ఆధునిక భారతదేశ చరిత్ర - I




1. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన రోజు- 
జవాబు:  1942 ఆగస్టు 9

2. ''డు ఆర్ డై'' అనే నినాదాన్ని ఇచ్చింది- 
జవాబు:  మహాత్మాగాంధీ

3. క్యాబినెట్ మిషన్ సభ్యులు కానిది- 
జవాబు:  పి.సి.అలెగ్జాండర్

4. కిందివాటిలో మొదటి సంఘటన-
1) రాజాజీ ఫార్ములా   2) వేవెల్ ప్రణాళిక    3) క్యాబినెట్ మిషన్    4) మౌంట్‌బాటన్ ప్రణాళిక
జవాబు:  రాజాజీ ఫార్ములా 

5. ''నడిరేయి సమయంలో ప్రపంచమంతా నిద్రావస్థలో ఉన్నప్పుడు భారతదేశం స్వేచ్ఛా జీవితానికి మేల్కొంటుంది'' అని భారత స్వాతంత్య్రంపై వ్యాఖ్యానించింది-
జవాబు: నెహ్రూ 

6. ముస్లింలీగ్ ప్రత్యక్ష చర్యాదినం చేపట్టిన రోజు-
జవాబు: 1946 ఆగస్టు 16

7. జాతీయోద్యమంలో హిందూ-ముస్లిం అలజడులు ఏ సంఘటనతో ప్రజ్వరిల్లాయి? 
జవాబు:  ప్రత్యక్ష చర్యాదినం

8.  దేశ విభజనకు ప్రధాన కారణం- 
జవాబు:  జిన్నా అనుసరించిన ప్రత్యక్ష చర్యాదినం మొదలైన విధానాలు  

9. స్వదేశీ సంస్థానాల శాఖా కార్యదర్శి-
జవాబు: వి.పి.మీనన్

10. స్వదేశీ సంస్థానాలను ఎన్ని తరగతి రాష్ట్రాలుగా రూపొందించారు? 
జవాబు:  4 

11. సర్దార్ వల్లభాయ్ పటేల్ 'ఇండియన్ బిస్మార్క్' బిరుదు పొందడానికి కారణం- 
జవాబు:  స్వదేశీ సంస్థానాలను ఇండియాలో చేర్చడం

12. ''దేహంలోని ఒక అవయవం విషపూరితమైతే అది మిగిలిన అవయవాలకు వ్యాపిస్తుందనే భయంతో దానిని త్వరితంగా తీసివేయాలి. లేకపోతే ఆ దేహాన్ని బాగుచేయడం దుర్లభం'' అని చెప్పింది- 
జవాబు:  వల్లభాయ్ పటేల్ 

13. దీనబంధు బిరుదు ఎవరికుంది? 
జవాబు:  సి.ఎఫ్.ఆండ్రూస్ 

14. 1946 సెప్టెంబరులో ఏర్పాటయిన తాత్కాలిక ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసింది- 
జవాబు: లియాఖత్ ఆలీఖాన్

15. 1947 అట్లీ ప్రకటన ప్రకారం బ్రిటిష్‌వారు భారతదేశాన్ని ఎప్పటిలోగా వదలివెళతామని చెప్పారు?
జవాబు: 1948 జూన్

16. అఖండ భారతదేశాన్ని భారత్, పాకిస్థాన్‌లుగా విభజిస్తామని ఎందులో పేర్కొన్నారు? 
జవాబు:  మౌంట్‌బాటన్ పథకం 

17. బొంబాయిలో రాయల్ ఇండియన్ నేవీ నౌకాదళ తిరుగుబాటు ఎప్పుడు జరిగింది?
జవాబు: 1946

18. రాయల్ ఇండియన్ నేవీ నౌకాదళ తిరుగుబాటులో సిపాయిలకు, బ్రిటిష్‌వారికి మధ్యవర్తిగా రాయబారం వహించింది-
జవాబు:  మహ్మద్ ఆలీజిన్నా, సర్దార్ వల్లభాయ్ పటేల్

19. 1947 సంవత్సరానికి సంబంధించని సంఘటన- 
జవాబు:  క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఇండియా రాక

20. కింది సంఘటనలలో చివరిది? 
  స్వరాజ్య పార్టీ ఏర్పాటు, చౌరీ చౌరా సంఘటన
జవాబు: స్వరాజ్య పార్టీ ఏర్పాటు

21. 1937లో 11 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ముస్లింలీగ్ ఎన్ని రాష్ట్రాల్లో అధికారం నెలకొల్పింది? 
జవాబు:   2 

22. కిందివాటిలో చివరి సంఘటన- 
పూనా ఒడంబడిక, కమ్యునల్ అవార్డు
జవాబు: పూనా ఒడంబడిక

23. ఈస్ట్ఇండియా కంపెనీ పరిపాలన రద్దుకు విక్టోరియా రాణి ప్రకటన ఎప్పుడు వెలువడింది? 
జవాబు:  1858 నవంబరు 1 

24. ఇండియాలో మొదటి జనాభా లెక్కల సేకరణ చేసింది ఎవరు?
జవాబు: లార్డ్ మేయో

25. వెర్నాక్యులర్ ప్రెస్ చట్టం (ప్రాంతీయ భాషా పత్రికల) రద్దుచేసింది-
జవాబు:  లార్డ్ రిప్పన్

26. లార్డ్ చెమ్స్‌ఫర్డ్ కాలంలో జరిగిన ప్రధాన సంఘటన- 
జవాబు:  జలియన్‌వాలాబాగ్ సంఘటన

27. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటిష్ ఇండియా వైస్రాయ్- 
జవాబు:  లార్డ్ వెల్లింగ్‌టన్ 

28. నరబలులను నిషేధించింది- 
జవాబు:  హార్డింజ్-1

29. పత్రికలమీద నిషేధాన్ని ఎత్తివేసి పత్రికాస్వేచ్ఛ కల్పించింది- 
జవాబు:  చార్లెస్ మెట్‌కాఫ్

30. కారన్‌వాలీస్‌కు సంబంధించిన సంఘటన- 
జవాబు:  శాశ్వత భూమిశిస్తు విధాన ప్రవేశకర్త 

31. భారతదేశంలో మొదటి వార్తా పత్రిక- 
జవాబు:   బెంగాల్‌గెజిట్

32. సమాచార్ దర్పణ్ వ్యవస్థాపకులు- 
జవాబు:   విలియం కార్వే

33. బంగదూత పత్రిక ఎన్ని భాషల్లో వెలువడింది?
జవాబు:  4 

34. దాదాబాయి నౌరోజి స్థాపించిన పత్రిక- 
జవాబు:  రస్త్ గోప్తర్ 

42. మహారాష్ట్రకు సంబంధించిన కుల ఉద్యమం-
జవాబు: మహర్

43. బి.ఆర్.అంబేద్కర్ నాయకత్వం వహించిన కుల ఉద్యమం- 
జవాబు:  మహర్ 

44. ఆత్మగౌరవ ఉద్యమ ప్రారంభకులు-
జవాబు: ఇ.వి.రామస్వామినాయర్

45. 'జస్టిస్‌పార్టీ' ఉద్యమ ప్రారంభంతో సంబంధంలేనివారు- 
జవాబు:  టి.కె.మాధవన్

46. మొదటి ఫ్యాక్టరీ చట్టం ఎవరికాలంలో రూపొందింది? 
జవాబు:  లార్డ్ రిప్పన్

47. భారతదేశంలో మొదటి కార్మిక సంఘం మద్రాస్ లేబర్ యూనియన్ స్థాపకులు-
జవాబు: బి.పి.వాడియం

48. అఖిల భారత కార్మిక కాంగ్రెస్ (ఎ.ఐ.టి.యు.సి) తొలి అధ్యక్షుడు- 
జవాబు:   లాలాలజపతిరాయ్