1. రాజ్యాంగంలోని 6వ భాగం ఏ రాషా్ట్రనికి వర్తించదు?
ఎ) గోవా బి) సిక్కిం సి) మిజోరాం డి) జమ్మూ, కాశ్మీర్
2. గవర్నర్ ఎవరికి బాధ్యత వహిస్తారు?
ఎ) పార్లమెంట్ బి) రాష్ట్ర శాసనసభ సి) రాష్ట్రపతి డి) సుప్రీం కోర్టు
3. గవర్నర్ విచక్షణాధికారాలను గుర్తించండి?
ఎ) రాష్ట్ర పరిస్థితిపై కేంద్రానికి నివేదిక పంపించడం
బి) బిల్లులను రాష్ట్రపతికి నివేదించడం
సి) ఏ పార్టీకి మెజారిటీ లేనప్పుడు ముఖ్యమంత్రి నియామకం చేపట్టడం
డి) పైవన్నీ
4. రాష్ట్ర గవర్నర్ పదవీ కాలం ఎంత?
ఎ) 5 సంవత్సరాలు బి) 6 సంవత్సరాలు
సి) రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు డి) పార్లమెంటు విశ్వాసం ఉన్నంత వరకు
5. గవర్నర్‌కు ఎవరిని తొలగించే అధికారం లేదు?
ఎ) అడ్వకేట్ జనరల్ బి) వైస్ ఛాన్సలర్
సి) ముఖ్యమంత్రి డి) రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు
6. గవర్నర్ నెలసరి వేతనం ఎంత?
1) రూ. 30 వేలు 2) రూ. 36 వేలు
3) రూ. 33 వేలు 4) రూ. 1.10 వేలు
7. గవర్నర్ న్యాయాధికారం కానిది ఏది?
ఎ) ఉరిశిక్షను రద్దు చేయడం బి) శిక్షను తగ్గించడం
సి) శిక్షను మార్పు చేయడం డి) శిక్షను వాయిదా వేయడం
8. గవర్నర్ అర్హతలకు సంబంధించి సరైనది?
ఎ) శాసనసభలో సభ్యుడై ఉండరాదు
బి) 35 సంవత్సరాలు నిండి ఉండాలి
సి) కనీస విద్యార్హత ఉండాలి
డి) 65 సంవత్సరాలు నిండి ఉండరాదు
9. గవర్నర్లను ఎవరు అభిశంసిస్తారు?
ఎ) పార్లమెంట్ బి) రాష్ట్ర శాసనసభ
సి) రాష్ట్రపతి డి) పైవేవీకావు
10. గవర్నర్‌కు లేని అధికారాలు ఏవి?
ఎ) శాసన అధికారాలు బి) సైనిక అధికారాలు
సి) విచక్షణ అధికారాలు డి) ఆర్థిక అధికారాలు
11. గవర్నర్‌తో పదవీ స్వీకార ప్రమాణం చేయించేది ఎవరు?
ఎ) ముఖ్యమంత్రి బి) రాష్ట్రపతి
సి) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి) అడ్వకేట్ జనరల్
12. రాష్ట్ర ఎగువ సభను ఏర్పాటు చేసే పద్ధతిలో సరైన అంశం ఏది?
ఎ) రాజ్యసభలో తీర్మానం చేయాలి
బి) రాష్ట్ర దిగువ సభ ప్రత్యేక మెజారిటీతో తీర్మానం చేయాలి
సి) పార్లమెంట్ రాష్ట్ర దిగువసభ చేసిన తీర్మానాన్ని ఆమోదించాలి
డి) బి, సి
13. సరైన అంశాన్ని గుర్తించండి?
ఎ) అన్ని రాషా్ట్రల్లో ఏక సభా విధానం ఉంది
బి) ఆరు రాషా్ట్రల్లో ఎగువసభ విధానం ఉంది
సి) రాష్ట్ర ఎగువసభ శాసనసభ
డి) పైవన్నీ సరైనవే
14. రాష్ట్ర ఎగువసభలో గరిష్ఠ సభ్యుల సంఖ్య ఎంత?
