తుపాను -
I |
|
1. 'కత్రినా' అనే తుపాను (హరికేన్) వల్ల ఏ దేశంలో సుమారు 1836
మంది మరణించారు? |
జ: అమెరికా |
|
2. 2008 లో తమిళనాడులో సంభవించిన తుపాను పేరేంటి? |
జ: నిషా |
|
3. 1999 లో ఏ రాష్ట్రంలో సంభవించిన సూపర్ సైక్లోన్ వల్ల 8913
మందికి పైగా ప్రజలు మరణించారు? |
జ: ఒరిస్సా |
|
4. పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌లో 5,00,000 మంది మరణానికి
కారణమైన భోలా తుపాను ఎప్పుడు సంభవించింది? |
జ: 1970 |
|
5. ఒక ప్రాంతంలో తుపాను వచ్చినప్పుడు జరిగే నష్టం ఏమిటి? |
జ: వేగంగా వీచే గాలి వల్ల
వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోతాయి; వరదలొచ్చి గ్రామాలు ముంపునకు
గురవుతాయి; రోడ్లు, భవనాలు దెబ్బతిని ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతుంది. |
|
6. తుపాను సంభవించినపుడు కలిగే పరిణామాలేవి? |
జ: గాలి అధిక వేగంతో
వీస్తుంది; వర్షపాతం కలుగుతుంది; సముద్రంలో అలల ఉద్ధృతి పెరుగుతుంది. |
|
7. భారతదేశంలోని ఏ సముద్రంలో తుపానులు ఎక్కువగా సంభవిస్తాయి? |
జ: బంగాళాఖాతం |
|
8. అరేబియా తీరప్రాంతంలో ఉండే ఏ రాష్ట్రాలకు తుపాను ముప్పు
ఎక్కువ? |
జ: గుజరాత్, మహారాష్ట్ర |
|
9. బంగాళాఖాతం తీరప్రాంతంలో ఉండే ఏ రాష్ట్రానికి తుపాను వల్ల
కలిగే నష్టం ఎక్కువ? |
జ: ఒరిస్సా |
|
10. భారతదేశంలో తుపాను విపత్తుకు గురయ్యే ప్రాంత పరిమాణం - |
జ: 8.5% |
|
|
వరదలు |
1. గంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదలను నియంత్రించడానికి
భారత ప్రభుత్వం గంగా ఫ్లడ్ కంట్రోల్ కమిషన్‌ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది? |
జ: 1972 |
|
2. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధీనంలో పనిచేసే 'నేషనల్ వాటర్
అకాడమీ' (NWA)ను ఏ నగరంలో నెలకొల్పారు? |
జ: పుణే |
|
3. వరదల వల్ల రోడ్లు, రైల్వే లైన్లకు కలిగే నష్టాన్ని తనిఖీ
చేయడానికి ఏ సంస్థలు పనిచేస్తున్నాయి? |
జ: బోర్డర్ రోడ్
ఆర్గనైజేషన్ , నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా , స్టేట్
డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ |
|
4. వరద హెచ్చరిక, నదీ ప్రవాహం ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి
అపాయకరమైన స్థాయి కంటే తక్కువగా ఉంటే ఆ ప్రవాహాన్ని ఏమంటారు? |
జ: తక్కువస్థాయి వరద |
|
5. 2008లో బీహార్‌లోని ఏ నదికి వరదలు రావడం వల్ల 527 మంది
మరణించారు? |
జ: కోసి |
|
6. భారతదేశంలో ఎంత శాతం భూ భాగం వరద ముప్పునకు గురయ్యే అవకాశం
ఉంది? |
జ: 8% |
|
7. భారతదేశంలో ఏ నెలల మధ్యకాలంలో వరదలు వచ్చే అవకాశం ఎక్కువ? |
జ: జూన్-సెప్టెంబరు |
|
8. భారతదేశంలో ఏ సంవత్సరంలో సంభవించిన వరదల ఫలితంగా
అత్యధికంగా 11,316 మంది మరణించారు? |
జ: 1977 |
|
9. మన దేశంలో వరదలు తరచుగా ఏ నదీ పరీవాహక ప్రాంతాల్లో
వస్తుంటాయి? |
జ: గంగా-బ్రహ్మపుత్ర |
|
10. ఏదైనా ప్రాంతంలో వరదలు రావడానికి కారణం- |
జ: అధిక వర్షపాతం,
తుపాన్లు , జలాశయాలకు గండ్లు పడటం , కొండచరియలు విరిగిపడటం, నదులు
ప్రవాహ దిశను మార్చుకోవడం |
|
11. హైదరాబాద్, ముంబయి లాంటి నగరాల్లో వరదలు రావడానికి
కారణమేమిటి? |
జ: డ్రైనేజీలు
ఘనపదార్థాలతో పూడుకుపోవడం |
|
12. బ్రహ్మపుత్రా నదీ ప్రాంతంలో ఉండే ఏ రాష్ట్రాల్లో అక్కడి
నదుల వల్ల ఎక్కువగా వరదలు వస్తున్నాయి? |
జ: అసోం, మిజోరం,
అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్ |
|
13. జార్ఖండ్, బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్,
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఏ నది, దాని ఉపనదుల వల్ల వరదలు సంభవిస్తున్నాయి? |
జ: గంగానది |