మొట్టమొదటి రైలు మార్గం ఎప్పుడు ఏర్పాటు చేశారు, దాని నిర్మాణ పొడవు ఎంత ? - అటవీశాఖ పరీక్షల ప్రత్యేకం




భారత రైల్వేలు ఏ రంగంలో ఉన్నాయి ?
-ప్రభుత్వం రంగంలో

దేశంలో రైలు మార్గాల సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ? 
-ఉత్తర భారత మైదానాలు

రైలు మార్గాల పొడవు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ?
- ఉత్తరప్రదేశ్‌

4సరుకుల సేకరణ-పంపిణీ ఇంటింటి నుంచి ఏ రకమైన రవాణా ద్వారా సాధ్యమవుతుంది ? 
- రోడ్డు

7వ నంబర్‌ జాతీయ రహదారి ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ విస్తరించి ఉంది ?
- వారణాసి, కన్యాకుమారి

 వాయు రవాణా దేనితో కూడుని ఉన్నా, దాని వల్ల జరిగే ఆధునిక రవాణా ఏదీ ?
-అధిక వ్యయం, అతి వేగంతో

 అంతర్జాతీయ విమానాలను ఏ సంస్థ నడుపుతోంది ? 
- ఎయిర్‌ ఇండియా

దక్షిణ భారత దేశంలో ముఖ్య జల రవాణా మార్గంగా ఉపయోగపడే కాలువ ?
- బకింగ్‌హామ్‌

 ప్రపంచంలో అతి ఎక్కువ తపాలా కార్యాలయాలు ఏ దేశంలో అధికంగా ఉన్నాయి. ?
- భారత దేశంలో

 వాయవ్య రైల్వే ముఖ్య కేంద్రం ఎక్కడ ఉంది ?
-జైపూర్‌

 అవ్యవస్థీకృత రంగానికి ఉదాహరణ ?
-ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు

 ఇంగ్లండ్‌లో పారిశ్రామిక విప్లవం కొనసాగిన కాలం ?
-1780-1790

ఐరోపా దేశాలు భారతదేశం నుంచి ముఖ్యంగా దిగుమతి చేసుకున్నవి ? 
- సుగంధ ద్రవ్యాలు

పశ్చిమ ఐరోపా దేశాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ ?
- పెట్టుబడిదారీ వ్యవస్థ

.2001 జనాభా లెక్కల ప్రకారం భారత్‌ అక్షరాస్యతా శాతం ? 
- 65.38శాతం

భారతదేశంలో బ్రిటిష్‌ వారు అడుగుపెట్టక ముందు స్వయం సంపూర్ణ గ్రామీణ సామూహిక 
గణతంత్ర రాజ్యాలు ఇక్కడ ఉండేవి. గ్రామ ప్రజల్లో వ్యవసాయ దారులు, వృత్తిపనివారు,
 దాసులు, ఇంకా ఎవరు ఉండేవారు ? 
-గ్రామాధికారులు

 హస్తకళలు, చేనేత వస్త్రాలు, ఇళ్లలో ఉత్పత్తి కార్యక్రమాలు వంటివి ఏ ఆర్థిక వ్యవస్థలో భాగాలు. ?
- అవ్యవస్థీకృత

జూన్‌-సెప్టెంబర్‌ల మధ్య వచ్చే ఏ రుతుపవనాలే వ్యవసాయానికి అవసరమైన
వర్షపు నీటిని అందిస్తాయి ?

- నైరుతి రుతుపవనాలు

ఏ వ్యవస్థలో ప్రభుత్వానికి పన్నుకట్టే కుటుంబాల ఒక చిన్న సమూహం యాజమాన్యంలో
 భూమి ఉంటుంది ?

- మహల్వారీ

 సంపద, ఆస్తుల నుంచి వచ్చే ఆదాయాన్ని ఏమంటారు ? 
- అసంపాదిత ఆదాయం

రావాణా రకాలు ఎన్ని, వాటి పేర్లు ? 
- రైలు, రోడ్డు, జల, వాయి మార్గాలు

మొట్టమొదటి రైలు మార్గం ఎప్పుడు ఏర్పాటు చేశారు, దాని నిర్మాణ పొడవు ఎంత ?
- 1853, 34 కి.మీ