no hope of a clean India in the near future. (బహుశా సగటు భారతీయుడికి, పరిశుద్ధమైన భారత్‌ను గురించిన ఆశలు ఇప్పుడిప్పుడే లేవేమో). Sailaja: I'm afraid, no. (లేనట్లేనని నా భయం). Look at the following expressions from the conversation above: 1) The book I gave you yesterday. 2) The Bhagavadgita. 3) It's on the table there. 4) ... picture of the Himalayas and the Ganga. 5) I bought it in the US. 6) He used to be in the Netherlands. ఇంతకు ముందు 'a'/' an' ఎక్కడ వాడాలో చూశాం కదా? ఇప్పుడు పై conversation (సంభాషణ) గమనించండి. 'The' వాడే కొన్ని సందర్భాలు (Occasions) తెలుస్తాయి. 'A'/ 'An' and 'The'లకు English లో చాలా ప్రాముఖ్యం ఉంది. ఇవి వాడాల్సిన చోట వాడకపోయినా వాడకూడని చోట వాడినా అర్థాల్లో చాలా తేడాలు వస్తాయి. కాబట్టి We should learn to use them properly.1) The book I gave you yesterday = నిన్న నేను నీకిచ్చిన పుస్తకం. Observe the difference between:a) A book gives information = పుస్తకం (ఏ పుస్తకమైనా అనే అర్థంతో) సమాచారాన్నిస్తుంది. ఇక్కడ A = any/one = ఏదైనా/ఒక. b) The book I gave you yesterday = ఇక్కడ, మనం 'ఏదో/ ఏ పుస్తకమో అని కాకుండా ఫలానా పుస్తకం - నేను నీకు ఇచ్చిన పుస్తకం - గురించి మాట్లాడుతున్నాం. అలాంటి అర్థం వచ్చేందుకు, 'The book' అంటాం. An egg is on the plate. The egg (on the plate) is for Ramesh. In the first sentence, we are talking about, one egg. So we say an egg. In the second, మనం అంతకు ముందే మాట్లాడిన egg గురించి చెబుతున్నాం కాబట్టి, the eggఅంటాం. ఇది 'the' ముఖ్యమైన ఉపయోగం. The pen you presented me is very nice = నువ్వు నాకు బహూకరించిన పెన్ను చాలా బాగుంది. గమనిక: 'A'/'An' లేదా, 'The' ఏది వాడాలి అని సందేహం ఉంటే, 'ఏ? ('Which'?) అని ప్రశ్న వేసుకుందాం. దానికి 'ఫలానా అని జవాబుంటే, 'the'వాడాలి. లేకుంటే 'a'/'an' వాడాలి. Man is standing there (అక్కడో మనిషి నిలబడి ఉన్నాడు). Question వేసుకుందాం; Which man is standing there? (ఏ మనిషి నిలుచుని ఉన్నాడు అక్కడ?) - దీనికి సమాధానం లేదు, కాబట్టి ఇక్కడ Manముందు 'A' నే వాడతాం. A man is standing thereMan with the gun is James Bond. (తుపాకితో ఉన్న మనిషి జేమ్స్ బాండ్)- Question వేయండి: ఏ మనిషి James Bond? (Which man s James Bond?) Answer (Man with the gun) ఉంది కాబట్టి, The man with the gun is Bond. |
ఇది అర్థం చేసుకుంటే, 'a'/'an', 'The' ఉపయోగించడం చాలా తేలిక. Look at some of the other expressions from the conversation above:a) It shows a beautiful picture of the Himalayas and the Ganga.b) He bought it in the USc) Wasn't he in the Netherlands? పై sentence అన్నీ 'the' వాడాల్సిన మరికొన్ని సందర్భాలను తెలుపుతాయి: 1) The Bhagavadgita, a great and holy book. అంటే గొప్ప, పవిత్రమైన గ్రంథాల ముందు 'the' తప్పక వాడాలి. The Ramayanam, The Mahabharatam, The Bible, The Khuran etc.,2) The US - కొన్ని రాష్ట్రాలు కలిపి ఏర్పాటైన దేశాల పేర్లముందు, తప్పకుండా The రావాలి. The US/ USA (The United States of America), The UAE (The United Arab Emirates) etc. అయితే ఒక సందేహం రావచ్చు: India లో కూడా రాష్ట్రాలున్నాయి కదా? అయినా The India అనం, ఎందుకనే అనుమానం రావచ్చు. ఇక్కడొకటి గమనించాలి- భారతదేశం రాష్ట్రాలు ఏర్పడక ముందే ఉంది. దేశాన్ని రాష్ట్రాలుగా విభజించారు. America (The US/USA), the UAE (Gulf countries) విషయంలో రాష్ట్రాలు మొదట ఏర్పడి, అవన్నీ కలిసి దేశమయ్యాయి. అందుకని The USA/ US, The UAE అంటారు. 3) The Netherlands: ద్వీపాల సమూహం పేరు ముందూ, The వాడాలి. a) The Andamans (అండమాన్ దీవుల సమూహం), b) The Maldives (మాల్దీవులు) etc. అయితే ఒకే ఒక ద్వీపం పేరు ముందు, 'The' వాడకూడదు. The Srilanka (Wrong), because it is only one island - Srilanka (Correct). |
4) The Himalayas - Use 'the' before the names of mountain ranges
(పర్వత శ్రేణులు - కొన్ని పర్వతాలు కలిసి ఏర్పడేవి). The Vindhyas (వింధ్య పర్వతాలు), The Eastern Ghats (తూర్పు కనుమలు), The Aravalis (ఆరావళి పర్వతాలు) - ఈ పర్వత పంక్తుల పేర్ల ముందు
"The" వాడాల్సిందే. అయితే ఒకే ఒక పర్వతం పేరు ముందు 'The' వాడం. The Mt. Everest - Wrong, because Everest is the name of just
one mountain. So it is wrong to say, the Kanchanganga, The Dhavalgiri,
as they are the names of single mountains.5) .... India is
the best. 'Best' ముందు, 'the' వాడటం గమనించండి. తెలుసు కదా, ''best', superlative degree of 'good'. అంటే మనం ఎక్కడ
superlative degree వాడినా, దానికి ముందు, 'the' వాడాల్సిందే. e.g.: a) He is the tallest boy in the class (అందరిలో పొడుగు). b) AP is the biggest (Superlative degree, So, 'the' before 'biggest') State in
South India. 'the' గురించి మరికొన్ని వివరాలు, next lesson లో.
|
|
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment