| 1. ఉపకల్పన బిల్లును ఏ సభలో ప్రవేశపెట్టవచ్చు? |
| జ: లోక్‌సభ |
| 2. చట్టబద్ధంగా మినహా మరేవిధంగా పన్ను విధించకూడదని రాజ్యాంగంలో ఏ ప్రకరణలో పేర్కొన్నారు? |
| జ: 164 |
| 3. ప్రభుత్వ ఖాతాల సంఘం అధ్యక్షుడిని ఎవరు నియమిస్తారు? |
| జ: లోక్‌సభ స్పీకర్ |
| 4. రాష్ట్ర ప్రభుత్వ ఆడిట్ అనేది - |
| జ: కేంద్ర అంశం |
| 5. బడ్జెట్ అనేది ఏ విధమైన నియంత్రణ? |
| జ: శాసనపరమైన |
| 6. కేంద్రంలో ఆడిట్ నుంచి ఖాతాలను ఎప్పుడు వేరుచేశారు? |
| జ: 1976 |
| 7. రాజ్యాంగం ప్రకారం ఆర్థిక సంఘాన్ని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నియమిస్తారు? |
| జ: ప్రతి అయిదేళ్లు లేదా అంతకంటే ముందు |
| 8. మొదటి వేతన సంఘాన్ని ఎప్పుడు నియమించారు? |
| జ: 1947 |
| 9. ఓట్ ఆన్ అకౌంట్ ప్రభుత్వానికి ఏ విధంగా, ఎప్పుడు నిధులను ఖర్చు చేసేందుకు తోడ్పడుతుంది? |
| జ: తాత్కాలికంగా బడ్జెట్ ఆమోదం నిలిపివేసినప్పుడు |
| 10. లైన్ - ఐటమ్ బడ్జెట్‌ను ఏ దేశంలో అనుసరిస్తున్నారు? |
| జ: భారతదేశం |
| 11. ఊహించని వ్యయాన్ని పార్లమెంటు ఆమోదానికి ముందుగానే ప్రభుత్వం ఏ నిధి నుంచి ఖర్చు చేయవచ్చు? |
| జ: భారత ఆగంతుక నిధి నుంచి |
| 12. చట్టం ప్రకారం వ్యయ ప్రతిపాదనలను ఎవరి సిఫారసు లేనిదే పార్లమెంటులో ప్రవేశపెట్టకూడదు? |
| జ: రాష్ట్రపతి |
| 13. గ్రాంట్ల కోసం డిమాండ్లను ఎవరు ప్రవేశపెట్టవచ్చు? |
| జ: ట్రెజరీ |
| 14. బడ్జెట్ అంటే ఏమిటి? |
| 1) రెవెన్యూ అంచనా 2) ఖర్చుల అంచనా 3) ప్రస్తుత ప్రభుత్వ ఖజానా పరిస్థితి అంచనా 4) పైవన్నీ |
| జ: పైవన్నీ |
| 15. సాధారణ బడ్జెట్‌ను పార్లమెంటులో ఎవరు ప్రవేశపెడతారు? |
| జ: ఆర్థిక మంత్రి |
| 16. 266 (1) ఆర్టికల్ ద్వారా దేన్ని ఏర్పరిచారు? |
| జ: సంఘటిత నిధి |
| 17. ఆర్టికల్ 266 ప్రకారం రాష్ట్రాల రెవెన్యూ దేని నుంచి వస్తుంది? |
| జ: రాష్ట్ర సంఘటిత నిధి |
| 18. ఆగంతుక నిధిని ప్రభుత్వ చట్టం ద్వారా ఎప్పుడు ఏర్పాటు చేశారు? |
| జ: 1950 |
| 19. రాష్ట్ర ప్రభుత్వ ఖాతాల తనిఖీ ఏ అంశం? |
| జ: కేంద్ర అంశం |
| 20. నిధులను ఖర్చు చేసే అధికారికి ఆ అధికారం ఉందా లేదా అని ఏ రకమైన ఆడిట్ నిర్ధారిస్తుంది? |
| జ: అకౌంటెన్సీ వర్గీకరణ |
| 21. ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు అవసరమయ్యే ధనాన్ని ఎవరు సమకూరుస్తారు? |
| జ: శాసనశాఖ |
| 22. జీరో బేస్డ్ బడ్జెట్‌ను ఎవరు ప్రారంభించారు? |
| జ: పీటర్ ఫైర్ |
| 23. బడ్జెట్‌లోని రెవెన్యూ అంచనాలను ఎవరు తయారు చేస్తారు? |
| జ: ఆర్థిక మంత్రిత్వ శాఖ |
| 24. ఆడిట్ నుంచి ఖాతాలను వేరుచేయడానికి కారణం |
| జ: శాఖలు తమ అవసరాలకు చెక్కులను జమ చేసుకోవడానికి |
| 25. కేంద్రం సంఘటిత నిధి నుంచి రాష్ట్రాలకు గ్రాంట్స్-ఇన్-ఎయిడ్‌ను ఇవ్వడానికి సంబంధించిన నియమావళిని ఎవరు సిఫారసు చేస్తారు? |
| జ: ఆర్థిక సంఘం |
| 26. ఊహించని ఖర్చులకు ఆగంతుక నిధి నుంచి నిధులను విడుదల చేసే అధికారం ఎవరికి ఉంది? |
| జ: రాష్ట్రపతి |
| 27. భారత ప్రభుత్వంలోని విత్త నిర్వహణలో 'వాచ్ డాగ్' విధులను ఎవరు నిర్వర్తిస్తారు? |
| జ: ఆర్థిక మంత్రిత్వ శాఖ |
| 28. ప్రభుత్వ విధులు, కార్యక్రమాలు, చర్యల ఆధారంగా తయారుచేసే బడ్జెట్‌ను ఏమని పిలుస్తారు? |
| జ: నిర్వర్తనాధార బడ్జెట్ |
| 29. భారతదేశంలో నిర్వర్తనాధార బడ్జెట్‌ను ఎవరి సిఫారసుల మేరకు ప్రవేశపెట్టారు? |
| జ: పరిపాలనా సంస్కరణల సంఘం |
| 30. భారత సంఘటిత నిధి నుంచి చెల్లింపులను ఏ విధంగా జరుపుతారు? |
| జ: ఆర్థిక చట్టం ద్వారా |