డిఎస్సీ పరీక్షల ప్రత్యేకం - బిట్స్ (జనరల్‌ సైన్స్‌)



1) సముద్ర తీరంలోని ఇసుక నుంచి ఏ ఖనిజాలు లభిస్తాయి?
జ: మోనోజైట్‌, ఇలిమినైట్‌, జిర్కాన్‌

2) భారతదేశంలో అత్యధికంగా చమురు లభిస్తున్న ప్రాంతం ఏది?
జ: బాంబే హై

3) విద్యుత్‌ ప్రవాహంలో ఎలాంటి నిరోధకతను చూపనిగుణాన్ని ఏమంటారు?
జ: సూపర్‌ కండక్టివిటి

4) సౌరశక్తిని కేంద్రీకరించి శక్తిని ఉత్పత్తి చేయడానికి వాడే దర్పణం ఏది?
జ: పుటాకార దర్పణం

5) పరావర్తన సూత్రం ఆధారంగా పనిచేసే పరికరాలేవి?
జ: పెరిస్కోప్‌, బైనాక్యులర్‌

6) బుల్లెట్‌ ప్రూఫ్‌ కవచాన్ని దేనితో తయారు చేస్తారు?
జ: జాకాల్‌ అనే మిశ్రమంతో

7) రాతికుష్టును కలిగించేది, తాజ్‌ మహల్‌ రంగు మారడానికి కారణ మయ్యేది, పేపర్‌, తోలును నష్ట పరిచే వాయువు?
జ: సల్ఫర్‌ డైఆక్సైడ్‌

8) సూపర్‌బగ్‌ అని ఏ బ్యాక్టీరియాను పిలుస్తారు (చమురు తెట్టలను విచ్ఛిన్నం చేస్తుంది)?
జ: సూడోమోనాస్‌ ప్యూటిడా

9) పవన విద్యుదుత్పత్తిలో అగ్రస్థానం లో ఉన్న రాష్ట్రం ఏది?
జ: తమిళనాడు

10) నీటిలోతును కొలవడానికిఉప యోగించే ప్రమాణం ఏది?
జ: ఫాథమ్‌

11) జన్యు రహస్యాల అధ్యయనానికి వాడుతున్న కంప్యూటర్‌?
జ: బ్లూజీన్‌

12) భారజలం (హెవీవాటర్‌) రసాయన నామం?
జ: డ్యుటీరియం ఆక్సైడ్‌ (ణ2ఉ)

13) కిరోసిన్‌కు ఉన్న మరోపేరు
జ: ఫారాఫిన్‌ నూనె

14) జర్మన్‌ సిల్వర్‌ ఏయే లోహాల మిశ్రమం?
జ: రాగి, జింక్‌, నికెల్‌

15) మిణుగురు పురుగు రాత్రిపూట కాంతిని వెదజల్లడానికి కారణం?
జ: లూసిఫెరిన్‌ పదార్థ ఆక్సీకరణం వల్ల

16) వేడిచేసినపుడు ద్రవంగా మార కుండానే వాయువుగా మారే పదార్థం ఏది? 

జ: అయోడిన్‌

17) ఎలాంటి పదార్థాలను అయస్కాంతం ఎక్కువగా ఆకర్షిస్తుంది?
జ: ఒంటరిఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉన్నవి
(ఫెర్రో మ్యాగటిక్‌ పదార్థాలు)

18) బేకింగ్‌ సోడా రసాయన నామం?
జ: సోడియం బైకార్బోనేట్‌

19) అతిశీతల ద్రవం అని దేనిని అంటారు?
జ: గాజు

20) మార్ష్‌గ్యాస్‌ అని దేనికి పేరు?
జ: మీథేన్‌

21) భూమి ఆకర్షణశక్తి నుంచి ఒక వస్తువు బయటపడేందుకు కావలసిన కనీస వేగం ఎంత?
జ: 11.2 కి.మీ./సెకన్‌

22) భారతదేశ పశ్చిమ తీరంలోని ఇసుకలో లభ్యమయ్యే ఖనిజం ఏది?
జ: థోరియం

23) ఎండమావులు, నీటిపై తేలియాడే నూనె పొరలో విభిన్న రంగులు ఏర్పడేందుకు కారణం ఏమిటి?
జ: కాంతి సంపూర్ణాంతర పరావర్తనం

