6) Gunavanth is the taller of the two = ఆ ఇద్దరిలో గుణవంతే పొడుగు.
Tall కు comparative degree 'taller'. అంటే ఇక్కడ comparative కు ముందు
'the' వాడాం. ఇక్కడ పోలిక ఇద్దరి మధ్యే (of the two).ii) Comparative
degree "taller" తర్వాత than లేదు. ఇలాంటి సందర్భాల్లో మాత్రమే, comparative
ముందు "the" వాడాలి.
|
ఇద్దరి కంటే/రెండిటి కంటే ఎక్కువమంది/ వాటిని పోల్చినప్పుడు, Comparative
తర్వాత "than"వచ్చినప్పుడు, ముందు "the" రాదు. A) Of the two States, AP and TamilNadu (రెండు రాష్ట్రాలు,
ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో)the former (ముందు చెప్పింది-AP) is the bigger(పెద్దది). Former కూడా comparative degree నే, Superlative - Foremost
Former (Comparative of "fore") తర్వాత లేదా Bigger (Comparative of
big) తర్వాత "than" లేకపోవడం గమనించండి. అందుకే వాటి ముందు "the" వాడాం.
Some more examples of "the" before comparative degree not
followed by "than".A) Prabat is the elder of the brothers (అంటే ఇక్కడ
brothers ఇద్దరే. Elder తర్వాత "than" లేదు). B) OF/ Between Ishant and Yuvraj, Ishant is the taller.7) ఇంకా, కొన్ని
రాష్ట్రాలు కలిసి ఏర్పడిన దేశాల పేర్ల ముందు "the"వాడతాం. The USA (The United States Of America) -మనం
మామూలుగా (అమెరికా/ The States అంటాం. - ఇది కొన్ని రాష్ట్రాలు
కలిసి ఏర్పడిన దేశం) TheUAE (The United Arab Emirates-
మనం మామూలుగా దుబాయ్ అంటాం), ఇంకా The USSR(గతంలో
సోవియట్ రష్యా, ఇతర దేశాల సమాఖ్య). అయితే ఇండియా కూడా కొన్ని రాష్ట్రాల సమూహమే కదా? మరి India
ముందు "the" ఎందుకు వాడం? ఎందుకంటే India మొదటి నుంచి ఒకే దేశం, దాన్ని మనం
రాష్ట్రాలుగా విభజించుకున్నాం. కాబట్టి The India అనరు. 8) "The" is used before designations and offices, హోదాల (designations)
ముందు, Offices (పదవుల) ముందు, the వాడతాం. (Office అంటే కార్యాలయం కూడా ?) The District Collector, The Mandal Revenue Officer (The
MRO) etc., ఇవన్నీdesignations. Also The principal, The
Vice - Chancellor etc.The President of India, The
Chief Minister, The MLA, The MP etc.,
ఇవన్నీ పదవులు (Offices).A) The Governor of AP,
Mr. Narasimhan.B) The Principal of our college, Dr. Sudhakar etc. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. పదవి/ హోదా
ముందు, తర్వాత వ్యక్తి పేరు వస్తే, ఆ పదవి/ హోదా ముందు "The" వస్తుంది. కానీ
వ్యక్తి పేరు ముందూ, పదవి/ హోదా తర్వాత వస్తే, వాటి ముందు "The" రాదు. e.g: a)
The Prime Minister of India, Mr. Manmohan Singh = Mr.Manmohan
Singh, Prime Minister of India. b) The Governor of AP
Mr. Narasimhan = Mr. Narasimhan, Governor of AP.
