అక్టోబరు - 2014 అవార్డులు



అక్టోబరు - 1 
¤ ప్రముఖ మళయాళ కవయిత్రి, పర్యావరణ ప్రచారకర్త సుగతా కుమారి ప్రతిష్ఠాత్మక 'మాతృభూమి' సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు.
అక్టోబరు - 4
¤ భారతీయ అమెరికన్ ప్రొఫెసర్ థామస్ కైలాథ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక జాతీయ సైన్స్ అవార్డుకు అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆయన్ను ఎంపిక చేశారు.     » శాస్త్ర సాంకేతిక రంగాల్లో అమెరికాలో ఇది అత్యున్నత పురస్కారం.     » 79 ఏళ్ల కైలాథ్‌తో పాటు మరో తొమ్మిది మందికి ఈ పురస్కారాన్ని ప్రకటించారు.     » కైలాథ్ మలయాళం మాట్లాడే సిరియా క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. 1956లో పుణె వర్సిటీ నుంచి పట్టా పొందారు. 1961లో అమెరికాలోని మసాచుసెట్స్ వర్సిటీ నుంచి మాస్టర్స్, డాక్టరేట్ డిగ్రీలు అందుకున్నారు. ఎంఐటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందిన తొలి భారతీయ విద్యార్థి.
అక్టోబరు - 5 
¤ ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు షారుక్‌ఖాన్‌కు లండన్‌లోని రెయిన్‌బో ఫౌండేషన్ 2014 సంవత్సరానికి గాను 'గ్లోబల్ డైవర్సిటీ అవార్డు'ను అందజేసింది.
     » నటనతోను, సినిమాలతోనూ ప్రపంచవ్యాప్తంగా చేసిన సేవలకు ఈ పురస్కారం దక్కింది
.
     » లండన్‌లోని బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో కామన్స్ స్పీకర్ జాన్ బెర్కో షారుక్‌ఖాన్‌కు ఈ అవార్డును ప్రదానం చేశారు
.
     » ఇంతకుముందు ఈ అవార్డును అమితాబ్‌బచ్చన్, ఐశ్యర్యరాయ్, జాకీచాన్ తదితరులు అందుకున్నారు.
 
అక్టోబరు - 6 
¤ ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతులు - 2014 ప్రకటన ప్రారంభమైంది. ప్రతిఏటా మాదిరిగా తొలిసారిగా నోబెల్ వైద్య విభాగంలో పురస్కారాలను ప్రకటించారు.     »  మెదడులో దిశానిర్దేశం జరిగే తీరును వెలుగులోకి తెచ్చిన బ్రిటన్ - అమెరికన్ జాన్ ఒ కీఫె, నార్వే జంట ఎడ్వర్డ్ మోసర్, మే-బ్రిట్ మోసర్ వైద్యశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు.     »  ఖాళీ ప్రదేశంలో ఉన్నప్పుడు మన స్థితిని తెలుసుకోవడానికి దోహదపడే పొజిషనింగ్ వ్యవస్థ (అంతర్గత జీపీఎస్)ను కనుక్కున్నందుకు వీరిని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు అవార్డు కమిటీ పేర్కొంది.     »  ఈ పరిశోధన అల్జీమర్స్, మెదడుకు సంబంధించిన ఇతర వ్యాధులకు చికిత్సలు చేయడానికి దోహదపడుతుందని అవార్డు కమిటీ పేర్కొంది. 'మన చుట్టూ ఉన్న ప్రదేశానికి సంబంధించిన మ్యాప్‌ను మెదడు ఎలా తయారు చేసుకుంటుంది? సంక్లిష్టమైన వాతావరణంలో మనం దిశానిర్దేశాన్ని ఎలా చేసుకుంటాం? ఇవి శతాబ్దాలుగా తత్వవేత్తలు, శాస్త్రవేత్తలను వేధిస్తున్న ప్రశ్నలు. వీటికి జాన్, ఎడ్వర్డ్, మే-బ్రిట్‌లు సమాధానాన్ని కనుక్కున్నారు' అని ఎంపిక కమిటీ ప్రశంసించింది.     »  1971లో జాన్ ఈ వ్యవస్థలోని మొదటి అంశాన్ని కనుక్కున్నారు. ప్రయోగశాలలోని నిర్దిష్ట ప్రదేశంలో ఉన్నప్పుడు ఎలుక మెదడులోని హిప్పోక్యాంపస్ భాగంలో కొన్ని కణాలు క్రియాశీలమవుతున్నట్లు గుర్తించారు. మిగతా చోట్ల ఉన్నప్పుడు ఇతర నాడీకణాలు క్రియాశీలమవుతున్నట్లు కనుక్కున్నారు. ఈ 'ప్రదేశ కణాలు' గదికి సంబంధించిన మ్యాప్‌ను రూపొందిచినట్లు జాన్ సూత్రీకరించారు.     »  మూడు దశాబ్దాల తర్వాత ఎడ్వర్డ్ మోసర్, మే బ్రిట్ ఈ అదృశ్య పొజిషనింగ్ వ్యవస్థకు సంబంధించి మరో అంశాన్ని వెలుగులోకి తెచ్చారు. రేఖాంశ, అక్షాంశాల తరహాలో ఒక సమన్వయ వ్యవస్థను రూపొందించే నాడీకణాల (గ్రిడ్ కణాలు)ను గుర్తించారు. ఇవి మెదడులో మార్గనిర్దేశక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నాయి.     »  అల్జీమర్స్ వ్యాధిగ్రస్థులు తాము ప్రయాణించాల్సిన మార్గాన్ని తరచూ మరచిపోతుంటారు. పరిసరాలను గుర్తించలేరు. మెదడులోని దిక్సూచి వ్యవస్థ గురించి అవగాహన పెరగడం వల్ల ఈ రోగుల్లో ప్రాదేశిక జ్ఞాపకశక్తి క్షీణత వెనుక ఉన్న ప్రక్రియ గురించి తెలుసుకోవడానికి వీలవుతుందని అవార్డు ఎంపిక కమిటీ వివరించింది.     »  జాన్ 1939 లో, ఎడ్వర్డ్ 1962 లోను, ఆయన భార్య మే బ్రిట్ మోసర్ 1963లో జన్మించారు.     »  బహుమతి కింద అందే 11 లక్షల డాలర్లను వీరు పంచుకుంటారు. అయితే అందులో సగం డబ్బు జాన్‌కు అందుతుంది.     »  డిసెంబరు 10న స్టాక్‌హోం (స్వీడన్ రాజధాని)లో బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది.     »  ప్రముఖ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరుమీదుగా ఈ పురస్కారాలు ఏర్పాటు అయ్యాయి. 1901 నుంచి అయిదు రంగాల్లో (వైద్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి) ప్రదానం చేస్తుండగా, 1969 నుంచి ఆర్థికశాస్త్రంలో కూడా నోబెల్ పురస్కారాలను ఇస్తున్నారు.     »  నోబెల్ బహుమతిని గెలుచుకున్న భార్యాభర్తలో ఎడ్వర్డ్ మోసర్ - మే బ్రిట్ మోసర్ 5వ జంటగా రికార్డులో చేరారు. ఈ 5 జంటల్లో 4 జంటలు సంయుక్తంగా అవార్డును గెలుచుకున్నాయి.     »  1903లో ఫ్రెంచ్ శాస్త్రవేత్త మేరీ క్యూరీ, ఆమె భర్త పియరీ మొదటిసారిగా ఈ పురస్కారాన్ని (భౌతిక శాస్త్ర విభాగం) సాధించిన జంటగా గుర్తింపు పొందారు.     » 1935లో మేరీక్యూరీ, పియరీల కుమార్తె ఇరెనె జోలియట్ - క్యూరీ, ఆమె భర్త ఫ్రెడ్రిక్ జోలియట్ రసాయన శాస్త్రంలో బహుమతి అందుకున్నారు.     »  1947లో అమెరికా - చెక్ జంట గెర్టీ, కార్ల్‌కోరి వైద్య శాస్త్ర విభాగంలో నోబెల్ పొందారు. ఈ విభాగంలో ఈ పురస్కారాన్ని పొందిన మొదటి మహిళగా కూడా గెర్టీ గుర్తింపు పొందారు.     »  1974లో స్వీడన్‌కు చెందిన ఆర్థికవేత్త గున్నార్ మిర్డాల్ ఆర్థిక శాస్త్ర విభాగంలో నోబెల్ సాధించారు. ఎనిమిదేళ్ల తర్వాత ఆయన భార్య ఆల్వా మిర్డాల్‌కు శాంతి విభాగంలో బహుమతి లభించింది. 
అక్టోబరు - 7
¤ విద్యుత్‌ను ఆదాచేసే ఎల్ఈడీ(light emitting diode) దీపాలను కనుక్కున్న జపాన్ పరిశోధకులు ఇసాము అకసాకి, హిరోషి అమానో, జపాన్-అమెరికన్ షుజి నకామురాకు భౌతికశాస్త్ర విభాగంలో నోబెల్‌ బహుమతి ప్రకటించారు. భూతాపాన్ని ఎదుర్కోవడంతో పాటు నిరుపేదలకు ఆశాకిరణంగానూ ఈ దీపం గుర్తింపు పొందింది.
     »  అకసాకి జపాన్‌లోని మెజో విశ్వవిద్యాలయంలోనూ, అమానో జపాన్ లోని నగోయా వర్సిటీలోనూ, నకామురా అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోనూ పనిచేస్తున్నారు
.
     »  వీరి ముగ్గురికీ ఈ పురస్కారం కింద 11 కోట్ల డాలర్లు అందనున్నాయి
.
