కాంతి




కాంతి  
1. సహాయక తరంగాల అధ్యారోపణకు తరంగాల దశాంతరం  ఏ విలువకు సమానంగా ఉండాలి?
2. ఘన కోణానికి ప్రమాణాలు ఏవి?
3. LASER విస్తృతరూపం ఏమిటి?
4. జనాభా విలోమన్ని సాధించే ప్రక్రియను  ఏమంటారు? 
5. కాంతి కణాలను పరావర్తన తలాలు ఏమి చేస్తాయి?
6. 'క్యాండెలా' కు  ప్రమాణం ఏమిటి? 
7. వినాశక తరంగాల అధ్యారోపణకు తరంగాల దశాంతరం  ఏవిధంగా ఉండాలి?
8. కాంతి తరంగాల ప్రసారానికి మొదట్లో  ఏది అవసరమని హైగీన్స్ భావించాడు? 
9. కాంతి అభివాహానికి ప్రమాణం  ఏమిటి?  
10. కాంతికి సంబంధించి న్యూటన్ ప్రతిపాదించిన సిద్ధాంతం  ఏది?

సమాధానాలు:     1. 2n. 2. స్టెరిడియన్       3. ఉత్తేజిత కాంతి ఉద్గారం వల్ల కాంతి వర్ధకం/ (Light  Amplification by Stimuiating Emission of Radiation)     4. పంపింగ్     5. వికర్షిస్తాయి          6. కాంతి తీవ్రత       7. (2n+1)   8. యానకం    9. ల్యూమెన్     10. కాంతికణ సిద్ధాంతం