ఏపి సెట్‌/నెట్‌ తెలుగు ప్రాక్టీస్‌ బిట్స్‌ - 25-11-14



1.    ‘నాదబ్రహ్మ’ బిరుదాంకితుడు’ ఎవరు?
    1) రామదాసు            2) త్యాగయ్య      
    3) క్షేత్రయ్య            4) అన్నమయ్య



2.    ‘శ్రీకృష్ణ కర్ణామృతం’ ప్రబంధ కర్త ఎవరు?
    1) శంకర కవి    2) వెలగపూడివెంగయామాత్యుడు    
   3) రామరాజు రంగప్పరాజు   4) నాదెండ్ల గోపన



3.    ‘సాంబోపాఖ్యానం’ కర్త ఎవరు?
    1) రామరాజు రంగపురాజు  2) దానేరు కోనేరునాథ కవి  
    3) శంకర కవి       4) నాదెండ్ల గోపన్న కవి



4.    ‘చంద్రభాను చరిత్ర’ రచన ఎవరిది?
    1) తరిగొప్పుల మల్లన      2) హరిభట్టు      
   3) ఎడపాటి ఎర్రన      4) చిన తిమ్మన



5.    ‘సిద్దేశ్వర చరిత్ర’కు మరో పేరు ఏమిటి?
    1) సిద్దేశ్వర మహత్యం      2) ప్రతాపచరిత్రం     
    3) కాకతీయ రాజవంశావళి     4) పైవన్నీ



6.    ‘నరపతి విజయం’ కర్త ఎవరు?
    1) విశ్వనాథనాయకుని స్థానాపతి      2) అందుగుల వెంకయ్య     
    3) రావణూరి వేంకటాచార్యుడు        4) వేంకటాచార్యుడు


7.    కుమార ధూర్జటి రచన ఏది?
    1) పెద్దన విజయం        2) తిమ్మన విజయం     
    3) ధూర్జటి విజయం      4) కృష్ణార్జున విజయం



8.    ‘శకుంతలా పరిణయం’ కర్త ఎవరు?
    1) రేవణూరి వేంకటాచార్యుడు  2) కుమార ధూర్జటి   
   3) బాల సరస్వతి             4) ముదరాజు రామన



9.    ‘లక్షణ సార సంగ్రహం’ కర్త ఎవరు?
    1) వెల్లంకి తాతం భట్టు         2) చిత్రకవి పెద్దన   
    3) వేంకటాచల కవి             4) లక్ష్మణ కవి



10.    ‘పరతత్త్య రసాయనం’ వేదాంత గ్రంథకర్త ఎవరు?
    1) ఈశ్వర ఫణిభట్టు           2) తురగా రాజకవి    
   3) అయ్యంకి బాలసరస్వతి      4) పైవేవీ కాదు



11.    తెలుగు కావ్యాలను మొదటగా వ్యాఖ్యానించింది ఎవరు?
    1) వేదం           2) తాపీ ధర్మారావు    
  3) ముదరాజు పెదరామన    4) లింగమకుంట తిమ్మకవి



12.    రఘునాథ నాయకుని తెలుగు రచనలెన్ని?
    1) 5        2) 7        3) 9        4) 11



13.    విక్రమార్క చరిత్ర కర్త ఎవరు?
    1) రంగరాయ కవి      2) సిద్ధనమంత్రి    
    3) జక్కన          4) ఏకామ్రనాథుడు



14.    ‘సౌభరి చరిత్ర’ కర్త ఎవరు?
    1) ఏకామ్రనాధుడు      2) చెన్నశౌరి  
    3) రాయలు                 4)ప్రౌఢదేవరాయలు



15.    ‘హరిశ్చంద్రోపాఖ్యానం’ రచన ఎవరిది?
    1) జక్కన         2) శంకర కవి  
    3) అయ్యలరాజు         4) ఎవరూ కాదు



16.    రాజా మల్లారెడ్డి రచన ఏది?
    1) షట్చక్రవర్తి    2) శివధర్మోత్తరం 
  3) పద్మపురాణం  4) పైవన్నీ



17.    ‘కృష్ణార్జున సంవాదం’ కర్త ఎవరు?
    1) సంకుసాల నృసింహకవి      2) నాదెండ్ల గోపన
     3) రుద్రకవి                          4) మల్లన