     »  'ఇన్‌కాండిసెంట్ లైట్ బల్బులు 20వ శతాబ్దానికి వెలుగులు నింపాయి. 21 శతాబ్దానికి ఎల్ఈడీ బల్బులు వెలుగు రేఖలు పంచుతాయి' అని అవార్డు ఎంపిక కమిటీ పేర్కొంది. 1990ల మొదట్లో ఈ ముగ్గురు పరిశోధకులు సెమీకండక్టర్ల ద్వారా ప్రకాశవంతమైన నీలం రంగు కాంతిని ఉత్పత్తి చేశారు. ఇది కాంతి పరిజ్ఞానానికి సంబంధించి ప్రాథమిక మార్పునకు శ్రీకారం చుట్టింది.
     »  19వ శతాబ్దంలో థామస్ ఎడిసన్ కనుక్కున్న ఇన్‌కాండిసెంట్ లైట్ బల్బులతో పోలిస్తే ఎల్ఈడీ దీపాలు ప్రకాశవంతమైన తెల్లకాంతిని వెదజల్లుతాయి. చాలా తక్కువ విద్యుత్‌ను వినియోగించుకుంటాయి. అందువల్ల వాటిని చౌకైనా, స్థానిక సౌర విద్యుత్‌కు అనుసంధానించుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం లేని 150 కోట్ల మందికి ఇది ప్రయోజనం కలిగిస్తోంది. కార్లలోని దీపాలు, స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ తెరల్లోనూ ఈ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ప్రపంచంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో 20 శాతం దీపాల కోసమే వినియోగమవుతోంది. ఎల్ఈడీ ఉపకరణాలను గరిష్ఠ స్థాయిలో వినియోగించి, దీన్ని 4 శాతానికి తగ్గించవచ్చని తేలింది
.
¤ ఈ ఏడాది 'కొమురం భీం జాతీయ పురష్కారాని'కి ప్రముఖ రచయిత సుద్దాల అశోక్‌తేజ ఎంపికయ్యారు
.
¤ లాల్ బహదూర్‌శాస్త్రి జాతీయ అవార్డును ప్రముఖ రక్షణ పరిశోధకుడు, బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి పితామహుడు శివథాను పిళ్లై అందుకున్నారు
.
     »  న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ పురస్కారాన్ని అందజేశారు
.
     »  ఈ అవార్డు కింద రూ.5 లక్షలు, ప్రశంసా పత్రం, జ్ఞాపికను ప్రదానం చేశారు
.
     »  ఏరోస్పేస్, క్షిపణి పరిజ్ఞాన రంగాల్లో అందించిన అసాధారణ సేవలకుగానూ పిళ్లైకి ఈ గౌరవం దక్కింది.
అక్టోబరు - 8 
¤ సూక్ష్మ వస్తువులను పెద్దగా చూపే మైక్రోస్కోప్‌లకు మరింత సునిశిత దృష్టిని ప్రసాదించిన అమెరికా శాస్త్రవేత్తలు ఎరిక్ బెట్జిగ్, విలియం మోర్నర్, జర్మన్ పరిశోధకుడు స్టీఫెన్ హెల్‌కు రసాయనశాస్త్ర విభాగంలో నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు.     » ఈ ముగ్గురూ 'సూపర్ - రిసాల్వ్‌డ్ ఫ్లోరసెన్స్ మైక్రోస్కోపీ' అభివృద్ధికి దోహదపడ్డారని ఎంపిక కమిటీ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రశంసించింది. సంప్రదాయ ఆప్టికల్ మైక్రోస్కోపులకు ఉండే గరిష్ఠ సామర్థ్యాన్ని మించి ఇవి పనిచేస్తున్నాయని వివరించింది. ఈ ముగ్గురి పరిశోధన ఆప్టికల్ మైక్రోస్కోపీని నానో కొలతల స్థాయికి తీసుకొచ్చిందని అకాడమీ కొనియాడింది.     » ఆప్టికల్ మైక్రోస్కోపుల్లో అనేక పరిమితులు ఉండేవి. అందులో కాంతి తరంగదైర్ఘ్యం కూడా ఒకటి. దీని కారణంగా 0.2 మైక్రోమీటర్ల కంటే ఎక్కువ స్పష్టతను సాధించలేమన్న భావన శాస్త్రవేత్తల్లో ఒకప్పుడు ఉండేది. అయితే ఫ్లోరసెంట్ పరమాణువుల సాయంతో ఎరిక్, విలియం, స్టీఫెన్ ఈ పరిమితిని అధిగమించారు. ఆప్టికల్ మైక్రోస్కోపీకి కొత్త దిశను చూపించారు. కణాల్లోని పరమాణువుల మధ్య సంబంధాలు ఎలా సాగుతున్నాయన్నది అధ్యయనం చేయడానికి కూడా ఇది వీలు కల్పించింది. వ్యాధికి సంబంధించిన ప్రొటీన్లు పోగుపడటాన్ని కూడా చూపింది. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు ఈ విధానాలను ఉపయోగించి, జీవుల్లోని అత్యంత చిన్న భాగాలను పరిశీలించారు. మెదడులోని సంకేతాలను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి నాడీ కణాలను స్టీఫెన్ పరిశీలించారు. 'హంటింగ్ టన్స్' వ్యాధికి సంబంధించిన ప్రొటీన్లను విలియం అధ్యయనం చేశారు. పిండాల్లోని కణ విభజనను ఎరిక్ పరిశీలించారు.     » ఈ ముగ్గురి పరిశోధన కారణంగా అనేక రంగాల్లో పురోగతి సాధ్యమైంది. పరమాణువులు, ఇతర అంశాలను ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో వీక్షించడానికి వీలు కల్పించింది. జీవులకు సంబంధించిన సూక్ష్మ అంశాలను అధ్యయనం చేయడానికి మార్గం సుగమమైంది. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా మరింత సూక్ష్మ అంశాలను పరిశీలించే అవకాశం ఉన్నా దాన్ని సజీవ కణజాలానికి ఉపయోగించలేరు.     » ఎరిక్ (54 సంవత్సరాలు) వర్జీనియాలోని హోవర్డ్ హ్యూగ్స్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్నారు. విలియం (61 సంవత్సరాలు) కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా, స్టీఫెన్ (51 సంవత్సరాలు) జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బయోఫిజికల్ కెమిస్ట్రీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 
అక్టోబరు - 9
¤ నాజీ మూకల దురాగతాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఫ్రాన్స్ నవలా రచయిత ప్యాట్రిక్ మోడియానోకు నోబెల్ సాహితీ పురస్కారం లభించింది.
