జాగ్రఫీ ప్రాక్టీస్ బిట్స్ - 06-01-2015


సమ మేఘావృతం కలిగిన ప్రదేశములను కలుపు రేఖలను ఏమంటారు?
1. ఐసోనెఫ్                  
2. ఐసోహైట్ 
3. ఐసోథర్మ్                 
4. ఐసోబార్

 ఉష్ణోగ్రతా విలోమము ఎప్పుడు సంభవించును?
1. శీతల ప్రవాహములు ప్రభావితంచేయు ప్రదేశములందు 
2. ప్రశాంత నిర్మలాకాశము గల శీతాకాలపు రాత్రులందు 
3. మేఘావృతమై పవనములతో కూడిన ప్రదేశములందు 
4. ప్రశాంత మేఘావృత రాత్రులందు

ఉష్ణ ఎడారులు ఖండములు పశ్చిమ భాగములలో ఉండుటకు కారణం?
1. తీరాభిగమన వ్యాపార పవనాలు
2. అపతీర పశ్చిమ పవనాలు
3. తీరాభిగమన పశ్చిమ పవనాలు
4. అపతీర వ్యాపార పవనాలు

 శీతల వాతాగ్రం కవోష్ట వాతాగ్రంను దాటినప్పుడు ఏర్పడు సంక్లిష్టమైన 
    వాతాగ్రంను ఎలా పిలుస్తారు?
1. వాతాగ్ర విలోమం                  
2. తీర వాతాగ్రం 
3. నేత్రిక వాతాగ్రం                     
4. అధివిష్ట వాతాగ్రం

 అంటార్కిటికాలో మంచు తుఫాన్లని ఏమంటారు?
1. కెటబాటిక్స్                
2. బిజార్ట్సు 
3. బోరా                       
4. బెర్గ్

భూమికి, సూర్యునికి మధ్య దూరం ఎక్కువగా ఏ రోజున ఉంటుంది?
1. జూలై 4                     
2. జనవరి 30
3. సెప్టెంబర్ 22               
4. డిసెంబర్ 22

క్రింది ఏ ప్రాంతంలో వేసవి కాలంలో సూర్యకిరణాలు ఎక్కువ సమయం తాకుతాయి?
1. ఢిల్లీ                      
2. సిమ్లా 
3. మద్రాసు                 
4. జబల్‌పూర్

అంటార్కిటికా ఖండంలో సూర్యోదయం ఎప్పుడు జరుగుతుంది?
1. డిసెంబర్ 31                
2. జనవరి 1
3. సెప్టెంబర్ 23                
4. మార్చి 21

 కింద ఏ ప్రాంతంలో అర్ధరాత్రి సూర్యుడు కనిపించే అనుభవం జరుగుతుంది?
1. ఆయనరేఖా ప్రాంతంలో 
2. ఉష్ణ మండల ప్రాంతంలో 
3. ఆర్కిటిక్, అంటార్కిటిక్ వలయ ప్రాంతాలలో 
4. సూర్యగ్రహణం జరిగినపుడు ఏ ప్రాంతంలోనైనా

 పవనము యొక్క దిశను మరియు ధృతిని నియంత్రించు ప్రధాన కారణాంశము?
1. అపకేంద్ర బలము                 
2. ఘర్షణ బలం
3. కొరియాలిస్ బలం                 
4. పీడన ప్రవణత బలం

 ‘ఐసోహెల్స్’అనే రేఖలు ఈ క్రింది వాటిలో దీని యొక్క సమాన విలువలను 
   కలుపుతూ గీయబడ్డ రేఖలు..?
1. మేఘావృతత                    
2. తుహినం 
3. సూర్యరశ్మి                       
4. ఉరుము, తుఫానులు

 రేడియో తరంగములను తిరిగి భూఉపరితలానికి పరావర్తనం చేయు వాతావరణ పొర?
1. మెసో ఆవరణము             
2. ఐనో ఆవరణము
3. స్ట్రాటో ఆవరణము             
4. ట్రోపో ఆవరణము

 ఉష్ణోగ్రత విలోమము ప్రత్యేకముగా ఎక్కడ కనిపించును?
1. కలశ పీఠభూములు               
2. గిరిపద పీఠభూములు
3. విదీర్ణదరులు                       
4. పర్వతాంతర లోయలు

 జల ఉపరితలము పరావర్తనముచేయు వికిర్ణశక్తియొక్క శాతము...
1. ఉష్ణపు సరితూకము            
2. ఆల్‌బెడో
3. ఎక్స్‌రే                            
4. క్రింద చెదరుట

 భూమి ఉపరితలమునకు సమీపముననున్న వాతావరణపు అట్టడుగు పొరను
    ఏమని అంటారు?
1. ట్రోపో ఆవరణము                   
2. స్ట్రోటో ఆవరణము
3. ఉష్ణఆవరణము                     
4. ఓజోన్ ఆవరణము

 కొప్పెన్ శీతోష్ణస్థితి విభజన ప్రకారం ‘ఏ’గుర్తు దేనిని సూచించును..?
1. అనార్థ్ర శీతోష్ణస్థితి                
2. అర్థశుష్క శీతోష్ణస్థితి 
3. శుష్క శీతోష్ణస్థితి                
4. ఉష్ణమండల వర్ష శీతోష్ణస్థితి