జ్ఞానేంద్రియాలు



జ్ఞానేంద్రియాలు
1. వాతావరణంలో అభీష్ట పరిమాణంలో జరిగే పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను ఏమంటారు?
జ : క్షోభ్యత

2. జ్ఞానేంద్రియాల లక్షణం కానిది?
జ : జ్ఞానవార్తలను విభజించి, వివరించే శక్తి ఉంటుంది

3. 'బైనాక్యులర్ విజన్' అంటే ఏమిటి?
జ : ఏకకాలంలో రెండు కళ్లతో ఒకే వస్తువును చూడటం

4. కంటిని తడిగా ఉంచుతూ, క్రిమిసంహారకంగానూ, దుమ్మును తీసివేయడంలోనూ ఉపయోగపడేవి ఏవి?
జ : అశ్రువులు

5. కంటిలోని జ్ఞాన భాగం ఏది?
జ : నేత్రపటలం

6. కంటిముందు భాగంలో పారదర్శకంగా ఉండి, కాంతిని లోపలికి పంపే నిర్మాణం ఏది?
జ : శుక్లపటలం

7. ఒక వ్యక్తి తీక్షణమైన కాంతి ఉన్న ప్రదేశం నుంచి చీకటి ప్రదేశంలోకి వెళ్లినట్లయితే, అతడి కంటిలో కలిగే మార్పులేమిటి?
జ : కనుపాప, తారక పరిమాణంలో చిన్నవిగా మారతాయి

8. ఏ నిర్మాణంలో ఉండే వర్ణక పదార్థాన్నిబట్టి కంటి రంగు మారుతుంది?
జ : కనుపాప

9. కచావత్ కక్ష్యలో చిక్కటి జెల్లీలా ఉండే పదార్థమేమిటి?
జ : తర్పకం

10. మానవుడికి చీకటిలో వస్తువులన్నీ బూడిద రంగులో కనిపించడానికి కారణమయ్యే కణాలేవి?
జ : దండాలు

11. 'ఎల్లో స్పాట్‌'లో అధిక సంఖ్యలో ఉండే కణాలేవి?
జ : కోనులు

12. నేత్రపటలంపై ఏర్పడే ప్రతిబింబ లక్షణం-
జ : వస్తువు కంటే చిన్నదిగా, తలకిందులుగా ఉంటుంది

13. కంటిలోని ఏ భాగంలో ప్రతిబింబం ఏర్పడదు?
జ : అంధచుక్క

14. ప్రతిబింబం నేత్రపటలానికి ముందుగా ఏర్పడితే అటువంటి దృష్టి లోపాన్ని ఏమంటారు?
జ : మయోఫియా

15. వెలుపలి చెవి, మధ్య చెవిని కలిపే నిర్మాణం పేరేమిటి?
జ : కర్ణబేరి

16. 'ఎముకల గొలుసు' ఉన్న చెవి భాగమేది?
జ : మధ్య చెవి

17. లోపలి చెవిలో ఉండే ఏ కుహరం కపాలంలోని ఎముకలతో ఏర్పడుతుంది?
జ : అస్థిగహనం

18. ఒక వ్యక్తి శబ్దాలను సక్రమంగా వినలేకపోతే, అతడు ఏ సమస్యను ఎదుర్కొంటున్నట్లు చెప్పవచ్చు?
జ : కర్ణబేరికి రెండువైపులా వేర్వేరు పీడనాలుండటం

19. వినడంలో పాత్ర వహించే లోపలి చెవి నిర్మాణమేది?
జ : కర్ణావర్తం

20. కర్ణావర్తంలోని కింది కిటికీని ఏమంటారు?
జ : గుండ్రని కిటికీ

21. శ్రవణనాడి దేనికి సంబంధించిన వార్తలను మోసుకు పోతుంది?
జ : శబ్దం

22. పెద్ద చప్పుళ్లు కపాలంలోని ఎముకల ద్వారా లోపలి చెవికి చేరే ప్రక్రియను ఏమంటారు?
జ : బోనీకండక్షన్

23. శబ్ద తరంగాల కేంద్రీకరణలో తోడ్పడే బాహ్య చెవిలోని భాగమేది?
జ : చెవిదొప్ప, పిన్నా

24. ఘ్రాణ గ్రాహకాలకు సంబంధించి సరైంది-
జ : రసాయన గ్రాహకాలు

25. నాసికలోని కిందిభాగాన్ని ఏమని పిలుస్తారు?
జ : ఆళిందం

26. శరీరంపై జిహ్వ గ్రాహకాలుండే ఉన్నత శ్రేణి సకశేరుకాలేవి?
జ : చేపలు

27. నాలుక పార్శ్వభాగంలో ఉండే రుచి కలికలు ఏ రుచిని తెలుపుతాయి?
జ : పులుపు

28. మానవ శరీరంలోని అతిపెద్ద అవయవమేది?
జ : చర్మం

29. గోళ్లు, కొమ్ములు, రోమాల్లో ఉండే ప్రొటీన్ ఏది?
జ : కెరాటిన్

30. ఆల్బినోలలో ఏ వర్ణక పదార్థం ఉండదు?
జ : మెలనిన్

31. వేలిముద్రలు ఏర్పడటానికి కారణమేమిటి?
జ : అంతశ్చర్మంలోని ముడతలు

32. పక్షులు, క్షీరదాల్లో శరీర ఉష్ణోగ్రత సమానస్థాయిలో ఉండేట్లు చూసే అవయవమేది?
జ : చర్మం

33. బాహ్యచర్మంలోని ఏ పొర పొలుసుల్లాగా ఊడిపోతుంది?
జ : కార్నియస్ స్తరం

34. చర్మంలో ప్రవహించే రక్తం నుంచి మలినాలను సేకరించి, 'స్వేదం' రూపంలో విసర్జించే గ్రంథులేవి?
జ :  స్వేద గ్రంథులు

35. ఏ భాగాల్లో స్పర్శ గ్రాహకాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి?
జ : పెదవులు

36. పీడనానికి సంబంధించిన సమాచారాన్ని గ్రహించే గ్రాహకాలేవి?
జ : పాసినియన్ కణాలు

37. బాధను గుర్తించే గ్రాహకాలేవి?
జ : నాసిసెప్టారులు

38. బ్రెయిలీ లిపిని చదవడంలో సహాయపడే గ్రాహకాలేవి?
జ : స్పర్శ గ్రాహకాలు

39. చిన్నపిల్లల్లో అతిసాధారణంగా వచ్చే చర్మవ్యాధి ఏది?
జ : గజ్జి

40. ఇచ్‌మైట్ (సార్కోప్టిస్ స్కాబీస్) అనే జీవి వల్ల వచ్చే చర్మవ్యాధి ఏది?
జ : గజ్జి

41. ఏ వ్యాధిని 'గజికర్ణ' అని పిలుస్తారు?
జ : తామర

42. చర్మంలో విషపదార్థాలు చేరడంవల్ల కలిగే దురద ఏ వ్యాధి లక్షణం?
జ : ఎలర్జీ

43. 'స్కేబిస్' వ్యాధికి ఏ లేపనాలను పూతమందుగా వాడతారు?
జ : సల్ఫర్

44. ఏ వ్యాధి వల్ల చర్మం దళసరిగా మారి, క్రమరహిత మచ్చలు ఏర్పడి, పొట్టులా రాలిపోతుంది?
జ : తట్టు

45. పోషకాహారలోపం వల్ల వచ్చే చర్మవ్యాధి ఏది?
జ : పెల్లాగ్రా