|
1. ఫ్రీ కార్బొనేట్లు లోపించి ఉండే నేలలు ఏవి? |
జ. ఎర్రనేలలు |
|
2. భారతదేశంలో ఇటీవల ఏర్పడిన ఒండ్రుమట్టిని ఏమని పిలుస్తారు? |
జ. ఖాదర్ |
|
3. నల్లరేగడి భూములు ఏ పంట సాగుకు అనుకూలమైనవి? |
జ. పత్తి |
|
4. పంజాబ్ నుంచి అసోం వరకు ఉన్న గంగా-సింధు మైదానంలోని మృత్తిక ఏ
రకానికి చెందింది? |
జ. ఒండ్రు |
|
5. చంబల్ నదీ ప్రాంతంలో ఏ రకం మృత్తికా క్రమక్షయం ఎక్కువగా
జరుగుతుంది? |
జ. అవనాళికా క్రమక్షయం |
|
6. మెత్తటి రేణుయుత అవక్షేపాలు నిక్షేపితమవడం వల్ల ఏ రకమైన
మృత్తికలేర్పడతాయి? |
జ. ఒండ్రు మృత్తికలు |
|
7. వరద మైదానాల్లో ప్రాచీనకాలంలో ఏర్పడిన ఒండలి మైదానం (లేదా)
మనదేశంలో పురాతన ఒండ్రుమట్టిని ఏమని పిలుస్తారు? |
జ. భంగర్ |
|
8. ఏ రకం నేలల్లో బంకమన్ను ఎక్కువగా ఉండి తేమను నిల్వచేసుకునే
శక్తిని కలిగి ఉంటుంది? |
జ. నల్లరేగడి నేలలు |
|
17. హీరాకుడ్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు? |
జ. మహానది |
|
18. మన దేశంలో 1204 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే అతిపెద్ద
పథకం ఏది? |
జ. భాక్రానంగల్ ప్రాజెక్ట్ |
|
19. కోసి ప్రాజెక్టు వల్ల ఏయే దేశాలు ప్రయోజనాలను పొందుతున్నాయి? |
జ. భారత్, నేపాల్ |
|
20. రామ్‌గంగా ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? |
జ. ఉత్తరప్రదేశ్ |
|
21. తుంగభద్ర ప్రాజెక్ట్‌ను ఏ నదిపై నిర్మించారు? |
జ. తుంగభద్ర |
|
22. భారతదేశంలో చెరువులు ఎక్కువగా ఉన్న రాష్ట్రమేది? |
జ. ఆంధ్రప్రదేశ్ |
|
23. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌ను ఏ నదిపై నిర్మించారు? |
జ. కృష్ణా |
|
24. బీహార్, నేపాల్ లకు ప్రయోజనం కలిగిస్తున్న అంతర్జాతీయ
ప్రాజెక్ట్ పేరేమిటి? |
జ. కోసీ ప్రాజెక్ట్ |
|
25. భాక్రానంగల్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? |
జ. హిమాచల్‌ప్రదేశ్ |
|
26. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి పథకమేది? |
జ. తుంగభద్ర |
|
27. భారతదేశంలో అతిపెద్ద బహుళార్థ సాధక పథకమేది? |
జ. భాక్రానంగల్ ప్రాజెక్ట్ |
|