ఏనుగులు రెండు రకాలు:
1. ఆసియా ఏనుగులు
2. ఆఫ్రికా ఏనుగులు
ప్రపంచంలో నేలమీద నివసించే క్షీరదాల్లో ఏనుగు పెద్దది.
ఆఫ్రికా ఏనుగులలో ఆడ, మగ ఏనుగులకు దంతాలుంటాయి
కానీ, ఆసియా ఏనుగుల్లో మగ ఏనుగులకే దంతం ఉంటుంది.
ఏనుగుపిల్ల తల్లి కడుపులో 22 నెలలు ఉంటుంది.
పెద్ద ఏనుగుకు రోజుకు 210 లీటర్లు నీళ్లు అవసరమవుతుంది.
ఉష్ణోగ్రత బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఏనుగుకు చెవులలో ఉండే రక్త నాళాలు
ఆ ఉష్ణోగ్రతని క్రమబద్దం చేస్తాయి.
ఏనుగు తొండం రెండు మీటర్ల పొడవు, బరువు 140 కిలోల వరకు ఉంటుంది.
ఈ తొండంలో లక్ష కండరాలు ఉంటాయి.
ఏనుగు నీళ్ళల్లో ఈదగలదు. పూర్తిగా నీళ్లల్లో మునిగినప్పుడు తొండం ద్వారా
శ్వాస పీలుస్తుంది.
ఏనుగులు శాఖాహారులు. రోజుకు పదహారు గంటలు ఆహర సేకరణ కోసం
కేటాయిస్తుంది.