18.    దేనిని ప్రథమాంధ్ర సంగ్రహ రామాయణంగా పరిగణిస్తారు?
    1) రంగనాథ  2) భాస్కర  3) ఉత్తర 4) మొల్లరామాయణం



19.    ‘ప్రతాప చరిత్ర’ రచన ఎవరిది?
    1) జక్కన                    2) మంచన     
   3) ఏకామ్రనాథుడు         4) గోపన



20.    ‘అర్థమెల్ల దోచకుండ గూఢ శబ్దములను గూర్చి వ్రాసినచో అది మూగ చెవిటి వారి ముచ్చటగును’ అనే అభిప్రాయమెవరిది?
    1) తిక్కన        2) శ్రీనాథుడు   
   3) మొల్ల           4) కంకంటి పాపరాజు



21.    ‘వరలక్ష్మీత్రిశతి’ ఎవరి స్మృతి కావ్యం?
    1) రాయప్రోలు                2) సినారె   
   3) విశ్వనాథ                   4) పానుగంటి



22.    ‘విషాదమోహనం’ కర్త ఎవరు?
    1) కృష్ణశాసి్త్ర               2) బసవరాజు   
    3) నాయని                   4)దువ్వూరి



23.    అబ్బూరి రామకృష్ణారావు రచన?
    1) జలాంజలి            2) మల్లికాంబ   
    3) పూర్వప్రేమ           4) పైవన్నీ



24. కూలే్ట్ర దొర ప్రభావంతో కవితా రంగంలో అడుగుపెట్టిన కవి?
    1) కృష్ణశాసి్త్ర        2) కవికొండల వెంకటరావు 
    3) అబ్బూరి            4) దువ్వూరి



25.    కృష్ణశాసి్త్ర రచన ‘కృష్ణపక్షం’ ఎప్పుడు వెలువడింది?
    1) 1920     2) 1923     3)  1925     4) 1930



26.‘సత్యాంజనేయులు’ జంట కవుల రచన ఏది?
    1) అడవిపిల్ల        2) సన్యాసి      3)రాధ       4) పైవన్నీ



27.‘చూపుతో మాటాడి ఊపిరితో తెనిగించిన’ కవి ఎవరు?
    1) దువ్వూరి               2) నండూరి   
   3) అడవి బాపిరాజు       4) విశ్వనాథ



28. దువ్వూరి రచన పేరేమిటి?
    1) జలదాంగన          2) పానశాల   
   3) గులాబితోట          4) పైవన్నీ



29. ‘సాహితీ సమితి’ ఎప్పుడు ఏర్పడింది?
     1) 1915             2) 1918          
   3)1919                 4) 1920



30.    తల్లావఝల శివశంకర శాసి్త్ర ఆధ్వర్యంలో సాహితీ పత్రికను ఎప్పుడు స్థాపించారు?
     1) 1915             2) 1920          
     3) 1924              4) 1928



31.    ‘తపసుచే తాల్మిచే, ధ్యానధార చేత లీనమై ఐక్యమీయజారినదె ప్రేమ’ అన్నదెవరు?
    1) కృష్ణశాసి్త్ర         2) రాయప్రోలు   
   3) చిలకమర్తి           4) పానుగంటి



32.    ‘ఈ శతాబ్ది (20) రెండో పదిలోనే సమగ్రాంరధ్ర స్వరూపాన్ని సందర్శించగలిగిన క్రాంతిదర్శి’ రాయప్రోలు అన్నదెవరు?
    1) విశ్వనాథ   2) ఖండవల్లి   3) సినారె  4) శ్రీశ్రీ



33.    ‘ఆధునిక కవిత్వాన్ని’ గీత కవిత్వం అన్నది ఎవరు?
    1) నోరి నరసింహశాసి్త్ర   2) దువ్వూరి   
   3) గాడిచర్ల                    4) కృష్ణశాసి్త్ర



34.    ఆధునిక కవిత్వాన్ని ‘కాల్పనిక కవిత్వం’ అన్నదెవరు?
    1) నోరి నరసింహశాసి్త్ర      2)  కృష్ణశాసి్త్ర   
   3) సినారె                          4) పైవేవీకావు



