సెప్టెంబరు - 2014 అవార్డులు


సెప్టెంబరు - 2
¤  గుజరాత్‌లోని మహారాజా షాయాజీరావ్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ మృణాళినీ దేవీ పౌర్ కి 'ఆక్స్‌ఫర్డ్ బెస్ట్ మేనేజర్' పురస్కారం దక్కింది.   »    యూరప్ బిజినెస్ అసెంబ్లీ (ఆక్స్‌ఫర్డ్, యు.కే.) ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. అక్టోబరు 14న బ్రిటన్‌లో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేస్తారు.   »    భారతీయ ఆహారంలో జింక్ లభ్యతపై చేసిన పరిశోధనలకుగాను ఆమె హైదరాబాద్‌కు చెందిన విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు.   »    మహారాజా షాయాజీరావ్ విశ్వవిద్యాలయాన్ని 1881లో బరోడా కళాశాల పేరుతో స్థాపించారు.
సెప్టెంబరు - 3
¤  అమెరికన్ కెమికల్ సొసైటీ (ఏసీఎస్) ఇచ్చే ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డులను నలుగురు భారత సంతతి అమెరికన్ శాస్త్రవేత్తలకు ప్రకటించారు. థామస్ జె.కోలాకట్, అభిజిత్ ఎ.నాంజోషిలకు ఏసీఎస్ అవార్డు; నీల్ గార్గ్‌కు ఆర్థర్ సి.కోప్‌స్కాలర్ అవార్డు, జోసెఫ్ రెడ్డికి 'జార్జ్ అండ్ క్రిస్టీన్ సోన్‌వ్‌స్కీ' అవార్డులు లభించాయి.¤  ప్రతిష్ఠాత్మక మహాత్మాగాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతిని దక్షిణాఫ్రికాకు చెందిన 'ది ఆఫ్రికన్ సెంటర్ ఫర్ కన్‌స్ట్రక్టివ్ రిజల్యూషన్ ఆన్ డిస్‌ప్యూట్స్' సంస్థకు ప్రదానం చేశారు.   »    ప్రపంచవ్యాప్తంగా శాంతి సాధనకు, వివిధ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నందుకు ఈ సంస్థకు ఈ అవార్డు లభించింది.   »    నల్లజాతి సూర్యుడిగా ప్రఖ్యాతి గాంచిన దివంగత నేత నెల్సన్ మండేలా భార్య, ఈ సంస్థ ఛైర్‌పర్సన్ అయిన గ్రాకా మషేల్‌కు ఈ అవార్డును మహాత్మాగాంధీ మనవరాలు ఇలా గాంధీ అందజేశారు.   »    ప్రపంచవ్యాప్తంగా మహిళలు, పిల్లల హక్కుల కోసం మషేల్ ఈ సంస్థ ద్వారా విశేష కృషి చేస్తున్నారు.   »    దక్షిణాఫ్రికాలో డర్బన్‌లోని గాంధీ అభివృద్ధి ట్రస్టు ఏటా ఈ అవార్డును ప్రకటిస్తోంది.
సెప్టెంబరు - 7
¤  గుంటూరు జిల్లా లాం వ్యవసాయ పరిశోధనా కేంద్రం అసోసియేట్ డైరెక్టర్ ఈదర నారాయణకు ప్రతిష్ఠాత్మక 'డాక్టర్ రాధాకృష్ణన్' అవార్డు లభించింది.
   »    వ్యవసాయరంగంలో విస్తృత పరిశోధనలు చేసి, రైతులకు సేవలందించే ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలకు న్యూఢిల్లీకి చెందిన గ్లోబల్ ఎకనామిక్స్ అండ్ రిసెర్చ్ అసోసియేట్ ఏటా ఈ అవార్డును అందిస్తోంది.
సెప్టెంబరు - 8
¤  ప్రకాశం జిల్లా కలెక్టర్ జి.ఎస్.ఆర్.కె.ఆర్.విజయ్‌కుమార్ సాక్షర భారత్-2014 పురస్కారాన్ని అందుకున్నారు.   »    అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు.   »    అక్షరాస్యత సాధనకు విశేషంగా కృషి చేసే జిల్లాలను ఈ పురస్కారానికి ఎంపిక చేస్తారు.   »    'ప్రకాశం అక్షర విజయం' కార్యక్రమం ద్వారా కేవలం 9 నెలల కాలంలో 4.75 లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దినందుకు జాతీయ సాక్షరత మిషన్ ప్రకాశం జిల్లాను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది.   »    గతంలో ప్రకాశం జిల్లా అక్షరాస్యత శాతం 63.08 ఉండగా, విజయ్‌కుమార్ కృషితో 78.84 శాతానికి చేరింది.   »    అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా అయిదో స్థానంలో నిలిచింది.¤  కొప్పరపు కవుల జాతీయ ప్రతిభా పురస్కారాన్ని ఈ ఏడాదికి గాను ప్రఖ్యాత హిందుస్థానీ సంగీత విద్వాంసుడు పద్మవిభూషణ్ పండిట్ జస్‌రాజ్‌కు ప్రకటించారు. ఈ నెల 9న అవార్డును విశాఖపట్నంలో ప్రదానం చేయనున్నారు.
సెప్టెంబరు - 10
¤  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కు 2014 సంవత్సరానికి ప్రపంచ దిగ్గజ వ్యాపార సమాచార విశ్లేషణ సంస్థ డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డీఅండ్‌బీ) ప్రతిష్ఠాత్మక పొలారీస్ ఫైనాన్షియల్ టెక్నాలజీ బ్యాంకింగ్ అవార్డును ప్రకటించింది.   »    రిటైల్, గ్రామీణ ప్రాంతాల్లో సేవల విస్తరణ, సాంకేతిక విధానాల వినియోగ విభాగాల్లో అత్యుత్తమ ప్రభుత్వరంగ బ్యాంక్‌గా ఎస్‌బీఐకు ఈ అవార్డు లభించింది.   »    ముంబయిలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ఎస్‌బీఐకు కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్‌సిన్హా ప్రదానం చేశారు.
సెప్టెంబరు - 12
¤  హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ ఆర్గనైజేషన్ డెవలప్‌మెంట్ (సీఓడీ) నెలకొల్పిన 'వి.కృష్ణమూర్తి ఎక్సలెన్స్ అవార్డు'ను 2014 సంవత్సరానికి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, యూఐడీఏఐ మాజీ ఛైర్మన్ నందన్ నీలేకనికి తమిళనాడు గవర్నర్ రోశయ్య ప్రదానం చేశారు.   »    BHEL , SAIL  లాంటి ప్రభుత్వరంగ సంస్థలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంతో పాటు, మారుతి కంపెనీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన వి.కృష్ణమూర్తి పేరున సీఓడీ అవార్డులను నెలకొల్పింది.
సెప్టెంబరు - 16 
¤ దేశంలో సహకార చక్కెర కర్మాగారాల ఆర్థిక యాజమాన్యంలో అత్యుత్తమ ప్రతిభను చూపించినందుకు విశాఖ జిల్లా చోడవరం సహకార చక్కెర కర్మాగారానికి 'సహకార చక్కెర కర్మాగారాల జాతీయ సమాఖ్య' (న్యూఢిల్లీ) అవార్డును ప్రకటించింది.
   » 2012-13లో క్రషింగ్ కాలంలో రుణాలు తీసుకోకుండా సొంత నిధులతో కర్మాగారాన్ని నడిపినందుకు ఉత్తమ ఆర్థిక యాజమాన్యం కింద ఈ అవార్డును ఇచ్చారు.
 
సెప్టెంబరు - 17
¤ ప్రముఖ గాయకుడు కె.జె.ఏసుదాసుకు విశాఖపట్నంలో 'విశ్వ విఖ్యాత సంగీత కళానిధి' బిరుదును ప్రదానం చేశారు.¤ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి జన్మదిన వేడుకల్లో రాజ్యసభ ఉపాధ్యక్షుడు పి.జె.కురియన్ ఈ బిరుదుతో ఏసుదాసును సత్కరించారు.
సెప్టెంబరు - 20
¤ ప్రతిష్ఠాత్మక అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును 2013 సంవత్సరానికిప్రముఖ
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు ప్రకటించారు.
   »  పురస్కారం కింద రూ.5 లక్షల నగదుప్రశంసాపత్రాన్ని ఇస్తారు.
   » 2005 నుంచి  అవార్డును ఏటా ప్రదానం చేస్తున్నారు.
   » ఇప్పటి వరకూ  అవార్డును అందుకున్నవారు వరుసగా: దేవానంద్
 (తొలి గ్రహీత),షబానా ఆజ్మీఅంజలీదేవిలతా మంగేష్కర్వైజయంతి మాల,
 కె.బాలచందర్హేమమాలినిశ్యాంబెనెగళ్.
సెప్టెంబరు - 23 
 అవార్డు లభించింది.
సెప్టెంబరు - 25 
¤ ప్రముఖ ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్తలు, సోదరులైన జి.పి.హిందుజా, ఎస్.పి.హిందుజాను బ్రిటన్ ఎగువ సభలో నిర్వహించిన కార్యక్రమంలో ఇండో-యూరోపియన్ బిజినెస్ ఫోరం (ఐఈబీఎఫ్) 'వ్యాపార రంగంలో జీవనకాల సాఫల్య పురస్కారం'తో సత్కరించింది.   » భారతీయ పారిశ్రామికవేత్త, వేదాంత రిసోర్సెస్ వ్యవస్థాపకుడు, ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్‌ను గ్లోబల్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సన్మానించారు. 
సెప్టెంబరు - 26 
¤ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అసాధారణ కృషి చేసిన పది మంది శాస్త్రవేత్తలకు న్యూఢిల్లీలో ప్రతిష్ఠాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారాలను ప్రదానం చేశారు.   » శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) డైరెక్టర్ జనరల్ పి.ఎస్.అహుజా ఈ పురస్కారాలను విజేతలకు ప్రదానం చేశారు.   » హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)కి చెందిన ఎస్.వెంకట మోహన్‌కు ఇంజినీరింగ్ సైన్స్ విభాగంలో ఈ పురస్కారాన్ని అందజేశారు.   » ఈ అవార్డుల కింద విజేతలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు నగదు బహుమతి ఇస్తారు. 
సెప్టెంబరు - 27 
¤ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన 14 ఏళ్ల కుర్రాడు అభిషేక్‌కు ప్రతిష్ఠాత్మక యునిసెఫ్ పురస్కారం 'మీనా రతన్' లభించింది.   » విద్య, సామాజిక సేవా రంగాల్లో కృషి చేసిన వారికి ఈ పురస్కారాన్ని ఇస్తారు.   » ఇటీవల ముజఫర్‌నగర్‌లో జరిగిన అల్లర్ల తర్వాత విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయం నెలకొంది. దీంతో వారు తమ పిల్లలను పాఠశాలలకు పంపడం లేదు. ఈ క్రమంలో అభిషేక్ మరో ఆరుగురు విద్యార్థులతో కలసి బృందంగా ఏర్పడి పిల్లలను పాఠశాలలకు పంపించండని ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. యునిసెఫ్, సర్వశిక్షా అభియాన్ సంయుక్తంగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేశాయి.¤ ప్రభుత్వ రంగంలోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) సీఎండీ పి.సుధాకర్‌కు 'ఎలక్ట్రానిక్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్' అవార్డు లభించింది.   » దేశంలోని ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమకు ప్రాతినిథ్యం వహించే సంస్థ అయిన ఎల్సినా (ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ అసోసియేషన్) ఏటా ఈ అవార్డును అందిస్తోంది.   » ఎలక్ట్రానిక్స్ రంగంలో విశేష కృషి చేసినవారిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు.
సెప్టెంబరు - 28 
¤ జాతీయ లోహ పరిశోధన కేంద్రం (ఎన్ఎంఎల్) మద్రాసు విభాగం ప్రతిష్ఠాత్మక విజ్ఞాన, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) టెక్నాలజీ అవార్డును అందుకుంది.   » ఎల్ఎంఎల్ విభాగంలోని తెలుగు శాస్త్రవేత్తలు రూపొందించిన, అధిక మొత్తంలో లోహాన్ని ఉత్పత్తి చేసే ప్రత్యేక సాంకేతిక ప్రాజెక్టుకు ఈ అవార్డు లభించింది.