ఎ) 60 బి) 250 సి) 500 డి) ఏదీ కాదు
15. కింది వాటిలో ఏ రాషా్ట్రల్లో ఎగువసభ లేదు?
ఎ) బీహార్ బి) రాజస్థాన్ సి) ఉత్తరప్రదేశ్ డి) మహారాష్ట్ర
16. ద్రవ్యబిల్లును ప్రవేశపెట్టడానికి ఎవరి సిఫారసు అవసరం?
ఎ) ముఖ్యమంత్రి బి)గవర్నర్
సి) స్పీకర్ డి) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
17. రాష్ట్ర ఎగువసభ సభ్యుకు అధ్యక్షత వహించేది ఎవరు?
ఎ) గవర్నర్ బి) ముఖ్యమంత్రి సి) స్పీకర్ డి) ఎవరూ కాదు
18. రాష్ట్ర ఎగువసభ సభ్యుల పదవీకాలం ఎంత?
ఎ) శాశ్వతం బి) 6 సంవత్సరాలు
సి) 3 సంవత్సరాలు డి) 5 సంవత్సరాలు
19. రాష్ట్ర దిగువసభ ఆమోదించిన బిల్లును రాష్ట్ర ఎగువసభ గరిష్టంగా ఎన్ని రోజుల వరకు వాయిదా వేయవచ్చు?
ఎ) 14 రోజులు బి) ఒక నెల సి) మూడునెలలు డి) నాలుగు నెలలు
20. రాష్ట్ర విధాన సభ సభ్యుల ఎన్నిక వివాదాన్ని పరిష్కరించేది ఎవరు?
ఎ) రాష్ట్ర ఎన్నికల సంఘం బి) కేంద్ర ఎన్నికల సంఘం
సి) హైకోర్టు డి) గవర్నర్
21. రాషా్ట్రనికి చట్టపరమైన అఽధిపతి ఎవరు?
ఎ) అడ్వకేట్ జనరల్ బి) హైకోర్టు చీఫ్ జస్టిస్
సి) గవర్నర్ డి) ముఖ్యమంత్రి
22. రాష్ట్ర విధాన సభ కనిష్ఠ, గరిష్ఠ సభ్యులు ఎంతమంది?
ఎ) 40-400 బి) 60-500 సి) 75-425 డి)పైవేవీ కావు
23. జిల్లా ఎగ్జిక్యూటివ్ జడ్జి ఎవరికి బాధ్యత వహిస్తారు?
ఎ) హైకోర్టు బి) రాష్ట్ర ప్రభుత్వం
సి) ముఖ్యమంత్రి డి) పైవేవీకావు
24. రాష్ట్ర సచివాలయ అధిపతి ఎవరు?
ఎ) గవర్నర్ బి) ముఖ్యమంత్రి
సి) చీఫ్ సెక్రటరీ డి) అడ్వకేట్ జనరల్
25. మంత్రిమండలిలో ఒక మంత్రిని ఎవరి విశ్వాసం కోల్పోయినప్పుడు రాజీనామా చేయమని అడుగవచ్చు?
ఎ) గవర్నర్ బి) రాష్ట్ర విధాన సభ
సి) ముఖ్యమంత్రి డి) హైకోర్టు
26. రాష్ట్ర మంత్రి మండలి సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరు?
ఎ) గవర్నర్ బి) ముఖ్యమంత్రి సి) హోంమంత్రి డి) ప్రధాన కార్యదర్శి
27. ముఖ్యమంత్రి స్థాయిని నిర్ణయించడంలో ప్రభావం చూపని అంశం ఏమిటి?
ఎ) అతని వ్యక్తిత్వం బి) పార్టీలో పలుకుబడి
సి) ఆర్థిక పరిస్థితి డి) శాసనసభలో పార్టీ బలం
28. రాష్ట్రపరిపాలనా అధిపతి ఎవరు?
ఎ) గవర్నర్ బి) ముఖ్యమంత్రి
సి) ప్రధాన కార్యదర్శి డి) హోంశాఖమంత్రి
29. రాష్ట్రంలో పరిపాలనా యూనిట్ ఏది?
ఎ) జిల్లా బి) మండలం సి) రెవెన్యూ డివిజన్ డి) రెవెన్యూ గ్రామం
30. రాష్ట్రంలో లోకాయుక్తను తొలగించేది ఎవరు?
ఎ) గవర్నర్ బి) రాష్ట్ర శాసన సభ 3) పార్లమెంట్ 4) రాష్ట్రపతి
31. ఆంధ్రరాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి పేరేమిటి?
ఎ) టంగుటూరి ప్రకాశం బి) డా. నీలం సంజీవరెడ్డి
సి) బూర్గుల రామకృష్ణారావు డి) దామోదరం సంజీవయ్య
32. ఆంధ్రరాష్ట్రంలో మొదటిసారిగా ఎప్పుడు రాష్ట్రపతి పాలన విధించారు?
ఎ) 1954 బి) 1973 సి) 1975 డి) 1984
33. విధాన పరిషత్ నిర్మాణానికి సంబంధించి సరైనది ఏది?
ఎ) 1/3 వంతు సభ్యులు ఎంఎల్‌ఎలతో ఎంపికవుతారు
బి) 1/3 వంతు సభ్యులు స్థానిక సంస్థలతో ఎంపికవుతారు
సి) 1/12 వంతు సభ్యులు ఉపాధ్యాయులతో ఎంపికవుతారు
డి) పైవన్నీ సరైనవే
డి) పైవన్నీ సరైనవే
34. సరిగ్గా జతపర్చనివి ఏవ్చి?
ఎ) ని. 165 - అడ్వకేట్ జనరల్
బి) ని. 163 - రాష్ట్ర మండలి
సి) ని. 214 - హైకోర్టు
డి) ని. 201 - డిసి్ట్రక్ట్ కోర్టులు
35. రాష్ట్ర విధానసభ సభ్యుల జీతభత్యాలను నిర్ణయించేది ఎవరు?
ఎ) పార్లమెంటు బి) రాష్ట్ర శాసన సభ సి) గవర్నర్ డి) రాజ్యాంగం
36. గవర్నర్ చేత నియమితులయ్యేది ఎవరు?
ఎ) ముఖ్యమంత్రి బి) అడ్వకేట్ జనరల్
సి) రాష్ట్ర ఎన్నికల సంఘం డి) ఎవరూ కాదు
37. రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికా మండలి అధ్యక్షుడు ఎవరు?
ఎ) ముఖ్యమంత్రి బి) గవర్నర్ సి) ఆర్థికమంత్రి డి) ముఖ్యకార్యదర్శి
38. సాధారణ బిల్లుల విషయంలో రాష్ట్ర శాసనసభలో ఏ సభ ఆధిపత్యం ఉంటుంది?
ఎ) దిగువ సభ బి) ఎగువ సభ సి) రెండూ సమానమే డి) ఏదీకాదు
39. గవర్నర్ రాష్ట్ర శాసనసభలో అంతర్భాగమని తెలిపే నిబంధన ఏది?
ఎ) 168 బి) 169 సి) 189 డి) 188
40. పంచాయతీరాజ్ సంస్థలు నిధుల కోసం ప్రధానంగా వేటి మీద ఆధారపడతాయి?
ఎ) స్థానిక సంస్థలు బి) ఆస్థి పన్ను
సి) ప్రభుత్వ సహాయాలు డి) ప్రత్యేక పన్నులు
సి) ప్రభుత్వ సహాయాలు డి) ప్రత్యేక పన్నులు
41. రాష్ట్ర గవర్నర్ పదవీ కాలం ఎంత?
ఎ) 5 సంవత్సరాలు బి) 6 సంవత్సరాలు సి) 4 సంవత్సరాలు డి) పైవేవీ కావు
42. గవర్నర్ విచక్షణాధికారాలను గుర్తించండి?
