మాలేషియా
==> "మలయు" అనే పేరు "మలయ్" మరియు "ఊర్" అనే తమిళ పదములనుండి పరిణామం చెందిన శబ్దంగా భావిస్తారు. మలయ్ అంటే పర్వతము, ఊర్ అంటే తెలుగు మరియు తమిళాలలో ఊరు లేదా నగరము అని అర్ధము. తరువాత 7 నుండి 13వ శతాబ్దం వరకు సుమత్రా లో కొనసాగిన సామ్రాజ్యాన్ని మలయు అని వ్యవహరించేవారు. ప్రాచీన భారతదేశపు వ్యాపారులు మలేషియాను "మలయాద్వీపం" అను పేరుతో వ్యవహరించేవారు. | ||
==> 1826 సంవత్సరంలో ఫ్రెంచి నావికుడు జూల్స్ డ్యుమాంట్ డ్యుర్విల్లీ తన సముద్రయానం లో మలేషియా, మైక్రోనేషియా మరియు మెలనేషియ అనే పేర్లతో పిలువబడే ఈ ప్రాంతాన్ని కనుగొన్నాడు . మలేషియాను పూర్వం ఈస్టిండీస్ అని వ్యవహరించేవారని అభివర్ణించాడు. | ||
==> మాలేషియాలో 40,000 సంవత్సరాల పూర్వం ఆధునిక మానవుడు నివసించిన ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రదేశంలో నివసించిన మొదటి మానవులు " నెగ్రితోస్ " అని భావిస్తున్నరు. క్రీశ మొదటి శతాబ్ధం నుండి ఇక్కడకు భారతదేశం మరియు చైనా నుండి వ్యాపారస్తులు వలసవచ్చినట్లు అంచనా. | ||
==> 14వ శతాబ్ధం నుండి మలేషియా ద్వీపకల్పంలో ఇస్లాం ప్రవేశించి వ్యాపించసాగింది. 15వ శతాబ్ధంలో శ్రీవిజయ సాంరాజ్యానికి చెందిన రాజకుమారుడు పరమేశ్వర మలక్క సుల్తానేట్ సాంరాజ్యస్థాపన జరిగింది. మలక్క సుల్తానేటును మలేషియా ద్వీపకల్ప మొదటి స్వతంత్ర రాజ్యంగా భావించబడుతుంది. | ||
==> 1511 లో పోర్చుగీస్ వారు మలక్కా సామ్రాజ్యాన్ని జయించారు . తరువాత మలేషియాను 1641లో డచ్ స్వాధీనం చేసుకుంది. | ||
==> 1819 లో సింగపూరును స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ సాంరాజ్యం 1824 నాటికి మలయా మీద ఆధిపత్యం సాధించింది. మలాయ్ పాలకులతో కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా మలాయ్ పాలకులకు బ్రిటిష్ పౌరులు సలహాదారుగా నియమించబడ్డారు. | ||
==> రెండవ ప్రపంచ యుద్ధసమయంలో జపానీ సైన్యం మలయా
మీద దండయాత్రచేసి మలయా, సరవాక్ మరియు సింగపూర్ లను ఆక్రమించుకున్నది. జపాన్
మాలయాను మూడు సంవత్సరాల కాలం పాలించింది. | ||
==> మిత్రసైన్యాలు మలయాను తిరిగి స్వాధీనం చేసుకున్న తరువాత స్వతంత్రరాజ్య స్థాపనకు ప్రజలలో మద్దతు అధికమైంది. | ||
==> 1946లో మలయాన్ యూనియన్ స్థాపించబడింది. సింగపూర్ తప్ప మిగిలిన మలయా ద్వీపకల్పంలో ఉన్న బ్రిటిష్ ఆధిపత్యం రద్దు చేసి బ్రిటిష్ సైనిక రక్షణతో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఫెడరేషన్ ఆఫ్ మలయా స్థాపించబడింది. | ||
==> మలయా తిరుగుబాటు 1948 నుండి 1960 వరకు కొనసాగింది. | ||
