కిరణజన్య సంయోగక్రియావిధానం
|
1. కాంతి కిరణాల్లో ఉండే శక్తిని ఏమంటారు?జ: క్వాంటమ్ శక్తి.2. ఆకుపచ్చ కాంతిని, పత్రహరిత వర్ణద్రవ్యం ఏం చేస్తుంది? జ: పరావర్తనం చెందిస్తుంది.3. వేటి త్వచాల దొంతరలను 'గ్రానా' అంటారు? జ: థైలకాయిడ్లు. 4. కిరణజన్య సంయోగక్రియలో పత్రహరిత అణువు పొందే చర్య ఏది? జ: ఆక్సీకరణం.5. కాంతి చర్యల తుది ఉత్పత్తులు ఏవి? జ: ATP, NADPH 6. కిరణజన్యసంయోగక్రియలో పరిశోధనకు గాను నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త ఎవరు? జ: మెల్విన్ కాల్విన్. 7. కిరణజన్య సంయోగక్రియ ఏ భాగంలో జరుగుతుంది? జ: హరితరేణువులు 8. మెల్విన్ కాల్విన్ కు ఏ పరిశోధనలు చేసినందుకు నోబెల్ బహుమతి దక్కింది? జ: కార్బన్ స్థాపన 9. మొక్కల్లో వాయుమార్పిడి జరిగే స్థలం ఏది? జ: పత్రరంధ్రాలు |