¤ విశాఖ ఉక్కు కర్మాగారం (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ - ఆర్ఐఎన్ఎల్) తొమ్మిదో ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పి.మధుసూదన్ బాధ్యతలు చేపట్టారు.
» ఎ.పి.చౌధురి స్థానంలో నియమితుడైన ఆయన అయిదేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. | |
» కర్మాగారం చరిత్రలో సీఎండీగా నియమితులైన తెలుగువారిలో మధుసూదన్ మూడో వ్యక్తి. 2004 నుంచి 2007 వరకు వై.శివసాగర్‌రావు మూడేళ్ల కాలానికి సీఎండీగా సేవలందించారు. అంతక్రితం సి.అప్పారావు 11 రోజుల పాటు తాత్కాలిక సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.
» విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రస్తుతం 'నవరత్న' హోదా ఉంది. ఏడాదికి 11 నుంచి 12 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యంగా 'మహారత్న' హోదాను దక్కించుకోవాలని విశాఖ ఉక్కు లక్ష్యంగా పెట్టుకుంది.
¤ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1980 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సత్యనారాయణ మహంతి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సప్త్లెస్-డిస్పోజబుల్స్ (డీజీఎస్-డీ) డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు.¤ విజయ బ్యాంక్ సీఎండీగా వి.కన్నన్ బాధ్యతలు స్వీకరించారు.
» గతంలో ఆయన ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేశారు. |
¤ నాస్‌కామ్ అధ్యక్షుడిగా టెలికాం పూర్వ కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు.
» సోమ్ మిట్టల్ స్థానంలో చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. | |
జనవరి - 18
|
¤ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మాజీ సలహాదారుడు, భారతీయ అమెరికన్ అనీశ్ గోయల్ దక్షిణాసియా మేథో బృందానికి సీనియర్ సభ్యుడిగా నియమితులయ్యారు.
» ప్రస్తుతం ఆయన బోయింగ్ వాణిజ్య విమానయాన సేవల సంస్థకు డైరెక్టరుగా ఉన్నారు. కొత్త బాధ్యతల్లో భాగంగా దక్షిణాసియాకు సంబంధించి అమెరికా ప్రభుత్వ విధానానికి ఆయన రూపకల్పన చేయనున్నారు. |
జనవరి - 20
|
¤ టెలికాం నియంత్రణ ప్రాథికార సంస్థ (ట్రాయ్) కొత్త కార్యదర్శిగా సుధీర్ గుప్తా నియమితుడయ్యారు.
» ప్రస్తుతం ఆయన ట్రాయ్‌లో ప్రధాన సలహాదారుగా పని చేస్తున్నారు. |
¤ హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ డైరక్టర్‌గా సీనియర్ పోలీస్ అధికారి అరుణా బహుగుణ నియమితులయ్యారు. | |
» 65 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ అకాడమీకి తొలి మహిళా డెరెక్టర్‌గా నియమితులైన అరుణా బహుగుణ 1979 బ్యాచ్‌కి చెందిన ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి.
» విధి నిర్వహణలో ప్రతిభ కనబరచినందుకు ఆమె 1995లో భారతీయ పోలీస్ పతకాన్ని (ఐపీఎం), 2005లో రాష్ట్రపతి పోలీసు పతకాన్ని పొందారు. |
జనవరి - 24
|
¤ కెనడాలోని భారతీయ సాంస్కృతిక కేంద్రం సంచాలకుడు ఆచార్య డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కేంద్రీయ హిందీ సమితి సభ్యుడిగా నియమితుడయ్యారు.
¤ అలోక్ సిన్హా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) కొత్త ఛైర్మన్‌గా వి.పి.అగర్వాల్ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. |
జనవరి - 30
|
¤ పాట్నా విశ్వవిద్యాలయానికి వై.సి.సింహాద్రి, మగధ యూనివర్సిటీకి మహమ్మద్ ఇస్తియాక్ వైస్ ఛాన్సలర్లుగా నియమితులయ్యారు.
¤ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీగా అరుణ్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. |
| ¤ సైబర్‌భద్రత సమస్యల పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సలహాదారుగా భారతీయ ప్రముఖ సైబర్ భద్రతానిపుణుడు వివేక్‌లాల్ నియమితుడయ్యారు. |
» భారత్, అమెరికా చర్చల్లో భాగంగా రక్షణ, వైమానిక రంగాలు, సైబర్ భద్రతలపై లాల్ ఏర్పాటు చేసిన ఇండోఅమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ కీలకపాత్ర పోషిస్తోంది. ఆయా రంగాలకు సంబంధించి, భారత్, అమెరికా వ్యూహాత్మక చర్చలకు లాల్ నాయకత్వం వహించారు. |
|
|