తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఏ విధంగా బోధన చేయాలి? - టెట్‌- రాగల ప్రశ్నలు


     
 

బోధించడం అనేది మరో వ్యక్తి అభ్యసించుటకు సహాయపడే కళ అని పేర్కొన్నది
1. థార్న్‌డెక్‌
 2.బ్రూసేకర్‌
3. డంకన్‌
4. జాన్‌డ్యూయి

బోధన అభ్యసన ప్రక్రియలో ప్రధాన అంశం
1. పాఠ్యప్రణాళిక
 2.ప్రణాళిక
3. బోధనాపద్ధతి
4. పైవన్నీ

నియత విద్యావ్యవస్థలో బోధనకు అభ్యసం అనేవి
1. వేర్వేరు కాలంలో చోటు చేసుకునే భిన్నప్రక్రియలు
2.ఏకకాలంలో చోటు చేసుకునే భిన్న ప్రక్రియలు
3. పరస్పర మార్పిడి పద్ధతిలో చోటు చేసుకునే భిన్న ప్రక్రియలు
4. ఏదీకాదు

ఈ కింది వానిలో ఉద్దీపన 
1. బోధన
2.అభ్యసనము
3. విద్యార్థి
4. పాఠ్యప్రణాళిక

బోధన ఉద్దీపన అయితే అభ్యసనము
1. స్వతంత్రచరము
  2.ప్రతిస్పందన
3. ప్రక్రియ
4. కారకము

బోధన అనేది వీరి మధ్య జరుగుతుంది
1. ఎక్కువ పరిపక్వత వర్సెస్‌ తక్కువ పరిపక్వత
2. పరిపక్వత వర్సెస్‌ పరిపక్వత
3. తక్కువ పరిపక్వత వర్సెస్‌ తక్కువ పరిపక్వత
4. ఎక్కువ పరిపక్వత వర్సెస్‌ ఎక్కువ పరిపక్వత

అభ్యసన అనేది విద్యార్థిలో
1. నిరంతరం కొనసాగే ప్రక్రియ
2.నిర్థిష్ట ప్రణాళిక
3.విశాల దృష్టిని కలుగజేయునది
4.జాతీయ విధానము

ఉత్తమ అభ్యసనము దీనిపై ఆధారపడి ఉంటుంది
1.ఉపాధ్యాయుడు 
2.ఉత్తమమైన బోధనా పద్ధతలు
3. బోధనోపకరణాలు ఉపయోగించడం
4. విద్యార్థి యొక్క ఆసక్తి

విద్యార్థులు మరింత పాఠ్యాన్ని అవగాహన చేసుకోవడానికి ఉపాధ్యాయునిగా నీవు
1. విద్యార్థులకు మరిన్ని ఉదాహరణలతో బోధిస్తావు
2. కొత్త గ్రంథాలను చదువుతావు
3. విద్యార్థులను ఉత్సాహపరుస్తావు
4. విద్యార్థులతో కలిసి ఆటలాడతావు

 పాఠశాలలో అభ్యసనకు అనుకూలమైన వాతావరణాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు.
1. ఉపాధ్యాయుడు
2. ప్రధానోపాధ్యాయుడు
3. విద్యార్థి
4. జిల్లా విద్యాశాఖాధికారి

అభ్యసనం అంటే
1. ఏదైనా ఒక అంశాన్ని పరిశీలించి గుర్తుంచుకోవడం
2. ఏదైనా ఒక అంశాన్ని గుర్తుంచుకుని తిరిగి ఉపయోగంచుట
3. ఏదైనా ఒక అంశాన్ని మెందడులో నిక్షిప్తం చేయడం
4. ఏదైనా ఒక అంశాన్ని ఎక్కువ కాలం చదువుట

బోధనలో ముఖ్యమైన కార్యక్రమం ఏది
1. నిర్ధేశమును తయారు చేయడం
2. పాఠ్యపథకాన్ని తయారు చేయడం
3. మూల్యాంకనము చేయుట
4. బోధనోపకరణములను తయారు చేయడం

తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఈ విధంగా బోధన చేస్తే జయప్రదం అవుతుంది
1. కృత్యములు ఉపయోగిస్తూ బోధించడం
2. పాఠ్యగ్రంథములను చూడకుండా బోధించడం
3. బోధనోపకరణాలు ఉపయోగిస్తూ బోధించడం
4. పాఠ్యప్రణాళిక అవసరం

విద్యాబోధనలో ముఖ్య ఉద్దేశము
1. పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడం
2. బడిఈడు పిల్లలందర్ని బడిలో చేర్పించడం
3. విద్యార్థులలో మానసికాభివృద్ధి, మూర్తిత్వన్ని కలిగించడం.
4.పైవన్నియు

భావనలు ఎలా ఏర్పడతాయి
1. పరిశీలన, సాధారణీకరణల ఆధారంగా
2. ఆలోచనల ఆధారంగా
3. సృజనాత్మకత ఆధారంగా
4. చదవడం వల్ల

కింద దానిలో ఉత్తమ అభ్యాసనానుభవ లక్షణం కానిది
1. ఆచరణాత్మకంగా ఉండాలి
2. వైయుక్తిక బేధాలను కలిగి ఉండాలి
3. నిర్ధేశించిన విషయ విభాగానికి తగినట్లుగా ఉండాలి
4. ఆశించిన మార్పును తేగల సామర్థ్యం ఉండాలి.

విద్యా లక్ష్యాలు ఏ అంశాలపై ఆధారపడును
1. సమాజిక అవసరాలు
2. సామాజిక తాత్విక చింతన
3. వైయుక్తిక అవసరాలు
4. పైవన్నీ

లక్ష్యాలకు సంబంధించిన అంశాలు
1. నిర్థిష్టంగా ఉంటాయి
2. అధ్యాపకులు నిర్ణయిస్తారు
3. విద్యార్థి కేంద్రంగా ఉంటాయి
4. పైవన్నీ

మంచి లక్ష్యానికి ఉండదగని లక్షణ ఏదీ
1. నిర్థిష్టంగా ఉండడం
2. విద్యకు సంబంధించిన సాధారణ ఉద్దేశాలకు తగినట్లుగా ఉండడం
3. సాధించడానికి వీలుగా సరళంగా ఉండడం
4. మార్పుకు అనుకూలంగా ఉండకపోవడం.

అధ్యాపకుడు ఒక నిర్ణీత కాలపరిమితిలో బోధన ద్వారా సాధించగలిగే లక్ష్యాలను ఏమంటారు.
1. బోధనాలక్ష్యాలు
 2.బోధనా ఉద్దేశ్యాలు
3. స్పష్టీకరణాలు
 4.ఏదీకాదు

తరగతి గదిలో బోధనానంతరం సాధించగలిగినది
1. ఆశయాలు
2. గమ్యాలు
3. ఉద్దేశ్యాలు
  4.లక్ష్యాలు

విద్యా ప్రణాళికలో విషయాన్ని బట్టి మారనిది
1. ఆశయం 2.లక్ష్యం
3. బోధనాపద్ధతి 4.స్పష్టీకరణలు

నిజ జీవిత సమస్యలను పరిష్కరించుకునే శక్తి ఏ రంగముకు చెందుతుంది
1. భావావేశ రంగము
2. మానసిక చలనాత్మక రంగము
3. జ్ఞానేతర రంగము
4. జ్ఞానరంగము

కింది వానిలో లక్ష్యానికి సంబంధించి సరికానిది
1. తరగతిని బట్టి మారవు
2. పాఠశాల పరిధిలో ఉంటాయి
3. అధ్యాపకులు నిర్ణయిస్తారు
4. మూల్యాంకనం చేయడం సులభం

కింది వానిలో స్పష్టీకరణాల లక్షణం కానిది
1. అభ్యసనానికి సాక్ష్యాలు
2. లక్ష్యాల మధ్య తేడాను తెలుపలేవు
3. పరీక్షలకు ఆధారం
4.విద్యార్థి సామర్థ్యాలను తెలియజేస్తాయి

పాఠశాలను చిన్న మోతాదు సమాజంగా పేర్కొన్నది
1. జాన్‌డ్యూయి
2. లావే మరియు మెంగర్‌
3. లావే
4. వెంగర్‌

తరగతిలోని విద్యార్థుల ప్రతిస్పందనలు దేనిని ఆధారంగా చేసుకొని వెలుపడుతాయి
1. ఆర్థిక పరిస్థితి
 2. సామాజిక పరిస్థితి
3. రాజకీయ పరిస్థితి
4. పైవన్నీ