ఎ) ఆర్డినెన్స్‌లు జారీ చేయడం
బి) బిల్లులను రాష్ట్రపతికి నివేదించడం
సి) రాష్ట్ర పరిస్థితిపై కేంద్రానికి నివేదిక పంపడం డి) బి,సి
43. గవర్నర్ బాధ్యత వహించేది ఎవరికి?
ఎ) రాష్ట్ర ప్రభుత్వానికి బి) రాష్ట్రపతి సి) పార్లమెంటు డి) సుప్రీంకోర్టు
44. గవర్నర్‌ను రీకాల్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది?
ఎ) కేంద్ర ప్రభుత్వం బి) పార్లమెంట్ సి) సుప్రీం కోర్టు డి) హైకోర్టు
45. రాష్ట్ర కార్యనిర్వాహక అధిపతి ఎవరు?
ఎ) ముఖ్యమంత్రి బి) గవర్నర్ సి) చీఫ్ సెక్రటరీ డి) అటార్నీ జనరల్
46 శాసనమండలి లేని రాష్ట్రం ఏది?
ఎ) మహారాష్ట్ర బి) రాజస్థాన్ సి) కర్ణాటక డి) కేరళ
47. రాషా్ట్రల పునర్‌వ్యవస్థీకరణ చట్టం 1956 ద్వారా దేశాన్ని 5 జోన్లుగా విభజించి జోనల్ కౌన్సిళ్లను ఏర్పాటు చేశారు. సిక్కింను ఏ జోన్‌లో ఏర్పాటు చేశారు?
ఎ) సెంట్రల్ జోన్ బి) నార్తర్న్ జోన్
సి) ఈస్టర్న్ జోన్ డి) వెస్టర్న్ జోన్
48. గవర్నర్ నియామకానికి ఈ కింది అర్హతల్లో తప్పుగా పేర్కొన్న అర్హత ఏది?
ఎ) అతడు లేదా ఆమె భారత పౌరుడై ఉండాలి
బి) అతడు లేదా ఆమె వయస్సు 30 సంవత్సరాలకు తక్కువ ఉండరాదు
సి) అతడు లేదా ఆమె పార్లమెంట్‌లోని ఏ సభలోగాని రాష్ట్ర శాసనసభల్లోగాని సభ్యులై ఉండరాదు
డి) అతడు లేదా ఆమెకు ఆదాయం లభించే ఏ ఇతర పదవి ఉండరాదు
49. రాష్ట్ర శాసనసభలో ఏ రాజకీయ పక్షానికి మెజారిటీ రానప్పుడు ముఖ్యమంత్రి ఎన్నిక కోసం గవర్నర్ ప్రధానంగా పరిశీలించాల్సిన విషయం ఏమిటి?
ఎ) స్థిరమైన మెజారిటీ పొందే అవకాశమున్న యోగ్యుడైన వ్యక్తిని వెతకడం
బి) రాష్ట్ర శాసనసభలో అతి పెద్ద రాజకీయ పార్టీ
సి) అతిపెద్దదైన అనేక పార్టీల కూటమి
డి) పార్టీ కార్యక్రమానికి దాని సభ్యుల విధేయత
50. రాష్ట్ర మంత్రి మండలిలో మంత్రులకు స్థాయి హోదాలను కేటాయించేది ఎవరు?
ఎ) తన ఇష్టానుసారంగా గవర్నర్
బి) ముఖ్యమంత్రి
సి) సభ్యుల సూచనలను అనుసరించి గవర్నర్
డి) మంత్రులతో సంప్రదించి గవర్నర్
51. రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యుల సంఖ్య ఎంతకు మించరాదని నిర్ణయించారు?
1) 350 2) 600 3) 750 4) 500
52. రాష్ట్ర గవర్నర్‌కు సంబంధించి సరైనది ఏది?
1) గవర్నర్, నామమాత్ర కార్యనిర్వహణాధికారి
2) రాష్ట్రపతి ఇష్టం ఉన్నంత వరకే గవర్నర్ పదవిలో ఉంటారు
3) గవర్నర్ పదవీకాలం 5 సంవత్సరాలు
4) రాష్ట్ర మంత్రి మండలి
53. భారతదేశంలోని రాషా్ట్రల్లో ఆగంతుక నిధి ఎవరి ఆధీనంలో ఉంటుంది?
