ఆధునిక భారతదేశ చరిత్ర - II




1. సహాయ నిరాకరణోద్యమంపై చర్చించేందుకు 1920లో ప్రత్యేక కాంగ్రెస్ సమావేశం కలకత్తాలో జరిగింది. ఆ సమావేశ అధ్యక్షుడు-
జ:  లాలాలజపతిరాయ్

2. సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా గాంధీజీ చేపట్టిన విదేశీ వస్త్రాల దహనాన్ని వ్యతిరేకించిన వారు-
జ:  రవీంద్రనాథ్ ఠాగూర్

3. సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించడానికి తక్షణ కారణం-
జ:  1919 మాంటేగ్‌ఛెమ్స్‌ఫర్డ్ సంస్కరణలపై అసంతృప్తి

4. రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్‌హుడ్ బిరుదును వదులుకోవడానికి కారణం-
జ:  జలియన్‌వాలాబాగ్ సంఘటన

5. సహాయ నిరాకరణోద్యమ కాలం-
జ:  1920-22

6. సహాయ నిరాకరణోద్యమంలో కోటి రూపాయలతో స్వరాజ్యనిధిని ఎవరి పేరుమీద ఏర్పాటు చేశారు?
జ:  బాలగంగాధర తిలక్

7. సహాయ నిరాకరణోద్యమంలో విద్యాలయాల బహిష్కరణలో భాగంగా మొదటి జాతీయ కళాశాలను కలకత్తాలో 1921లో ఏర్పాటు చేశారు. అయితే దాని ప్రిన్సిపల్‌గా ఎవరిని నియమించారు?
జ:  సుభాష్ చంద్రబోస్

8. సహాయ నిరాకరణోద్యమం సందర్భంగా కాంగ్రెస్ నాయకులందరినీ అరెస్ట్ చేయడంతో 1921 అహ్మదాబాద్ కాంగ్రెస్ సమావేశానికి చిత్తరంజన్‌దాస్ స్థానంలో తాత్కాలికంగా అధ్యక్షత వహించినవారు-
జ:  హకీం అజ్మల్ ఖాన్

9. భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశం మొదటి సారిగా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ జరిగింది?
జ:  కాకినాడ

10. సహాయ నిరాకరణోద్యమ ప్రధాన లక్ష్యమేది?
జ:  ఒక సంవత్సరంలో స్వరాజ్య సాధన

11. సహాయ నిరాకరణోద్యమం అర్ధాంతరంగా  ఆగిపోవడానికి ప్రధాన కారణం-
జ:  చౌరీచౌరా సంఘటన

12. చౌరీచౌరా సంఘటన జరిగిన తేదీ-
జ:  1922 ఫిబ్రవరి 5

13. కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ విజ‌యవాడ స‌మావేశం, చౌరీచౌరా సంఘ‌ట‌న‌, సహాయ నిరాకరణోద్యమ ప్రారంభ
సంఘటనల్లో మొదటిది- 
జ:  సహాయ నిరాకరణోద్యమం ప్రారంభం

22.  వైకోం స‌త్యాగ్ర హం,  హ‌రిజ‌న్ సేవ‌క్ సంఘం స్థాప‌న, కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్య పార్టీ స్థాపనల్లో
  మొదటి సంఘటన-
జ:  కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్య పార్టీ స్థాపన

23. సైమన్ కమిషన్ ఇండియా పర్యటించిన సంవత్సరం-
జ:  1928

24. సైమన్ కమిషన్‌ను భారతీయులు వ్యతిరేకించడానికి కారణం-
జ:  సైమన్ కమిషన్‌లో కనీసం ఒక్కరు కూడా భారతీయులు లేకపోవడం

25. సైమన్ కమిషన్ పర్యటనలో జరిగిన వ్యతిరేక ప్రదర్శనలో మద్రాస్‌లో నాయకత్వం వహించినవారు-
జ:  టంగుటూరి ప్రకాశం పంతులు

26. తమకు కావాల్సిన రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం భారతీయులకు చేతకాదని అవహేళన చేసినవారు-
జ: బర్కిన్ హెడ్

27. నెహ్రూ నివేదిక అధ్యక్షుడు-
జ:  మోతీలాల్ నెహ్రూ

28. మోతీలాల్ నెహ్రూ నివేదిక, సైమన్ కమిషన్ తుది నివేదిక సమర్పణ , సైమన్ కమిషన్ నియామకం 
 సంఘటనల్లో చివరిది-
జ:  సైమన్ కమిషన్ తుది నివేదిక సమర్పణ

29. కాంగ్రెస్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించినవారు-
జ:  సుభాష్ చంద్రబోస్

38. భారత జాతీయ కాంగ్రెస్ శాసనోల్లంఘన ఉద్యమాన్ని (ఉప్పు సత్యాగ్రహాన్ని) తాత్కాలికంగా విరమించడానికి  కారణం-
జ:  గాంధీ - ఇర్విన్ ఒప్పందం

39. కిందివాటిలో సరైన అంశాల్ని గుర్తించండి-
1) మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని భారత జాతీయ కాంగ్రెస్ బహిష్కరించింది
2) మహాత్మాగాంధీ 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు
3) 2వ రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత గాంధీ, ఇర్విన్ ఒప్పందం జరిగింది
4) రౌండ్ టేబుల్ సమావేశాలకు కమ్యునల్ అవార్డుకు సంబంధం ఉంది
జ:  1, 2, 4

40. పుణే ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది?
జ:  మహాత్మాగాంధీ, అంబేద్కర్

41. 1933లో మహాత్మాగాంధీ పుణేలోని ఎర్రవాడ జైలులో 21 రోజులు నిరాహారదీక్ష చేయడానికి కారణం-
జ:  హరిజనోద్ధరణ కోసం

42. 'పాకిస్థాన్' అనే ప్రత్యేక దేశం కావాలని మొట్టమొదట సూచించినవారు-
జ:  రహమత్ ఆలీ