|
1. ప్రపంచ దేశాలన్నింటిలో జాతీయ జనాభా విధానాన్ని ప్రకటించిన మొదటి
దేశమేది? |
జ: ఇండియా |
|
2. భారతదేశం జనాభా నియంత్రణ కోసం మొదటిసారిగా ఏ సంవత్సరంలో జాతీయ
జనాభా విధానాన్ని రూపొందించింది? |
జ: 1951 |
|
3. 1951 జాతీయ జనాభా విధాన ప్రధాన లక్ష్యం? |
జ: మాతా-శిశు ఆరోగ్య సంరక్షణ, కుటుంబ
నియంత్రణ, జనాభా స్థిరీకరణ |
|
4. 1976 జాతీయ జనాభా విధానంలోని ముఖ్యమైన అంశమేది? |
జ: ప్రజల్లో విద్యను అభివృద్ధి చేయడం, వైద్య
సౌకర్యాలు మెరుగు పరచడం, వివాహ వయసును స్త్రీలలో 18 ఏళ్లు, పురుషుల్లో
21 ఏళ్లకు పెంచడం. |
|
5. ప్రస్తుతం అమల్లో ఉన్న జాతీయ జనాభా విధానాన్ని ఎప్పుడు
రూపొందించారు? |
జ: 2000 లో |
|
6. లక్షలోపు జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతమేది? |
జ: లక్షదీవులు |
|
7. 1901, 1951 మధ్య కాలంలో భారతదేశ జనాభా వృద్ధి దాదాపు ఎంత
శాతం? |
జ: 51.47 శాతం |
|
8. గత 50 సంవత్సరాలుగా భారతదేశ జనాభాలో గ్రామీణ జనాభా శాతం ఏ విధంగా ఉంది? |
జ: క్రమంగా తగ్గుతోంది |
|
9. గత 50 సంవత్సరాలుగా దేశ నగర జనాభా శాతం ఎలా ఉంది? |
జ: క్రమంగా పెరుగుతోంది |
|
10. 2001 జనగణన ప్రకారం భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న నగరమేది? |
జ: ముంబయి |
|
11. ఇండోర్, విశాఖపట్నం, నాసిక్, మైసూర్ నగరాల్లో మెట్రో పాలిటన్ నగరం కానిది ఏది? |
జ: మైసూర్ |
|
12. 2001 జనగణన ప్రకారం దేశంలోని నగర జనాభాకు సంబంధించి హైదరాబాద్ ఎన్నో స్థానంలో ఉంది? |
జ: 5వ స్థానం |
|
13. మెట్రోపాలిటన్ నగరంగా గుర్తించడానికి కావాల్సిన కనీస జనాభా ఎంత? |
జ: 10 లక్షలు |
|
14. జనాభా నియంత్రణకు తోడ్పడే జాతీయ ఆరోగ్య విధానాన్ని కేంద్రప్రభుత్వం ఏ సంవత్సరంలో రూపొందించింది? |
జ: 2002 |
|
15. కిందివాటిలో మెట్రోపాలిటన్ నగరాన్ని గుర్తించండి. |
ఎ)
జంషెడ్‌పూర్
బి) జబల్‌పూర్ సి) మీరట్
డి) అన్నీ |
జ: అన్నీ |
|
16. 2001 జనగణన ప్రకారం దేశంలో 60 సంవత్సరాలకు పైబడిన జనాభా దాదాపు
ఎన్ని కోట్లు? |
జ: 7 |
17. భారతదేశంలో అత్యధిక జనాభా ఏ వయసు సమూహంలో ఉంది? |
|
జ: 15-60 సంవత్సరాలు |
|
18. 2001 జనగణన ప్రకారం 0-14 సంవత్సరాల వయసున్న జనాభా శాతం మొత్తం
దేశ జనాభాలో ఎంత శాతం ఉంది? |
జ: 34.3 శాతం |
|
19. 0-14 సంవత్సరాల వయసున్న జనాభా శాతం గత 30 సంవత్సరాలుగా ఏ
విధంగా ఉంది? |
జ: క్రమంగా తగ్గుతోంది |
|
20. 2001 జనగణన ప్రకారం దేశ మొత్తం జనాభాలో గ్రామీణ జనాభా దాదాపు