24) బంగారు ద్రవం అని ఏ మొక్క నూనెను పిలుస్తారు?
జ: జోజోబా నూనె

25) భూమికి ఎక్కడ అయస్కాంతత్వం ఎక్కువగా ఉంటుంది?
జ: ధ్రువాల వద్ద

26) గ్యాస్‌ సిలిండర్లలో లీకేజిని గుర్తించడానికి కలిపే వాయువు.
జ: ఇథైల్‌ మెర్కాప్టాన్‌

27) కృత్రిమ వర్షాలను కురిపించేందుకు వాడే రసాయనం
జ: సిల్వర్‌ అయోడైడ్‌

28) అల్నికో (Aశ్రీఅఱషశీ) ఏయే లోహాల మిశ్రమం?
జ: అల్యూమినియం, నికెల్‌, కోబాల్ట్‌

29) బాష్పవాయువు రసాయన నామం
జ: ట్రైక్లోరో నైట్రోమీథేన్‌

30) ద్రవరాజం లేదా ఆక్వారీజియా అని దేనిని అంటారు?
జ: 1:3 నత్రికామ్లం+హైడ్రోక్లోరిక్‌ ఆమ్ల మిశ్రమం

31) గాలిలో ధ్వని వేగం...
జ: 330మీ/సె

32) వీర్యాన్ని నిలువజేసే ఉష్ణోగ్రత
జ: 1920జ ద్రవనైట్రోజిన్‌ వద్ద

33) ఏ ఉష్ణోగ్రత వద్ద సెంటిగ్రేడ్‌ ఫారిన్‌ హీట్‌ సమానంగా ఉంటుంది?
జ:-400జ

34) సముద్రమట్టం నుంచి ఎత్తుకుపోయే కొద్దీ వాతావరణ పీడనం?
జ: తగ్గుతుంది

35) రిజర్వాయర్‌లోని నీటికి, చుట్టిన స్ప్రింగుకు ఉందేశక్తి
జ: స్థితిజశక్తి

36) ద్రవాలలో అత్యుత్తమ ఉష్ణవాహకం
జ: పాదరసం

37) శూన్యంలో ధ్వని వేగం.....
జ: సున్నా

38) స్వేచ్ఛాఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని ఏమంటారు?
జ: విద్యుత్‌

39) పిడుగుపాటు నుంచి భవనాలను రక్షించడానికి వాడే పరికరం
జ: లైటనింగ్‌ కండక్టర్

40) ఎలక్ట్రాన్‌కు ఉండే ఆవేశం?
జ: రుణ విద్యుత్‌ ఆవేశం

41) ×-కిరణాలను కనుగొన్నది
జ: రాంటిజన్‌

42) జుొఎష2 అనే సమీకరణాన్ని ప్రతిపాదించింది?
జ: ఐన్‌స్టీన్‌

43) ఒకే పరమాణు సంఖ్య, భిన్న ద్రవ్య రాశి సంఖ్యలు కలిగిన ఒకేమూలక పరమాణువుల నేమంటారు?
జ: ఐసోటోపులు

44) నాఫ్తలీన్‌ ఏ ద్రావణంలో కరుగు తుంది?
జ: కిరోసిన్‌

45) ఉక్కులో సగం బరువుండి, ఉక్కు కంటే ఎక్కువ గట్టిదైన లోహం?
 జ: టైటానియం

46) రబ్బరును వల్కనైజ్‌ చేసేందుకు ఉపయోగించేది?
జ: సల్ఫర్‌

47) +ూూVణ-3 రాకెట్‌ ద్వారా ప్రయోగించిన ఉపగ్రహం......
జ: ఎడ్యుశాట్‌

48) ప్లాస్మాను ఉత్పత్తి చేయడానికి వాడే పరికరం?
జ: టోక్‌ మాక్‌

49) వీఉశ (మిక్స్‌డ్‌ ఆక్సైడ్‌) వేటి మిశ్రమం ?
జ: 3% ప్లూటోనియం ఆక్సైడ్‌+97% యురేనియం ఆక్సైడ్‌


50) న్యూక్లియర్‌ వ్యర్థపదార్థాలను పాతి పెట్టేందుకు వాడే గాజు?
జ: బోరోసిలికేట్‌ గాజు

51) రేడియోలజీ అంటే........
జ: ఞ,y కిరణాలను వైద్యశాస్త్రంలో ఉపయోగించే విధానాన్ని తెలియ జేసే శాస్త్రం

