జనవరి - 2014 కమిటీలు - కమిషన్లు


జనవరి - 2
¤ ఒడిశాలో జరిగిన గనుల అక్రమ తవ్వకాలపై విచారణ జరిపిన జస్టిస్ ఎం.బి.షా కమిషన్ అయిదు సంపుటాల తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఒడిశాలో ఏటా 55 మిలియన్ టన్నులకు మించి ఇసుక ఖనిజాన్ని తవ్వకూడదనే పరిమితి విధించాలని కమిషన్ సిఫార్సు చేసింది.

          » జస్టిస్ ఎం.బి.షా కమిషన్ సమర్పించిన నివేదికను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన న్యూఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పరిశీలించింది. షా కమిషన్ నివేదిక నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన కోసం వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.