     » 69 ఏళ్ల మోడియానో అంతర్జాతీయ సాహితీ లోకంలో సుప్రసిద్ధులు. ఆయన నవల 'మిస్సింగ్ పర్సన్' 1978లో ప్రతిష్ఠాత్మక 'ప్రిన్స్ గోన్ కోర్ట్' అవార్డుకు ఎంపికైంది.
     » యూరప్‌లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1945 జులైలో పశ్చిమ ప్యారిస్‌లో మోడియానో జన్మించారు. ఆయన తండ్రి యూదు ఇటాలియన్. తల్లి 
బెల్జియం కు చెందిన నటి.
     » 1968లో వెలువడిన 'లా ప్లేస్ ది ఎల్ ఇటోయిలె' నవల యూరప్ దేశాల్లో సంచలనం సృష్టించింది.
     » మోడియానో ఫ్రెంచ్ భాషలో 40కి పైగా రచనలు చేశారు. వాటిలో కొన్ని ఇంగ్లిష్‌లోకి అనువాదమయ్యాయి. 'రింగ్ ఆఫ్ రోడ్స్ : ఏ నోవల్', 'విల్లా ట్రిస్టీ', 'ఎ ట్రేస్ ఆఫ్ మెలైస్', 'హనీమూన్' లాంటివి ఆ కోవకు చెందినవే.
     » మోడియానో చిన్న పిల్లల పుస్తకాలు రాశారు. సినిమాలకు స్క్రిప్టును అందించారు. 2000లో కేన్స్ సినీ ఉత్సవాల జ్యూరీలో సభ్యుడిగా వ్యవహరించారు.
     » 2012లో యూరోపియన్ సాహిత్యంలో కృషి చేసినందుకుగాను ఆస్ట్రేలియా స్టేట్ ప్రైజ్‌ను మోడియానో గెల్చుకున్నారు.
     » 1974లో లాకోంబ్ అనే సినిమాను తీశారు.
     » నోబెల్ సాహిత్య పురస్కార విజేతల్లో 107వ వ్యక్తి ప్యాట్రిక్ మోడియానో. అలాగే ఈ అవార్డ్‌ను అందుకుంటున్న 11వ ఫ్రెంచ్ రచయిత.
     » నోబెల్ సాహిత్య పురస్కారం కింద 80 లక్షల స్వీడిష్ క్రోనార్ల (రూ.6.7 కోట్లు)ను ఇస్తారు.
¤ భారత పొగాకు బోర్డుకు అంతర్జాతీయ స్థాయిలో ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన 'గోల్డెన్ లీఫ్ అవార్డు' లభించింది.
     » పొగాకు రంగంలో వివిధ వర్గాలకు అత్యుత్తమ సేవలందించినందుకు 2014 సంవత్సరానికి 'గ్లోబల్ టొబాకో నెట్‌వర్కింగ్ ఫోరం' (జీటీఎస్ఎఫ్) ఈ అవార్డును అందజేసింది.
     » అమెరికాలోని పశ్చిమ వర్జీనియాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పొగాకు బోర్డు ఛైర్మన్ డాక్టర్ కె.గోపాల్ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు.
     » ఒక ప్రభుత్వ సంస్థ ఈ అవార్డుకు ఎంపిక కావడం ఇదే మొదటిసారి.
     » పొగాకు సాగులో రైతులు అత్యుత్తమ విధానాలు అవలంబించేలా చేయడం, పొగాకులో అన్య పదార్ధాల (ఎన్‌టీఆర్ఎం) లేకుండా చూడడం, క్రిమిసంహారక వాడకాన్ని తగ్గించడం, ఈ రంగంలో సుస్థిర అభివృద్ధి సాధించేలా బోర్డు చూపిన చొరవ, చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది.
