¤ జాతీయ న్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు.
» భారత ప్రజలందరికీ సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయ కల్పనే రాజ్యాంగ
లక్ష్యం. అది సాకారమయ్యేందుకు సిద్ధం చేసిన రాజ్యాంగ తొలి ముసాయిదా ప్రతిపై
నవంబరు 26న సంతకాలు చేసిన రోజును 'జాతీయ న్యాయ
దినోత్సవం'గా నిర్వహిస్తున్నారు.
» చట్టం ముందు అంతా సమానమే అని, ఆ నిబంధనల ఆధారంగా
సత్వర న్యాయసాధనకు ముందుంటామని ఆ రోజున న్యాయవాదులు ప్రతిజ్ఞ
చేస్తారు.
¤ 2008 నవంబరు 26న ముంబయి ఉగ్రవాద దాడి ఘటన జరిగి
ఆరేళ్లు పూర్తయ్యాయి. » 26/11 ముంబయి దాడుల మృతులకు ప్రధాని నరేంద్ర
మోదీ నివాళి అర్పించారు. 18వ సార్క్ సదస్సులో పాల్గొనేందుకు
ఖాట్మండులో ఉన్న ఆయన ట్విట్టర్‌లో తన సందేశాన్ని పెట్టారు.
» ఈ దాడులపై ఏర్పాటు చేసిన రామ్ ప్రధాన్ కమిటీ సిఫార్సులను
అమలు చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
» లష్కరే తోయిబాకు చెందిన పది మంది ఉగ్రవాదులు
2008లో ముంబయిలోని పలుచోట్ల జరిపిన దాడుల్లో 166 మంది
మరణించారు.
|