స్టెతస్కోపు ఎవరు కనుగొన్నారు ?



 రోగుల శరీరంలోని శబ్దాలను వినడానికి వైద్యులు ఉపయోగించే పరికరాన్ని 
స్టెతస్కోపు అంటారు. 

దీనిద్వారా ఊపిరితిత్తులు, గుండె, ఉదరంలోని శబ్దాలను వినవచ్చును. 

ఆయా అవయవాల్లో కలిగే శబ్దాల్లో మార్పును గుర్తించడం ద్వారా అనేక శారీరక 
రుగ్మతలను తెలుసుకోవచ్చు. 

స్టెతస్కోపు ను 1816 సంవత్సరంలో రేన్‌ థియోఫిల్‌ హైసింథ్‌ లేనిక్‌ అనే ఫ్రెంచ్‌
శాస్త్రవేత్త కనుగొన్నాడు. 

పొడవైన ఒక కర్రకు మధ్యలో గుల్లగా చేసి స్టెతస్కోపు తయారు చేశాడు. 
కర్రలోని ఒక వైపు భాగాన్ని రోగి ఛాతీ మీద ఉంచి, రెండవ వైపు తన చెవి దగ్గర 
ఉంచుకుని శబ్దాలను వినేవాడు. 

వేర్వేరు రోగులను పరీక్షించడం ద్వారా వారి గుండె, ఊపిరితిత్తులలోని లోపాలను
గుర్తించగలిగేవాడు. 1819లో ఆయన తాను కనుగొన్న విషయాలను 'ద ఎల్‌ ఎస్కులేషన్‌ మీడియేట్‌' పేరిట ఒక పుస్తకం వెలువరించాడు. కాలక్రమేణా స్టెతస్కోపు లో అనేక 
మార్పులు వచ్చి నేడు మనం చూస్తున్న స్టెతస్కోపు  అందుబాటులోకి వచ్చింది.

ఇంకా :

జీవిత కాలంలో నీరు త్రాగని జీవి ఎక్కడ ఉంది ?
జంతువులు , పక్షుల "తోక" విలువ మీకు తెలుసా?
మొదటిసారి చక్రాన్ని ఎప్పుడు ఉపయోగించారో మీకు తెలుసా ?
విపత్తు నిర్వహణ 
జాగ్రఫీ 
ఎకానమీ 
పాలిటి