అక్టోబరు - 10 
¤ వెట్టిచాకిరి నుంచి బాలలను విముక్తి చేయడానికి పాటుపడుతున్న భారతదేశానికి చెందిన కైలాశ్ సత్యార్థి, బాలికల విద్య కోసం పోరాడుతున్న పాకిస్థాన్ బాలిక మలాలా యూసఫ్ జాయ్‌కు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని సంయుక్తంగా ప్రకటించారు.     » వీరిద్దరికీ కలిపి 11 లక్షల డాలర్ల (దాదాపు రూ.6.7 కోట్లు) మొత్తాన్ని డిసెంబరులో నోబెల్ కమిటీ ప్రదానం చేయనుంది.బాలల మిత్రుడు సత్యార్థి..       మదర్ థెరిసా తర్వాత నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన రెండో భారతీయుడు కైలాశ్ సత్యార్థి(60). మధ్యప్రదేశ్‌లోని విదిశ పట్టణంలో 1954 జనవరి 11న జన్మించారు. ఎలక్ట్రిక్ ఇంజినీర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి చిన్నారులను వెట్టిచాకిరి నుంచి విముక్తి చేసేందుకు నడుంబిగించారు. 1980లో 'బచ్‌పన్ బచావో ఆందోళన్' సంస్థను స్థాపించి గత మూడు దశాబ్దాలకుపైగా పిల్లల హక్కల కోసం కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకూ దాదాపు 80 వేల మంది చిన్నారులను నిర్బంధ శ్రమ నుంచి విముక్తి కల్పించారు.     » సత్యార్థి ప్రారంభించిన 'గ్లోబల్ మార్చ్ ఎగైనెస్ట్ చైల్డ్ లేబర్' ఉద్యమం చాలా దేశాల్లో క్రియాశీలంగా ఉంది.     » కైలాష్ గతంలోనూ పలుమార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు.     » 1994లో బాల కార్మికులు లేని సంస్థలు తయారు చేస్తున్న రగ్గులు, కార్పెట్లు కోసం 'రగ్ మార్క్' అనే ముద్రను సృష్టించారు. ప్రస్తుతం ఈ ముద్రను 'గుడ్ సేల్స్' గా మార్చారు.అవార్డులుడిఫెండర్స్ ఆఫ్ డెమొక్రసీ అవార్డ్ (2009 - అమెరికా)మెడల్ ఆఫ్ ఇటాలియన్ సెనెట్ (2007 - ఇటలీ)అల్ఫాన్సో కొమిన్ ఇంటర్నేషనల్ అవార్డ్ (2008 - స్పెయిన్)రాబర్ట్ ఎఫ్ కెనడీ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అవార్డ్ (అమెరికా)     » సత్యార్థి, మలాలాను 'చిన్నారుల ప్రపంచ ఛాంపియన్లు'గా ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ అభివర్ణించారు.     » ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి రికార్డు స్థాయిలో 270 మంది పేర్లను పరిశీలించారు.నోబెల్ అందుకున్న భారతీయులు

భారతీయ మూలాలు - నోబెల్     » వాతావరణ మార్పులపై ఏర్పాటైన అంతర్జాతీయ వేదిక (ఐపీసీసీ - ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ ఆన్ క్త్లెమేట్ ఛేంజ్) 2007లో నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైంది. ఐపీసీసీ ఛైర్మన్ హోదాలో మన దేశానికి చెందిన రాజేంద్ర పచౌరీ నోబెల్ అందుకున్నారు.     » 1902లో వైద్యరంగంలో నోబెల్‌ను అందుకున్న రోనాల్డ్ రాస్ బ్రిటన్ పౌరుడు అయినప్పటికీ భారత్‌లోనే జన్మించారు.     » 1907లో సాహితీ నోబెల్‌ను దక్కించుకున్న బ్రిటన్ పౌరుడు రుడ్యార్డ్ కిప్లింగ్ కూడా భారత్‌లోనే జన్మించారు.     » 1968లో వైద్యరంగంలో నోబెల్‌కు ఎంపికైన హరగోవింద్ ఖురానా, 1987లో భౌతిక శాస్త్ర నోబెల్ విజేతగా నిలిచిన సుబ్రమణ్యన్ చంద్రశేఖర్ భారతీయ అమెరికన్లు.     » 1979లో భౌతికశాస్త్రంలో నోబెల్‌ను దక్కించుకున్న పాకిస్థాన్ శాస్రవేత్త అబ్దుస్ సలేం భారత్‌లోనే జన్మించారు.     » 1989లో నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన దలైలామా 1959 నుంచి మన దేశంలోనే నివాసం ఉంటున్నారు.     » భారతీయ మూలాలున్న బ్రిటన్ పౌరుడు వి.ఎస్. నైపాల్ 2001లో సాహితీ నోబెల్ పొందారు.     » 2006లో నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపికైన బంగ్లాదేశ్ పౌరుడు మహ్మద్ యూనస్ అవిభక్త భారత్‌లో జన్మించారు.     » 2009లో రసాయనశాస్త్రంలో పరిశోధనలకు నోబెల్ అందుకున్న వెంకట్రామన్ రామకృష్ణన్‌కు బ్రిటన్, అమెరికా దేశాల పౌరసత్వం ఉన్నప్పటికీ ఆయన భారత్‌లోనే పుట్టారు.
¤ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ '2014 యూరో మనీ ఉత్తమ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్'
అవార్డు ను అందుకున్నారు.
     » వాషింగ్టన్‌లో ఈ అవార్డును ప్రదానం చేశారు.
     » భారీ లోటుతో బాధపడుతూ నిద్రాణమై ఉన్న ఆర్థిక వ్యవస్థను మేల్కొల్పేందుకు ఆయన కఠినమైన నిర్ణయాలు తీసుకొంటూ స్వార్థపర శక్తులతో పోరాడుతున్నారని యూరోమనీ పత్రిక ఈ సందర్భంగా కొనియాడింది.
 
అక్టోబరు - 13
¤ ఫ్రాన్స్ ఆర్థికవేత్త జీన్ టిరోల్ ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. మార్కెట్ శక్తి సామర్థ్యాలు, నియంత్రణ గురించి ఆయన చేసిన పరిశోధనలకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది.     » 61 ఏళ్ల టిరోల్ ఫ్రాన్స్‌లోని 'టౌలౌస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌'లో పని చేస్తున్నారు.     » 1999 తర్వాత అమెరికా ఆర్థికవేత్త లేకుండా ఆర్థిక శాస్త్రంలో నోబెల్ విజేతను ప్రకటించడం ఇదే ప్రథమం.     » ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన 'మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)' లో టిరోల్ పీహెచ్‌డీ చేశారు.     » సాహిత్య నోబెల్‌కు కూడా ఫ్రాన్స్ సాహితీవేత్త ప్యాట్రిక్ మోడియానో ఎంపికైన నేపథ్యంలో ఆ దేశానికి ఈ ఏడాది రెండు నోబెల్‌ పురస్కారాలు లభించినట్లయ్యింది.     » ఆర్థిక రంగంలో విజేత ఎంపికతో ఈ ఏడాది నోబెల్ పురస్కారాల ఎంపిక ముగిసింది. డిసెంబరు 10న బహుమతి ప్రదానం జరుగుతుంది.
అక్టోబరు - 15
¤ ప్రతిష్ఠాత్మక 'మ్యాన్ బుకర్ ప్రైజ్ - 2014'కు ఆస్ట్రేలియా నవలాకారుడు రిచర్డ్ ఫ్లానగన్ ఎంపికయ్యారు. 'ది నారో రోడ్ టు ద డీప్ నార్త్'నవలకుగాను ఈ పురస్కారం వరించింది.
     » రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1943లో 
 థాయ్‌లాండ్ - బర్మా డెత్ రైల్వే నిర్మాణంలో యుద్ధ ఖైదీలు, బానిస కార్మికులు ఎదుర్కొన్న పరిస్థితుల నేపథ్యంగా ఈ నవల రాశారు.
     » లండన్‌లోని గిల్డ్ హాల్‌లో బ్రిటన్ యువరాజు ఛార్లెస్ భార్య కెమిల్లా చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
     » అవార్డు కింద 50 వేల పౌండ్లు (రూ.48.83 లక్షలు) ఆయన పొందారు.
¤ హైదరాబాద్‌లోని ఐడీఆర్‌బీటీ (ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ)లో పదో బ్యాంకింగ్ టెక్నాలజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
     » స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 2013-14 సంవత్సరానికి ఐడీఆర్‌బీటీ నుంచి ఉత్తమ బ్యాంక్ అవార్డును గెలుచుకుంది. అందరికీ బ్యాంకింగ్ సేవలు అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకున్న విభాగంలో పెద్ద బ్యాంకుల్లో ఎస్‌బీఐకి ఈ అవార్డు దక్కింది.
     » ఇదే అవార్డు మధ్యస్థాయి బ్యాంకుల విభాగంలో ఫెడరల్ బ్యాంక్‌కు లభించింది.
     » ఎస్‌బీఐ 'ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్స్'
 విభాగంలోనూ ఉత్తమ బ్యాంక్ అవార్డును అందుకుంది.
     » ఫెడరల్ బ్యాంక్‌కు సోషల్ మీడియా అండ్ మొబైల్ బ్యాంకింగ్, ఇంటెలిజెన్స్ ఇనిషియేటివ్స్, బెస్ట్ ఐటీ టీమ్ విభాగాల్లో కూడా అవార్డులు లభించాయి.
     » సహకార బ్యాంకుల్లో ఐటీ వినియోగానికి సంబంధించిన అవార్డును 'సారస్వత్ కో-ఆపరేటివ్ బ్యాంక్'
 గెలుచుకుంది.
     » బ్యాంకుల్లో ఐటీ వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఐడీఆర్‌బీటీ పదేళ్లుగా ఏటా ఈ అవార్డులను ఇస్తోంది.
అక్టోబరు - 16
¤ ప్రముఖ భారత శాస్త్రవేత్త సంజయ్ రాజారాంకు ప్రతిష్ఠాత్మక ప్రపంచ ఆహార పురస్కారం (వరల్డ్ ఫుడ్ ప్రైజ్) లభించింది. ప్రపంచవ్యాప్తంగా గోధుమ ఉత్పత్తి దిశగా విస్తృత పరిశోధనలు చేసి విశేష సేవలందించినందుకు సంజయ్ రాజారాంకు ఈ పురస్కారం లభించింది.
     » రాజారాంకు అమెరికాలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
     » ఆయన రూపొందించిన 480 గోధుమ రకాలను సుమారు 51 దేశాల్లో పండిస్తున్నారు.
అక్టోబరు - 18
¤ భారత్ - బ్రిటన్ సంబంధాల బలోపేతానికి కృషి చేసినవారి సేవలకు గుర్తింపుగా బ్రిటన్ ప్రభుత్వం దాదాబాయ్ నౌరోజీ పేరిట అవార్డులను ప్రారంభించింది.
     » బ్రిటన్ పార్లమెంట్ లో తొలి ఆసియా సభ్యుడిగా, భారత వాణిజ్యాన్ని బ్రిటన్ కు తీసుకొచ్చిన తొలి భారతీయుడిగా నిలిచిన నౌరోజీకి అంకితం చేస్తూ ఈ అవార్డులను ప్రకటించారు.
     » వాణిజ్య రంగంలో యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఛైర్మన్ పాట్రికా హెవిట్‌కు; విద్యారంగానికి సేవలకుగానూ ఆశా ఖేమ్కాకు; కళలకు సంబంధించి నటుడు మాధవ్‌శర్మకు అవార్డులను ప్రకటించింది
.
     » లండన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, బ్రిటన్ ఉపప్రధాని నిక్‌క్లెగ్ అవార్డులను ప్రదానం చేశారు.
అక్టోబరు - 21
¤ సినీనటుడు మోహన్‌బాబుకు దివంగత మాజీ ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్‌రెడ్డి (బెగోరె)
అవార్డును తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య నెల్లూరులో ప్రదానం చేశారు.¤ ప్రతిష్ఠాత్మకమైన 'గ్లోరియా బ్యారన్ ప్రైజ్ ఫర్ యంగ్ హీరోస్‌'నుభారతఅమెరికన్ కిరణ్
 గెలుచుకున్నాడు.     » 'వేస్ట్ నో ఫుడ్' అనే వెబ్ ఆధారిత సర్వీస్‌ను ప్రారంభించినందుకుకిరణ్‌కు ఈ బహుమతి
 లభించింది. ఆకలిని తీర్చే దాతృత్వ సంస్థలతోఆహారదాతలను ఈ సర్వీస్ అనుసంధానం చేస్తుంది.     » అత్యుత్తమ సేవలు అందించే 8-18 ఏళ్ల మధ్య వయసుగల వారిలో25 మందిని ఎంపిక చేసి ఏటా అమెరికాలో ఈ బహుమతిని 
అందజేస్తారు.
అక్టోబరు - 22
¤ సాహిల్ దోషి అనే భారత సంతతి విద్యార్థికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 'అమెరికాస్ టాప్ సైంటిస్ట్' అవార్డు లభించింది.
     » గృహావసరాలకు వాడే విద్యుత్ సరఫరా సమయంలో వెలువడే కార్బన్ డయాక్సైడ్ (బొగ్గుపులుసు వాయువు)ను కరెంటుగా మార్చే పర్యావరణహితమైన పరికరాన్ని రూపొందించినందుకు సాహిల్‌కు ఈ పురస్కారం దక్కింది
.
     » ఈ పురస్కారం కింద సాహిల్‌కు సుమారు రూ.15 లక్షలతోపాటు కోస్టారికా లాంటి ప్రాంతానికి సాహస యాత్రకు వెళ్లే అవకాశం కూడా లభించింది. పిట్స్‌బర్గ్‌లో సాహిల్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
అక్టోబరు - 25
¤ వన్యప్రాణులు, జంతువులకు సంబంధించిన ఉత్తమ చలన చిత్రాలకు ఇచ్చే 'వైల్డ్ స్క్రీన్ పండా అవార్డ్‌'ను పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువ ఫిల్మ్ మేకర్ అశ్వికా కపూర్ గెలుచుకుంది.
     » ఈ అవార్డును ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్‌తో పోలుస్తూ 'గ్రీన్ ఆస్కార్‌'గా పరిగణిస్తారు
.
     » 'కకాపో చిలుక' 'గుడ్లగూబ' జీవితం ఆధారంగా అశ్విక నిర్మించిన 'సిరొక్కో' లఘు చిత్రానికి ఈ అవార్డు వచ్చింది
.
     » బ్రిటన్‌లోని బ్రిస్టల్ సిటీలో జరిగిన వైల్డ్ స్క్రీన్ ఫెస్టివల్‌లో ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేశారు
.
     » కోల్‌కతాలో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన అశ్విక, న్యూజిలాండ్‌లోని ఒటాగో విశ్వవిద్యాలయం నుంచి 'శాస్త్ర, జీవావరణ చలనచిత్ర నిర్మాణం'లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది
.
     » న్యూజిలాండ్‌లో మాత్రమే కనిపించే అత్యంత అరుదైన, ఎగరలేని జాతికి చెందిన 'కకాపో చిలుక'పై 15 నిమిషాల చిత్రాన్ని రూపొందించింది. ఇది వైల్డ్ స్క్రీన్ ఫెస్టివల్‌లో 42 దేశాలకు చెందిన 488 చిత్రాలతో పోటీపడి 'గ్రీన్ ఆస్కార్‌'ను గెలుచుకుంది.
అక్టోబరు - 26
¤ విశాల్‌భరద్వాజ్ తెరకెక్కించిన బాలీవుడ్ చిత్రం 'హైదర్' రోమ్ చలన చిత్రోత్సవాల్లో 'పీపుల్స్ ఛాయిస్' పురస్కారాన్ని గెలుచుకుంది.
     » కాశ్మీర్ నేపథ్యంగా సాగే ఈ చిత్రంలో షాహిద్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా నటించారు.
అక్టోబరు - 28
¤ యువ కళావాహిని అనే సాహితీ సాంస్కృతిక సంస్థ కథ, నవలా రచయితలకు త్రిపురనేని గోపీచంద్ (రచయిత) పేరిట అందించే జాతీయ సాహితీ పురస్కారాన్ని ఉర్దూ రచయిత్రి జీలానీ బానోకు ప్రకటించింది.
     » ఉత్తరప్రదేశ్‌కు చెందిన జీలానీ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. సుమారు 20 కథా సంపుటాలకు రూపమిచ్చి జాతీయ స్థాయి గుర్తింపును పొందారు
.
     » యువకళావాహిని 1987 నుంచి ఈ పురస్కారాన్ని ప్రారంభించింది. 2007 నుంచి దీన్ని జాతీయ పురస్కారంగా మార్చారు. తెలుగు, ఇతర భారతీయ భాషల్లో గుర్తింపు పొందినవారిని ఎంపిక చేస్తున్నారు
.
¤ నెల్లూరులోని నాయుడమ్మ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆల్టర్నేటివ్స్ సంస్థ ఏటా అందించే ప్రతిష్ఠాత్మక నాయుడమ్మ అవార్డును ఐక్యరాజ్యసమితి ఉపకార్యదర్శి జనరల్ డాక్టర్ కాన్డే కే యంకెల్లా కు ప్రకటించింది
.
     » కాన్డే సియెర్రాలియోన్ దేశస్థుడు. అమెరికాలోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం నుంచి అగ్రికల్చరల్ ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పట్టా పొందాడు
.
     » వియన్నాలో రెండు సార్లు యునిడో డైరెక్టర్ జనరల్‌గా పని చేశాడు
.
¤ నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న మలాలా యూసఫ్‌జాయ్ ప్రపంచ బాలల అవార్డు (వరల్డ్ చిల్డ్రన్స్ ప్రైజ్)కు ఎంపికయింది
.
     » ఈ అవార్డును బాలల నోబెల్ బహుమతిగా పేర్కొంటారు
.
     » ఓటింగ్ ద్వారా లక్షలాది మంది బాలలు మలాలాను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.
అక్టోబరు - 29
¤ ఉన్నత విద్యలో అత్యుత్తమ ఫలితాలను సాధించేలా కేంద్రీయ విశ్వ విద్యాలయాలను ప్రోత్సహించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 'విజిటర్స్' అవార్డులను నెలకొల్పారు.
     » ఉత్తమ వర్సిటీతోపాటు పరిశోధన, నూతన ఆవిష్కరణలకు సంబంధించి ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.
     » రాష్ట్రపతి సందర్శకుడి (విజిటర్)గా ఉన్న కేంద్రీయ వర్సిటీలకూ ఈ అవార్డు పొందేందుకు అర్హత ఉందని రాష్ట్రపతి భవన్ ప్రకటించింది.
     » ఉత్తమ వర్సిటీకి ప్రశంసాపత్రం, పరిశోధనలకు రూ.లక్ష చొప్పున నగదు అందజేస్తారు.
¤ బాలల హక్కుల కార్యకర్త, నోబెల్ విజేత మలాలా యూసఫ్ జాయ్‌కు స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో '2014 ప్రపంచ బాలల అవార్డు'
ను ప్రదానం చేశారు.
     » స్వీడన్ రాణి సిల్వియా ఈ అవార్డును ప్రదానం చేసింది.
     » ఈ అవార్డు కింద లభించిన రూ.30 లక్షల మొత్తాన్ని మలాలా గాజలో ఐరాస స్కూళ్ల పునర్నిర్మాణానికి విరాళంగా ఇచ్చింది.
అక్టోబరు - 31
¤ న్యూఢిల్లీలో 'ఇండియా టుడే' నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ రాష్ట్రానికి లభించిన అవార్డును తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు స్వీకరించారు.