35.    ఆధునిక కవిత్వాన్ని రాయప్రోలు ఏ విధంగా పిలిచారు?
    1) గీత    2) కాల్పనిక    3) అభినవ    4) నవ్య



36.    ఆధునిక కవిత్వాన్ని నోరి నరసింహశాసి్త్ర  ఏ విధంగా పిలిచాడు?
    1) అభినవ    2) నవ్య    3) గీత    4) కాల్పనిక



37.    ‘తెలుగులో కవితా విప్లవాలు స్వరూపం’ కర్త ఎవరు?
    1) కడియాల        2) వేల్చేరు నారాయణ రావు   
   3) ఖండవల్లి          4) పింగళి



38.    ‘ఒక కవి యొక్క అవి స్పష ్టవాంఛాంకురం, ఒక అంతర్నిగూఢ తాపం, ఒక చిన్న కావ్యంలో ఊదబడినచో అది భావ కవిత్వం’ అన్నదెవరు?
    1) రాయప్రోలు             2) కృష్ణశాసి్త్ర  
    3) విశ్వనాథ               4) నండూరి



39.    భావ కవిత్వానికి ఆ పేరు పెట్టింది ఎవరు?
    1)  కృష్ణశాసి్త్ర                2) గాడిచర్ల    
  3) నోరి నరసింహశాసి్త్ర      4) రాయప్రోలు



40.    ‘భగ్న హృదయం’ కర్త ఎవరు?
    1) విశ్వనాథ           2) దువ్వూరి      
    3) నాయని             4) జాషువా



41.    ‘కుప్పుస్వామి’ శతక కర్త ఎవరు?
    1) విశ్వనాథ           2) నార్ల చిరంజీవి   
   3) త్రిపురనేని          4) తుమ్మల



42.    రసము ‘వేయి రెట్లు గొప్పది నవ కథాధుృతినిమించి’ అన్న పల్కులెవరివి?
    1) శ్రీశ్రీ   2) సినారె   3) విశ్వనాథ   4) రావిశాసి్త్ర



43.    ‘అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్‌’ అన్న కవి ఎవరు?
    1) రాయప్రోలు         2) కందుకూరి   
   3) గురజాడ              4) చిలకమర్తి



44.    ‘’చావలేదు, చావలేదు ఆంధ్రుల మహోజ్జ్వల చరిత్ర’ అన్నదెవరు?
    1) చిలకమర్తి               2) గరిమెళ్ల   
   3) రాయప్రోలు             4) గురజాడ



45.    ‘ఎన్ని జన్మములు గాగ నీత నువునన్‌ ప్రవహించునొ ఆంధ్ర రక్తముల్‌’ అన్న పల్కులెవరివి?
    1) రాయప్రోలు            2) విశ్వనాథ   
   3) గురజాడ                4) చిలకమర్తి



46.    ‘నిమ్నజాతుల కన్నీటి నీరదములు పిడుగులై దేశమును కాల్చి వేయు’ అనే పలుకులు ఎవరివి?
    1) గురజాడ           2) త్రిపురనేని   
   3) తుమ్మల           4) జాషువా



47.    ‘నాకు నిశ్వాస తాళ వుత్తాంతాలు కలవు’ అని చెప్పుకొన్నది ఎవరు?
    1) పింగళి                    2) కృష్ణశాసి్త్ర           
    3) రాయప్రోలు              4) చలం



48.    ‘పల్లె యెల్లయె సర్వ ప్రపంచ సీమ’ అన్న కవి ఎవరు?
    1) జాషువా         2) తుమ్మల   
   3) దువ్వూరి         4) పానుగంటి



49.    ‘ఆంధ్రయన మెత్తబడనట్టి యాత్మలేదు’ అన్నది ఎవరు?
    1) ఫరిపండా           2) పుట్టపర్తి   
   3) రాయప్రోలు         4) గురజాడ



50.    ‘రవ్వలు రాల్చెదన్‌ గరగరల్‌ పచరించెద ఆంధ్ర వాణి కిన్‌’ అన్న కవి ఎవరు?
    1) జాషువా          2) త్రిపురనేని     
 3) పురిపండా          4) పుట్టపర్తి



