జనవరి - 8
|
¤ పన్నెండో 'ప్రవాస్ భారతీయ దివస్' కార్యక్రమం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. » ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రవాస భారతీయుల్లో నెలకొన్న ఆందోళనను ప్రధాని తొలగించే యత్నం చేశారు. |
» ప్రవాస్ భారతీయ దివాస్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మలేషియా సహజ వనరులు, పర్యావరణ మంత్రి దాతుసెరి జి.పళనివేల్ హాజరయ్యారు. ఐఐటీ కేంద్రాన్ని మలేషియాలో ఏర్పాటు చేయాలంటూ మంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. » ఈ కార్యక్రమంలో 'ఇన్‌క్రెడిబుల్ ఆపర్చ్యునిటీస్ బ్యాక్‌హోమ్' పుస్తకాన్ని ప్రధాని విడుదల చేశారు. |
|
జనవరి - 24
|
¤ జాతీయ బాలికాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. |
జనవరి - 25
|
¤ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. » ఇది నాలుగో జాతీయ ఓటర్ల దినోత్సవం. 2011 నుంచి ఏటా జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. » 'ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాను' అనేది జాతీయ ఓటర్ల దినోత్సవ నినాదం. |
|
|