52) పొడిమంచు (డ్రై ఐస్‌) అని దేనిని అంటారు?
జ: ఘన జశీ2ను

53) గన్‌పౌడర్‌ వేటి మిశ్రమం?
జ: సల్ఫర్‌ + బొగ్గు+ పొటాషియం నైట్రేట్‌

54) ఆమ్లాలన్నింటిలో చురుకైనది?
జ: పర్‌క్లోరిక్‌ ఆమ్లం (నజశ్రీఉ4)

55) మెర్క్యురీ ద్రావణిలా ఉండే ద్రావణాలను ఏమంటారు?
జ: అమాల్గమ్‌

56) ఎముకల విరుపును, కట్టడాల లోపాలను, పురాతన తైలవర్ణ చిత్రా లను గుర్తించడానికి వాడేకిరణాలు.?
జ: శ కిరణాలు

57) శిలాజాల వయస్సును నిర్ణయించ డానికి వాడే రేడియోఐసోటోపు.....
జ:జ14

58) సూర్యుడిలో, హైడ్రోజన్‌ బాంబులో జరిగే చర్య?
జ: కేంద్రక సంలీనం

59) గ్రాఫైట్‌ వజ్రం వేటి రూపాంతరాలు?
జ: కార్బన్‌

60) సోడాగ్యాస్‌లో ఉండేది, అగ్నిమాపక యంత్రాలలో మంటలను ఆర్పేది, సున్నపు తేటను పాలవలె మార్చే వాయువు?
జ: కార్బన్‌ డై ఆక్సైడ్‌

61) మెదడు, గుండె అంతర్భాగాలను పరి శీలించడానికి, వాటిలోని జీవ రసాయన చర్యలను పరిశీలించడా నికి ఉపయోగపడేది?
జ:పాజిట్రాన్‌ ఎమిషన్‌ టోమో గ్రఫిస్కాన్‌

62) సూపర్‌ కండక్టివిటీని గుర్తించింది?
జ: డాక్టర్‌ హీక్‌ కామర్‌ లింగ్‌ ఓన్స్‌

63) నత్రజని ఎరువులకు ఉదాహరణ
జ: యూరియా, అమ్మోనియం సల్ఫేట్‌

64) వస్తువుకు ఉండే రేడియేషన్‌ (వికిరణం) ఆధారంగా వస్తువుకు సంబంధించిన సమాచారం సేక రించడం?
జ: రిమోట్‌ సెన్సింగ్‌

65) భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనకు కారణమైన వాయువు?
జ : ఎంఐసి (మిథైల్‌ ఐసో సైనైడ్‌)

66) ఫాస్ట్‌ బ్రీడర్‌ రియాక్టర్‌లలో వాడే అణుఇంధనం?
జ: ఫ్లుటోనియం

67) వీధిలోని బ్యాండు మేళం శబ్దానికి ఇంటిలోని పాత్రలు కంపించడాన్ని ఏమంటారు?
జ: అనునాదం

68) నీటిఅడుగున ఉండే వస్తువులను గుర్తించడానికి ఉపయోగపడే పద్ధతి?
జ: సోనార్‌ పద్ధతి

69) యాంత్రిక శక్తిని విద్యుత్‌ శక్తిగా మార్చే పరికరం?
జ: డైనమో

70) విద్యుత్‌ హీటర్‌లో ఉండే తీగ?
జ: నిక్రోమ్‌ తీగ
7
1) ఏ పద్ధతిలో విద్యుత్‌ దీపాలను కలిపితే ఒకటి పాడైపోయినా మిగతావి వెలుగుతాయి?
జ : సమాంతర పద్ధతి

72) సౌరశక్తి గిడ్డంగి అని దేనిని అంటారు ?
జ : బొగ్గు

73) బయోమాస్‌ ఆక్సిజన్‌లేని వాతా వరణంలో విఘటనం చెందిన ప్పుడు వెలువడే వాయువు?
జ : మీథేన్‌

74) సూర్యుడి నుండి భూమికి ఏ పద్ధతి ద్వారా ఉష్ణప్రసారం జరుగు తుంది?
జ : ఉష్ణ వికిరణం

75) మెదడులోని విద్యుత్‌ తరంగాలను నమోదు చేసే పరికరం?
జ:ఇఇజి (ఎలక్ట్రో ఎన్‌సెఫాలియో గ్రాఫ్‌)