==> 1965లో ఇండోనేషియా మరియు సింగపూరులతో పోరాటం జాతి ఘర్షణలు రావడానికి కూడా కారణం అయింది. ఈ జాతి ఘర్షణలు పాతుకుపోయి 1969 మే 13 నాటికి అల్లర్లు చెలరేగాయి. అల్లర్ల తరువాత ప్రధానమంత్రి తన్ అబ్దుల్ రజాక్ వివాదాస్పదమైన కొత్త ఆర్ధికవిధానాలను ప్రవేశపెట్టాడు. | ||
==> మలేషియా 31 ఆగష్టు 1957 న స్వాతంత్ర్యం పొందినది . స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి, మలేషియా GDP దాదాపు 50 సంవత్సరాలు సగటున 6.0% వృద్ధి తో, ఆసియాలోని అత్యుత్తమ ఆర్థిక రికార్డులలో ఒకటిగా ఉంది. | ||
==> మత స్వేచ్ఛను రక్షిస్తూనే ఇస్లాం మతం జాతీయ మతంగా ప్రకటించబడింది. రాజ్యాధిపతిగా రాజు( యాంగ్ డి-పెర్తుఆన్) ఉంటాడు, రాజుగా తొమ్మిది మలేషియా రాష్ట్రాల వంశపారంపర్య పాలకుల నుండి ఒకరిని ఎన్నుకొంటారు, ఇతని పదవీకాలం 5 సంవత్సరాలు. ప్రభుత్వం యొక్క అధికారిగా ప్రధాన మంత్రి ఉంటాడు. | ||
==> ప్రధానమంత్రి సలహాతో రాష్ట్రాలకు పాలకులుగా మలాయ్ వారసత్వ ప్రాతిపదికన నియమించబడతారు. పార్లమెంట్ ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. 21 సంవత్సరాలు నిండిన నమోదుచేయబడిన పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది | ||
==> యురేషియాఖండం దక్షిణ కొనలో, ఉష్ణమండలం లో తాన్జుంగ్ పియై అను ప్ర్రాంతం మలేషియాలో ఉంది. ఇది పెద్ద సంఖ్యలో వివిధ స్థానీయ జంతువులు, శిలీంధ్రాలు మరియు మొక్కలు ఉండే వైవిధ్యమైన దేశం. ఇది ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య, తూర్పు ఆసియా సమ్మిట్ మరియు ఇస్లామిక్ సహకార సంస్థ, మరియు ఆసియా పసిఫిక్ ఆర్ధిక సహకార సంస్థ, కామన్వెల్త్ దేశాల సమాఖ్య, మరియు అలీనోద్యమము మొదలైన సంస్థలు మరియు సమాఖ్యలకు వ్యవస్థాపక సభ్యదేశంగావుంది | ||
==> మలేషియా మొత్తం వైశాల్యం 3,29,847 చదరపు కిలోమీటర్లు. వైశాల్యపరంగా మలేషియా ప్రపంచదేశాలలో 67వ స్థానంలో ఉంది. మలేషియా పడమటి సరిహద్దులలో తాయ్‌లాండ్ ఉంది. తూర్పు సరిహద్దులలో ఇండోనేషియా మరియు బ్రూనై దేశాలు ఉన్నాయి. మలేషియా సముద్రతీర సరిహద్దులో వియత్నాం మరియు ఫిలిప్పైన్ ఉన్నాయి | ||
==> మలేషియా 1993 జూన్ 12 వ తేదీ రియో సమావేశంలో " బయోలాజికల్ డైవర్శిటీ " (జీవవైవిధ్యం)కి సంతకం చేసి 1994 జూన్ 24 సమావేశంలో భాగస్వామ్యం వహించింది. మలేషియా తరువాత జీవవైవిధ్యం ప్రణాళిక మరియు కార్యరూప ప్రణాళిక రూపిందించింది | ||
==> మలేషియాలో ప్రపంచంలో ఉన్న జీవజాతులలో 20% జీవజాలం ఉన్నట్లు అంచనా. బోర్నియో పర్వతారణ్యాలలో దేశంలోని అత్యధిక స్థానిక జీవజాలం మనుగడ సాగిస్తున్నది. | ||
