ఫిబ్రవరిలో 28 రోజులే ఎందుకు వస్తాయో మీకు తెలుసా?



    ఇప్పుడు మనం అనుసరిస్తున్న గ్రిగేరియన్‌ క్యాలెండర్‌ అమల్లోకి రాకముందు
 'క్యాలెండర్‌' అనేది చిత్ర విచిత్రమైన మార్పులకు లోనవుతూ వచ్చింది. ఉదాహరణకు 
ఒక దశలో... అమెరికాకు చెందిన మయా జాతివారు రూపొందించుకున్న క్యాలెండర్‌లో
 నెలకు 20 రోజుల చొప్పున, ఏడాదికి 18 నెలలు ఉండేవి. 


అలాగే క్రీ.పూ. 2700 ప్రాంతంలో బాబిలోనియన్లు పాటించే క్యాలెండర్‌లో నెలకు 
30 రోజుల చొప్పున ఏడాదికి 12 నెలలు ఉండేవి. అయితే సంవత్సరం అంటే, (స్థూలంగా)
 365 రోజులు కాబట్టి, ప్రతి ఏడాది లెక్కలోకి రాని ఐదు రోజుల్ని తీసుకుని, ఆరేళ్ళ కొకసారి 
అదనంగా మరో నెలను వారు చేర్చుకునేవారు. 

అంటే వారి క్యాలెండర్‌లో ప్రతి ఆరో సంవత్సరంలో పన్నెండు నెలలకు బదులుగా 
13 నెలలు ఉండేవన్న మాట. ఇలా క్యాలెండర్లకు సంబంధించిన చిత్రవిచిత్రమైన 
సంగతులు ఎన్నో ఉన్నాయి. అయితే...

ప్రస్తుతం మనం అనుసరించే క్యాలెండర్‌కి ఒకానొకప్పుడు రోమన్లు అనుసరించిన క్యాలెండర్‌ పునాదిలాంటిదని చెప్పాలి. మొదట్లో ఆ క్యాలెండర్‌లో ఏడాదికి 10 నెలలు, రోజుల పరంగా 
అయితే 304 రోజులు మాత్రమే ఉండేవి. 

అయితే ఒకరి తరువాత ఒకరుగా వచ్చే రోమన్‌ చక్రవర్తులు ఈ నెలల్ని తమ ఇష్టం వచ్చినట్లు కుదించడం లేదా పెంచడం చేసేవారు. క్రీ.పూ. 700లో న్యూమా పాంపిలన్‌ అనే ఒక రోమన్‌ 
పాలకుడు జనవరి 11వ నెలగానూ, ఫిబ్రవరిని 12వ నెలగాను అప్పటి క్యాలెండర్‌లో 
అదనంగా చేర్చాడు. 
దాంతో ఏడాదికి 355 రోజుల క్యాలెండర్‌ అమలుకావడం మొదలుపెట్టింది.
ఆ తరువాతి కాలంలో... భూపరిభ్రమణ కాలాన్ని అనుసరించి సంవత్సరానికి 365 రోజులు,
 లీఫు సంవత్సరానికి 366 రోజులు ఉండేలా చేశారు. జూలియస్‌ సీజర్‌ అధికారంలోకి వచ్చాక క్వింటిలిస్‌ అనబడే నెలని తన పేరు మీదుగా జూలై నెలగా మార్చాడు. అంతేకాదు ఫిబ్రవరి 
నుంచి ఒక రోజుని తీసి, దానిని జులైకి కలిపి దీన్ని 31 రోజుల నెలగా మార్చాడు. 
దాంతో ఫిబ్రవరి నెలకు 29 రోజులయ్యాయి. పాపం, కనీసం అక్కడితోనైనా దాని కథ 
ముగిసిపోలేదు. జులియస్‌ సీజర్‌ తరువాత అధికారంలోకి వచ్చిన అగస్టస్‌ సీజర్‌ ఏడాదిలో 
8వ నెలకు (ఆగస్ట్‌) తన పేరు పెట్టడు. అయితే అప్పట్లో ఆ నెలలో 30 రోజులే ఉండటం 
ఆయనకు ఏమాత్రం రుచించలేదు. ఇంకేం. ఫిబ్రవరి నెల నుంచి మరో రోజుని తీసేసి దానిని 
ఆగస్ట్‌కి కలిపాడు.

ఆ విధంగా ఫిబ్రవరి నెలలో మామూలుగా 28 రోజులు, లీఫు సంవత్సరంలో 29 రోజులు 
ఉండటం మొదలయ్యింది. అన్నట్లు నూతన సంవత్సర వేడుకలు జనవరి 1న జరుపుకోవాలని 
ఒక ఫ్రాన్స్‌ రాజు ఆదేశించే వరకూ అందరూ ఏప్రిల్‌ 1న ఆ వేడుకలను జరుపుకునేవారు. 
క్యాలెండర్‌కి సంబంధించిన ఇలాంటి చిత్రవిచిత్రమైన సంగతులు ఇంకా ఎన్నో ఉన్నాయి.



యంత్రాలతో ప్రయోజనమేనా?
ఏ చిత్రపటాలు ఇళ్లల్లో ఉంచాలి ?
జీవిత కాలంలో నీరు త్రాగని జీవి ఎక్కడ ఉంది ?
జంతువులు , పక్షుల "తోక" విలువ మీకు తెలుసా?
భారత రాజ్యాంగం - చట్టాలు
భారత రాజ్యాంగ పరిషత్
పంచ వర్ష ప్రణాలికలు
బడ్జెట్ - పన్నులు
భారత దేశ ఎలక్షన్ కమీషన్