| 1. జాతీయ వ్యవసాయ పంటల బీమా పథకం ఎప్పుడు ప్రారంభమయ్యింది? |
| జ. 2000 |
| 2. రాష్ట్ర ప్రభుత్వం ఏ వ్యవసాయ కార్యక్రమాలపై సబ్సిడీలు అందిస్తోంది? |
| 1) పంటమార్పిడి పథకం 2) వ్యవసాయ యంత్రాలు |
| 3) ఎరువులు 4) పంటమార్పిడి పథకం, వ్యవసాయ యంత్రాలు |
| జ. పంటమార్పిడి పథకం, వ్యవసాయ యంత్రాలు |
| 3. పంటల బీమాను లెక్కించడానికి దేన్ని యూనిట్‌గా తీసుకుంటారు? |
| జ. గ్రామం |
| 4. పంటల బీమా పథకంలో ఎన్ని పంటలను చేర్చారు? |
| జ. 20 |
| 5. ప్రధానమంత్రి ప్రత్యేక ప్యాకేజీ పథకం లక్ష్యం ఏమిటి? |
| 1) ఆర్థికంగా కుంగిపోయిన రైతులను ఆదుకోవడం |
| 2) పంటల బీమా కింద ఆర్థిక సహాయం అందించడం |
| 3) రాష్ట్రంలో 16 జిల్లాల్లో పథకం అమలు |
| 4) 1, 3 |
| జ. 4(1, 3) |
| 6. పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించే పథకం ఏది? |
| జ. అంత్యోదయ అన్న యోజన |
| 7. హరిత విప్లవం ఎప్పుడు వచ్చింది? |
| జ. 1966 - 80 |
| 8. ప్రచ్ఛన్న నిరుద్యోగం ఏ రంగంలో కనిపిస్తుంది? |
| జ. వ్యవసాయ రంగం |
| 9. వ్యవసాయ కార్మికులకు ఉపాధి లభించక, ఖాళీగా ఉండే స్థితిని ఏమంటారు? |
| జ. రుతు సంబంధ నిరుద్యోగం |
| 10. వ్యాపార కార్యకలాపాలు స్తంభించడంతో ఏర్పడే నిరుద్యోగాన్ని ఏమంటారు? |
| జ. చక్రీయ నిరుద్యోగం |
| 11. ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? |
| జ. కీన్స్ |
| 12. సి.జి.ఐ.ఎ.ఆర్. పద్ధతి ద్వారా అంతర్జాతీయ సహాయం కోసం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలను ఎప్పుడు నెలకొల్పారు? |
| జ. 1971 |
| 13. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ అమలు పథకాన్ని మొదటిసారి ఎక్కడ ప్రారంభించారు? |
| జ. పంజాబ్ |
| 14. గ్రామీణాభివృద్ధికి 1953లో ప్రవేశపెట్టిన పథకం ఏది? |
| జ. జాతీయ విస్తరణ సేవ |
| 15. ఏ కాలంలో గ్రామ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది? |
| జ. ప్రాచీన యుగం |
| 16. భారతదేశంలో సాధారణంగా కనిపించని నిరుద్యోగం ఏది? |
| జ. ఒరిపిడి నిరుద్యోగం |
| 17. అనిచ్ఛా పూర్వక నిరుద్యోగం అంటే ఏమిటి? |
| జ. పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పని లభించని స్థితి |
| 18. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్ఎస్ఎస్ఓ) ప్రకారం సాధారణ స్థితి నిరుద్యోగిత స్వభావం ఏమిటి? |
| జ. ఒరిపిడి |
| 19. ఎన్.ఎస్.ఎస్.ఒ. ప్రకారం అల్ప ఉద్యోగిత అంటే ఏమిటి? |
| జ. వారానికి 30 గంటల కంటే తక్కువ పనిచేసేవారు |
| 20. భారతదేశంలో నిరుద్యోగ సమస్యకు కారణం ఏమిటి? |
| 1) జనాభా విస్ఫోటం 2) దిశ లోపించిన విద్యా వ్యవస్థ |
| 3) మావన వనరుల వినియోగం సరిగ్గా లేకపోవడం 4) పైవన్నీ |
| జ. 4(పైవన్నీ) |
| 21. వసాయ ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో కిందివాటిలో ఏది ప్రబలంగా కనిపిస్తుంది? |
| జ. ప్రచ్ఛన్న నిరుద్యోగిత |
| 22. భారతదేశంలోని నిరుద్యోగం ఏ రకానికి చెందింది? |
| జ. వ్యవస్థాపక నిరుద్యోగం |
| 23. ప్రచ్ఛన్న నిరుద్యోగం ఏ ఆర్థిక వ్యవస్థలో ప్రబలంగా ఉంటుంది? |
| జ. వర్ధమాన దేశాలు |
| 24. ఉద్యోగ కల్పనకు ప్రత్యేక పథకాలను మొదటిసారిగా ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారు? |
| జ. 6వ ప్రణాళిక |
| 25. 'ట్రైసమ్ పథకం' దేనికి సంబంధించింది? |
| జ. ఉపాధి కోసం యువ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం |
| 26. భారతదేశంలో ఎక్కువమంది ప్రజలు ఏ రంగంలో పని చేస్తున్నారు? |
| జ. ప్రాథమిక రంగం |
| 27. భారతీయ వేతన విధానం ఇంచుమించుగా దేనిపై ఆధారపడి రూపుదిద్దుకుంది? |
| జ. కనీస అవసరాలు |
| 28. మన దేశంలో నిరుద్యోగితపై అంచనాలు వేసిన కమిటీ ఏది? |
| జ. భగవతి కమిటీ |
| 29. భారతదేశంలో నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని దేని ద్వారా కనుక్కోవచ్చు? |
| జ. అధిక ఆర్థిక వృద్ధి |