మార్చి - 2014 వార్తల్లో వ్యక్తులు

మార్చి - 1
¤  బెంగళూరుకు చెందిన ముగ్గురు ఇంజినీరింగ్ పట్టభద్రులు సి.శేఖర్, విజయ్‌కుమార్, సందేశ్ క్లౌడ్ టెలిఫోన్ ప్రొడక్ట్ ఫ్రీకాల్ ద్వారా ఉచిత టెలిఫోన్ సేవలను ప్రారంభించారు. ఈ సేవల ద్వారా జీరో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ఉచితంగా రోజుకు 12 నిమిషాల పాటు మాట్లాడుకోవచ్చు.
   »    ఈ సేవలను బెంగళూరులో ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు దొరైస్వామి ఆవిష్కరించారు.   »    ఉచిత సేవలను పొందేందుకు ముందుగా 080-49202060 అనే నెంబరుకు కాల్ చేయాలి. దీనికి ఛార్జీలు పడవు. పది సెకన్ల నుంచి నిమిషం తర్వాత అదే నెంబరు నుంచి మనకు కాల్ వస్తుంది. వెంటనే కాల్‌ను స్వీకరించి మనం చేయాల్సిన ఫోన్ నెంబరుతోపాటు యాష్ (#) కొట్టి ఓకే చేస్తే సంబంధిత వ్యక్తి ఫోన్ లైన్‌లోకి వస్తారు.
మార్చి - 3
¤  మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ప్రపంచంలో అత్యంత ధనికుడిగా నిలిచారు.   »    ఫోర్బ్స్ పత్రిక రూపొందించిన 2014 వార్షిక బిలియనీర్ల జాబితాలో గేట్స్ మొదటి స్థానాన్ని సంపాదించారు. నాలుగేళ్ల అనంతరం ఆయనకు మళ్లీ ఈ స్థానం దక్కడం విశేషం.
   »    గత నాలుగేళ్లు మెక్సికోకు చెందిన టెలికాం దిగ్గజం కార్లోస్ స్లిమ్ హెలూ ప్రథమ స్థానంలో ఉన్నారు. తాజా జాబితాలో ఆయన రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు.   »    బిల్‌గేట్స్ ఆస్తి నికర విలువ 7,600 కోట్ల డాలర్లకు చేరింది. గత 20 ఏళ్లలో 15 ఏళ్లు గేట్స్ మొదటి స్థానంలో కొనసాగడం విశేషం.
   »    జాబితాలో మొత్తం 1,645 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరి సగటు నికర విలువ 640 కోట్ల డాలర్లు.   »    గతంలో ఎప్పుడూ లేని విధంగా జాబితాలో మొత్తం 172 మంది మహిళలు ఉన్నారు. గతేడాది జాబితాలో 130 మంది మహిళా బిలియనీర్లు చోటు దక్కించుకున్నారు.   »    2014 ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో భారత్‌కు చెందిన 56 మంది సంపన్నులు చోటు దక్కించుకున్నారు.   »    భారతీయుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన సంపద 1,860 కోట్ల డాలర్లుగా ఫోర్బ్స్ వెల్లడించింది. జాబితాలో ముకేష్ 40వ స్థానంలో నిలిచారు. ముకేష్ సోదరుడు అనిల్ అంబానీ 500 కోట్ల డాలర్ల సంపదతో 281వ స్థానంతో సరిపెట్టుకున్నారు. 2008లో ముకేష్ అంబానీ 4,300 కోట్ల డాలర్ల నికర విలువతో ప్రపంచంలోనే 5వ అత్యంత ధనవంతుడిగా నిలవడం గమనార్హం.   »    ఇతర భారతీయుల్లో అజీమ్ ప్రేమ్‌జీ 61వ స్థానం (1,530 కోట్ల డాలర్లు), దిలీప్ సింఘ్వీ 82వ స్థానం (1,280 కోట్ల డాలర్లు), శివ్‌నాడార్ 102వ స్థానం (1,110 కోట్ల డాలర్లు), హిందుజా సోదరులు 122వ స్థానం (1,000 కోట్ల డాలర్లు), కుమార మంగళం బిర్లా 191వ స్థానం (700 కోట్ల డాలర్లు) సాధించారు.¤  ఎన్నో స్టాక్ మార్కెట్ మోసాల కేసుల్లో నిందితుడైన స్టాక్ బ్రోకర్ కేతన్ పరేఖ్‌ను సీబీఐ దోషిగా తేల్చి, రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. రూ.50 వేల జరిమానా కూడా విధించింది.¤  లోకపాల్ అన్వేషణ కమిటీకి నేతృత్వం వహించేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.టి.థామస్ తిరస్కరించారు.   »    ఇప్పటికే ప్రముఖ న్యాయకోవిదుడు ఫాలీ నారిమన్ ఈ కమిటీలో ఉండేందుకు తన తిరస్కారాన్ని తెలియజేశారు.
¤  పితృత్వ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్.డి.తివారీ (88) ఎట్టకేలకు నిజాన్ని వెల్లడించారు.
   »    రోహిత్ శేఖర్ తన కన్న కొడుకేనని తివారీ బహిరంగంగా న్యూఢిల్లీలో వెల్లడించారు.
మార్చి - 4
¤   ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఈ ఏడాది ఇద్దరు భారతీయ మహిళలకు చోటు దక్కింది. సావిత్రి జిందాల్, కుటుంబం 4.9 బిలియన్ డాలర్లతో, ఇందు జైన్ 2.3 బిలయన్ డాలర్లతో ఫోర్బ్స్ జాబితాకెక్కడం గమనార్హం.
   »    ఆసియాలోనే అత్యంత ధనవంతురాలిగా ఒకప్పుడు రికార్డు సృష్టించిన సావిత్రి జిందాల్ ప్రస్తుతం ఫోర్బ్స్ అంతర్జాతీయ జాబితాలో 295వ స్థానంలో నిలిచారు. బెన్నెట్ అండ్ కోల్‌మన్ అండ్ కో అధినేత్రి ఇందు జైన్ 764వ స్థానంతో సరిపెట్టుకున్నారు.
¤
   క్రిస్టీ వాల్టన్ (జాన్ వాల్టన్ భార్య) 36.7 బిలియన్ డాలర్లతో మహిళల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచారు. రెండో స్థానాన్ని లారియల్ అధినేత్రి లిలియాన్ బెటెన్ కోర్ట్ (34.5 బిలియన్ డాలర్లతో), మూడో స్థానాన్ని మరో వాల్టన్ కుటుంబ సభ్యురాలైన అలైస్ వాల్టన్ (34.3 బిలియన్ డాలర్లు) దక్కించుకున్నారు.
మార్చి - 5
¤   జపాన్‌కు చెందిన మిసౌ ఒకావా అనే వృద్ధురాలు తన 116వ పుట్టిన రోజును జరుపుకొంది.   »    పశ్చిమ జపాన్‌లోని ఒసాకాకు చెందిన ఆమె ప్రపంచంలోనే అతి వృద్ధ మహిళగా రికార్డులకెక్కారు.
మార్చి - 6
¤   ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లోని గ్రాఫిక్ ఎరా వర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ బోధించే ప్రొఫెసర్ అరవింద్ మిశ్రా ఏకధాటిగా 130 గంటల పాటు (అయిదు రోజుల పది గంటలు) ఉపన్యాసం ఇచ్చి ప్రపంచ రికార్డు సృష్టించారు.
   »    2009లో ఏకధాటిగా 121 గంటలపాటు ఉపన్యాసం ఇచ్చి రికార్డు సృష్టించిన ఎరోల్ ముజావజి రికార్డును మిశ్రా అధిగమించారు.
మార్చి - 7
¤   కాల్పనిక సాహిత్యంలో మహిళలకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక బెయిలేస్ బహుమతికి ఎంపికైన 20 మంది రచయిత్రుల జాబితాలో భారత సంతతికి చెందిన ఝంపా లాహిరి చోటు పొందారు.
   »    పాకిస్థానీ రచయిత్రి ఫాతిమా భుట్టో కూడా  జాబితాలోఉన్నారు.

   »    గతంలో బెయిలేస్ బహుమతిని 'ఆరెంజ్ ప్రైజ్‌'గా పేర్కొనేవారు. ఆంగ్ల కాల్పనిక సాహిత్యంలో
 అత్యుత్తమ నవలకు బ్రిటన్ ఏటా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డునిచ్చి సత్కరిస్తోంది.
