ఫిబ్రవరి - 2014 అంతర్జాతీయం


ఫిబ్రవరి - 5
¤  ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్ 'కొలోసస్' 70 సంవత్సరాలను పూర్తి చేసుకుంది.   

»    'కొలోసస్' కార్యకలాపాలు 1944, ఫిబ్రవరి 5న ప్రారంభమయ్యాయి.   

»    రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ సేనలు పంపే రహస్య సందేశాలను డీకోడ్ చేయడానికి బ్రిటిష్ టెలిఫోన్ ఇంజినీర్ టామీ ఫ్లవర్స్ ఈ కంప్యూటర్‌ని రూపొందించారు. దీని సాయంతో ఆ సమయంలో వేలాది ప్రజల ప్రాణాలను కాపాడగలిగారు.

¤  క్రైస్తవుల మతపెద్ద పోప్‌కు నిలయమైన వాటికన్ పై ఐక్యరాజ్యసమితి కన్నెర్ర జేసింది.   

»    ప్రపంచవ్యాప్తంగా వాటికన్ ఆధ్వర్యంలోని కేథలిక్ చర్చిల్లో బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న క్రైస్తవ మతాధికారులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేసింది. గతంలో ఈ తరహా నేరాలకు పాల్పడి, వాటిని మరుగు పరచిన మతపెద్దల ఫైళ్లనూ తెరవాలని ఆదేశించింది.
ఫిబ్రవరి - 6
¤  రష్యా వెళ్లే విమానాల్లో ఉగ్రవాదులు టూత్ పేస్టు బాంబులతో విరుచుకుపడే ప్రమాదం ఉందని అమెరికా ప్రభుత్వం దేశ విదేశీ విమానయాన సంస్థలను హెచ్చరించింది.  

 »    రష్యాలోని సోచీలో వింటర్ ఒలింపిక్స్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రష్యా వెళ్లే విమానాలను ఉగ్రవాదులు ప్రత్యేక లక్ష్యంగా చేసుకుంటున్నట్లు సమాచారం ఉందని అమెరికా అధికారులు వెల్లడించారు.
ఫిబ్రవరి - 10
¤  పదహారేళ్ల పాటు భారత్‌లో స్వీయ ప్రవాసంలో ఉన్న నేపాలీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సుశీల్ కొయిరాలా నేపాల్ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.

 »    74 ఏళ్ల కోయిరాలా సీపీఎన్ - యూఎంఎల్ మద్దతుతో పదవిని చేపట్టనున్నారు. దీంతో గతేడాది ఎన్నికల ఫలితాల అనంతరం నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ముగింపు పలికినట్లయింది.


»    ప్రధాని పదవికి ఏకైక పోటీదారు అయిన సుశీల్ కొయిరాలాకు 601 సభ్యుల రాజ్యాంగ అసెంబ్లీలో మొత్తం 405 ఓట్లు లభించాయి.   

»    2008లో నేపాల్‌లో రాచరికం రద్దయిన తరువాత ప్రధానమంత్రి పదవి చేపడుతున్న ఆరో వ్యక్తిగా సుశీల్ వార్తల్లో నిలిచారు.
ఫిబ్రవరి - 11
¤  పాకిస్థాన్‌లో పెషావర్‌లోని ఓ సినిమా థియేటర్‌లో మూడు బాంబులు పేలిన ఘటనలో 12 మంది మృతి చెందారు. ఈ థియేటర్‌లో భారతీయ చలనచిత్రాలను ప్రదర్శిస్తుంటారు.

¤  అల్జీరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 103 మంది మృతి చెందారు. దట్టమైన మంచు, బలమైన గాలుల మధ్య చిక్కిన అల్జీరియా సైన్యానికి చెందిన హెర్క్యులస్ సి-130 విమానం ప్రమాదానికి గురయింది.    

»    అల్జీరియా రాజధాని అల్జీర్స్ నుంచి ప్రమాదం జరిగిన కాన్‌స్టంటైన్ సిటీ 380 కిలోమీటర్ల దూరంలో ఉంది.

¤  నేపాల్నూతన ప్రధాన మంత్రిగా నేపాలీ కాంగ్రెస్ (ఎన్‌సీ) అధ్యక్షుడు సుశీల్ కోయిరాలా ప్రమాణ స్వీకారం చేశారు.
ఫిబ్రవరి - 14
¤  ఉప్పు, నిప్పులా పరస్పరం కయ్యానికి కాలు దువ్వే ఉత్తర, దక్షిణ కొరియాలు అరుదైన ఒప్పందం కుదుర్చుకున్నాయి. 1950-53 మధ్య జరిగిన కొరియా యుద్ధంలో వేరు పడిన లక్షలాది కుటుంబాలు తిరిగి బంధువుల చెంతకు చేరేలా వీలు కల్పించే చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశాయి. అలాగే ఇకపై దుర్భాషలాడుకోరాదని, అనువైన సమయంలో చర్చల ప్రక్రియ కొనసాగించాలని తీర్మానించాయి.