==> మలేషియా ద్వీపంలో 210 క్షీరదాలు, 620 కంటే అధికమైన పక్షిజాతులు ఉన్నట్లు నమోదైంది. దేశంలో 150 జాతుల పాములు మరియు 80 బల్లి జాతులు ఉన్నాయి. అలాగే వేలసంఖ్యలో కీటకాలు ఉన్నాయి. మలేషియా జలభాగం భూభాగం కంటే 1.5 పెద్దది. మలేషియా జభాగంలో జీవవైవిధ్యం అత్యధిక కలిగిన కోరల్ ట్రైయాంగిల్ ఒకటి. సిపడాన్ ద్వీపం చూట్టూ ఉన్న జలభాగం ప్రంపంచంలో జీవవైవిధ్యం అధికంగా ఉన్న ప్రదేశంగా భావించబడుతుంది | ||
==> మలేషియాలో మూడింట రెండుభాగాలు అరణ్యాలతో నిండి ఉంటుంది. కొన్ని అరణ్యాలు 13 కోట్ల సంవత్సరాల నాటివని వశ్వసిస్తున్నారు. | ||
==> మలేషియా దేశం ఇస్లాం మతాన్ని దేశీయమతంగా నిర్ణయిచినా పౌరులకు మతస్వాతంత్రం ఇచ్చింది. 2010 గణాంకాలను అనుసరించి జనసంఖ్యలో 61.3 % ఇస్లాం మతావలంబీకులు, 9.2% క్రైస్తవ మతావలంబీకులు, 6.3% హిందూ మతావలంబీకులు మరియు 1.3% కాంఫంక్షనిజం చెందిన వారని అంచనా. తాయిజం మరియు ఇతర చైనా మతావలంబీకులు | ||
==> మలేషియా అధికారిక భాష మలేషియన్ . ప్రామాణికం చేబడిన మలయాభాషయే మలేషియన్. వాస్తవంగా చారిత్రకమైన అధికారభాష ఆంగ్లభాషే అయినా 1969 జాతి కలవరం తరువాత మలయాభాష అధికారికభాషగా మార్చబడింది. ఆంగ్లం అధికంగా నాట్లాడుతున్న రెండవ భాష అయింది. | ||
==> మలేషియాలో సంవత్సరం పొడవునా పలు పండుగలు మరియు
పలు సెలవు దినాలు ఉండడం గమనించవచ్చు. కొన్ని ప్రభుత్వం మంజూరు చేసే సెలవు
దినాలు, మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే ప్రత్యేక సెలవు దినాలు .
రాష్ట్రీయ మతమైన ముస్లిం సెలవుదినాలకు ప్రత్యేకత ఉన్నది. హరిరాయ పుయాషా (హరి రాయ
ఐదిల్ ఫిత్రి) హరి రాయ హజీ ( హరిరాయ ఐదిలాధా), మైలీ దర్ రసూల్ (ప్రవక్త పుట్టిన
రోజు). |
||
==> మలేషియా నినాదం : "బెర్సెకుటు బెర్తంబాహ్ ముటు" ("ఐకమత్యమే బలము") | ||
==> మలేషియా జాతీయగీతం :
Negaraku |
||
==> మలేషియా రాజధాని : కౌలాలంపూరు | ||
==> మలేషియా అధికార భాషలు : మలయు | ||
==> మలేషియా ప్రజానామము : మలేషియన్ | ||
==> మలేషియా ప్రభుత్వం : ఫెడరల్ రాజ్యాంగ రాజరికం |
||
==> మలేషియా ప్రధానమంత్రి : Yang di-Pertuan Agong | ||
యునైటెడ్ కింగ్ డమ్ నుండి స్వాతంత్ర్యం వచ్చినది : ఆగష్టు 31 1957 | ||
సింగపూరు నుండి స్వాతంత్ర్యం వచ్చినది : సెప్టెంబరు 16 1963 | ||
మలేషియా విస్తీర్ణం మొత్తం : 329,847 కి.మీ² లేక 127,355 చ.మై | ||
మలేషియా జనాభా : 27,122,000 | ||
మలేషియా కరెన్సీ : రింగిత్ - Ringgit - (RM) (MYR) |
||
0 వ్యాఖ్యలు
Post a Comment
Thank You for your Comment