| నీటి కాలుష్యం |
| 1. నీరు కలుషితమవడానికి ముఖ్య కారణాలు - |
| జ. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థజలాలు ,వ్యవసాయంలో వాడే ఎరువులు,రసాయనాలు,ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు |
| 2. వ్యవసాయంలో వాడే కింది ఏ రసాయనాలు విచ్ఛిన్నం కాకుండా జీవ సంచయనం చెంది ఆహార వలయంలోకి ప్రవేశిస్తాయి? |
| జ. D.D.T., B.H.C.,ఆల్డ్రిన్, ఎండ్రిన్ |
| 3. నీటిలోని వివిధ రకాల కాలుష్య రసాయనాలు మొక్కలు, జంతువుల్లో నుంచి ఆహార వలయంలోకి ప్రవేశించడాన్ని ఏమంటారు? |
| జ. బయోమాగ్నిఫికేషన్ |
| 4. చెరువులు, కుంటల్లో ఏ పదార్థాలు ఎక్కువగా జమకూడితే శైవలాలు, నీటిమొక్కలు బాగా పెరిగి యూట్రాఫికేషన్‌కు దారితీస్తుంది? |
| జ. ఫాస్ఫేట్‌లు, నైట్రేట్‌లు |
| 5. ఒక కుంటలోని నీటికి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆ నీరు |
| జ. కలుషితమైంది |
| 6. ఏ భార లోహంతో విషపూరితమైన చేపలను తినడంవల్ల 1953లో జపాన్‌లో మినిమాటా వ్యాధి కలిగింది? |
| జ. పాదరసం |
| 7. నేల కాలుష్యానికి కారణమైన ఘనరూప వ్యర్థ పదార్థాలు చాలా ఎక్కువగా వెలువడటానికి కారణం? |
| జ. గృహసంబంధ వ్యర్థాలు |
| 8. జీవ వైవిధ్యం నశించడానికి కారణాలేంటి? |
| జ. ప్రాజెక్టుల నిర్మాణం, గనుల తవ్వకం, కార్చిచ్చు, పోడు వ్యవసాయం |
| 9. భూమండలంలో ఏ ప్రాంతంలో జీవ వైవిధ్యం అత్యధికంగా ఉంటుంది? |
| జ. ఉష్ణమండలం |
| 10. సున్నితమైన ప్రదేశాలు లేదా హాట్‌స్పాట్స్ అనేవి ఏ లక్షణాల్ని కలిగి ఉంటాయి? |
| జ. స్థానీయమైన జాతులు ఎక్కువగా ఉంటాయి, ఇక్కడి జాతులు మానవుడి వల్ల ప్రభావితమవుతాయి, ఈ ప్రదేశంలో కనీసం 1500 స్థానీయ వృక్షజాతులుండాలి. |
| 11. భారతదేశంలోని ఏ ప్రదేశాలను జీవవైవిధ్య హాట్‌స్పాట్స్‌గా గుర్తించారు? |
| జ. తూర్పు హిమాలయాలు, పడమటి కనుమలు |
| 12. ఏ రోజును ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా పాటిస్తున్నారు? |
| జ. జూన్ - 5 |
| 13. జీవ వైవిధ్యాన్ని స్వస్థానీయ సంరక్షణలో భాగంగా ఏ ప్రదేశాల్లో సంరక్షిస్తారు? |
| జ. జాతీయ పార్కులు, అభయారణ్యాలు, జీవావరణ రక్షిత ప్రదేశాలు |