¤  సమాచార హక్కు కింద సీబీఎస్ న్యూస్ చేసిన విన్నపానికి అమెరికా విదేశాంగ శాఖ ఇచ్చిన గణాంకాల ప్రకారం అధ్యక్షుడు బరాక్ ఒబామా పదవి చేపట్టిన తర్వాత తొలి అయిదుగురు అత్యంత ప్రముఖ నేతలకు ఇచ్చిన విందుల వ్యయం రూ.9.62 కోట్లుగా ఉంది.
   


»    రూ.9.62 కోట్లలో సింహభాగం రూ.3.55 కోట్లు ఖర్చుతో ఒబామా భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌కు విందు ఇవ్వడం గమనార్హం.
   

»    ఒబామా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటి పర్యటనకొచ్చిన విదేశీనేత మన్మోహన్ సింగ్‌కు 2009 నవంబరు 24న ఒబామా ఘనంగా విందు ఇచ్చారు. ఇందుకైన ఖర్చు 5.72 లక్షల డాలర్లు (దాదాపు రూ.3.55 కోట్లు).
ఫిబ్రవరి - 15
¤ శరీరానికి ధరించే సరికొత్త పుస్తకాన్ని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు రూపొందించారు.   

»  సెన్సర్లతో తయారు చేసిన 'ది గర్ల్ హూవాజ్ ప్లగ్‌డ్ ఇన్' పేరిట రూపొందించిన ఈ పుస్తకాన్ని నడుముకు ధరిస్తే చదువుతున్నంతసేపూ, అందులోని పాత్రల మనోభావాలకు అనుగుణంగా ఇందులోని సెన్సర్లు వైబ్రేషన్లు కలిగిస్తాయి.
ఫిబ్రవరి - 16
¤ అఫ్గానిస్థాన్‌లో ఏర్పాటు చేసిన మొదటి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కాందహార్‌లో ప్రారంభించారు.   

»  భారత ఆర్థిక సాయంతో నిర్మించిన ఈ వర్సిటీని భారత విదేశాంగ మంత్రి సల్మాన్‌ఖుర్షీద్‌తో కలిసి కర్జాయ్ ప్రారంభించారు.   

»  ఏప్రిల్ 5న తమ దేశంలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా, దాని మిత్రపక్షాలు జోక్యం చేసుకోవద్దని అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ స్పష్టం చేశారు. ద్వైపాక్షిక రక్షణ ఒప్పందానికి సంబంధించి, అమెరికా-అఫ్గానిస్థాన్ మధ్య దూరం పెరిగిన నేపథ్యంలో కర్జాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

¤ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'నైస్ కార్నివాల్' ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో ప్రారంభమైంది.
ఫిబ్రవరి - 17
¤ ఇటలీ నూతన ప్రధానమంత్రిగా మెటియో రెంజీ ఎంపికయ్యారు.  

 »  39 ఏళ్ల రెంజీ ప్రస్తుతం ఫ్లోరెన్స్ మేయర్‌గా పనిచేస్తున్నారు.  

 »  యూరోపియన్ యూనియన్‌లో అతిపిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు.   

»  ఎన్రికో లెట్టా స్థానంలో రెంజీ ఎంపికయ్యారు.
ఫిబ్రవరి - 21
¤ అమెరికాలో జనాభాలో అత్యంత పెద్దదైన కాలిఫోర్నియా రాష్ట్రాన్ని ఆరు రాష్ట్రాలుగా విభజించాలనే డిమాండ్ ఉంది. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలనే ప్రతిపాదన అర్హత సాధించేందుకు ప్రజలతో సంతకాలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది.  

 » ఈ ప్రతిపాదన అర్హత సాధించాలంటే, జులై మధ్యనాటికి 8,08,000 మంది సంతకాలు అవసరం.   

» ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజలు అంగీకరించినా, అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) ఒప్పుకుంటేనే విభజన సాధ్యమవుతుంది.
ఫిబ్రవరి - 22
¤ ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో తిరుగుబాటుదారులు అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు. నిర్బంధంలో ఉన్న తమ నాయకురాలు తిమొషెన్కోను బయటకు తీసుకొచ్చారు.   

» దేశ అధ్యక్షుడు యనుకోవిచ్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటుదారులు కీవ్‌లోని 'ఇండిపెండెన్స్ స్వ్కేర్' వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఫిబ్రవరి - 23
¤ అంతర్జాల దిగ్గజం గూగుల్ ప్రపంచ వ్యాప్తంగా అడవుల నరికివేతకు సంబంధించిన
 సమాచారాన్నిఅందించేందుకు వీలుగా 'గ్లోబల్ ఫారెస్ట్ వాచ్' అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.
   

» శాస్త్రవేత్తలు శతాబ్దాల క్రితం వివిధ ప్రాంతాల్లో వృక్ష సంపద ఎలా ఉందో అధ్యయనం
 చేసివివరాలను  వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారువీటికి తోడు గూగుల్ ఎర్త్గూగుల్ మ్యాప్స్,
శాటిలైట్చిత్రాల సాయంతో వృక్ష సంపద వివరాలను వీలైనంత పక్కాగా అందిస్తారు.