భూమిలో నుంచి తవ్వి తీసిన వస్తువును ఏమంటారు ?



భూమిలో నుంచి తవ్వి తీసిన వస్తువును ఫాజిల్‌ అంటారు. కానీ ఇప్పుడు లక్షలు, కోట్లు 
సంవత్సరాలకు పూర్వం నివసించిన జంతువులు, మొక్కల అవశేషాలకు మాత్రమే 
ఈ పదం ఉపయోగిస్తున్నారు. 

లక్షల ఏళ్ల క్రితం భూకంపాలు, ఇతర కారణాలతో భూమిలో మొక్కలు, జంతువులు 
కూరుకుపోయేవి.

          ప్రాణుల అవశేషాలకు సంబంధించిన విజ్ఞాన శాస్త్రాన్ని 'పాలెంటాలజీ' అంటారు. 

ఈ విజ్ఞాన శాస్త్రాన్ని అనుసరించి ఫాజిల్‌ను మూడు రకాలుగా విభజించారు. 

మొదటిరకం:
ఏదేని ప్రాణి యొక్క విభాగం చెడిపోకుండా సంపూర్ణ శరీరం లభించిన అవశేషాలు .

రెండో రకం:
శరీరంలోని కొన్ని అంగాలు, ఎముకలు, వృక్షాల్లోని కొమ్మలు, కాండాలు మొదలైన 
అవశేషాలు . 

మూడో రకం:
అవశేషాలు జంతువుల కాలి గుర్తులు.

ఇప్పటివరకూ లభించిన అవశేషాలను అధ్యయనం చేయటం వల్ల 350 కోట్ల 

సంవత్సరాలకు పూర్వం భూమి మీద ప్రాణికోటి ఉన్నట్లు తెలిసింది. జంతువులలో
 క్రమపరిణామం ఎలా కలిగిందీ తెలిసింది.

          ఈ శాస్త్ర అధ్యయనాల వల్లే కోట్ల సంవత్సరాల క్రితం భూమ్మీద పాకే 

జంతువులు ఉన్నాయని తెలుసుకున్నాం. డైనోసార్‌లను ఈ విధంగానే గుర్తించారు. 
అయితే అవి ఇప్పుడు లేవు. శిలల మీద లభించిన అవశేషాలను బట్టే వీటిని
 గుర్తించారు.

 వాతావరణ, భౌగోళిక మార్పుల్ని గురించి ఫాజిల్స్‌ సమాచారాన్ని ఇస్తాయి. 
ఖనిజాల్ని గుర్తించడంలో భూగర్భ శాస్త్రజ్ఞులకు ఇది బాగా సహాయపడుతుంది.

ఇంకా: 

మానవ శరీరం గురించి మీకు తెలుసా?
భోజనం తర్వాత నిద్ర వస్తుంది ఎందుకు?
మూగజీవాలకు రోగ నిరోధక శక్తి ఎక్కువ ఎందుకు ?
మృత సముద్రం (Dead Sea)గురించి మీకు తెలుసా ?
పెన్సిల్ గురించి మీకు ఎంతవరకు తెలుసు ?
ఇళ్లలో ఉన్న ఫ్యాన్లకు, రైళ్లలో ఉన్న ఫ్యాన్లకు తేడా ఏమిటి ?
అంతరిక్షంలోని నక్షత్రాలు, గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతుంటాయి. ఎందుకు?