ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ (ICC Cricket World Cup) అనేది పురుషుల వన్డే ఇంటర్నేషనల్ (ODI) క్రికెట్‌కు సంబంధించిన ప్రధాన అంతర్జాతీయ పోటీలను సూచిస్తుంది ఈ ప్రపంచ కప్‌ను క్రీడా పాలక సంస్థ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రతి నాలుగు సంవస్తారాలకు ఒకసారి నిర్వహిస్తుంది, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద మరియు అత్యధిక మంది వీక్షించే క్రీడా కార్యక్రమంగా గుర్తింపు పొందింది మొదటి టెస్ట్ మ్యాచ్ 1877లో ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ దేశాల మధ్య జరిగింది, ప్రపంచ కప్ ఫైనల్స్‌లో విజయం సాధించిన జట్టుకు ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీని ప్రదానం చేస్తారు. ప్రస్తుత ట్రోఫీని వెండి మరియు గిల్డ్‌లతో తయారు చేశారు, దీనిలో మూడు వెండి నిలువు వరుసలపై ఒక బంగారు గోళం ఉంటుంది. ఇది 60 సెం.మీ ఎత్తు మరియు సుమారుగా 11 కిలోగ్రాముల బరువు ఉంటుంది. గత విజేతల పేర్లను ట్రోఫీ అడుగు భాగంలో ముద్రిస్తారు, ఇక్కడ మొత్తం ఇరవై జట్ల పేర్లను లిఖించే వీలుంది. అసలు ట్రోఫీ ఐసిసి వద్ద ఉంటుంది. లేఖనాల విషయంలో మాత్రమే వ్యత్యాసం ఉండే దీని యొక్క ఒక ప్రతి రూపాన్ని విజేతగా నిలిచిన జట్టుకు శాశ్వతంగా ప్రదానం చేస్తారు ప్రారంభ క్రికెట్ ప్రపంచ కప్‌కు 1975లో ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇచ్చింది, 1992 ప్రపంచ కప్ లో అనేక మార్పులు ప్రవేశపెట్టారు, రంగుల దుస్తులు, తెలుపు బంతులు, పగలు/రాత్రి (డే/నైట్) మ్యాచ్‌ల పరిచయం, ఫీల్డింగ్ నిబంధనలకు మార్పులు చేయడం జరిగింది వరుసగా ఆస్ట్రేలియా మూడు ప్రపంచ కప్ లను గెలుచుకుంది
2015 ప్రపంచ కప్ కు ఎంపికయిన భారత జట్టు వివరాలు :
మహేంద్రసింగ్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్) విరాట్ కోహ్లీ (వైస్ కెప్టెన్) శిఖర్ ధావన్ రోహిత్ శర్మ అంజిక్య రెహానే సురేష్ రైనా అంబటి రాయుడు రవీంద్ర జడేజా రవిచంద్రన్ అశ్విన్ అక్షర్ పటేల్ భువనేశ్వర్ కుమార్ ఇషాంత్ శర్మ మహమ్మద్ షమీ స్టూవర్ట్ బిన్నీ ఉమేష్ యాదవ్