నోబెల్ బహుమతులు





నోబెల్ బహుమతులను స్వీడన్‌కు చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీద ఏర్పాటు చేశారు. అక్టోబర్ 21, 1833లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ జన్మించారు. ఆయన 355 ఆవిష్కరణలు చేశారు. అందులో అత్యంత ప్రధానమైంది డైనమైట్. నోబెల్ 1895లో రాసిన వీలునామా ప్రకారం ఈ బహుమతుల ను ఇస్తున్నారు. మానవాళి అభివృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తులకు ఐదు రంగాల్లో బహుమతులు ఇవ్వాలని వీలునామాలో రాసి డిసెంబర్ 10, 1896లో నోబెల్ మరణించారు. ఆయన పేర్కొన్న ఐదు విభాగాలు భౌతిక శాస్త్రం, రసాయనశాస్త్రం, వైద్యశాస్త్రం లేదా ఫిజియాలజీ, సాహిత్యం, శాంతి.
నోబెల్ బహుమతులను తొలిసారి 1901లో ప్రదానం చేశారు. వీటిని ప్రతి ఏటా ఆల్‌ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి అయిన డిసెంబర్ 10న బహూకరిస్తారు. స్వీడన్ కేంద్ర బ్యాంక్ ‘స్వెర్జిస్ రిక్స్ బ్యాంక్’ 1968లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ స్మారకార్థం ఆర్థిక శాస్త్రంలో బహుమతిని ఏర్పాటు చేసింది. 1969 నుంచి దీన్ని ప్రదానం చేస్తున్నారు. ప్రస్తుతం ఆరు విభాగా ల్లో నోబెల్ బహుమతులను ఇస్తున్నారు. 
ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌ల్లో నోబెల్ బహుమతులను స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడి ష్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ అందిస్తోంది. స్వీడన్ లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్.. మెడిసిన్‌లో, స్వీడిష్ అకాడమీ.. లిటరేచర్‌లో ప్రదానం చేస్తాయి. శాంతి బహుమతిని నార్వేజియన్ నోబెల్ కమిటీ నార్వే రాజధాని ఓస్లోలో ఇస్తుంది. మిగిలిన ఐదు బహుమతులు స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో ప్రదానం చేస్తారు. ఒక్కో విభాగంలో ప్రైజ్‌మనీ 8 మిలియన్ స్వీడిష్ క్రోనార్ లేదా 1.1 మిలియన్ డాలర్లు.
తొలి గ్రహీతలు (1901)
ఫిజిక్స్ - విలియం రాంట్‌జెన్ (జర్మనీ)
కెమిస్ట్రీ - జాకోబ్ వాంట్ హాఫ్ (నెదర్లాండ్‌‌స)
మెడిసిన్ - ఎమిల్ అడాల్ఫ్ వాన్ బేరింగ్ (జర్మనీ)
లిటరేచర్ - సలీ ప్రధోమ్ (ఫ్రాన్‌‌స)
శాంతి - హెన్రీ డ్యునాంట్ (స్విట్జర్లాండ్), ఫ్రెడరిక్ పాసీ(ఫ్రాన్‌‌స)

1969లో ఎకనామిక్స్‌లో తొలి నోబెల్‌ను రాగ్నర్ ఫ్రిష్ (నార్వే), జాన్ టింబర్ జాన్ (నెదర్లాండ్‌‌స)లకు ప్రదానం చేశారు.
1901 నుంచి 2014 వరకు నోబెల్ బహు మతులను 889 మంది వ్యక్తులు, సంస్థలు దక్కించుకున్నారు. ఇందులో భౌతికశాస్త్రంలో 199, రసాయన శాస్త్రంలో 169, వైద్యశాస్త్రంలో 207, సాహిత్యంలో 111, ఆర్థికశాస్త్రంలో 75 మంది గ్రహీతలున్నారు. శాంతి బహుమతిని 103 మంది వ్యక్తులు, 25 సంస్థలకు ప్రదానం చేశారు.
మహిళా విజేతలు:
ఇప్పటివరకు 46 మంది మహిళలకు నోబెల్ బహుమతి లభించింది. ఈ బహుమతి పొందిన మొదటి మహిళ మేరీ క్యూరీ (1903). మదర్ థెరిసా (1979), ఆంగ్‌సాన్ సూకీ (1991), షిరీన్ ఎబాదీ (2003), వంగరి మతాయ్ (2004), ఎలెన్ జాన్సన్ సర్‌లీఫ్ (2011) వంటి వారు నోబెల్ బహుమతిని పొందారు.
ఒకటి కంటే ఎక్కువ సార్లు గెలుచుకున్నవారు
ద ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్‌క్రాస్ .. నోబెల్ శాంతి బహుమతిని మూడుసార్లు (1917, 1944,1963) గెలుచుకుంది. 
జె. బార్టీన్ ఫిజిక్స్‌లో రెండుసార్లు (1956, 1972) విజేతగా నిలిచారు. మేరీ క్యూరీ రెండు సార్లు (1903- ఫిజిక్స్, 1911- కెమిస్ట్రీ) నోబెల్ బహుమతులు సాధించారు. ఫ్రెడరిక్ సాంగర్ కెమిస్ట్రీలో రెండు సార్లు (1958, 1980)లో గెలుచుకోగా, యునెటైడ్ నేషన్‌‌స హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ సంస్థ (యుఎన్ హెచ్‌సీఆర్) నోబెల్ శాంతిని రెండుసార్లు (1954,1981) దక్కించుకుంది. లైనస్ పౌలింగ్ 1954లో కెమిస్ట్రీలో, 1962లో శాంతి బహుమతిని గెలుచు కున్నారు. ఇప్పటివరకు మొత్తం ఆరుగురు వ్యక్తులు లేదా సంస్థలు ఒకటి కంటే ఎక్కువ సార్లు నోబెల్ బహుమతులు పొందారు.
మరణానంతరం గ్రహీతలు:
 
నోబెల్ బహు మతులను మరణానంతరం ఇవ్వరాదని 1974 లో నిర్ణయించారు. అంతకుముందు ఎరిక్ ఎక్సెల్ కార్‌‌ల ఫెల్డ్‌కు 1931లో సాహిత్యంలో, డాగ్ హామర్‌‌స జోల్డ్‌కు 1961లో శాంతి బహుమతి మరణానంతరం లభించాయి.
భారత గ్రహీతలు: భారతదేశ పౌరసత్వం ఉన్న వారు, భారతదేశంలో జన్మించి విదేశీ పౌరసత్వం పొందిన మొత్తం పది మందికి నోబెల్ బహుమతి లభించింది. 
భారతదేశ పౌరసత్వం ఉన్న నోబెల్ గ్రహీతలు
1. రవీంద్రనాథ్ ఠాగూర్: 1913లో సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. ఈ అవార్డు లభించిన తొలి ఆసియా ఖండవాసి ఠాగూర్. 1861, మే 7న జన్మించిన ఠాగూర్ 1941, ఆగస్టు 7న మరణించారు. బెంగాల్‌కు చెందిన ఆయనను గురుదేవ్ అని సంబోధిస్తారు. ఆయన రచించిన గీతాంజలి విశ్వవిఖ్యాతి చెందింది. భారత జాతీయగీతం జన గణ మన, బంగ్లాదేశ్ జాతీయగీతం అమర్ శోనార్ బంగ్లా ఠాగూర్ రచనలే. 1915లో నైట్‌హుడ్‌తో సత్కరించారు. జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా 1919లో ఠాగూర్ నైట్‌హుడ్‌ను తిరస్కరించారు.
2. సర్ సి.వి. రామన్: 1930లో ఫిజిక్స్‌లో నోబెల్ లభించింది. రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నందుకు ఈ అవార్డును ప్రదానం చేశారు. చంద్రశేఖర వెంకటరామన్ 1888, నవంబర్ 7న తమిళనాడులో జన్మించారు. 1928, ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నారు. అందువల్ల ఏటా ఫిబ్రవరి 28న జాతీయ సైన్‌‌స దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1929లో బ్రిటిషర్లు రామన్‌ను నైట్‌హుడ్‌తో సత్కరించారు. 1954లో భారతరత్న అవార్డు లభించింది. ఆయన 1970, నవంబర్ 21న బెంగళూరులో మరణించారు.
3. మదర్ థెరిసా: 1979లో నోబెల్ శాంతి బహుమతి పొందిన మదర్ థెరిసా 1910, ఆగస్టు 26న ఆప్పటి ఒట్టొమాన్ సామ్రాజ్యంలోని స్కోపేలో జన్మించారు. ఆమె అసలు పేరు ఏంజెజ్ గోంజె బొజాజియు. ఆమె 1929లో భారతదేశానికి వచ్చి స్థిరపడ్డారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థను 1950లో ఏర్పాటు చేశారు. మదర్ థెరిసాకు 1980లో భారతరత్న అవార్డు లభించింది. 1997 సెప్టెంబరు 5న కలకత్తాలో మరణించారు.
4. అమర్త్యసేన్: సంక్షేమ ఆర్థికశాస్త్రంలో చేసిన కృషికిగాను 1998లో నోబెల్ బహుమతి లభించింది. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించిన ఏకైక భారతీయుడు. ఆయన 1933 నవంబర్ 3న బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్ ప్రెసిడెన్సీ (ప్రస్తుతం పశ్చిమబెంగాల్)లో జన్మించారు. 1972 నుంచి అమెరికా, యునెటైడ్ కింగ్‌డమ్‌లలోని పలు విశ్వవిద్యాల యాల్లో బోధించారు. ప్రస్తుతం బీహార్‌లోని నలందా విశ్వవిద్యాలయానికి చాన్సలర్‌గా వ్యవహరిస్తున్నారు. 1999లో భారతరత్న లభించింది. అమర్త్యసేన్ పలు పుస్తకాలు రాశారు. డెవలప్‌మెంట్ యాజ్ ఫ్రీడమ్, ద ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్, ఐడెంటిటీ అండ్ వయొలెన్‌‌స: ద ఇల్యూజన్ ఆఫ్ డెస్టినీ, ద ఐడియా ఆఫ్ జస్టిస్ వంటివి ప్రముఖ రచనలు.
5. కైలాష్ సత్యార్థి: 2014 నోబెల్ శాంతి బహుమతిని మలాలా యూసఫ్ జాయ్‌తో కలిసి గెలుచుకున్నారు. 1954, జనవరి 11న మధ్యప్రదేశ్‌లోని విదిషలో జన్మించారు. బాలల హక్కులపై పోరాడుతున్నారు. 1980లో ‘బచ్‌పన్ బచావో ఆందోళన్’ సంస్థను స్థాపించి బాల కార్మిక వ్యవస్థ రూపుమాపడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన 144 దేశాల్లో 83,000 మంది బాలబాలికల హక్కు లను పరిరక్షించారు.
విదేశీ పౌరసత్వం కలిగిన భారత సంతతికి చెందిన నోబెల్ గ్రహీతలు
6. హర్‌గోబింద్ ఖొరానా: భారతీయ అమెరికన్ బయోకెమిస్ట్ అయిన హర్‌గోబింద్ ఖొరానాకు 1968లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కింది. ఆయన 1922, జనవరి 9న పంజాబ్‌లో జన్మించారు. 1966లో అమెరికా పౌరసత్వాన్ని స్వీకరించారు. 2011 నవంబర్ 9న యునెటైడ్ స్టేట్స్‌లోని మసాచుసెట్స్‌లో మరణించారు.
7. సుబ్రమణ్యన్ చంద్రశేఖర్:
 
1983లో ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతి లభించింది. 1910, అక్టోబర్ 19న బ్రిటిష్ ఇండియాలోని లాహోర్‌లో జన్మించారు. 1953లో యునెటైడ్ స్టేట్స్ పౌరస త్వాన్ని స్వీకరించారు. భారత ప్రభుత్వం 1968లో పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. 1995, ఆగస్టు 21న అమెరికాలోని చికాగో నగరంలో మరణించారు.
8. వెంకట్రామన్ రామకృష్ణన్: 2009లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందారు. 1952లో తమిళనాడులోని చిదంబరంలో జన్మించిన వెంకట్రామన్ రామకృష్ణన్‌కు అమెరికా, బ్రిటిష్ పౌరసత్వాలున్నాయి. రైబోజోమ్‌లపై పరిశోధనకుగాను నోబెల్ లభించింది. 2010లో పద్మవిభూషణ్‌ను ప్రదానం చేశారు. 
భారతీయ మూలాలు కలిగిన విదేశీ నోబెల్ గ్రహీతలు
9. రొనాల్డ్ రాస్: 1902లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందారు. ఈయన భారతదేశంలో జన్మించిన బ్రిటిష్ పౌరుడు. 1857లో ఉత్తరాఖండ్‌లోని అల్మొరాలో జన్మించారు. మలేరియాపై పరిశోధనకు గాను నోబెల్ బహుమతి లభించింది.
10. రుడ్యార్డ్ కిప్లింగ్: 1907లో సాహిత్యంలో నోబెల్ బహుమతిని పొందారు. 1865లో అప్పటి బ్రిటిష్ ఇండియాలోని బొంబాయిలో జన్మించారు. భారత్‌లో జన్మించినప్పటికీ ఈయన బ్రిటన్ పౌరుడు. ఇంగ్లీష్ భాషా సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి వ్యక్తి కిప్లింగ్.
2013 విజేతలు
ఫిజిక్స్:బ్రిటన్‌కు చెందిన పీటర్ హిగ్‌‌స, బెల్జియం శాస్త్రవేత్త ఫ్రాంకోయిస్ ఎంగ్లెర్‌‌టలకు దైవకణంపై పరిశోధనకుగాను లభించింది.
కెమిస్ట్రీ: అమెరికాకు చెందిన మార్టిన్ కార్‌ప్లస్, మైకెల్ లెవిట్, ఏరియా వార్షెల్‌లకు దక్కింది.
వైద్యశాస్త్రం: అమెరికాకు చెందిన జేమ్స్ రాథ్‌మన్, రాండీషెక్‌మన్, జర్మన్- అమెరికన్ థామస్ సుధోఫ్‌లు పొందారు.
లిటరేచర్: ప్రఖ్యాత కెనడా రచయిత్రి అలైస్ మన్రో సాహిత్య బహుమతిని గెలుచుకున్నారు. ఆమె 2009లో మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్‌ను కూడా సాధించారు. డ్యాన్‌‌స ఆఫ్ ది హ్యాపీ షేడ్‌‌స ఆమె ప్రముఖ రచన.
ఎకనామిక్స్అమెరికాకు చెందిన యుజీన్ ఫామా, లార్‌‌స పీటర్ హోన్‌సెన్, రాబర్‌‌ట షిల్లర్ అనే ముగ్గురు ఆర్థికవేత్తలకు సంయుక్తంగా లభించింది.
పీస్: 2013 నోబెల్ శాంతి బహుమతిని ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్‌‌స (ఓపీసీడబ్ల్యూ) అనే సంస్థకు రసాయన ఆయుధాలను నిర్మూలించడంలో కృషి చేసినం దుకు ప్రదానం చేశారు. ఈ సంస్థ 1997, ఏప్రిల్ 29న నెదర్లాండ్‌‌సలోని ద హేగ్ నగరంలో ఏర్పడింది. టర్కీకి చెందిన అహ్మత్ ఉజుమ్‌చు ఓపీసీడబ్ల్యూ ప్రస్తుత డైరక్టర్ జనరల్.
2014 గ్రహీతలు 
భౌతికశాస్త్రం:విద్యుత్‌ను ఆదా చేసే లైట్ ఎమిటింగ్ డయోడ్‌‌స (ఎల్‌ఈడీ)ను కనుగొన్న జపాన్ శాస్త్రవేత్తలు ఇసాము అకసాకి, హిరోషి అమానో; జపాన్- అమెరికన్ శాస్త్రవేత్త.. ఘజి నకమురాలకు 2014లో భౌతికశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి లభించింది.
రసాయనశాస్త్రం: అమెరికా శాస్త్రవేత్తలు విలి యం మోర్నర్, ఎరిక్ బెట్జిగ్, జర్మనీకి చెందిన స్టీఫెన్ హెల్‌లను నోబెల్ వరించింది. ఈ ముగ్గు రు పరిశోధకులు మైక్రోస్కోపును మరింత మెరుగుపర్చారు.
వైద్యశాస్త్రం: బ్రిటిష్- అమెరికన్ జాన్ ఒ కీఫ్, నార్వే జంట ఎడ్వర్‌‌డ మోసర్, మే బ్రిట్ మోసర్‌లకు వైద్య విభాగంలో నోబెల్ పురస్కారం లభించింది. వీరు మెదడుపై విస్తృత పరిశోధనలు చేశారు.
సాహిత్యం: ఫ్రాన్‌‌సకు చెందిన నవలా రచయిత పాట్రిక్ మోడియానోకు 2014 నోబెల్ సాహితీ పురస్కారం దక్కింది. మిస్సింగ్ పర్సన్ ఆయన ప్రముఖ రచన. 2012లో ఆస్ట్రియన్ స్టేట్‌ప్రైజ్ ఫర్ యురోపియన్ లిటరేచర్ అవార్డు కూడా లభించింది.
శాంతి: ఈ ఏడాది శాంతి బహుమతిని భారత్ పాకిస్థాన్‌లకు చెందిన సామాజిక కార్యకర్తలు కైలాష్ సత్యార్థి, మలాలా యూసఫ్‌జాయ్‌లు సంయుక్తంగా దక్కించుకున్నారు. మదర్ థెరిసా తర్వాత నోబెల్ బహుమతికి భారత్ తరపున ఎంపికైన రెండోవ్యక్తి కైలాష్ సత్యార్థి. జన్మతః భారతీయుడైన వ్యక్తికి నోబెల్ శాంతి బహుమతి లభించడం ఇదే తొలిసారి. మలాలా యూసఫ్‌జాయ్ అతి చిన్న వయసు లో (17) నోబెల్ బహుమతికి ఎంపికైంది. ఇంతకుముందు ఈ రికార్డు లారెన్‌‌స బ్రాగ్ (25) పేరిట ఉండేది. మలాలా బాలికల విద్యాహక్కు కోసం ఉద్యమం కొనసాగిస్తోంది.
ఆర్థిక శాస్త్రం: ఫ్రాన్‌‌సకు చెందిన ఆర్థికవేత్త జీన్ టీరోల్‌కు ఈ ఏడాది ఆర్థికశాస్త్ర నోబెల్ పుర స్కారం లభించింది. మార్కెట్ శక్తి, మార్కెట్ నియంత్రణలపై జీన్ టిరోల్ చేసిన పరిశోధ నలకు ఆయనను ఎంపిక చేశారు.


అతి పెద్ద వయసులో గ్రహీతలు:



విభాగం             పేరు సంవత్సరం వయసు
ఫిజిక్స్ రేమండ్ డేవిస్ జూనియర్ 2002 88

కెమిస్ట్రీ
జాన్ ఫెన్ 2002 85

మెడిసిన్
పేటన్ రోస్ 1966 87

లిటరేచర్
డోరిస్ లెస్సింగ్ 2007 88

శాంతి
జోసెఫ్ రాట్ బ్లాట్ 1995 87
ఎకనామిక్స్ లియోనిడ్ హర్‌విచ్ 2007 90


అతి చిన్న  వయసులో గ్రహీతలు:

వయసు పేరు విభాగం సంవత్సరం
17 మలాలా యూసఫ్ జాయ్ శాంతి 2014

25
లారెన్‌‌స బ్రాగ్ భౌతికశాస్త్రం 1915

32
ఫ్రెడరిక్ బ్యాంటింగ్ వైద్యశాస్త్రం 1923

35
ఫ్రెడరిక్ జోలియట్ రసాయన శాస్త్రం 1935

42
రుడ్‌యార్‌‌డ కిప్లింగ్ సాహిత్యం 1907

51
కెన్నత్ యారో ఆర్థికశాస్త్రం 1972
వివిధ విభాగాలలో నోబెల్ బహుమతులు పొందిన వారు :
నోబెల్ శాంతి బహుమతి
1991 ఆంగ్ శాన్ సూకీ మయన్మార్

1992
రిగో బెర్టా మెంచ్యూ గ్వాటి మాల

1993
ఫ్రెడరిక్ డబ్లు డి క్లార్క్ , నెల్సన్ మన్డెలా  సౌత్ ఆఫ్రికా

1994
యాసిర్ ఆరాఫత్ పాలస్తీనా

1994
సైమన్ పేరీస్ ఇజ్రాయెల్

1995
జోసెఫ్ రాట్ బ్లాట్ యు కె

1996
జోసే రామోస్ హోర్తా తైమూర్

1997
జోడీ విలియమ్స్

1998
డేవిడ్ ట్రింబల్ నేడర్ లాన్డ్

1999
డాక్టర్ వీత్ అవుట్ బొర్డర్స్ ఫ్రాన్స్

2000
కిమ్ దే జంగ్ డా . కొరియా 

2001
కోఫీ అన్నం ఐ . రా. సా . అద్యక్శుడు

2002
జిమ్మీ కార్టర్ యు ఎస్

2003
శిరిన్ ఇబాదీ ఇరాన్

2004
వంగారి మాటాయ్ కెన్యా

2005
మాహ్నడ్ ఎల్ బారాది

2006
మాహ్నాడ్ యూనస్ బంగ్లా డేష్

2007
ఆ ఎల్ గోరే యు ఎస్

2008
మార్టి అతిసారి ఫిన్ లాన్డ్

2009
బరాక్ ఒబామా యు ఎస్

2010
లయు జియాబో చైనా

2011
ఎలెన్ జాన్సం సర్లీఫ్ లైబీరియా

2011
తవూక్కల్ కర్మన్ యెమన్

2012
యూరోపియన్ యూనియన్ ఈ యు
2013 ఆర్గా నైజేషన్ ఫర్ డి ప్రోహిబీషన్ ఆఫ్ కెమికల్ వేపంస్ ఓ పి సి డబ్ల్యూఏ

నోబెల్ అర్థ శాస్త్రం బహుమతి



1991 రొనాల్డ్ హెచ్ కాస్ యు ఎస్

1992
గేరి ఎస్ బెకర్ యు ఎస్

1993
రాబర్ట్ డబ్లు ఫోజల్ యు ఎస్

1994
జీన్ సి హర్‌సాంవి యు ఎస్

1995
రాబర్ట్ ఈ లుకాస్ జూనియర్ యు ఎస్

1996
జేమ్స్ ఆ మిర్లిన్ యు కె

1996
విలియం విక్రఎ కెనడా

1997
రాబర్ట్ సి మెర్టాన్ యు ఎస్

1997
మైరాం ఎస్ స్కోల్స్ యు ఎస్

1998
అమర్త్య సేన్ ఇండియా

1999
రాబర్ట్ మున్డెల్ కెనడా

2000
జేమ్స్ మేక్ మ్యాన్ యు ఎస్

2001
జార్ట్ ఆ ఆకార్లాఫ్ యు ఎస్

2002
డేనియల్ కెహ్ని మ్యాన్ యు ఎస్

2003
రాబర్ట్ ఎఫ్ ఎంగల్ యు ఎస్

2003
గ్రాంజెర్ బ్రిటన్

2004
ఫిన్ కిడ్లాడ్ నార్వే

2004
ఎద్జర్డ్ ప్రిస్కాట్ యు ఎస్

2005
రాబర్ట్ ఐ అమన్ ఇజ్రాయెల్

2005
థామస్ షెలింగ్ యు ఎస్

2006
ఎడ్మన్డ్ ఎస్ ఫెల్ప్ యు ఎస్

2007
లియొనిడ్ హురేక్ట్ యు ఎస్

2008
పాల్ క్రాగ్ మ్యాన్ యు ఎస్

2009
ఎలినార్ ఒస్ట్రమ్ యు ఎస్

2009
ఆలివర్ ఈ విలియం సన్ యు ఎస్

2010
పీటర్ డైమండ్ యు ఎస్

2010
క్రిస్టఫర్  సైప్రస్

2011
థామస్ జె సార్జన్ట్ యు ఎస్ 

2012
ఆల్విన్ ఏ రాట్ యు ఎస్ 

2013
ఎఫ్ పామా  యు ఎస్ 

0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment