మత, సాంఘిక సంస్కరణ ఉద్యమాలు



1. క్రైస్తవ మత ప్రచారకుడైన అలెగ్జాండర్ డఫ్ చేసిన హిందూమత వ్యతిరేక ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టిందెవరు?
జ: దేవేంద్రనాథ్ ఠాగూర్

2. 'బ్రహ్మధర్మ' గ్రంథ రచయిత ఎవరు?
జ: దేవేంద్రనాథ్ ఠాగూర్

3. 'వేదాంత సూత్రాలు' గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించినవారు ఎవరు?
జ: వివేకానందుడు

4. 'శుద్ధి ఉద్యమాన్ని' ఎవరు ప్రారంభించారు?
జ: దయానందుడు

5. తత్వబోధిని సభను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ: 1839

6 'ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్‌'ను ఎవరు స్థాపించారు?
జ: కేశవ్ చంద్రసేన్

7. 'ప్రార్థనా సమాజ్' ను ఎప్పుడు స్థాపించారు?
జ: 1867 

8. ఆర్యసమాజం ప్రభావం ఏ రాష్ట్రంపై ఎక్కువ?
జ: పంజాబ్

9. శ్రద్ధానందుడు గురుకుల విద్యాలయాలను ఎక్కడ ప్రారంభించాడు?
జ: హరిద్వార్

10. రామకృష్ణ పరమహంస భార్య పేరేంటి?
జ: శారదాదేవి

11. పశ్చిమ భారత పునరుజ్జీవన పితగా పేరుపొందినవారు ఎవరు?
జ: ఎం.జి.రనడే

12. ఉత్తర భారతదేశపు హిందూ లూథర్‌గా ప్రసిద్ధి చెందినవారు ఎవరు?
జ: దయానందుడు

13. ప్రజామిత్ర మండలి స్థాపకుడు ఎవరు?
జ: సి.ఆర్.రెడ్డి

14. నాయర్ సర్వీస్ సొసైటీ స్థాపకుడు ఎవరు?
జ: మన్నత్ పద్మనాభ పిళ్లై

15. 'నామ్‌ధారి ఉద్యమం' ఎప్పుడు ప్రారంభమైంది?
జ: 1857 


16. వితంతు పునర్వివాహ చట్టం రూపకల్పనకు కృషి చేసినవారు?
జ: ఈశ్వరచంద్ర విద్యాసాగర్

17. హిందూ కన్యా విద్యాలయాలను ఎవరు స్థాపించారు?
జ: జె.ఇ.డి.బెత్యూన్

18. ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు ఎవరు?
జ: ఎం.జి.రనడే

19. వితంతువులకు శారదా సదన్ పేరుతో పాఠశాలలను స్థాపించినవారు ఎవరు?
జ: పండిత రమాబాయి

20. పుణెలో 1896లో 'విధవా సదన్' ఏర్పాటు చేసినవారు ఎవరు?
జ: ధొండొకేశవ్ కార్వే

21. 1893లో కలకత్తాలో మహాకాళి పాఠశాలను ఎవరు స్థాపించారు?
జ: గంగాబాయి

22. మద్రాసు ప్రెసిడెన్సీలో మొదటి హిందూ వితంతు గ్రాడ్యుయేట్ ఎవరు?
జ: సుబ్బలక్ష్మి

23. అలహాబాద్‌లో 1910 లో 'భారత్ స్త్రీమహామండల్' ను ఎవరు ప్రారంభించారు?
జ: సరళాదేవి చౌధురాని 

24. 'ఉమెన్స్ ఇండియా అసోసియేషన్' ను స్థాపించిన ఐర్లండ్ వనిత ఎవరు?
జ: దొరోతి

25. స్త్రీలకు ఓటుహక్కు కల్పించాలని మాంటేగ్‌ను డిమాండు చేసిన మొదటి సభ ఏది?
జ: ఉమెన్స్ ఇండియా అసోసియేషన్

26. పుణెలో 1927లో 'ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్' ఏర్పాటుకు కృషి చేసినవారు ఎవరు?
జ: మార్గరెట్ కజిన్స్

27. మద్రాసు శాసనమండలిలో నియమించిన మొదటి మహిళ ఎవరు?
జ: ముత్తులక్ష్మి రెడ్డి

28. ఏ చట్టం స్త్రీలకు పరిమిత సంఖ్యలో ఓటు హక్కు కల్పించింది?
జ: 1935 చట్టం

29. అలీగఢ్ ఉద్యమ స్థాపకుడు ఎవరు?
జ: సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్

30. 1887లో భారత జాతీయ కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ముస్లిం అధ్యక్షుడు ఎవరు?
జ: బద్రుద్దీన్ త్యాబ్జి

31. అలీగఢ్ పాఠశాలను ఎప్పుడు స్థాపించారు?
జ: 1875 


32. సతీసహగమన నిషేధ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
జ: 1829

33. 1873లో 'సత్యశోధక్ సమాజ్‌'ను ఎవరు ప్రారంభించారు?
జ: జ్యోతిబా పూలే

34. 'శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం' సంస్థను ఎవరు స్థాపించారు?
జ: నారాయణ గురు

35. మహర్, మాతంగ్‌లను ఏ రాష్ట్రంలో అంటరానివారిగా పరిగణించేవారు?
జ: మహారాష్ట్ర

36. గాంధీజీ 'హరిజన్' పత్రికను ఎప్పుడు స్థాపించారు?
జ: 1933

37. మొదటి అఖిల భారత అణగారిన వర్గాల సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించారు?
జ: 1918

38. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఏ కులానికి చెందినవారు?
జ: మహర్

39. 1925లో ఆత్మగౌరవ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు?
జ: ఇ.వి.రామస్వామి నాయకర్ 

40. బి.ఆర్.అంబేద్కర్ ప్రారంభించిన పత్రిక ఏది?
జ: బహిష్కృత్ భారత్

41. 1885లో 'సేవాసదన్' సంస్థను ఎవరు ప్రారంభించారు?
జ: బి.ఎమ్.మలబారి

42. గోపాలకృష్ణ గోఖలే 'సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ' ని ఎప్పుడు ప్రారంభించారు?
జ: 1915

43. 1911లో ఎన్.ఎమ్.జోషి స్థాపించిన సంస్థ ఏది?
జ: సోషల్ సర్వీస్ లీగ్

44. లోకహితవాదిగా పేరుపొందినవారు ఎవరు?
జ: గోపాల హరిదేశ్‌ముఖ్

45. 'ద్రవిడ మున్నేట్ర కజగం' పార్టీని ఎప్పుడు స్థాపించారు?
జ: 1949