| 1. వీరపాండ్య కట్టబొమ్మన్ ఏ ప్రాంతాన్ని పాలించాడు? |
| జ: పాంచాల కురిచ్చి |
| 2. 1808 - 09లో బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ట్రావెన్‌కోర్ దివాన్ ఎవరు? |
| జ: వేలు తంబి |
| 3. కిట్టూర్ తిరుగుబాటుకు ఎవరు నాయకత్వం వహించారు? |
| జ: చెన్నమ్మ |
| 4. గడ్కరీలు మహారాష్ట్రలోని ఏ ప్రాంతంలో తిరుగుబాటు చేశారు? |
| జ: కొల్హాపూర్ |
| 5. సయ్యద్ అహ్మద్ వహాబీ ఉద్యమాన్ని ఎప్పుడు ప్రారంభించాడు? |
| జ: 1820 |
| 6. పాగల్ పంతీ ఉద్యమ నాయకుడు ఎవరు? |
| జ: కరమ్ షా |
| 7. పరైజీల ఉద్యమం ఏ ప్రాంతంలో ప్రారంభమైంది? |
| జ: తూర్పు బెంగాల్ |
| 8. కుకా ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? |
| జ: భగత్ జవహర్ మల్ |
| 9. కోలి తెగల ఉద్యమం ఏ ప్రాంతంలో ప్రారంభమైంది? |
| జ: గుజరాత్, మహారాష్ట్ర (సహ్యాద్రి) |
| 10. కోలి తెగల ఉద్యమానికి నాయకుడు ఎవరు? |
| జ: బుద్దో భగత్ |
| 11. నాగా తెగల తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది? |
| జ: అస్సాం |
| 12. ముండా తెగల తిరుగుబాటుకు ఎవరు నాయకత్వం వహించారు? |
| జ: బిర్సా ముండా |
| 13. 1857 తిరుగుబాటు సమయంలో అయోధ్య ముఖ్య కమిషనర్ ఎవరు? |
| జ: సర్ హెన్రీ లారెన్స్ |
| 14. నానాసాహెబ్ అసలు పేరేంటి? |
| జ: దోండు పంత్ |
| 15. 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిషర్లకు సహకరించిన మొగలు చక్రవర్తి రెండో బహదూర్ షా భార్య పేరేమిటి? |
| జ: జీనత్ మహల్ |
| 16. డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేసిన రాజ్యాల్లో వేటి విలీనాన్ని బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేసింది? |
| జ: భగత్, ఉదయ్‌పూర్ |
| 17. 1856లో బ్రిటిష్ ప్రభుత్వం కింది ఏ చట్టాన్ని రూపొందించలేదు? |
| ఎ) హిందూ వితంతు పునర్వివాహ చట్టం బి) సతీసహగమన నిషేధ చట్టం |
| సి) సామాన్య సేనా నియుక్త చట్టం డి) రెలిజియస్ డిజెబిలిటీస్ చట్టం |
| జ: సతీసహగమన నిషేధ చట్టం |
| 18. భారతీయులను క్రైస్తవులుగా మార్చడానికి భారీ సంఖ్యలో క్రైస్తవ మిషనరీలు ఏ సంవత్సరంలో ప్రవేశించాయి? |
| జ: 1833 |
| 19. ఏ చట్టం తర్వాత భారతీయుల సామాజిక, మత విషయాల్లో బ్రిటిషర్ల జోక్యం పెరిగింది? |
| జ: 1813 చార్టర్ చట్టం |
| 20. బ్రిటిష్ ఇండియా సైన్యంలో కొత్తరకం ఎన్‌ఫీల్డ్ రైపిళ్లను ఎప్పుడు ప్రవేశపెట్టారు? |
| జ: జనవరి 1857 |
| 21. 1857లో మూడో అశ్వదళానికి చెందిన సిపాయిలను కొత్త ఎన్‌ఫీల్డ్ తుపాకులను ఉపయోగించాల్సిందిగా ఆదేశించిన సైన్యాధికారి ఎవరు? |
| జ: కల్నల్ స్మిత్ |
| 22. 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ ఇండియా సైన్యంలో భారతీయ, ఐరోపా సైనికుల నిష్పత్తి ఎంత? |
| జ: 6 : 1 |
| 23. 1857 తిరుగుబాటుకు కాన్పూర్‌లో ఎవరు నాయకత్వం వహించారు? |
| జ: నానాసాహెబ్ |
| 24. రాణీ లక్ష్మీబాయి భర్త పేరేంటి? |
| జ: గంగాధరరావు |