వ్యక్తి పేరు తర్వాత పదవి పేరు వస్తే, "the" లేకపోవడం గమనించండి. 9) ఇది గమనించండి:
|
Meena: Prajwal, Have you seen the Taj (తాజ్‌మహల్ చూశావా?) Prajwal: Unfortunately no, but I have seen the Kutubminar in Delhi. I have visited the Ajantha caves too. (దురదృష్టం, నేను చూడలేదు. అయితే కుతుబ్‌మీనార్, అజంతా గుహలు చూశాను.) |  |
|
Meena: The Rashtrapathi Bhvan in Delhi? (ఢిల్లీలో రాష్ట్రపతిభవన్?) Prajwal: I've seen that too (అదీ చూశాను) Tajmahal, Kutubminar- ఇవి జ్ఞాపక చిహ్నాలు (Monuments); రాష్ట్రపతి భవన్ - ఇది గొప్ప, ప్రసిద్ధికెక్కిన భవనం - వీటిముందూ "The" రావాలి. |
Hundred meters from here, you find the passport office. The rail station is just a kilometre from there. You'd (you had) better take an auto. (ఇక్కడ నుంచి రెండు మూడు వందల మీటర్ల దూరంలో Passport office ఉంది. అక్కడ నుంచి రైల్వేస్టేషన్‌కి కిలోమీటర్ ఉంటుంది. ఆటోలో వెళ్లడం మంచిది.) రైల్వేస్టేషన్, పాస్‌పోర్ట్ ఆఫీస్ లాంటివి మనకూ మనతో మాట్లాడే వాళ్లకు తెలిసిన ప్రదేశాలు.వాటి ముందు పై సంభాషణలోలా 'The' వాడటం తప్పనిసరి. అలాగే The collectors office, Thepolice station, The post office, The Govt. General Hospital etc.Prasad: Who is the boy that got the first prize? (మొదటి బహుమతి పొందిన అబ్బాయిఎవరు?) Prakash: Look there. He is the third in the row of boys there. (అక్కడ చూడు, ఆ పిల్లల వరసలో మూడోవాడు). చూశారా? First, Second, Third, Tenth, Fifteenth etc - అంటే ఎన్నోది అని చెప్పేవాటిముందు కూడా 'The' వస్తుంది. |
a) Jawaharlal Nehru was the first Prime Minister of India. b) This is the 15th day of themonth. (ఇది నెలలో 15వ రోజు). Sundar: When do you go for a walk worthy? (నువ్వు మామూలుగా walking కు ఎప్పుడు వెళ్తావు?) Manohar: Mostly in the morning, now and then in the evening. |  |
గమనించారు కదా? Morning, Evening etc., ముందు 'the' వాడతాం. He goes to school in the morning.He has returns at four in the evening. He has lunch at one in the afternoon. In the night before going to bed, he takes milk. అయితే ఇదికూడా గమనించండి.In the night = at nightIn the beginning he did not like the school, but as time went on, he liked it more and more. In the end he was sad to leave the school.చూశాం కదా? The beginning, the end, the middle. |
| Look at the following |
The boy goes to schoolat 9; his father a doctor goes to hospital and his mother, tomarket, about the same time. ఇక్కడ School, hospital, market ముందర a/ an లేదా The లేదు కదా? |  |
ఇవన్నీ కూడా అక్కడ జరిగే పనులను తెలపడానికి ఉపయోగిస్తున్నాం. a) Students go to school (school ముందు a/an The లేవు). Parents/ doctors go to hospital. [hospital ముందు The లేదు] People who want to buy things go to market (market ముందు 'The' లేదు). a/an లేదా The రాని మరికొన్ని సందర్భాలు At home (మాట్లాడుతున్న వాళ్ల ఇంట్లో) At work - My mother is at work (పనిలో ఉంది) I called him by mistake (పొరపాటున) By chance I met him (అనుకోకుండా) They took part in the game (పాల్గొన్నారు) |
Exercise
|
Supply 'a/an' or 'The' where necessary. Where they need not be used, mark 'x'. 1) There is .... dog in .... room.2) She is .... tallest girl in .... class.3) .... books are kept in libraries.4) What do you like more? .... English movies or telugu movies.5) Where is .... boy that has stolen ... book from the library.6) .... dictionary gives the meanings of .... words.7) .... city is much bigger place than .... village.8) There is ....book shop near our home, and .... shop near to it sells stationary but in both .... shops..... prices are very high.9) .... diamond ring costs more than.... plain ring, but I always prefer.... plain ring, to... diamond ring.10) .... student returns from .... college at five in ... evening.11) ... Srilanka is.... Island to.... south of India.12) We had.... dinner at.... new restaurant last night.13) She is .... second girl to get ... prize.14) These are .... girls who wish to join... school.15) .... Pacific is .... deeper than... Atlantic.16) If Kolakatha and .... Chennai ... former is bigger than ... latter.17) .... Elephants live in .... forests.18) .... cycle is no use in .... rain.19) ... beauty of ... Kashmir attracts a lot of tourists.20) Only.... few attended .... exam held on... Thursday last |
Answers
|
1) a, the 2) the, the 3) X4) X5) the, the 6) The, X 7) A, a 8) a, the, the, the 9) A, a, a, a 10) The, the, the 11) X, an, the 12) X, the 13) the, the 14) The, the 15) the, X, the 16) X, the, the 17) X, X 18) A, X 19) The, X 20) a, the, X
|
|
|
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment