2 X 3 X 5 X 7 X 9 X 11 X 13 ల లబ్ధం సంఖ్య ? -టెట్‌- రాగల ప్రశ్నలు


(2n + 1) (n ఒక సహజ సంఖ్య) రూపంలో ఉండే సంఖ్య...
1) బేసిసంఖ్య
2) సరిసంఖ్య 
3) సంయుక్తసంఖ్య
4) ఏదీకాదు

 2 X 3 X 5 X 7 X 9 X 11 X 13 ల లబ్ధం సంఖ్య ?
1) సరిసంఖ్య
2) బేసిసంఖ్య 
3) ప్రధానసంఖ్య
4) ఏదీకాదు

రామువద్ద 415 రూపాయలు రజని వద్ద రాము వద్ద ఉన్న దానికాన్న
36 రూపాయలు తక్కువ ఉన్నాయి. ఇద్దరి వద్ద ఉన్న మొత్తం డబ్బు ?
1) రూ.379
2) రూ.794
 3) రూ.451
4) ఏదీకాదు

 ప్రవీణ్‌కు వాళ్ల నాన్న రూ.150-50 వాళ్ల అమ్మ రూ.272-25 ఇచ్చారు.
 ప్రవీణ్‌ వాళ్ల చెల్లికి రూ.168-80 ఇచ్చాడు. అతని వద్ద ఉన్న సొమ్ము ఎంత ?
1) రూ.422-75
2) రూ.253-95
3) రూ.346-15
4)రూ.250-95

45 నోటు పుస్తకాల ధర రూ.1147 అయిన ఒక్కొక్క పుస్తకం ధర ?
1) రూ.25 1/2
2) రూ.24 1/2
3) రూ.23 1/2
4) రూ.26 1/2

బియ్యం ఒక కి.గ్రా రూ.32 అయిన 4 1/2 కిలోగ్రాముల బియ్యం ధర ఎంత?
1) రూ.140
2) రూ.144
 3) రూ.142
4) రూ.128

 సందీప్‌ బజారుకెళ్లి బ్యాగు రూ.40 చొప్పున 2 బ్యాగులు, పుస్తకం రూ.4-50
చొప్పున 10 పుస్తకాలు తీసుకొని 500 రూపాయల కాగితం షాపువానికి ఇస్తే తిరిగి
వచ్చే సొమ్ము ఎంత ?
1) రూ.375
2) రూ.350
 3) రూ.475
4) రూ.275

 496 రూపాయలను 4గురు పంచుకోగా ఒక్కొక్కరికీ వచ్చేసొమ్ము ఎంత ?
1) రూ.134
2) రూ.124
 3) రూ.144
4) రూ.154

 ఒక ప్రదేశంలో ఉదయం 6గంటలకు -100 ఉష్ణోగ్రత ఉంది. తరువాత 11గంటల
సమయానికి 120 సెంటీగ్రేడ్‌లు ఉష్ణోగ్రత పెరిగింది అయితే 11 గంటలకు ఎంత
ఉష్ణోగ్రత ఉంది. ?
1) 220
2) -220
3) 20
4) ఏ

 ఒక పరీక్షలో 30 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి సరైన సమాధానానికి 5 మార్కులు
 ఇచ్చారు. ప్రతి తప్పు సమాధానానికి రాయని వాటిని గాని 3 మార్కులు తగ్గించును.
రాధేశ్యావమ్‌ 25 ప్రశ్నలకు సరిగా సమాధానాలు రాసాడు. జ్యోతిష్మిత 23 ప్రశ్నలకు
 సరిగ్గా సమాధానాలు రాసింది. అయితే ఇద్దరి మార్కులలో తేడా ఎంత ?
1) 10
2) 16
3) 5
4) 26

 1 - 2 + 3 - 4 + 5 - 6 + ...2012 యెక్క విలువ ?
1) కనుగొనలేము
2) 1006
3) -1006
4) 4024

ఈ కింది వాటిలో నిజము కానిది ?
1) మిక్కిలి చిన్న పూర్ణ సంఖ్య '0' అవుతుంది.
2) పూర్ణ సంఖ్యల సమితిలో గుణకారం దృష్ట్యా విలోమ మూలకం వ్యవస్థితం కాదు
3) పూర్ణ సంఖ్యలు సమితిలో సంకలనం దృష్ట్యా తత్సమ మూలకం వ్యవస్థితం
4) పూర్ణసంఖ్యల సమితిలో సంకలనం దృష్ట్యా సంవృత న్యాయాన్ని పాటిస్తుంది.

ఏవైనా రెండు పూర్ణసంఖ్యలు a, b లకు బేసి సంఖ్య a + b అయితే ?
1) a, b లు రెండు సరిసంఖ్యలు
2) a, బేసిసంఖ్య b సరిసంఖ్య 
3)a, b లు రెండూ బేసి సంఖ్యలు
4) ఏదీకాదు

 రెండు ఆకరణీయ సంఖ్యల మధ్య అపరిమితంగా అకరణీయ సంఖ్యలు ఉంటాయి.
ధర్మాన్ని ఏమంటారు?
1) సంవృత ధర్మం
2) సాంద్రత ధర్మం
3) వర్గత్రయ విభజన ధర్మం
4) సంక్రమణ ధర్మం

 - 30 + (-a) + 20 = 0 అయిన a విలువ ... ?
1) 30
2) -15
3) -10
 4) -25

 సంఖ్యారేఖపై -3 1/2 అనే సంఖ్య ఏ పూర్ణ సంఖ్యకు కుడిపైపు ఉంటుంది ?
1) -4
2) -5
3) 4
4) 5

(` 8) G (` 9) G (G 17) R .......
1) 18
2) 16
3) 1
4) 0

 6/7 యొక్క సమాన భిన్నాలన్నీ సంఖ్యారేఖపై ?
1) వేరు వేరు చోట్ల ఉంటాయి 
2) ఒకే బిందువు వద్ద ఉంటాయి
3) సున్నాకు కొన్ని కుడివైపు, కొన్ని ఎడమవైపు ఉంటాయి
4) ఏదీకాదు

ఈ కింది వాటిని ఆరోహణ క్రమంలో రాయగా 5/8, 5/6, 1/2 ?
1) 1/2 < 5/6 < 5/8    
2) 1/2 < 5/8 < 5/6      
3) 5/6 < 5/8 < 1/2    
4) 5/6 < 1/2 < 5/8

ఈ కింది వానిలో ఏది సత్యము ?
1) రెండు విభిన్న అకరణీయల మధ్య అపరిమితంగా అకరణీయ సంఖ్యలు ఉంటాయి. 
2) రెండు విభిన్న అకరణీయ సంఖ్యల మధ్య అపరిమితంగా పూర్ణ సంఖ్యలు ఉంటాయి.
3) రెండు విభిన్న పూర్ణ సంఖ్యల మధ్య అపరిమితంగా పూర్ణ సంఖ్యలు ఉంటాయి.
4) ప్రతి అకరణీయ సంఖ్య పూర్ణసంఖ్య అవుతుంది.