| 25. ఢిల్లీలో తిరుగుబాటుకు వాస్తవంగా ఎవరు నాయకత్వం వహించారు? |
| జ: భక్తఖాన్ |
| 26. వెల్లూరులో సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? |
| జ: 1806 |
| 27. డల్హౌసీ ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో ఎప్పుడు విలీనం చేశాడు? |
| జ: 1853 |
| 28. అవధ్‌కు మొదటి ముఖ్య కమిషనర్‌గా ఎవరిని నియమించారు? |
| జ: జేమ్స్ ఔట్రమ్ |
| 29. ఢిల్లీని తిరుగుబాటుదారుల నుంచి తిరిగి ఎవరు ఆక్రమించుకున్నారు? |
| జ: జాన్ నికల్సన్ |
| 30. 1857 తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది? |
| జ: మీరట్ |
| 31. 1857, మార్చి 27న బరక్‌పూర్‌లో తన ఉన్నతాధికారిపై ఎవరు దాడిచేశారు? |
| జ: మంగళ్‌పాండే |
| 32. బహదూర్ షా రంగూన్‌లో ఎప్పుడు మరణించాడు? |
| జ: 1862 |
| 33. 1857 తిరుగుబాటు సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? |
| జ: లార్డ్ కానింగ్ |
| 34. తిరుగుబాటుదారుల్లో ఏ నాయకుడు/ నాయకురాలిని ఉత్తమమైన, ధైర్యసాహసాలున్న వ్యక్తిగా సర్ హ్యూరోజ్ కీర్తించాడు? |
| జ: రాణి ఝాన్సీ లక్ష్మీబాయి |
| 35. 1844 - 45లో జరిగిన గడ్కరీల తిరుగుబాటు ఎవరికి వ్యతిరేకంగా జరిగింది? |
| జ: వడ్డీ వ్యాపారులు, బ్రిటిష్ ప్రభుత్వం |
| 36. 1857 తిరుగుబాటును మొదటి భారత స్వాతంత్య్ర యుద్ధంగా అభివర్ణించినవారు |
| జ: వి.డి. సావర్కర్ |
| 37. బ్రిటిష్ సైన్యంలోని భారతీయ సైనికులు మొదట ఎక్కడ తిరుగుబాటు చేశారు? |
| జ: పాట్నా |
| 38. 1857లో అశాంతి ఛాయలు మొదట ఎక్కడ కనిపించాయి? |
| జ: బెంగాల్ |
| 39. కిందివాటిలో 1857లో ఎక్కడ తిరుగుబాటు జరగలేదు? |
| ఎ) బరేలీ బి) ఝాన్సీ సి) మద్రాస్ డి) ఆగ్రా |
| జ: మద్రాస్ |
| 40. 1858, ఏప్రిల్‌లో ఎవరిని బంధించడం ద్వారా 1857 తిరుగుబాటు అంతమైంది? |
| జ: తాంతియా తోపే |
| 41. కింది ఏ వర్గం తిరుగుబాటుదార్లకు సహకరించలేదు? |
| ఎ) రాకుమారులు బి) రైతులు, చేతివృత్తులవారు సి) జమీందారులు డి) మధ్య తరగతి ప్రజలు |
| జ: మధ్య తరగతి ప్రజలు |
| 42. 1857 తిరుగుబాటుకు అస్సాంలో ఎవరు నాయకత్వం వహించారు? |
| జ: మణిరామ్ దత్తా |
| 43. ఎవరి సహాయంతో రాణి లక్ష్మీబాయి గ్వాలియర్‌ను ఆక్రమించింది? |
| జ: నానాసాహెబ్ సోదరుడు రావుసాహెబ్, తాంతియా తోపే |
| 4. 1857 తిరుగుబాటు సమయంలో ఫ్రాన్స్ రాజు మూడో నెపోలియన్‌కు మూడు ఉత్తరాలు పంపిన నాయకుడు ఎవరు? |
| జ: నానా సాహెబ్ |
| 45. 'మొదటి జాతీయ స్వాతంత్య్ర యుద్ధంగా పేర్కొనే 1857 తిరుగుబాటు మొదటిది కాదు, జాతీయం కాదు, |
| స్వాతంత్య్ర యుద్ధం కాదు' అని పేర్కొన్నవారు ఎవరు? |
| జ: ఆర్.సి. మజుందార్ |
| 46. నానాసాహెబ్‌ను ఓడించిన బ్రిటిష్ జనరల్ ఎవరు? |
| జ: కొలిన్ క్యాంప్ బెల్ |
| 47. 1859లో నేపాల్ కు పారిపోయిన నాయకుడు ఎవరు? |
| జ: నానాసాహెబ్ |
| 48. ఝాన్సీ లక్ష్మీబాయి ఎప్పుడు మరణించింది? |
| జ: 1858, జూన్ 17 |