51.    ‘సరస్వతీ మహల్‌’ లైబ్రరీని ఎక్కడ  నిర్మించారు?
    1) నెల్లూరు              2) తిరుపతి     
   3) తంజావూరు         4) హైదరాబాద్‌



52.    ‘ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసం’ కర్త ఎవరు?
    1) మూర్తి కవి                         2) కట్టా వరదరాజు   
   3) గణపవరపు వేంకట కవి        4) శేషం వేంకట కవి



53. ‘అశ్లీల మోహ శృంగార కావ్యం’గా నింద మోసిన గ్రంథం ఏది?
    1) మనుచరిత్ర                         2) వసుచరిత్ర      
     3) రాధికాసాంత్వనం               4) పాంచాలీ పరిణయం



54.    ‘ఆనందరంగ రాట్భందం’ గ్రంథకర్త ఎవరు?
    1) కస్తూరి రంగ కవి             2) కాకుమాను మూర్తి కవి   
   3) సవరం చిననారాయణ     4) కట్టా వరదరాజు



55.    ప్రథమాంధ్ర వాగ్గేయకారుడు ఎవరు?
    1) అన్నమయ్య         2) త్యాగయ్య   
   3) క్షేత్రయ్య                4) రామదాసు



56.    ‘అపౌరుషేయాలు’ ఏవి?
    1) వేదాలు        2) పురాణాలు    
  3) కావ్యాలు         4) ప్రబంధాలు



57.    ఆర్షప్రోక్టాలు ఏవి?
    1) పురాణాలు          2) వేదాలు   
   3) కావ్యాలు              4) చారిత్రక కావ్యం



58.    ‘భక్త చింతామణి’ శతక కర్త ఎవరు?
    1) కృపాంభనిది                    2) వసురాయ కవి   
   3) కాసుల పురుషోత్తమ కవి    4) అన్నమయ్య



59.    ‘దేవకీనందన’ శతక కర్త ఎవరు?
    1) కాసుల పురుషోత్తమ కవి      2) వెన్నెలకంటి జన్నయ 
     3) పుష్పగిరి తిమ్మన               4) వసురాయకవి



60.    ‘మాతృ శతక’ కర్త ఎవరు?
    1) మంగిపూడి వేంకట శర్మ    2) దువ్వూరి రామిరెడ్డి   
   3) నిడదవోలు వెంకటరావు     4) ఎలకూచిబాలసరస్వతి



61.    ద్విపద రచనకు ఆద్యుడు ఎవరు?
    1) నన్నెచోడుడు     2) పాల్కురికి సోమన  
    3) త్యాగయ్య           4) క్షేత్రయ్య



62.    ‘శృంగార దండకం’ కర్త ఎవరు?
    1) అన్నమయ్య                   2) చిన్నన్న   
   3) చిన తిరుమలాచార్యుడు    4) పెద తిరుమలాచార్యుడు



63.    ‘పరమయోగీ విలాసం’ కర్త ఎవరు?
    1) చిన్నన్న            2) పెదతిరుమలాచార్యుడు    
  3) అన్నమయ్య          4)  తిమ్మక్క



64.    ‘భాగవత దశమస్కంధ ద్విపద’ను రచించింది ఎవరు?
    1) మడిక సింగన            2) గౌరన    
  3) నాదెండ్ల గోపన్న           4) చిన్నన్న



65.    ‘అష్టమహిషీ కళ్యాణం’ కర్త ఎవరు?
    1) తాళ్ళపాక చిన్నన్న    2) పాల్కురికి సోమన   
   3) అన్నమయ్య               4) వేంగమాంబ



66.    ‘దండక’ రచన మొదట ఎవరి భారతంలో కనిపిస్తుంది?
    1) నన్నయ       2) తిక్కన    
   3) ఎర్రన             4) పై ముగ్గురిలో కనిపించదు



67.    ‘కుకవుల్‌ ధర దుర్విటులు’ అన్న కవి ఎవరు?
    1) నన్నెచోడుడు                2) తిక్కన   
   3) పాల్కురికి సోమన           4) నాచన సోమన



68.    ‘ఉచ్ఛారణ దక్షుచే అభిహితంబగు శబ్దంబునట్లపోలె’ అన్న కవి?
    1) నన్నయ   2) తిక్కన  3) శ్రీనాథడు  4) పోతన