ఎన్ని కోట్లు? |
జ: 74.3 |
|
21. భారతదేశంలో అత్యధిక నగర జనాభా శాతం ఉన్న రాష్ట్రమేది? |
జ: గోవా |
|
22. ఆంధ్రప్రదేశ్,
మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రం ఏది? |
జ: ఆంధ్రప్రదేశ్ |
|
23. ఏ సంవత్సరం నాటికి భారతదేశ జాతీయ జనాభా విధానం జనాభాను స్థిరీకరించాలని పేర్కొంది? |
జ: 2045 |
|
24. దేశంలో జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది? |
జ: 5వ స్థానం |
|
25. ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం ఏది? |
జ: అసోం |
|
26. అధిక జనసాంద్రత ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది? |
జ: లక్షదీవులు |
|
27. 2001 జనగణన ప్రకారం భారతదేశ స్త్రీ, పురుషుల నిష్పత్తికి సంబంధించి ప్రతి 1000 మంది పురుషులకు ఎంత మంది స్త్రీలు ఉన్నారు? |
జ: 933 |
|
28. 1991, 2001 జనగణనలను అనుసరించి భారతదేశ స్త్రీ, పురుషుల నిష్పత్తి - |
జ: స్వల్పంగా పెరిగింది |
|
29. గత 50 సంవత్సరాలుగా దేశ జనాభాలో గ్రామీణ జనాభా ఏ విధంగా ఉంది? |
జ: క్రమంగా పెరుగుతోంది |
|
30. భారతదేశంలో స్త్రీ, పురుషుల నిష్పత్తి అత్యధికంగా ఉన్న మొదటి రెండు రాష్ట్రాలేవి? |
జ: కేరళ, చత్తీస్‌గఢ్ |
|
31. భారతదేశంలో అత్యధిక నగర జనాభా ఉన్న రాష్ట్రమేది? |
జ: మహారాష్ట్ర |
|
32. స్త్రీ, పురుషుల నిష్పత్తి అత్యధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది? |
జ: పుదుచ్చేరి |
|
33. 2001 జనగణన ప్రకారం కేరళలో స్త్రీ, పురుషుల నిష్పత్తి, అంటే ప్రతి 1000 మంది పురుషులకు ఎంత మంది స్త్రీలు ఉన్నారు? |
జ: 1058 |
|
34. 1951 జనగణన ప్రకారం దేశ జనాభాలో నగర జనాభా శాతం ఎంతగా నమోదైంది? |
జ: 27.78 శాతం |
|
35. ఏ రాష్ట్రంలో స్త్రీ, పురుషుల నిష్పత్తి ఎక్కువగా ఉన్నది? |
జ: తమిళనాడు |
|
36. ఏ రాష్ట్రంలో స్త్రీ, పురుషుల నిష్పత్తి అతి
తక్కువగా ఉంది? |
జ: హర్యానా |
|
37. భారతదేశంలో స్త్రీ, పురుషుల నిష్పత్తి తగ్గడానికి ప్రధాన
కారణం? |
జ: సామాజిక అసమానతలు,
నిరక్షరాస్యత, వరకట్న సమస్య |
|
38. 2001 జనగణన ప్రకారం దేశంలోని మొత్తం మెట్రోపాలిటన్ నగరాలు
ఎన్ని? |
జ: 35 |
|
39. 2001 జనగణన ప్రకారం భారతదేశంలోని అక్షరాస్యత రేటు ఎంత? |
జ: 64.84 శాతం |
|
40. అత్యధిక అక్షరాస్యతను సాధించిన కేరళ రాష్ట్ర అక్షరాస్యత
రేటు ఎంత? |
జ: 90.86 శాతం |
|
