భారతదేశంలో సగటు వ్యక్తి ఆయు: ప్రమాణం ఎంత ? - అటవీశాఖ పరీక్షల ప్రత్యేకం




 నిర్మాణ సంబంధమైన ద్రవ్యోల్బణం ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది ? 
- లాటిన్‌ అమెరికా

అత్యధిక వయోజన అక్షరాస్యత కలిగిన దేశం ?
- కొరియా

 డాలర్‌ ఏ దేశ కరెన్సీ ?
- అమెరికా

 ఉపాధి కల్పనా కార్యక్రమాలు ఎక్కువగా ఏ ప్రాంతాలకు చెందినవి ? 
- గ్రామీణ

 వ్యవసాయ రంగాన్ని మాత్రమే అభివృద్ధికి సూచికగా తీసుకుంటే మొదటి స్థానంలో
     ఉండే రాష్ట్రం ?

 - పంజాబ్‌

భారతదేశంలో సగటు వ్యక్తి ఆయు: ప్రమాణం ఎంత ? 
- 60.8 సంవత్సరాలు

 ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రాంతంలో వెనుకబడిన ప్రదేశాలు అధిక మొత్తంలో ఉన్నాయి ?
- తెలంగాణ-రాయలసీమ

ప్రచ్ఛన్న నిరుద్యోగం మఖ్యంగా ఏ రంగంలో కనిపిస్తుంది ?
-వ్యవసాయం

అందరికీ ఆరోగ్యం అనే నినాదం ఎలా మారింది ? 
- అట్టడుగు వర్గాల వారికి ఆరోగ్యం

ఇందిరా ఆవాస్‌ యోజన అనేది ?
- గృహ నిర్మాణ పథకం

నీటిపారుదల దేనికి సహాయ పడుతుంది ?
- వ్యవసాయాభివృద్ధికి

అన్నిరకాల సూచికల ఆధారంగా చూసినప్పుడు దేశంలో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నో స్థానంలో ఉంది ?
- 10వ స్థానం

సామాజిక గృహ పథకం ?
 - ఎఏవై

ఆసియాలో అత్యధిక జీవన ప్రమాణం కలిగిన దేశం ?
- సింగపూర్‌

1991లో గ్రామీణప్రాంత పేదల శాతం ?
- 42.06

తలసరి స్థూల జాతీయోత్పత్తిని దీని సూచికగా ఉపయోగిస్తారు ? 
- సాపేక్ష ఆర్థికాభివృద్ధి

1995లో భారతదేశ తలసరి ఆదాయం ?
- 340 డాలర్లు

పేదరికం ఏ ప్రాంతంలో కంటే గ్రామీణ ప్రాంతాల్లో అధికం ? 
- పట్టణ ప్రాంతాల్లో

ఓఇసిడి అంటే ?
-ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కార్పరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌

ఆర్‌ఎల్‌ఇజిపి ని విస్తరించండి ? 
-రూరల్‌ లేబర్‌ ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రామ్‌

ఐఆర్‌డిపి అంటే ఏంటి ? 
-ఇంటిగ్రేటెడ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌

వేటిని మధ్య ఆదాయ దేశాలు అంటారు ? 
- ఇరాక్‌, మలేషియా, కొరియా, సౌదీఅరేబియా

బ్రాడ్‌ గేజ్‌ రైల్వే లైను వెడల్పు ఎంత ?
- 1.69 మీ

ముంబై ఏ రైల్వే మండలానికి ముఖ్య కేంద్రం ?
 - మధ్య రైల్వే

సరిహద్దు రహదారుల అభివృద్ధి సంస్థను ఏ సంవత్సర కాలంలో ఏర్పాటు చేశారు ?
 - 1960

 అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్వహణను, అభివృద్ధి పనులను ఏ సంస్థ చూస్తుంది ?
- భారత అంతర్జాతీయ విమానాశ్రయాల సంస్థ

 గ్రీన్‌ ఛానల్‌ దేనికి సంబంధించింది ?
 -స్థానిక ఉత్తరాల బట్వాడా

 చైనా, తూర్పు ఐరోపా దేశాల్లో ఏ ఆర్థిక వ్యవస్థ ఉంది ? 
-సామ్యవాద వ్యవస్థ

భారత దేశ ఆర్థిక వ్యవస్థ ?
- మిశ్రమ ఆర్థిక వ్యవస్థ

ఉత్పత్తి, పంపిణీలలో ప్రయివేటు వ్యక్తుల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటే దాని అర్థం ?
 - పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ

 శ్రమ లేదా పని చేయడం ద్వారా సంపాదించే ఆదాయం?
- సంపాదిత ఆదాయం

డిమాండ్‌, సప్లైలు ఏ వ్యవస్థలో వస్తువుల ధరలను నిర్ణయిస్తాయి ? 
-పెట్టుబడిదారీ వ్యవస్థ

 భారతదేశంలో ఈస్ట్‌ ఇండియన్‌ కంపెనీ రాజకీయ అధికారాన్ని చేపట్టిన సంవత్సరం ?
 - 1757

సంపద, ఆస్తుల నుంచి సంపాదించే ఆదాయం ?
- అసంపాదిత ఆదాయం

 దాదాబాయి నౌరోజీకి సంబంధించిన అంశం ? 
- ఆర్థిక సంపదను కొల్లగొట్టడం

 జమిందారీ పద్ధతిని ప్రవేశపెట్టింది ?
- కారన్‌వాలీస్‌

1991 లెక్కల ప్రకారం భారత అక్షరాస్యతా వాతం?
-52.2 శాతం

దక్షిణ మధ్య రైల్వే ముఖ్య కేంద్రం ?
 -సికింద్రాబాద్‌

దక్షిణ రైల్వే ముఖ్య కేంద్రం?
- చెన్నై

 ఈశాన్య రైల్వే ముఖ్య కేంద్రం ?
- గోరఖ్‌పూర్‌

 కోల్‌కతా ఏ రైల్వే మండలానికి ముఖ్య కేంద్రం ?
- ఆగేయ రైల్వే

 బకింగ్‌ హామ్‌ కాలువ ఏ రెండు రాష్ట్రాలను కలుపుతుంది ? 
-ఆంధ్రప్రదేశ్‌ , తమిళనాడు