అక్టోబరు - 2014 దినోత్సవాలు


అక్టోబరు - 8 
¤ 82వ భారత వైమానికదళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

       » ఉత్తరప్రదేశ్‌లోని హిండన్‌లో నిర్వహించిన వైమానిక దినోత్సవంలో
 క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ యూనిఫాం ధరించి గౌరవ
 గ్రూప్ కెప్టెన్ హోదాలో పాల్గొన్నారు.
అక్టోబరు - 11
¤ అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.       » ఈ దినోత్సవం సంద్భంగా ప్రధాని దేశ ప్రజలకు సందేశమిచ్చారు. 
ఆడ శిశువుల భ్రూణ హత్యలు అత్యంత సిగ్గుచేటైన విషయమని ప్రధాని
 మోదీ పేర్కొన్నారు. లింగ వివక్షను రూపుమాపి, ఆడపిల్లలకూ 
సమానత్వం లభించే వాతావరణాన్ని తీసుకువస్తామంటూ ప్రతిజ్ఞ 
చేయాల్సిందిగా పిలుపునిచ్చారు.
అక్టోబరు - 21
¤ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

       » ఢిల్లీలోని పోలీసు స్మారకం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో

 కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొన్నారు.

       » ఢిల్లీలోని చాణక్యపురిలో జాతీయ పోలీసు స్మారకాన్ని 

నిర్మించనున్నట్లు హోం మంత్రి ప్రకటించారు.