41. ఏదైనా ఒక ప్రాంతాన్ని నగరంగా గుర్తించడానికి కావాల్సిన
కనీస జనసాంద్రత ప్రతి కిలోమీటరుకు ఎంతగా నిర్ణయించారు? |
జ: 400 |
|
42. 2001 జనగణన ప్రకారం భారతదేశంలో మొత్తం నగర జనాభా ఎంత? |
జ: 28.6 కోట్లు |
|
43. 2001 జనగణన ప్రకారం దేశ మొత్తం జనాభాలో గ్రామీణ జనాభా
శాతం ఎంత? |
జ: 72.22 శాతం |
|
44. 2001 జనగణన ప్రకారం భారతదేశంలో మహిళా అక్షరాస్యతా శాతం
ఎంత? |
జ: 53.67 శాతం |
|
45. ప్రస్తుతం భారతదేశంలోని మొత్తం గ్రామాల సంఖ్య ఎంత? |
జ: 5.93 లక్షలు |
|
46. 1951 జనగణన ప్రకారం భారతదేశ జనాభాలో గ్రామీణ జనాభా శాతం
ఎంత? |
జ: 82.7 శాతం |
|
47. అత్యధిక మహిళా అక్షరాస్యత ఉన్న రాష్ట్రమేది? |
జ: కేరళ |
|
48. కేరళ తర్వాత అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రం? |
జ: మిజోరాం |
|
49. అత్యధిక అక్షరాస్యత ఉన్న కేంద్రపాలిత ప్రాంతమేది? |
జ: లక్షద్వీప్ |
|
50. అక్షరాస్యతను నిర్ధరించడానికి పరిగణించే కనీస వయసు ఎంత? |
జ: 7 సంవత్సరాలు |
|
51. అక్షరాస్యులుగా పరిగణించాలంటే_ |
జ: ఏదైనా ఒక భాషను
చదవగలిగి, రాయగలిగి, అవగాహన చేసుకోగలగాలి |
|
52. అధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రమేది? |
జ: నాగాలాండ్ |
|
53. భారతదేశంలో అత్యల్ప అక్షరాస్యత ఉన్న రాష్ట్రమేది? |
జ: బీహార్ |
|
54. 2001 జనగణన ప్రకారం ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రేటు ఎంత? |
జ: 60.47 శాతం |
|
55. రాష్ట్రాల అక్షరాస్యత క్రమం- |
జ: కేరళ - మిజోరాం - గోవా -
మహారాష్ట్ర |
|
56. 2001 జనగణన ప్రకారం భారతదేశంలోని పురుషుల జనాభా శాతం ఎంత? |
జ: 75.26 శాతం |
|
57. ఏదైనా ఒక ప్రాంతాన్ని నగరంగా పరిగణించాలంటే కావాల్సిన
కనీస జనాభా ఎంత? |
జ: 5000 |
|
58. 1991 జనగణన ప్రకారం భారతదేశంలో అక్షరాస్యత రేటు ఎంత? |
జ: 52.21 శాతం |
|
59. 2001 జనగణన ప్రకారం భారతదేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ జనాభా
శాతమెంత? |
జ: 7.41 శాతం |
|
60. అతి తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతమేది? |
జ: లక్షదీవులు |
|
61. గత శతాబ్ది కాలంలో అంటే 1901-2001 మధ్య కాలంలో భారతదేశంలో
పెరిగిన జనాభా శాతమెంత? |
జ: 331 శాతం |
|
62. 1901-2001 మధ్యకాలంలో పెరిగిన జనాభా దాదాపు ఎన్ని కోట్లు? |
జ: 79 కోట్లు |
|
63. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో గ్రామాలున్న రాష్ట్రం ఏది? |
జ: ఉత్తరప్రదేశ్ |