1) రాష్ట్ర గవర్నర్ 2) రాష్ట్ర ఆర్థిక మంత్రి
3) రాష్ట్ర ముఖ్యమంత్రి 4) రాష్ట్ర మంత్రి మండలి
54. భారత రాజ్యాంగంలోని 156వ ప్రకరణం ప్రకారం గవర్నర్ అతని పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 5 సంవత్సరాలు పదవిలో ఉంటాడని చెప్తుంది. దీని నుంచి ఈ కింది అర్థాలను గ్రహించవచ్చు?
1) ఏ గవర్నర్‌ను అతని పదవీకాలం పూర్తయ్యేవరకు తొలగించలేరు
2) ఏ గవర్నరూ 5 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం పదవిలో కొనసాగలేడు
ఎ) 1 మాత్రమే బి) 2 మాత్రమే సి) 1,2 డి) ఏదీ కాదు
55. గవర్నర్ పదవికి సంబంధించి ఏది నిజం?
ఎ) జీతభత్యాల భద్రత
బి) గవర్నర్ వేతనాన్ని శాసనసభ నిర్ణయించదు
సి) గవర్నర్‌ను బదిలీ చేయవచ్చు
డి) పైవన్నీ
56. గవర్నర్‌ను అభిశంసించే అధికారం ఎవరికి ఉంది?
ఎ) పార్లమెంటు బి) రాష్ట్ర అసెంబ్లీ
సి) సుప్రీం కోర్టు డి) ఎవరూ అభిశంసించలేరు
57. ఆర్డినెన్స్ జారీ చేసే విషయంలో గవర్నర్ వేటిని పరిశీలిస్తాడు?
ఎ) క్యాబినెట్ సలహా ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేస్తాడు
బి) గవర్నర్ ఆర్డినెన్స్ జారీని నిలిపి ఉండవచ్చు
సి) శాసనసభ సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్‌ను జారీ చేస్తారు
డి) పైవన్నీ
డి) పైవన్నీ
58. గవర్నర్ ఆమోదం కోసం బిల్లును పంపినప్పుడు?
ఎ) ఆమోద ముద్ర వేయవచ్చు, నిలిపి ఉండవచ్చు
బి) రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లును రిజర్వ్ చేయవచ్చు
సి) పున:పరిశీలనకు పంపవచ్చు
డి) పైవన్నీ
59. విధాన సభకు సంబంధించి ఏది నిజం?
ఎ) దాని పదవీకాలం 5 సంవత్సరాలు
బి) ప్రత్యేక పరిస్థితుల్లో 5 సంవత్సరాల కంటే ముందే రద్దు చేయవచ్చు లేదా మరో సంవత్సరం పొడిగించవచ్చు
సి) పై రెండూ
డి) ఏదీ కాదు
60. రాష్ట్ర శాసనమండలి రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది?
ఎ) ముఖ్యమంత్రి
బి) రాష్ట్ర అసెంబ్లీ మెజారిటీ సభ్యుల ఆమోదం, పార్లమెంటు ఆమోదం
సి) ప్రధానమంత్రి
డి) రాష్ట్రపతి
61. విధాన మండలి గురించి సరైన వ్యాఖ్యను గుర్తించండి?
ఎ) విధాన మండలి సభ్యుల గరిష్ట సంఖ్యకు సంబంధిత విధానసభ మొత్తం సభ్యుల సంఖ్యలో మూడింట ఒక వంతు మించకూడదు
బి) విధాన మండలి సభ్యుల సంఖ్య 40కి తగ్గకూడదు
సి) పై రెండూ
డి) ఏదీ కాదు
62. రాష్ట్ర విధానసభ స్పీకర్ రాజీనామా లేఖను ఎవరికి సంబోధించాలి?
ఎ) రాష్ట్రపతి బి) గవర్నర్ సి) స్పీకర్ డి) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి