| ¤ మహారాష్ట్రలోని థానే నుంచి అహ్మద్‌నగర్ వెళ్తున్న మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సును తొక్వాడే సమీపంలో మాల్ సెజ్ కనుమల వద్ద ట్రక్కు ఢీ కొట్టడంతో బస్సు 400 అడుగుల లోయలోకి పడిపోయిన ఘటనలో 27 మంది ప్రయాణికులు మృతి చెందారు. | |
జనవరి - 4
|
| ¤ తిరువనంతపురంలో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గ్లోబల్ లర్నింగ్ సెంటర్‌కు ప్రధాని మన్మోహన్‌సింగ్ శంకుస్థాపన చేశారు. » పెట్రోనెట్ ఎల్ఎన్‌జీ సుమారు రూ.4,500 కోట్లతో కేరళలోని పుథైవైపిలో నిర్మించిన ఎల్ఎన్‌జీ టెర్మినల్‌ను కూడా ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రారంభించారు.¤ గోవా రాజధాని పనాజీ శివార్లలో నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం కూలిపోవడంతో 13 మంది కార్మికులు మరణించారు. |
| ¤ మహారాష్ట్రలోని థానే జిల్లా ధాను-ఘోల్‌వడ్ రైల్వేస్టేషన్ల మధ్య బాంద్రా-డెహ్రాడూన్ (19019) ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన ఘటనలో తొమ్మిదిమంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. |
| ¤ ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జీవీకే సంస్థ నిర్మించిన
టెర్మినల్ 'టీ 2' ను ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రారంభించారు. » ఫిబ్రవరి 12 నుంచి అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలు ప్రారంభమవుతాయని
నిర్మాణసంస్థ జీవీకే ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీవీకే-ఎంఐఏఎల్)
కార్యనిర్వాహకఛైర్మన్ జి.వి.కృష్ణారెడ్డి ప్రకటించారు. |
| » 44 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, నాలుగు అంతస్తుల్లో ఈ టెర్మినల్‌ను నిర్మించారు. అత్యున్నత ప్రమాణాలున్న ఈ టెర్మినల్‌ను రూ.5,500 కోట్లతో పూర్తి చేశారు. ఏ 380 వంటి భారీ విమానాల రాకపోకలకు సైతం అనువుగా ఈ టెర్మినల్‌ను నిర్మించారు. | |
| ¤ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ పతంగుల పండుగను ఆ రాష్ట్ర సీఎం నరేంద్రమోడీ ప్రారంభించారు. |
| ¤ హిమాచల్‌ప్రదేశ్‌లోని పర్యాటక ప్రాంతమైన మనాలిలో బియాస్ నదిపై కొత్తగా నిర్మించిన ఓ డ్యామ్ అనూహ్యంగా బద్దలైంది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు. » డ్యామ్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యాన్ని తొలిసారి పరీక్షించేందుకు డ్యామ్‌ను 95% నీటితో నింపగా అది ఒక్కసారిగా బద్దలై నీరు నదిలోకి వెళ్లిపోయింది. » ఈ డ్యామ్ 4.8 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. |
జనవరి - 13
|
| ¤ రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లా థైయాట్ గ్రామంలో రాక్షస బల్లుల ఆనవాళ్లు బయటపడ్డాయి. ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్ తదితర 34 దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు రాక్షస బల్లుల మూలాలపై జై సల్మేర్ ప్రాంతంలో పరిశోధనలు చేస్తున్నారు. ఇక్కడి శిలలపై తాము గుర్తించిన ప్రాథమిక పాదముద్రలు చాలా చిన్నవని, 5 సెం.మీ. పొడవున్నాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. |
జనవరి - 14
|
¤ దక్షిణ సూడాన్‌లోని నైలునదిలో మలాకల్ ప్రాంతంలో పడవ మునిగి పోయిన ఘటనలో సుమారు 200 మంది ప్రయాణికులు మరణించారు. » దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధం నుంచి తప్పించుకుని తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. |
జనవరి - 15
|
¤ బీహార్‌లోని విశ్వవిఖ్యాత నలందా విశ్వవిద్యాలయానికి 40 కిలోమీటర్ల దూరంలో పురాతత్వ శాస్త్రవేత్తలు మరో విశ్వవిద్యాలయం అవశేషాలను గుర్తించారు. దీంతో చైనా యాత్రికులు హుయాన్‌సాంగ్, ఇత్సింగ్‌ల రచనల్లోని ప్రస్తావనలకు మరింత బలం చేకూరినట్లయింది. » నలంద జిల్లాలోని తెల్హరాలో చేపట్టిన తవ్వకాల్లో కొత్త విశ్వవిద్యాలయం అవశేషాలు బయటపడ్డాయి. నలందలోని ఎకంగల్ సరాయ్ బ్లాక్ తెల్హరాలో 2009లో ప్రారంభించిన తవ్వకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. |
| ¤ ముంబయిలో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృతి చెందారు. |
| » జనవరి 17న మరణించిన దావూదీ బోహ్రా ఆధ్యాత్మిక గురువు సయ్యద్ మహ్మద్ బురహానుద్దీన్‌ను చివరిసారి చూసేందుకు దేశం నలుమూలల నుంచి లక్షకు పైగా భక్తులు తరలిరావడంతో ఈ తొక్కిసలాట జరిగింది. |
|
| » దావూదీ బోహ్రా సమాజం 52వ ఆధ్యాత్మిక గురువే సయ్యద్ మహ్మద్ బురహానుద్దీన్. |
జనవరి - 23
|
| ¤ బెంగళూరులోని జాతీయ సైనిక స్మారక ఉద్యానవనంలో దేశంలోనే అతిపెద్ద జాతీయ జెండాస్తంభాన్ని ఏర్పాటు చేశారు. » కర్ణాటక గవర్నర్ హెచ్.ఆర్.భరద్వాజ్ 210 అడుగుల ఎత్త్తెన ఈ స్తంభాన్ని ఆవిష్కరించారు. ఈ స్తంభానికి 72 అడుగుల పొడవు, 48 అడుగుల వెడల్పు, 31 కిలోల బరువున్న జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. » 24 గంటల పాటు రెపరెపలాడే ఈ జెండా 50 కిలోమీటర్ల మేర కనిపిస్తుంది. |
| ¤ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని మహ్మదాబాద్‌లో నిర్మించిన వినాయకుడి దేవాలయం దేశంలోనే అతిపెద్ద గణేశ్ ఆలయంగా గుర్తింపు పొందింది. | |
జనవరి - 26
|
| ¤ అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో బంగాళాఖాతంలో పర్యాటకుల పడవ ఒకటి బోల్తా పడిన ఘటనలో 21 మంది దుర్మరణం పాలయ్యారు. |
జనవరి - 28
|
¤ ఐఐటీ మద్రాసు ప్రాంగణంలో దేశంలోనే తొలిసారిగా 'నేషనల్ క్యాన్సర్ టిష్యూ బయో బ్యాంక్'ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. » దీని కోసం కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం రూ.27.81 కోట్లు కేటాయించింది. క్యాన్సర్ వ్యాధిని గుర్తించడం, చికిత్సలకు సంబంధించిన పరిశోధనలు, అధ్యయనాలు వంటి ప్రక్రియలకు ఈ కేంద్రం దోహదపడుతుంది. |
జనవరి - 29
|
¤ రాజస్థాన్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి భెల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సహా ఆరు ప్రభుత్వ రంగ సంస్థలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. » 4,000 మెగావాట్ల సామర్థ్యం ఉండే ఈ కేంద్రం ఏర్పాటుకు మొదటి దశలో రూ.7,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. » రానున్న ఏడెనిమిదేళ్లలో వివిధ దశల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. మొదటి దశలో 1,000 మెగావాట్ల సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తారు. |
|
|