   »    ఝంపా లాహిరి రాసిన 'ది లో ల్యాండ్'ఫాతిమా భుట్టో కలం నుంచి జాలువారిన 'ది షాడో ఆఫ్ది
 క్రిసెంట్ మూన్‌'లు  జాబితాలో ఉన్నాయి.¤   భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐఆంధ్రప్రదేశ్ ఛైర్మన్‌గా 2014-15 సంవత్సరానికిసురేష్‌రాయుడు చిట్టూరి ఎన్నికయ్యారు.   »    వైస్ ఛైర్‌పర్సన్‌గా వనితా దాట్ల ఎన్నికయ్యారు.¤   భారత పునరుత్పాదన ఇంధన అభివృద్ధి సంస్థ (ఐఆర్ఈడీఏసీఎండీ గా కె.ఎస్.పొప్లీ పదవీబాధ్యతలు
 స్వీకరించారు.   »    దేవాశిష్ మజుందార్ స్థానంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు.
మార్చి - 9
¤   ఆధార్ సృష్టికర్త, ఐటీ దిగ్గజం నందన్ నిలేకని బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం స్వీకరించారు.   »    ఆధార్ ప్రాధికార (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్) పదవికి రాజీనామా చేసి, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.
¤   అమెరికాలోని మిస్సోరిలో నిర్వహించిన జాక్సన్ కౌంటీ స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతికి 
చెందిన ఫ్రాంటియర్ స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ విద్యార్థి కుష్ శర్మ విజేతగా నిలిచాడు.
   »    మొత్తం 95 రౌండ్ల పాటు మారథాన్‌లో పోటీని నిర్వహించారు.చివరి రౌండ్‌లో definition

 స్పెల్లింగ్ చెప్పిన కుష్ టైటిల్ సాధించాడు.

¤   న్యూయార్క్ నగరం (అమెరికా)లోని ట్యాక్సీలు, అద్దె రవాణా వ్యవస్థను నియంత్రించే న్యూయార్క్ సీటీ ట్యాక్సీ, లిమోజిన్ కమిషన్ ఛైర్‌పర్సన్, సీఈఓగా భారత సంతతి మహిళ మీరా జోషీ నియమితులయ్యారు.
మార్చి - 10
¤   ఒక ఆలోచన వ్యాపారాన్ని లాభాల్లో నడిపిస్తుంది. అలా చేసినవారిలో తొలి 40 మందిని అది కూడా 40 ఏళ్లలోపు వారిని ఫార్చ్యూన్ ఇండియా గుర్తించి, వారితో '40 అండర్ 40' జాబితా విడుదల చేసింది. అందులో ఏడుగురు మహిళలకు కూడా చోటు దక్కింది. 'ఇది ఒక జాబితా మాత్రమే, ర్యాంకింగ్ కాదు' అని ఫార్చ్యూన్ ఇండియా స్పష్టం చేసింది.   »    ధెరామిత్ నోవో బయొలాజికల్స్ డైరెక్టర్, సీఓఓ కవితా అయ్యర్ రోడ్రిగ్స్; జివామేడాట్‌కామ్ వ్యవస్థాపకురాలు, సీఈఓ రిచాకర్; గ్లోబో స్పోర్ట్ గ్రూప్ సీఓఓ కవిత భూపతి చద్దా; టైటన్ ఇండస్ట్రీస్ ఫాస్ట్రాక్ అండ్ న్యూ బ్రాండ్స్ ఇండియా మార్కెటింగ్ అధినేత్రి సమీరన్ భాసిన్; ద మెయిడ్స్ కంపెనీ వ్యవస్థాపకురాలు గౌరీసింగ్; టాటా స్టార్‌బక్స్ సీఈఓ అవని సంగ్లానీ దేవ్దా; ఇండియా ఆర్ట్ ఫెయిర్ వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ నేహా కిర్పాల్ జాబితాలో చోటు దక్కించుకున్నారు.   »    ఫ్లిప్‌కార్ట్ సహా వ్యవస్థాపకులు సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్; టాక్సీ ఫర్ ష్యూర్ సహవ్యవస్థాపకులు, డైరెక్టర్లు అప్రమేయా రాధాకృష్ణ, రఘనందన్ జీ; ఇన్ మొబి సహ వ్యవస్థాపకుడు, సీఈఓ నవీన్ తివారీ; మోర్గాన్ స్టాన్లీ ఇండియా ఈడీ అన్షుమన్ ఠాకూర్ తదితరులు జాబితాలో ఉన్నారు.
మార్చి - 11
¤   ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్లూఈఎఫ్-2014)కు 214 మందితో ప్రకటించిన 'యంగ్ గ్లోబల్
 లీడర్స్(వైజీఎల్)' జాబితాలో 14 మంది భారతీయులకు చోటు లభించింది.
   »    నాయకత్వ లక్షణాలుసమాజసేవ ప్రాతిపదికగా వీరిని గుర్తించారు. 214 మంది ఉన్న
జాబితాలో 109 మంది యువతులే. 66 దేశాల నుంచి విద్యకళలుపౌరసమాజం,
ప్రభుత్వరంగం,మీడియాస్వచ్ఛంద సంస్థలు తదితర రంగాలకు చెందిన వారికి ఇందులో
స్థానం కల్పించారు.
   »    సచిన్ బన్సాల్ఫర్హాన్ అక్తర్‌తో పాటు రచయిత్రి పల్లవి అయ్యర్టాటా స్టార్ బక్స్ సీఈఓ
 అవనీదేవ్దామోహిత్ జోషి (ఇన్ఫోసిస్ యూరప్), రోషిని నాడార్ మల్హోత్రా
 (హెచ్‌సీఎల్ కార్పొరేషన్ సీఈఓ),విశ్వరూప్ నారాయణ్ (టెక్సాస్ పసిఫిక్ గ్రూప్),
నందిని పిరామిల్ (పిరామిల్ ఎంటర్‌ప్రైజెస్), రిషద్ప్రేమ్‌జీ (విప్రో), అనూప్ రత్నకర్‌రావు
 (నాంది ఫౌండేషన్), చికి సర్కార్ (పెంగ్విన్ రాండం హౌస్ఇండియా), పరమేష్ సహానీ (గోద్రెజ్),
అనురాగ్ ఠాకూర్ (భాజపా యువమోర్ఛా అధ్యక్షుడు),రతీశన్ యోగనాథన్ (లెబరా గ్రూప్)
 జాబితాలో చోటు పొందారు.
¤   కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ కేరళ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.   »    తిరువనంతపురంలోని రాజ్‌భవన్‌లో కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మంజులా చెల్లూర్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు.
   »    నిఖిల్ కుమార్ స్థానంలో షీలాదీక్షిత్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.
¤   ప్రముఖ భారత క్రికెటర్ శిఖర్ ధావన్‌ను కెనరాబ్యాంక్ తన ప్రచారకర్తగా నియమించుకుంది.   »    కెనడా బ్యాంక్ సీఎండీ ఆర్.కె.దుబే
మార్చి - 13
¤   ఇన్ఫోసిస్ స‌హ వ్యవ‌స్థాప‌కుడు, ఆధార్ కార్యక్రమ ప‌ర్యవేక్షకుడు నంద‌న్ నీలేక‌ని భార‌త ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఛైర్మన్ ప‌ద‌వికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నేప‌థ్యంలో ఆయ‌న ఈ నిర్ణయం తీసుకున్నారు. ద‌క్షిణ బెంగ‌ళూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోక్‌స‌భ‌కు పోటీ చేయ‌నున్న నీలేక‌ని ప్రధాని మ‌న్మోహ‌న్ సింగ్‌కు రాజీనామా స‌మ‌ర్పించారు. 
 మార్చి - 21
¤   1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై సిక్కు వ‌ర్గం వేసిన దావాలో ఏప్రిల్ 7లోగా ఆమె పాస్‌పోర్టు ప్రతిని కోర్టుకు స‌మర్పించాల‌ని అమెరికా న్యాయ‌స్థానం ఆదేశించింది. గ‌తేడాది సెప్టెంబ‌రులో ఆమె అమెరికాలో ఉన్నారో లేర‌నే విష‌యం నిర్ధరించేందుకు ప‌త్రరూప సాక్ష్యాధారంగా ఆమె పాస్‌పోర్టు ప్రతిని స‌మ‌ర్పించాల‌ని సూచించింది.
   »    సోనియాగాంధీ గ‌తేడాది సెప్టెంబ‌రులో వైద్యం కోసం న్యూయార్క్‌కు వ‌చ్చిన‌ప్పుడు స‌మ‌న్లు జారీ చేసిన‌ట్లు సిక్కుల న్యాయం కోసం పోరాడే సంఘం (ఎస్ఎఫ్‌జే) పేర్కొంది. అయితే ఆ స‌మ‌యంలో న్యూయార్క్‌లో లేన‌ని, త‌న‌కు ఎలాంటి స‌మ‌న్లు జారీ కాలేద‌ని సోనియాగాంధీ కోర్టుకు తెలిపిన నేప‌థ్యంలో దానిపై వారు కోర్టులో స‌వాలు చేశారు.   »    సెప్టెంబ‌రు 2 నుంచి 12 మ‌ధ్య సోనియాగాంధీ అమెరికాలో ఉన్నారా? లేదా? అనేదానిపై ఇప్పటివ‌ర‌కు సంతృప్తిక‌ర‌మైన ఆధారాల‌ను స‌మ‌ర్పించ‌లేద‌ని మాన్‌హ‌ట్టల్ ఫెడ‌ర‌ల్ కోర్టు న్యాయ‌మూర్తి పేర్కొన్నారు. ఈ విష‌యంలో ప‌త్రరూప సాక్ష్యాధారంగా ఆమె పాస్‌పోర్టు ప్రతిని ఏప్రిల్ 7లోగా స‌మ‌ర్పించాలని ఆదేశించారు.
 మార్చి - 22
¤   కావాల్సినంత కోడి మాంసాన్ని ప్రయోగశాలల్లోనే ఉత్పత్తి చేసుకునే రోజులు త్వరలోనే రానున్నాయి. విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యుడు డాక్టర్‌ ఆర్‌.సత్యనారాయణ ఆలోచనకు ప్రతిరూపమే ఈ కృత్రిమ కోడిమాంసం.
   »    ఈ తరహా మాంసం తయారీకి సంబంధించి ఆయన ప్రతిపాదనలను కేంద్ర ఆహార శుద్ధి మంత్రిత్వశాఖ ఆమోదించడంతో పాటు పరిశోధనలకు అవసరమైన నిధులనూ మంజూరు చేసింది.
   »    
గీతం బయోటెక్నాలజీ విభాగానికి చెందిన డాక్టర్‌ కె.అరుణలక్ష్మి, పర్యావరణశాస్త్ర విభాగానికి చెందిన సిహెచ్‌.రామకృష్ణ సహకారంతో కోడి కండ నుంచి సేకరించిన మూలకణాల ఆధారంగా కృత్రిమ మాంసం తయారీ ప్రయోగాలు చేశారు. ఫలితాలు సానుకూలంగా రావడంతో పెద్దఎత్తున మాంసం తయారు చేసే అవకాశాలపై దృష్టి సారించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే తక్కువ ధరకే మంచి పోషకాలున్న కృత్రిమ కోడి మాంసం అందుబాటులోకి వస్తుంది. 
   »    ప్రయోగశాలలో కృత్రిమంగా రూపొందిస్తున్న నేపథ్యంలో ఈ కోడి మాంసాన్ని 'ఇన్‌విట్రో చికెన్‌', 'టెస్ట్‌ట్యూబ్‌ చికెన్‌' అని అంటారు. సాధారణ కోడి నుంచి మాంసం తీసే క్రమంలో పావువంతు వృథా అవుతుంది. కృత్రిమ కోడి మాంసంలో వ్యర్థాలకు తావేలేదు. కోడి మూల కణాల నుంచి అభివృద్ధి చేయడం వల్ల రంగు, రుచి, వాసనలో ఏమాత్రం తేడా ఉండదని సత్యనారాయణ పేర్కొన్నారు.   »    ఇన్‌విట్రో చికెన్‌లో కావాల్సిన స్థాయికి కొవ్వు శాతాన్ని పరిమితం చేసుకోవచ్చు. అవసరమైన ఇతర పోషకాల‌నూ జతచేసుకుని 'డిజైనర్‌ మీట్‌' ఉత్తత్తి చేయవచ్చు. మరోవైపు సాధారణ కోళ్లలో వచ్చే బర్డ్‌ఫ్లూ వంటి వ్యాధుల సమస్య కూడా ఉండదు.    »    సత్యనారాయణ గ‌తంలో కేంద్ర ప్రభుత్వ శాస్త్రసాంకేతిక విభాగం (డి.ఎస్‌.టి.) నుంచి 'యువ శాస్త్రవేత్త' అవార్డు అందుకున్నారు.